శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం గులాం నబీ ఆజాద్.. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి షాక్ తగిలింది. ఈ పార్టికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తాజ్ మొహియుద్దీన్ కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. ‘‘కొన్ని రోజుల్లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతాను. ఆజాద్ సాబ్ నాకు పార్టీలో చాలా గౌరవం ఇచ్చారు. ఆజాద్ కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను పూర్తి స్థాయిలో సంతోషంగా ఉంటాను. నాకు కాంగ్రెస్ పార్టీతో సుమారు 45 ఏళ్ల అనుబంధం ఉంది. నేను మళ్లీ నా సోంత గూటికి చేరుకోబోతున్నా.
అయితే నేను నా కార్యకర్తల అభిప్రాయాలను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నా. వారంతా నేను కాంగ్రెస్‌లో చేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అందుకే నేను మళ్లీ కాంగ్రెస్‌తో చేరనున్నాను’’ అని అన్నారు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ అసెంబ్లీ సెగ్మెంట్ మాజీ ఎమ్మెల్యే అయిన మొహియుద్దీన్ 2022 ఆగస్టులో ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం ఆజాద్ పెట్టిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీలో చేరారు.
గులాం నబీ ఆజాద్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏఈప) కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. శనివారం తాజ్ మొహియుద్దీన్ కాంగ్రెస్ చేరనున్నట్లు ప్రకటించటంతో ఊహాగానాలు మరింతి ఎకక్కువ అయ్యాయి. అయితే ప్రచారానన్ని డీపీఏపీ అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఖండించారు.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టినప్పటి నుంచి ఆయనకు ఏ కాంగ్రెస్ నాయకుడు నేరుగా లేదా టెలిఫోన్ ద్వారా సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఈ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి, అబద్ధం మాత్రమే అని అన్నారు. గందరగోళాన్ని సృష్టించి తమ పార్టీని విచ్ఛిన్నం చేయడాని ఇలాంటి ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఈ ట్రాప్‌లో పార్టీ నాయకులు కార్యకర్తలు చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇక.. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్-డిసెంబర్‌లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment