పార్టీ కార్యకర్తలను సముచితంగా గౌరవిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరంగా గాం«దీభవన్ నుంచి వచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని, ముఖ్యమంత్రి సహా యావత్ మంత్రిమండలి ఇందుకు కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ సభలో భట్టి మాట్లాడారు. సామాజిక న్యాయం జరిగేది కాంగ్రెస్ పారీ్టలోనేనని.. ఇందుకు మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే నిదర్శనమని పేర్కొన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ కారణంగానే పార్టీ అధికారంలోకి వచి్చందని.. కార్యకర్తలను సముచితంగా గౌరవిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యతలను కార్యకర్తలు తీసుకోవాలన్నారు.
సమన్వయంతో ముందుకెళ్లాలి: దీపాదాస్‌మున్షీ
పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకుని పనిచేయాలని కోరారు.
మరింత బలోపేతం చేయాలి: ఉత్తమ్
కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పేందుకు మహేశ్‌గౌడ్ నియామకమే నిదర్శనమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తల శ్రమ, త్యాగాలతోనే తాము పదవుల్లో ఉన్నామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.
ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి సీఎం పరామర్శ
చిన్నచింతకుంట: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో జరిగిన దశదినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. మధుసూదన్‌రెడ్డిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి జూపల్లి, చిన్నారెడ్డి, మల్లురవి ఉన్నారు.
సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగు కలకలం
బంజారాహిల్స్ (హైదరాబాద్): సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో ఆదివారం ఓ గుర్తుతెలియని బ్యాగు కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రంగోలి స్టోర్ నుంచి సీఎం ఇంటికి వెళ్లేదారిలో ఈ బ్యాగును సీఎస్‌డబ్లూ (సిటీ సెక్యూరిటీ వింగ్) అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే వెళ్లి.. ఆ బ్యాగ్‌ను పరిశీలన కోసం అక్కడి నుంచి తరలించారు. ఇది సీఎం నిత్యం ప్రయాణించే మార్గం కావడం గమనార్హం. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని గుర్తించినట్లు పోలీసువర్గాలు చెప్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment