సాక్షి, న్యూఢిల్లీ: తిహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను ఆ పార్టీ సీనియర్ నాయకులు పలువురు గురువారం కలిశారు. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శ్మ, డీకే సురేశ్ జైల్లో ఉన్న శివకుమార్‌ను కలిసి.. కాసేపు ముచ్చటించారు.
తిహార్ జైల్లోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఆయన తనయుడు కార్తీ చిదంబరం గురువారం కలిశారు. చిదంబరాన్ని కలిసిన అనంతరం జైలు బయట కార్తీ మీడియాతో మాట్లాడారు. ‘ఇది కక్షసాధింపు రాజకీయం తప్ప మరొకటి కాదని మేం పదేపదే చెప్తున్నాం. మంచి వక్తలై ఈ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగడుతున్న నాయకుల్ని బోగస్ కేసులతో టార్గెట్ చేశారు. మా నాన్న, శివకుమార్ మీద ప్రస్తుతం ఎలాంటి విచారణ జరగడం లేదు. వారిని దోషులుగా ఏ కోర్టు నిర్ధారించలేదు. అయినా, జ్యుడీషియల్ కస్టడీ కింద వారిని జైల్లో ఉంచారు. ఇది దేశ రాజకీయ వాతావరణాన్ని విషతుల్యంచేసి భయానక వాతావరణాన్ని సృష్టించడమే’ అని కార్తీ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment