ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (46 స్థానాలు) దాటింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ మూడోసారి హర్యానాలో అధికారం చేపట్టనుంది. బీజేపీ భారీ విజయం సాధించటంతో హైకమాండ్ మళ్లీ హర్యానాకు సీఎంగా నయాబ్ సింగ్ సైనీకి ప్రకటించింది.
ఇక.. ఇక్కడి ఆప్, జేజేపీ పార్టీలు ఒక్కసీటు కూడా గెలువలేదు. మంగళవారం ఓట్ల లెక్కింపులో ఒక సయయంలో బీజేపీ పలు స్థానాల్లో వెనకంజలో ఉన్నా.. అనూహ్యంగా ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా వచ్చాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ అనుకూలమైన తాజా ఫలితాల తలకిందులు చేశాయి.
ప్రస్తుతం సీఎం హర్యానా సైనీ.. ఆరు నెలల ముందే సీఎం పీఠంపై కూర్చున్నా.. పార్టీని హర్యానాలో గెలిపించుకున్నారు. ఆశలు లేని స్థాయి నుంచి అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. 1966 నుంచి హర్యానాలో ఏ పార్టీ కూడా వరసగా మూడు సార్లు అధికారం చేటపట్టలేదు. తాజాగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గెలిచి ఆ ఆనవాయితీని బ్రేక్ చేసింది.
హర్యానాలో
- బీజేపీ: గెలుపు-48
- కాంగ్రెస్: గెలుపు- 37
- ఇతరులు:గెలుపు-5
ఇప్పటివరకు ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక ఫలితాలు..
జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి విజయం
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన మ్యాజిక్ ఫిగర్ స్థానాలను కూటమి గెలుపొందింది. ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న సీపీఎం స్థానంలో గెలుపు. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాధించింది.ఇక.. పీడీపీ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. జమ్ము రీయన్‌లో కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అవుతారని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌లో
- నేషనల్ కాన్ఫరెన్స్ - 42 సీట్లు
- బీజేపీ - 29
- కాంగ్రెస్ - 06
- పీడీపీ - 03
- సీపీఎం - 01
- ఆప్ - 01
- జేపీసీ - 01
- స్వతంత్రులు - 07
- మొత్తం స్థానాలు: 90
Comments
Please login to add a commentAdd a comment