బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.
అయితే తాజాగా కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ చేసిన నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవల ఆస్కార్ ఎంపికైన చిత్రాల జాబితాపై హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆస్కార్ సినిమాల జాబితాపై కాస్తా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనదేశాన్ని వ్యతిరేకంగా తీసిన సినిమాలకే స్థానం దక్కిందని కంగనా ఆరోపించింది. అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతోందని మండిపడింది.
(ఇది చదవండి: సినిమాల్లో నటించనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ హీరో)
కంగనా రనౌత్ మాట్లాడుతూ..'మనదేశానికి వ్యతిరేకంగా చిత్రీకరించే సినిమాలు తరచుగా ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక చేస్తున్నారు. సాధారణంగా మనదేశం కోసం.. వారు ముందుకు తెచ్చే ఎజెండా చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్కార్ ఎంపికైన చిత్రాలు భారతదేశానికి వ్యతిరేకం. ఇప్పుడు ఆ చిత్రాలకే ప్రశంసలు వస్తున్నాయి. మన దేశంలో ఆస్కార్ అవార్డుల కోసం స్లమ్‌డాగ్ మిల్లియనీర్ లాంటి సినిమా అయి ఉండాలి. అంటే మనదేశాన్ని తక్కువగా చూపించే సినిమాలకే నామిషన్స్‌లో చోటు ఉంటుంది.'అని అన్నారు.
కంగనా మాట్లాడుతూ..'ఎమర్జెన్సీ అలాంటి చిత్రం కాదు. ఈ రోజు భారతదేశం ఎలా ఉందో చూడటానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా ఉన్నాయి. నేను ఈ అవార్డుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను భారతీయ అవార్డులు, విదేశీ అవార్డుల గురించి పట్టించుకోను. ఇది అద్భుతంగా రూపొందించిన చిత్రం. అంతర్జాతీయ చలన చిత్రం కంటే బాగుటుంది. అదే సమయంలో మన రాజకీయాలు ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు. ఒక జాతీయవాదిగా నాకు అవార్డు ఫంక్షన్లపై మాకు పెద్దగా ఆశ లేదు' అని తెలిపింది.
ఎమర్జెన్సీ కథేంటంటే..
కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.
(ఇది చదవండి: Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’)
మొదటి నుంచి వివాదాలు..
ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment