జమ్మూకశ్మీర్‌లో ముగిసిన రెండో విడత పోలింగ్‌.. | Jammu And Kashmir Assembly Elections 2nd Phase Votes Polling Live Updates And Latest News In Telugu | Sakshi
Sakshi News home page

Jammu And Kashmir Polling Updates: జమ్మూకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్‌లో 50 శాతం పోలింగ్‌ నమోదు

Published Wed, Sep 25 2024 7:09 AM | Last Updated on Wed, Sep 25 2024 6:08 PM

Jammu And Kashmir Assembly Elections 2nd Phase Elections Live Updates

Elections Live Updates..

👉జమ్ము కశ్మీర్‌లో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

 👉శ్రీనగర్‌లో పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు, వారిని అడ్డుకున్న స్థానిక ఎన్నికల సిబ్బంది, పోలీసులు. 

👉ఉదయం 11 గంటల వరకు 24.10 శాతం పోలింగ్‌ నమోదైంది. 
 

 👉 ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు.

 

👉పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు 

 

 

👉ఓటు వేసేందుకు బారులు తీరిన జనం..

 

 

 

 

👉ఓటర్లకు మోదీ సందేశం..

అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో తమ వంతు బాధ్యతగా ఓటు వేయండి. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి కంగ్రాట్స్‌. 

 

 

 

👉వైష్టో దేవీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్‌లో నిలుచున్నారు.

 

👉పలువురు బీజేపీ అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 

 

 


👉బీజేపీ చీఫ్‌ రవీందర్‌ రైనా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీ విజయం సాధిస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మా పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు. నేను పార్టీలో ఒక సాధారణ కార్యకర్తను మాత్రమే. నేషన్‌ ఫస్ట్‌ అనే భావనతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మోదీ, అమిత్‌ షా కృషితో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ చూస్తారు. 
 

 

 

👉జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు రెండో విడతలో 26 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. 

👉26 నియోజకవర్గ 239 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు. దాదాపు 25 లక్షల మంది ఓటర్లు రెండో విడతలో ఓటు వేయనున్నారు.

 

 

👉సెకండ్‌ ఫేజ్‌ ఎన్నికల్లో కశ్మీర్‌ లోయలో మూడు జిల్లాల్లో, జమ్మూ డివిజన్‌లో మూడు జిల్లాల్లో ఈ రోజు పోలింగ్‌ జరుగుతోంది.

👉పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 3,502 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో 1,056 పట్టణ ప్రాంతాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పారు.

👉ఈ దఫాలో మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు తారిఖ్‌ హమీద్‌ కరా, బీజేపీ జమ్ము కశ్మీర్‌ చీఫ్‌ రవీందర్‌ రైనాలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఒమర్‌ ఈసారి గందేర్‌బల్, బుద్గామ్‌ చోట్ల నుంచి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement