హర్యానాలో బీజేపీ జోరు.. కాబోయే సీఎం ఎవరంటే? | Sources Says BJP To Stay With Nayab Singh Saini As Haryana CM | Sakshi
Sakshi News home page

హర్యానాలో బీజేపీ జోరు.. కాబోయే సీఎం ఎవరంటే?

Published Tue, Oct 8 2024 3:56 PM | Last Updated on Tue, Oct 8 2024 4:28 PM

Sources Says BJP To Stay With Nayab Singh Saini As Haryana CM

చండీగఢ్‌: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దూసుకెళ్లోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో కాషాయ పార్థీ నేతలు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ నడుస్తోంది. 

అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ సైనీనే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం. సైనీవైపే హైకమాండ్‌ మొగ్గుచూపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో లాడ్వా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం సైనీ.. కాంగ్రెస్‌ అభ్యర్థి మేమా సింగ్‌పై భారీ విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా ‍ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మూడో సారి బీజేపీకి అధికారం ఇచ్చినందకు ధన్యావాదాలు. మోదీ నాయకత్వం వల్లే విజయం సాధ్యమైందన్నారు. 

 

ఇదిలా ఉండగా.. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 90 స్థానాలు ఉన్న హర్యానాలో ఇప్పటికే 49 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌(46)ను అధికార బీజేపీ దాటేసింది. ఇక, ముందంజలో ఉన్న 49 స్థానాల్లో ఇప్పటికే 30 స్థానాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో, బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. అయితే, ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభంలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ క్రమంగా బీజేపీ దూసుకెళ్లింది. కాంగ్రెస్‌ పట్టున్న పలు స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక, ప్రస్తుత లెక్కల ప్రకారం.. బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో, ఇతరులు ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement