న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె ప్రియాంక గాంధీ ఓ భావోద్వేగపూరిత సందేశాన్ని ట్వీట్ చేశారు. ‘మా నాన్న నాకు ఎప్పుడు ఒకటే చెప్పేవారు. మార్గం ఎంత కష్టంగా ఉన్నా సరే.. జనాల కష్టాలు తెలుసుకుంటూ చిరునవ్వుతో ముందుకు సాగిపో’ అంటూ తండ్రితో కలిసి ఉన్న ఫోటోతో పాటు ఓ కవితను కూడా ట్వీట్ చేశారు. ప్రియాంక చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది.
From my father, I learned how to listen to people’s stories and find a place in my heart for them no matter how contrary to mine they might be.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 20, 2019
From him, I learned how to keep smiling and keep walking no matter how difficult the path might be.#RajivGandhi75 #SadbhavanaDiwas pic.twitter.com/O4W8d9cUL5
రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రియాంక. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నా తండ్రి నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఇతరుల కష్టాలను విని హృదయంతో స్పందిచడం.. ఎంత కష్టమైనప్పటికి నచ్చిన మార్గంలో పయనించడం వంటి లక్షణాలను నా తండ్రి నుంచే అలవర్చుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీ తన తండ్రిని ఉద్దేశిస్తూ.. ‘గొప్ప వీరుడు మాత్రమే కాక గొప్పగా ప్రేమించే తండ్రి’ అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment