అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై కేటీఆర్‌ కామెంట్స్‌ | KTR Reacts On The Arrest Of Allu Arjun In Sandhya Theatre Case, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై కేటీఆర్‌ కామెంట్స్‌

Dec 13 2024 1:41 PM | Updated on Dec 13 2024 5:00 PM

KTR Condemns the Arrest of Allu Arjun

సాక్షి,హైదరాబాద్‌: సినీ హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు. హైడ్రా వల్ల ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలో సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలి. 

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆ ట్వీట్‌లో ‘సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతాను.. కానీ ఘటనలో నిజంగా తప్పు చేసింది ఎవరని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కానీ అల్లు అర్జున్‌ను సాధారణ నేరగాడిలా ట్రీట్‌ చేయడం సరికాదని కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్‌ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు. 

అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్‌ కోసం క్లిక్ చేయండి

అల్లు అర్జున్‌ అరెస్ట్‌ 
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో డిసెంబర్‌ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (9)కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీతేజ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై ఇప్పటికే నమోదు చేయగా.. తాజాగా ఈ కేసులో చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పీఎస్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనలో పోలీసులు ఇటీవలే ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. సెక్యూరిటీగార్డ్‌ సహా థియేటర్‌ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

👉చదవండి : హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ 

Advertisement
 
Advertisement
Advertisement