తొలి ప్రధానికి ఘన నివాళి
తొలి ప్రధానికి ఘన నివాళి
Published Mon, Nov 14 2016 8:49 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధానిమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 127వ జయంతి సందర్భంగా జాతి యావత్తు ఘనంగా నివాళులు అర్పిస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉదయం ఢిల్లీలోని నెహ్రూ సమాధి శాంతి వన్ వద్దకు చేరుకుని తొలి ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించారు.
ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు కూడా నెహ్రూ సమాధిపై పూలు చల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాంతి వన్ వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు. 1889, నవంబర్ 14న అలహాబాద్ లో జన్మించిన జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్యానంతరం 1947 నుంచి 1964 వరకు తొలి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. నెహ్రూ జయంతిని జాతీయ బాలల దినోత్సవంగానూ జరుపుకొంటారని తెలిసిందే.
Advertisement