
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా (సీఎం రేవంత్) రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.
‘దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు. నీఆలోచనల్లో కుసంస్కారం.. నీ మాటలు అష్ట వికారం. తెలంగాణతల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రేస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా?.
.. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది. మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం.తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం’ అని కేటీఆర్ అన్నారు.
సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది....
దొడ్డి దారిన పిసిసి ప్రసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు....
నీఆలోచనల్లో కుసంస్కారం ... నీ మాటలు అష్ట వికారం .....
తెలంగాణతల్లి…— KTR (@KTRBRS) August 28, 2024
ఇదిలా ఉండగా.. తెలంగాణ సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విగ్రహ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఇక, డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment