
తెలంగాణ ఏర్పాటైన అనంతరం మన్మోహన్‌ను కలిసి కృతజ్ఞతలు చెబుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు, రాజకీయ నిర్ణయాలు జరిగినప్పటికీ మన్మోహన్ ప్రధానిగా ఉన్న సభలోనే రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడం గమనార్హం. హైదరాబాద్ మెట్రో రైలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే మంజూరు కావడమే కాక, వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను ఇవ్వడంలో ఆయన కృషి ఉంది.
కాగా, మన్మోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన జీవితం దేశానికి ఆదర్శమని, ఆయన మరణం దేశ ప్రజలకు తీరనిలోటని పేర్కొన్నారు. మన్మోహన్ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment