![Ghulam Nabi Azad Says 2024 Assessment Dont See Party 300 Seats Winning - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/2/gulam-nabi.jpg.webp?itok=SCgotsWM)
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ ఓ వైపు నాయకత్వలేమి సమస్యలు ఎదుర్కొంటోంది. మరోవైపు సీనియర్ నాయకుల సంచలన వ్యాఖ్యలతో సతమతమవుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం జమ్మూ కశ్మీర్‌లో మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు గెలిచే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
చదవండి: మా మద్దతు లేకుండా బీజేపీని ఓడించలేరు
అదే విధంగా జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి అర్టికల్ 370 పునరుద్ధరణ విషయంతో తమ వాగ్దానాలను నెరవేర్చే స్థితిలో లేవమని పేర్కొన్నారు. అర్టికల్ 370 కోర్టు పరిధిలో ఉందని, ప్రస్తుతం తమ చేతిలో ఏం లేదని తెలిపారు. అయితే ఎవరైనా దానికి కోసం పోరాడితే అది బాధ్యతయుతమైన ముందడుగు అవుతుందని అన్నారు.
చదవండి: వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం కేసీఆర్ భేటీ?
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 300 ఎంపీ స్థానాలు లేవని, వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామన్న పరిస్థితి కనిపంచడం లేదన్నారు. అందుకే తాను సత్యదూరమైన వాగ్దానాలు చేయలేనని స్పష్టం చేశారు. ఇక, జీ-23 కాంగ్రెస్ నేతల్లో గులాం నబీ అజాద్ ప్రముఖ నేత అన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment