సినీ హీరో అల్లు అర్జున్‌ని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం బన్నీ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానితో పాటు అక్కడ సెక్యూరిటీ వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆయనను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను హాజరుపరచగా, 14 రోజుల పాటు రిమాండ్ విధించింది సదరు కోర్టు.
(ఇదీ చదవండి: Allu Arjun: రేవతి మృతిపై స్పందించిన అల్లు అర్జున్.. రూ.25 లక్షల సాయం)
అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 118(1), బీఎన్ఎస్ 105, రెడ్ విత్ 3/5 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు వల్ల 5 నుంచి 10 ఏళ్లు శిక్షపడే అవకాశముంది. బీఎన్ఎస్ 118 (1) కింద ఏడాది నుంచి 10 ఏళ్ళ శిక్షపడే అవకాశముంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరఫు న్యాయవాది.. హైకోర్టుని ఆశ్రయించారు. బుధవారమే పిటిషన్ వేశామని, ఇంకా విచారణ జరగలేదని పేర్కొన్నారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని న్యాయవాది కోరారు. నాం పల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నేపథ్యంలో హై కోర్టు తీర్పు కీలకంగా మారనుంది.
అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగింది..?
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలు డిసెంబర్ 4న రాత్రి 9:30 నిమిషాలకు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో హీరో అల్లు అర్జున్.. భార్య స్నేహతో కలిసి థియేటర్‌కు వెళ్లాడు. అయితే, థియేటర్ యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఎంట్రీ, ఎగ్జిట్ లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.
బన్నీ రాకతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో రేవతి (36) మహిళ అక్కడికక్కడే మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 105, 118(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులోనే అల్లు అర్జున్‌ను చిక్కడిపల్లి పోలీస్టేషన్‌కు తీసుకెళ్లారు.
(ఇదీ చదవండి: సంతోషంగా లేనన్న సుకుమార్.. బన్నీ ఏమన్నారంటే?)
Comments
Please login to add a commentAdd a comment