సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం పంపిణీ చేశారు. సివిల్స్‌లో ప్రిలిమ్స్ పాసై మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్న 135 మందికి ఆర్థికసాయం అందించారు. ఒక్కొక్కరికి రూ. లక్ష చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. 90 రోజుల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామని, మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో తెలంగాణ యువత రాణించాలని, అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేదలకు మంచి విద్యను అందిస్తామని, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్దిలో పనిచేస్తున్నాం. సివిల్స్ విద్యార్ధులకు ఆత్మస్తైర్యం ఇవ్వడం కోసం మా ప్రయత్నం. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నాం. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలి. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తాం
గతంలో సచివాలయంలోరి రానివ్వని పరిస్థితి ఉండేది. సచివాలయంలోకి వెళ్తే అరెస్ట్ చేయించారు. చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. పరిశ్రమలు పెట్టే వాళ్లంతా వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ల కోసం వెతుతుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తాం.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడాకారులకు శిక్షణ ఇస్తాం. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నాం. పేద పిల్లలకు న్యాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది. వచ్చే 10, 15 రోజుల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తాం. వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. ’ అని తెలిపారు.
‘డిప్యూటీ సీఎం భట్టి కమెంట్స్..
‘సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించి తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి. సివిల్స్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి కొంతైనా ఉపశమనం లభిస్తుంది. మన రాష్ట్రం నుంచి ఐఎఎస్ అయిన వారు ఏ రాష్ట్రంలో పనిచేసినా.. మనకు గర్వకారణమే.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను 5 వేల కోట్ల తో ఏర్పాటు చేస్తున్నాం. మా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం.
లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందుకుంటున్న వారిలో ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 21 మంది. ఓబీసీ కేటగిరిలో 62 మంది. ఎస్సీ కేటగిరిలో 19 మంది.. ఎస్టీ కేటగిరీలు 33 మంది. ఎస్టీ కేటగిరిలో 33 మందిలో 22 మంది మహిళా అభ్యర్థులు ఉండడం స్ఫూర్తిదాయకం. దేశంలో ఈ తరహా పథకం అమలు ఇదే తొలిసారి.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment