birth aniversary
-
స్వాతంత్య్రాన్ని ఊహించిన ‘బోస్’ ఏం చేశారు?
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పలువురు నేతలు కీలకపాత్ర పోషించారు. అయితే అటువంటి వారిలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర ఎనలేనిది. ఈరోజు(జనవరి 23) నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. 2021 సంవత్సరంలో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే సుభాష్ చంద్రబోస్ భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించింది. అయితే దీనికి నాలుగేళ్ల క్రితమే సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1943 అక్టోబరు 21న భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందే బోస్ సింగపూర్‌లో ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని స్థాపించారు. తాను చేపట్టిన ఈ చర్యతో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎక్కువ కాలం సాగదని బ్రిటీష్ వారికి బోస్ సందేశం ఇచ్చారు. 1943, జూలై 4న సింగపూర్‌లోని క్యాథే భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో స్వాతంత్ర్య పోరాట యోధుడు రాస్ బిహారీ బోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ బాధ్యతలను సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఆజాద్ హింద్ ప్రభుత్వం 1943, అక్టోబర్ 21న స్థాపితమయ్యింది. జపాన్, ఫిలిప్పీన్స్, జర్మనీ తదితర తొమ్మిది దేశాల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి గుర్తింపు వచ్చింది. ఈ ప్రభుత్వంలో సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రిగా, విదేశాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా పనిచేసినట్లు సమాచారం. ఆర్థిక శాఖను ఎస్సి ఛటర్జీకి, ప్రచార విభాగాన్ని ఎస్ఎకి అప్పగించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం అనేక దేశాలలో రాయబార కార్యాలయాలను కూడా ప్రారంభించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ తాత్కాలిక ప్రభుత్వం తపాలా స్టాంపులను కూడా విడుదల చేసింది. నేషనల్ ఆజాద్ బ్యాంక్, ఆజాద్ హింద్ రేడియో, రాణి ఝాన్సీ రెజిమెంట్లను కూడా ఏర్పాటు చేసింది. ఆ సమయంలో బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో మహిళల విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాటి మహిళా విభాగానికి చెందిన సైనికులు వైద్యం, గూఢచర్యంలో నిపుణులుగా పేరొందారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను 1915, అక్టోబరు 29న రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్, రాస్ బిహారీ బోస్, నిరంజన్ సింగ్ గిల్ స్థాపించారు. తర్వాత వారు దానిని సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు. వివిధ నివేదికల ప్రకారం ఆ సమయంలో బోస్ సారధ్యంలో 85 వేల మంది సాయుధ సైనికులు ఉండేవారు. 1943 డిసెంబర్ 30న బ్రిటిష్ వారిని ఓడించిన తర్వాత అండమాన్ నికోబార్‌లో తొలిసారిగా ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. దీనికి సుభాష్ చంద్రబోస్ సారధ్యం వహించారు. -
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.. సీఎం జగన్ నివాళి
అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొట్టతొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భాంగా ఆ మహనీయుడికి ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారని తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడని కొనియాడుతూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/oFfEdyidHz — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2023 ఇది కూడా చదవండి: అవును.. సీఎం జగన్ మహిళా పక్షపాతే -
వైఎస్సార్ అరుదైన చిత్రాలు.. స్పెషల్ వీడియో
-
మంగళగిరిలో వైఎస్సార్ జయంతి వేడుకలు
-
తండ్రిని స్మరిస్తూ.. ప్రియాంక భావోద్వేగం
న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె ప్రియాంక గాంధీ ఓ భావోద్వేగపూరిత సందేశాన్ని ట్వీట్ చేశారు. ‘మా నాన్న నాకు ఎప్పుడు ఒకటే చెప్పేవారు. మార్గం ఎంత కష్టంగా ఉన్నా సరే.. జనాల కష్టాలు తెలుసుకుంటూ చిరునవ్వుతో ముందుకు సాగిపో’ అంటూ తండ్రితో కలిసి ఉన్న ఫోటోతో పాటు ఓ కవితను కూడా ట్వీట్ చేశారు. ప్రియాంక చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. From my father, I learned how to listen to people’s stories and find a place in my heart for them no matter how contrary to mine they might be. From him, I learned how to keep smiling and keep walking no matter how difficult the path might be.#RajivGandhi75 #SadbhavanaDiwas pic.twitter.com/O4W8d9cUL5 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 20, 2019 రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రియాంక. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నా తండ్రి నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఇతరుల కష్టాలను విని హృదయంతో స్పందిచడం.. ఎంత కష్టమైనప్పటికి నచ్చిన మార్గంలో పయనించడం వంటి లక్షణాలను నా తండ్రి నుంచే అలవర్చుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీ తన తండ్రిని ఉద్దేశిస్తూ.. ‘గొప్ప వీరుడు మాత్రమే కాక గొప్పగా ప్రేమించే తండ్రి’ అంటూ ట్వీట్ చేశారు. -
విశ్వనట చక్రవర్తికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, రామచంద్రాపురం: తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అజరామర పాత్రల్లో అలరించిన మహానటుడు, విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు. ఆయన శత జయంతి సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ‘తెలుగు, తమిళ సినీరంగాలకు చెందిన మహానటుడు ఎస్వీరంగారావుగారి శతజయంతి పురస్కరించుకొని ఆయన్ను స్మరించుకుందాం’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. Remembering the legend of Telugu and Tamil cinema Sri SV Ranga Rao Garu on his 100th Jayanthi. — YS Jagan Mohan Reddy (@ysjagan) 3 July 2018 -
తొలి ప్రధానికి ఘన నివాళి
-
తొలి ప్రధానికి ఘన నివాళి
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధానిమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 127వ జయంతి సందర్భంగా జాతి యావత్తు ఘనంగా నివాళులు అర్పిస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉదయం ఢిల్లీలోని నెహ్రూ సమాధి శాంతి వన్ వద్దకు చేరుకుని తొలి ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు కూడా నెహ్రూ సమాధిపై పూలు చల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాంతి వన్ వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు. 1889, నవంబర్ 14న అలహాబాద్ లో జన్మించిన జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్యానంతరం 1947 నుంచి 1964 వరకు తొలి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. నెహ్రూ జయంతిని జాతీయ బాలల దినోత్సవంగానూ జరుపుకొంటారని తెలిసిందే. -
మనసు నిండుగా మహాత్మునికి నివాళి
-
రాష్ట్ర పండుగగా కాటన్ జయంతి
- 15న రాజమండ్రిలో వేడుకలు... జల వనరుల శాఖ ఏర్పాట్లు హైదరాబాద్: ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్‌లను నిర్మించిన సర్ ఆర్థన్ కాటన్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15న రాజమండ్రిలో కాటన్ 212 జయంతి వేడుకలను నిర్వహించడానికి జల వనరుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ అధికారులు పాల్గొననున్నారు. కాటన్‌తో పాటు ప్రముఖ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రామకృష్ణయ్య, కేఎల్ రావు జయంతులను కూడా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.