
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం ఆగస్టు 21వ తేదీన నాటకీయ పరిణామాల మధ్య అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో తీహార్ జైల్లో ఉన్న చిదంబరాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ బుధవారం కలిశారు. వారివెంట చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఉన్నారు. తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన కాంగ్రెస్ నేతలు ఆయనతో దాదాపు అర్ధగంట సేపు ముచ్చటించారు.
రాజకీయ అంశాలు ముఖ్యంగా కశ్మీర్ గురించి, రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి వీరి మధ్య చర్చ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జైల్లో ఉన్న చిదంబరం సోమవారం 74వ పుట్టినరోజును జరుపుకున్నారు. జైలు వర్గాల ప్రకారంచ ప్రస్తుతం చిదంబరం ఆరోగ్యంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment