Karthi Chidambaram
-
పని గంటలపై నారాయణమూర్తికి కౌంటర్
న్యూఢిల్లీ:ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్‌లో పనిదినాలు ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గిపోతుండడంపై మూర్తి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కార్తీ చిదంబరం ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ఎన్ని గంటలు ఎక్కువ పనిచేశామన్నది ముఖ్యం కాదని, ఎంత ప్రభావవంతంగా పనిచేశామన్నది ముఖ్యమన్నారు.‘ఎక్కువ సేపు పనిచేయడమనేది అర్థం లేనిది. ఎంత ఫోకస్‌తో పనిచేశామనేది మఖ్యం. జీవితంలో రోజువారి సమస్యలతో పోరాడే మనుషులకు వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. నిజానికి భారత్‌లో పనిదినాలను వారానికి నాలుగు రోజులకు తగ్గించాలి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే చాలు’అని కార్తీ చిదంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌గొగోయ్ కూడా నారాయణమూర్తి ఎక్కువ పనిగంటల విధానంతో విభేదించడం గమనార్హం. Working longer is meaningless, focus should be on efficiency. Daily life is as it is a struggle, battling inefficient & substandard infrastructure & amenities. Work life balance is most important for good social order & harmony. We should infact move to a 4 day working week. 12… https://t.co/EOOer6AgnK— Karti P Chidambaram (@KartiPC) December 22, 2024 ఇదీ చదవండి: హైదరాబాద్‌పై ఇన్ఫోసిస్ మూర్తి కీలక వ్యాఖ్యలు -
ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళన
సిబిల్ స్కోర్ విశ్వసనీయతపై రాజకీయ రంగంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో సిబిల్ స్కోర్ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించే సిబిల్ స్కోర్ల విశ్వసనీయత, జవాబుదారీతనంపై ప్రశ్నలొస్తున్నాయని తెలిపారు. వ్యవస్థ పారదర్శకత, నిష్పాక్షికతపై అనుమానం వ్యక్తం చేశారు. సిబిల్ స్కోర్ నిర్వహణకు మెరుగైన యంత్రాంగం లేకపోవడాన్ని చిదంబరం నొక్కిచెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న సిబిల్ నిర్వహణ చాలా మంది భారతీయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుందని అభిప్రాయపడ్డారు.అసలు సిబిల్ అంటే ఏమిటి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది ఎంత ఉండాలి? దాన్ని మెరుగుపరుచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. అనే అంశాల గురించి తెలుసుకుందాం.సిబిల్ స్కోర్సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని సిబిల్ స్కోర్ ఇస్తారు. క్రెడిట్ బ్యూరో దగ్గర వ్యక్తులు తీసుకున్న రుణాలు వాటి చెల్లింపుల వివరాలు అన్నీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్‌ను తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబంధించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఇవన్నీ సిబిల్లో రికార్డు అవుతాయి. ఈ స్కోర్ 750-900 మధ్య ఉంటే మంచి రికార్డు ఉందని అర్థం.ఎక్కువగా ఉంటే..సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే త్వరగా లోన్ పొందే వీలుంటుంది. మనం కోరుకున్న రుణం మొత్తాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం రాదని కాదు. ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకయినా మరో బ్యాంకు లోన్ ఇవ్వొచ్చు. అది ఆయా బ్యాంకుల పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తక్కువ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు అప్పు ఇచ్చినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తాయి.సిబిల్ 750-900: సిబిల్ స్కోర్ 750 నుంచి 900 మధ్యలో ఉంటే ఎటువంటి లోన్ అయినా సులభంగా పొందవచ్చు. అది కూడా తక్కువ వడ్డీరేటుతో పొందే అవకాశం ఉంటుంది.స్కోర్ పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్, జియో పరస్పరం విరుద్ధ వాదనలుస్కోర్ తెలుసుకోవడం ఎలా?క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దానికోసం సిబిల్‌కు సంబందించిన అధికారక వెబ్సైట్ www.cibil.comలోకి వెళ్లాలి. ఆన్లైన్లో ఫారం పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డు, బ్యాంకుకు సంబందించిన వివరాలను ఇవ్వాలి. అన్ని వివరాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే క్రెడిట్ రిపోర్ట్ మెయిల్ ద్వారా పంపిస్తారు. -
ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కరరామన్ అరెస్ట్
చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వీసా కన్సల్టెన్సీ స్కాంలో కీలక మలుపు చోటుచేసుకుంది. చిదంబరం కుమారుడు కార్తీ అనుచరులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నైలో కార్తీ సన్నిహితుడు ఎన్ భాస్కర్ రామన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా విదేశీ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయంటూ కార్తీ చిదంబరంపై సీబీఐ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల కిందట యూపీఏ హయాంలో తన తండ్రి చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో పవర్ కంపెనీ పనుల నిమిత్తం భారత్ వచ్చిన 250 మంది చైనా పౌరులకు వీసాలు ఇచ్చేందుకు కార్తీ రూ. 50 లక్షల లంచం తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మంగళవారం కార్తి, ఆయన సన్నిహితుడు భాస్కరరామన్ సహా పలువురి నివాసాలు, అధికారిక కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, ఒడిశా, శివగంగైలో ఈ సోదాలు జరిగాయి. తాజా కేసులో కార్తీతోపాటు ఆయన సన్నిహితుడు ఎన్ భాస్కర రామన్, తలవండీ, పవర్ ప్రాజెక్ట్ ప్రతినిధి వికాస్ మఖరియా, ముంబైకు చెందిన బెల్‌టూల్స్ తదితరుల పేర్లను కూడా చేర్చారు. భాస్కరరామన్ వద్ద చిక్కిన కొన్ని పత్రాలు ఈ కేసులో కీలకంగా సీబీఐ భావిస్తోంది. చదవండి: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ -
కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరంపై మరో కేసు నమోదైంది. పదకొండేళ్ల క్రితం చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండగా రూ.50 లక్షల లంచం తీసుకొని ఒక విద్యుత్ కంపెనీ కోసం 263 మంది చైనీయులకు వీసాల మంజూరుకు సహకరించారంటూ కార్తీపై సీబీఐ కేసు నమోదు చేసింది. కార్తీతో పాటు ఆయన సన్నిహితుడు ఎస్.భాస్కరరామన్, నాటి తల్వాండి సాబో పవర్ ప్రాజెక్టు అధ్యక్షుడు వికాస్ మఖారియా తదితరులపై ఏపీసీ 120బీ, 477ఏ, అవినీతి నిరోధక చట్టంలోని 8, 9 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, చెన్నైలోని చిదంబరం, కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై, ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, ఒడిశా, పంజాబ్ సహా 10 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. సోదాల సమయంలో చిదంబరం ఢిల్లీలో, కార్తీ లండన్‌లో ఉన్నారు. వీటిపై కార్తీ, ‘‘ఇప్పటివరకు నాపై ఎన్నిసార్లు ఇలా దాడులు చేశారో గుర్తు లేదు. ఇది కచ్చితంగా ఒక రికార్డే’’ అని ట్వీట్ చేశారు. ఎఫ్ఐఆర్లో నాపేరే లేదు: చిదంబరం మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిదంబరం కొడుకు కార్తీపై నమోదైన కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీబీఐ దాడులపై చిదంబరం స్పందించారు. This morning, a CBI team searched my residence at Chennai and my official residence at Delhi. The team showed me a FIR in which I am not named as an accused. The search team found nothing and seized nothing. I may point out that the timing of the search is interesting. — P. Chidambaram (@PChidambaram_IN) May 17, 2022 ‘ఈ రోజు(మంగళవారం) ఉదయం చెన్నై, ఢిల్లీలోని నా నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. అధికారులు ఎఫ్ఐఆర్ కాపీ చూపించారు. కానీ అందులో నిందితుడిగా నా పేరే లేదు. అంతేగాక సోదాల్లో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి అధికారులు ఎలాంటి పత్రాలనూ స్వాధీనం చేసుకోలేదు. ఇక అధికారులు సెర్చింగ్ చేసే సమయం ఆసక్తికరంగా సాగింది’ అంటూ చిదంబరం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చదవండి: ‘ఢిల్లీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆప్‌దే’ I have lost count, how many times has it been? Must be a record. — Karti P Chidambaram (@KartiPC) May 17, 2022 -
టీ హబ్‌కి ఎంపీలు ఫిదా.. మంత్రి కేటీఆర్‌ని మెచ్చుకున్న ఫ్రైర్‌బ్రాండ్
THubHyd: స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ హబ్‌ని పార్లమెంట్ ఐటీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటు ఐటీ స్టాండింగ్ కమిటీ ఇటీవల టీ ఐటీ హబ్‌ని సందర్శించారు. ఇక్కడ స్టార్టప్‌లకు అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వపరమైన ప్రోత్సహాకాలను వారు పరిశీలించారు. మంత్రి కేటీఆర్‌కు ప్రశంసలు తెలంగాణ ఐటీ హబ్ పనితీరును పశ్చిమ బెంగాల్‌కి చెందిన టీఎంసీ ఎంపీ, ఫైర్‌బ్రాండ్ మహువా మెయిత్రా మెచ్చుకున్నారు. 70 వేల చదరపు అడుగుల ఇంక్యుబేటర్ సెంటర్‌ని త్వరలోనే 3.50 లక్షల అడుగుల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. ఒక ఐడియాతో తెలంగాణ ఐటీ హబ్‌లోకి వెళితే ప్రొడక్టుతో బయటకు రావొచ్చంటూ ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు వండర్ఫుల్ జాబ్ ఆల్ అరౌండ్ కేటీఆర్టీఆర్ఎస్ అంటూ ప్రశంసించారు. — KTR (@KTRTRS) September 8, 2021 థ్యాంక్యూ మహువా మోయిత్రా ప్రశంసల ట్వీట్‌కి మంత్రి కేటీఆర్ స్పందించారు. థ్యాంక్యూ మహువా జీ అంటూ ట్వీట్ చేశారు. తమిళనాడుకి అవసరం మరోవైపు తమిళనాడుకు చెందిన కార్తి చిదంబరం సైతం ఐటీ హబ్‌ని మెచ్చుకున్నారు. ఇటువంటి ఐటీ హబ్ తమిళనాడుకు అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. టీ హబ్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ అండ్ ఎఫెక్టివ్ ఇన్షియేటివ్ అంటూ ట్వీట్ చేశారు. చదవండి : ఆన్‌లైన్‌లోకి ఆటో మొబైల్.. భారీగా నియామకాలు! -
సొంత పార్టీ నేతలపై కార్తీ చిదంబరం విమర్శలు
చెన్నై: కాంగ్రెస్ పార్టీ వర్గాలపై అదే పార్టీకి చెందిన జాతీయ నేత పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తీవ్రంగా విరుచుకుపడడం చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ వాళ్లు అబద్ధాల కోరులు.. ఆపండి మీ అబద్ధాలు అని ఆయన రామనాథపురం వేదికగా ఆగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. రామనాథపురం జిల్లా పరమకుడిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కార్తీ చిదంబరం తన పార్టీ వాళ్ల మీదే తీవ్రంగానే మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ సభ్యత్వం 70 లక్షలు అంటా.. ఇది పూర్తిగా అబద్ధమని మండిపడ్డారు. ( కాంగ్రెస్‌లో సంక్షోభం: సీఎం రాజీనామా..!) ఈ మేరకు సభ్యులు ఉండి ఉంటే, ఎందుకు ఓటింగ్ శాతం తగ్గినట్టో అని ప్రశ్నించారు. సభ్యుల్ని పెంచి చూపించాలని, ఏదో మొక్కుబడిగా నివేదికలు, చిట్టాలు సిద్ధం చేసి ఢిల్లీకి పంపించేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ పేపర్లు అక్కడి వాళ్లకు బటానీలను పెట్టుకుని తినేందుకు ఉపయోగపడుతున్నట్టు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని, ఇకనైనా నిజాలు చెబితే మంచిదని హితవు పలికారు. -
రజనీకాంత్ అసలు రాజకీయం ఇదీ!
సాక్షి, చెన్నై: పౌరసత్వం (సవరణ) చట్టానికి మద్దతుగా నటుడు రజనీకాంత్ చేసిన ప్రకటనకు వరుస కౌంటర్లు పేలుతున్నాయి. సీఏఏ, ఎన్పీఆర్ గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్న రజనీకాంత్ వ్యాఖ్యలను తమిళనాడు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం రజనీకాంత్‌పై విమర్శలు గుప్పించారు. అధికార బీజేపీ చేతిలో ఆయన కీలు బొమ్మగా మారిపోయాడని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అళగిరి మండిపడ్డారు. సీఏఏ అమల్లోకి వస్తే 17 కోట్ల మంది ముస్లింలు, మూడు కోట్ల మంది క్రైస్తవులతోపాటు 83 కోట్ల మంది హిందువులు కూడా ప్రభావితమవుతారు. అస్సాంలో 19 లక్షల మంది పౌరులను విదేశీయులుగా ప్రకటించారు. ఈ జాబితాలో ముస్లింలు, హిందువులు ఉన్నారనే సంగతి రజనీకాంత్‌కు తెలుసా అని అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలో మాదిరిగా దేశవ్యాప్తంగా నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలను కుంటున్నారా? అని ప్రశ్నించారు. రజనీకాంత్ తమిళనాడులో మతపరమైన ఎజెండాను భుజానకెత్తుకున్నారని స్పష్టమైందనీ, రజనీ అసలు రాజకీయాలు ఇప్పుడు బహిర్గతమ య్యాయని విమర్శించారు. మతం ప్రాతిపదికన పౌరులపై వివక్ష చూపలేమని రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. బీజేపీకి రజనీకాంత్ మద్దతు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు.. కానీ వాస్తవాలను మరుగుపరచకూడదన్నారు. జనాభా గణన, ఎన్పీఆర్ వేర్వేరు అనే విషయాన్ని ఆయన మొదట అర్థం చేసుకోవాలని హితవు పలికారు. అలాగే కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం రజనీకాంత్ వ్యాఖ్యలపై నిరాశ వ్యక్తం చేశారు. సీఏఏ ఎందుకు వివక్షాపూరితమైందో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎలా అవుతుందో రజనీకాంత్ వివరించేవాడినని ఆయన ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్ నేత, ఎంపీ కార్తీచిదంబరం కూడా రజనీకాంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీ నటించాల్సిన అవసరం లేదని కార్తీ ఎద్దేవా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చని పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. సీఏఏపై బుధవారం స్పందించిన రజనీ సీఏఏ వలన ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరపున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని రజనీ ప్రకటించారు. చదవండి :సీఏఏ, ఎన్పీఆర్పై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు Disappointed with Mr.Rajnikanth’s statement on CAA. If he had asked me, I would’ve explained to him why the CAA is discriminatory and violates Art 14 of the Constitution. — P. Chidambaram (@PChidambaram_IN) February 5, 2020 -
ఎన్కౌంటర్ హత్యలు వ్యవస్థకు మచ్చ: కాంగ్రెస్ ఎంపీ
చెన్నై: షాద్‌నగర్ కేసులోని నిందితులను శుక్రవారం తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ పి చిదంబరం ట్విటర్లో స్పందించారు. 'అత్యాచారమనేది ఒక క్రూరమైన నేరం. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. అత్యాచారానికి పాల్పడిన నిందితులను నేను సమర్థించకున్నా.. ఎన్కౌంటర్ హత్యలు మన వ్యవస్థకు మచ్చ అని విమర్శించారు. Rape is an heinous crime. It must be dealt with strictly under the provisions of law. While I hold no brief for the alleged perpetrators of this dastardly act, “encounter” killings are a blot to our system. While I understand the urge for instant justice, this is not the way. https://t.co/BzVkLlSgYW — Karti P Chidambaram (@KartiPC) December 6, 2019 కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు, తమిళనాడు శివగంగ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తీ చిదంబరం.. ఎన్కౌంటర్ హత్యలు మన వ్యవస్థకు మచ్చ అని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. సత్వర న్యాయం కోసం.. ఎన్కౌంటర్ సరైన మార్గం కాదని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను శుక్రవారం తెల్లవారుజామున షాద్‌నగర్ చటాన్‌పల్లి శివారుకు తీసుకురాగా.. వారు పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా నలుగురు నిందితులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. -
మేం పదేపదే చెప్తున్నాం.. ఇది కక్షసాధింపే!
సాక్షి, న్యూఢిల్లీ: తిహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను ఆ పార్టీ సీనియర్ నాయకులు పలువురు గురువారం కలిశారు. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శ్మ, డీకే సురేశ్ జైల్లో ఉన్న శివకుమార్‌ను కలిసి.. కాసేపు ముచ్చటించారు. తిహార్ జైల్లోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఆయన తనయుడు కార్తీ చిదంబరం గురువారం కలిశారు. చిదంబరాన్ని కలిసిన అనంతరం జైలు బయట కార్తీ మీడియాతో మాట్లాడారు. ‘ఇది కక్షసాధింపు రాజకీయం తప్ప మరొకటి కాదని మేం పదేపదే చెప్తున్నాం. మంచి వక్తలై ఈ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగడుతున్న నాయకుల్ని బోగస్ కేసులతో టార్గెట్ చేశారు. మా నాన్న, శివకుమార్ మీద ప్రస్తుతం ఎలాంటి విచారణ జరగడం లేదు. వారిని దోషులుగా ఏ కోర్టు నిర్ధారించలేదు. అయినా, జ్యుడీషియల్ కస్టడీ కింద వారిని జైల్లో ఉంచారు. ఇది దేశ రాజకీయ వాతావరణాన్ని విషతుల్యంచేసి భయానక వాతావరణాన్ని సృష్టించడమే’ అని కార్తీ మండిపడ్డారు. -
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి బెయిల్
-
ఇదీ.. చిదంబరం చిట్టా
యూపీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తన కొడుకు కార్తీ కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చారని ఆరోపణలున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియాతోపాటు మరి కొన్ని కేసుల్లో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలివీ... ఐఎన్ఎక్స్: విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా! స్టార్ టీవీ ఇండియాకు సీఈఓగా దాదాపు పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత బయటకు వచ్చేసిన పీటర్ ముఖర్జియా సంస్థ పేరే ఐఎన్ఎక్స్ మీడియా. ఈయన తన భార్య ఇంద్రాణి ముఖర్జీతో కలిసి 2007లో ఐఎన్ఎక్స్ మీడియాను ఆరంభించారు. దాన్లో ఇంద్రాణి సీఈఓగా ఉండగా... పీటర్ ముఖర్జియా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా చేరారు. ఈ సంస్థలోకి విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిన రూ.305 కోట్లకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) పచ్చజెండా ఊపింది. ఈ ఎఫ్ఐపీబీ అనుమతుల విషయంలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. అంతేకాక విదేశీ పెట్టుబడుల రూపంలో ఐఎన్‌ఎక్స్‌లోకి వచ్చిన డబ్బులు వేరెవరివో కావని, చిదంబరం తనయుడు కార్తీకి చెందిన వివిధ కంపెనీలు ఈ పెట్టుబడుల్ని ఇండియాకు తరలించడానికి ఐఎన్ఎక్స్ మార్గాన్ని ఎంచుకున్నాయని, ఇది స్పష్టమైన మనీ లాండరింగ్ వ్యవహారమని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలు ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారిపోయారు. ఈ కేసులో తమను ఇరికించకుండా చూడడానికి వారు కార్తీకి 10 లక్షలు లంచం కూడా ఇచ్చారని సీబీఐ చెబుతోంది. ఎయిర్‌సెల్– మాక్సిస్: అక్రమ అనుమతులు! ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు 2011వ సంవత్సరం మేలో వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌సెల్ సంస్థ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తన సంస్థలోని 74 శాతం వాటాలను 2006లో మలేసియా కంపెనీ మాక్సిస్‌కు విక్రయించారు. అప్పటి కేంద్ర టెలికం మంత్రి దయానిధి మారన్ బలవంతంగా తనతో ఈ పని చేయించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ఆరంభించగా... ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. రూ.3,500 కోట్ల విలువ చేసే పెట్టుబడులను మాక్సిస్ సంస్థ ఎయిర్‌సెల్‌లో పెట్టిన సమయంలో ఆర్థిక మంత్రిగా చిదంబరమే ఉన్నారు. వాస్తవానికి ఈ స్థాయి విదేశీ పెట్టుబడులకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం నిబంధనల్ని తోసిరాజని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ద్వారా అనుమతులు మంజూరు చేశారని అభియోగాలున్నాయి. నిజానికి ఎఫ్ఐపీబీకి రూ.600 కోట్ల వరకు విలువున్న పెట్టుబడులకు మాత్రమే అనుమతినిచ్చే అధికారం ఉంది. ఈ ఒప్పందం కుదరడానికి చిదంబరం కుమారుడు కార్తీకి భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. 20 సార్లు చిదంబరానికి ఊరట ఐఎన్ఎక్స్, ఎయిర్‌సెల్, మాక్సిస్ కేసుల్లో ఇప్పటికే పలు దఫాలు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ చిదంబరాన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాయి. చిదంబరం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేసుకొని అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఈ ముందస్తు బెయిల్‌కు సంబంధించిన గడువుల్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. అలా మొత్తంగా 20 సార్లు చిదంబరానికి ఊరట లభించింది. ఇప్పటికే ఈడీ చిదంబరాన్ని గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో రెండు సార్లు ప్రశ్నించింది కూడా. బెయిల్‌పై ఉన్న కార్తీ ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం కుమారుడు కార్తీని గత ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేసింది. 23 రోజుల పాటు జైల్లో ఉన్న కార్తీ మార్చిలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి భారత్, యూకే, స్పెయిన్ దేశాల్లో కార్తీ చిదంబరానికి చెందిన రూ.54 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. పెండింగ్‌లో మరిన్ని కేసులు ► ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.1,272 కోట్ల విలువైన అవినీతి జరిగినట్టు కూడా చిదంబరంపై కేసు ఉంది. దీనిపై విచారణకు హాజరు కావాలని ఇటీవలే ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ► రూ.5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్స్ ్చంజ్ వ్యవహారంలో చిదంబరం తీసుకున్న నిర్ణయాల వల్లే తమ సంస్థ భారీగా దెబ్బతిన్నదని ‘63 మూన్స్ టెక్నాలజీస్’సంస్థ (గతంలో దీనిపేరు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్) ఫిర్యాదు చేసింది. ► ఇక శారదా చిట్‌ఫండ్ కేసులో చిదంబరం భార్య నళిని ప్రమేయం ఉన్నట్టుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో 1.4 కోట్ల రూపాయల ముడుపులు నళినికి అందినట్టుగా ఆరోపణలున్నాయి. ► బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015 కింద చిదంబరం, ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ, కోడలు శ్రీనిధిని విచారించాలంటూ ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను గత ఏడాది మద్రాస్ హైకోర్టు కొట్టివేసినప్పటికీ, సుప్రీం కోర్టులో ఇంకా ఇది పెండింగ్‌లో ఉంది. ► చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పడు ఇష్రాత్ జహాన్ కేసులో అఫిడవిట్‌ను తారుమారు చేసినట్టుగా ఆరోపణలున్న కేసు ఢిల్లీ పోలీసుల వద్ద పెండింగ్‌లో ఉంది. దాక్కోలేదు.. నిందితుడిని కాను న్యూఢిల్లీ: బుధవారం రాత్రి అరెస్టవ్వడానికి కొద్దిసేపటి ముందు చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. అక్కడ చిదంబరం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ‘ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఐఎన్ఎక్స్ కేసులో నేను కానీ, నా కుటుంబీకులు కానీ, లేదా మరెవ్వరూ నిందితులు కాదు. ఈ కేసులో సీబీఐ, ఈడీలు అభియోగపత్రం కూడా దాఖలు చేయలేదు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాల్లోనూ నేను తప్పు చేసినట్లు ఎక్కడా లేదు. అయినా నేను, నా కొడుకు ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు చెప్పడమనే రోగం ఉన్నవారు వ్యాప్తి చేస్తున్న అసత్యాలే ఇవన్నీ. నిజాన్ని దాటి ఏదీ ముందుకు వెళ్లలేదు. సీబీఐ, ఈడీలు నన్ను విచారించడం కోసం నోటీసులు ఇచ్చాయి. ముందుజాగ్రత్తగా అరెస్టు నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లి తాత్కాలిక రక్షణ కోరాను. నాకు దాదాపుగా గత 15 నెలలపాటు ఆ రక్షణ లభించింది. నేను ఎక్కడా దాక్కోలేదు. నిన్న రాత్రంతా నేను నా లాయర్లతో కలిసి కూర్చొని కోర్టులో సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేస్తున్నా. ఈ రోజు ఉదయానికే పని ముగిసింది. నా కేసును సుప్రీంకోర్టు శుక్రవారమే విచారిస్తుందని తెలిసింది. నేను న్యాయస్థానం ఆదేశాలకు తలవంచుతున్నాను. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేయకపోయినా సరే, నేను చట్టాన్ని గౌరవిస్తాను’అని మీడియాతో అన్నారు. కక్షగట్టారు: కాంగ్రెస్ చిదంబరానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే ఆయనపై కక్షగట్టి కేంద్రం వేధిస్తోందని వారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థ లను, ఓ వర్గం మీడియాను ఉపయోగించి చిదంబరం వ్యక్తిత్వాన్ని హతమార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహు ల్ గాంధీ ఆరోపించారు. చిదంబరాన్ని కేంద్రం వేటాడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఓ ట్వీట్ చేస్తూ ఏది ఏమైనా తాము చిదంబరానికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపింది. ‘అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా నిజం మాట్లాడే పౌరులను పీడించడం ద్వారా ప్రభుత్వం తన పిరికితనాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటోంది. చిదంబరం ఎన్నో అర్హతలున్న, గౌరవనీయ నాయకుడు. అంకితభావం, వినయంతో ఆయన ఈ దేశానికి సేవ చేశారు. సత్యాన్వేషణలో మేం ఆయనకు మద్దతుగా ఉంటాం. ఏది ఏమైనా సరే’అని కాంగ్రెస్ ట్విట్టర్లో పేర్కొంది. పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, ఇతర సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ, శశి థరూర్ తదితరులు చిదంబరానికి మద్దతుగా మాట్లాడా రు. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులపై ఎన్ని ఆరోపణలున్నా వారంతా పదవులు అనుభవిస్తున్నారని వారు ఆరోపించారు. తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు: బీజేపీ చిదంబరంపై కేసు విషయంలో కాంగ్రెస్ చేసిన కక్షసాధింపు వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. విచారణలో తాము జోక్యం చేసుకోవడంలేదనీ, చిదంబరం తాను చేసిన పనుల వల్లే ఈ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొంది. ‘ఆయన (చిదంబరం) ఏదైనా తప్పు చేసి ఉంటే, తప్పకుండా ఆయన ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాదేశాలతో పనిచేయవు. స్వతంత్రంగా పనిచేసే అధికారాలు వాటికి ఉన్నాయి’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. అరెస్ట్‌కు ముందు ఏఐసీసీ కార్యాలయంలో చిదంబరం చిదంబరం ఇంట్లోకి వస్తున్న సీబీఐ అధికారుల కారును అడ్డుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు -
గెలుపు చిదంబర రహస్యం
తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటి శివగంగ. కాంగ్రెస్ సీని యర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి కార్తీ చిదంబరం కిందటి ఎన్నికల్లో నాలుగో స్థానం లో నిలిచారు. మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి హెచ్.రాజా మళ్లీ పోటీలో ఉన్నా రు. వీరిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. 2014లో గెలిచిన ఏఐఏడీఎంకే నేత పీఆర్ సెంథిల్నాథన్, రెండో స్థానంలో ఉన్న డీఎంకే అభ్యర్థి దురై రాజ్ సుభా పొత్తుల కారణంగా పోటీ చేయడం లేదు. రాష్ట్రంలో రెండు కూటములకు నాయకత్వం వహిస్తున్న పాలక ఏఐఏడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే తమ మిత్రపక్షాలకు ఈసారి శివగంగ సీటును కేటాయిం చాయి. కిందటి ఎన్నికల ముందు పి.చిదంబరం రాజ్యసభకు ఎన్నికవడంతో తొలిసారి లోక్‌సభకు పోటీచేయలేదు. మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన ఆయన కొడుకు కార్తి ఓడిపోయారు. గత ఐదేళ్లలో ఆర్థిక నేరాలకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కార్తి ఇప్పుడు రెండోసారి గెలుపు కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఏఐఏడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థి హెచ్.రాజాకు వివాదాస్పద ప్రకటనలతో సంచలనం సృష్టించే నేపథ్యం ఉంది. నోటి దురుసు నేత రాజా రెండు దశాబ్దాల క్రితం శివగంగలో కాంగ్రెస్ అభ్యర్థికి రాజా గట్టి పోటీ ఇచ్చినా ఆయన నోటి దురుసు వల్ల జనాదరణ కోల్పోయారు. పాలకపక్షమైన ఏఐఏడీఎంకేతో పొత్తు ఉన్నా ఆయన ఇమేజ్ కారణంగా ఆయన అభ్యర్థిత్వానికి బీజేపీ కార్యకర్తలు మొదట అంత అనుకూలంగా లేరు. ఇటీవల రాజా తమిళులంతా గౌరవించే పెరి యార్ ఈవీ రామస్వామి నాయకర్, మైనారిటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో గొడవపడిన సమయంలో ఆయన మద్రాసు హైకోర్టుపైన, శబరిమల ఆలయ ప్రవేశ వివాదంలో అన్ని వయసుల మహిళలపై కూడా అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు. ఇలాంటి కరుడుగట్టిన హిందుత్వ రాజకీయాలు నడిపే నేత అభ్యర్థి అయితే ఓటర్లను ఆకట్టకోలేమని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి కార్తిపై ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులుండటంతో ఇద్దరు వివాదాస్పద నేతల మధ్య పోటీ జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కార్తి పేరు ప్రకటించడంలో జరిగిన ఆలస్యం కూడా కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది. ఎయిర్‌సెల్–మాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో నిందితుడైన కార్తి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ నాచయప్పన్ అభ్యంతరం చెప్పడంతో ఆయనకు శివగంగ టికెట్ ఇవ్వడంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం జాప్యం చేసింది. చాలా కాలంగా తన కేసులకు సంబంధించి ముఖ్యంగా బెయిలు కోసం వేసిన పిటిషన్ల కారణంగా కార్తి వార్తల్లో ఉంటున్నారు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన శివగంగలో రైతులు కష్టాల్లో మునిగి ఉన్నారు. వరి, చెరకు, పత్తి, మిరప, వేరు శనగ పండించే ఈ ప్రాంతంలోని రైతులు సాగు నీటి సమస్యతోపాటు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు. చెరకు పం టకు కనీస మద్దతు ధర తగినంత లేకపోవడం, సాగునీటి కొరత వల్ల పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన పంటల బీమా పథకం ఇక్కడి రైతులను ఆదుకోలేకపోతోంది. చెరువుల్లో పూడిక తీయకపోవడం వల్ల ప్రజలు తాగు నీరులేక అల్లాడుతున్నారు. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నా అలాంటి ప్రయత్నాలు జరగటం లేదు. సున్నపురాయి, గ్రానైట్, గ్రాఫైట్ వంటి ఖనిజ నిక్షేపాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నా రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పరిశ్రమల స్థాపన జరగడం లేదు. శివగంగ సమీపంలో తమిళనాడు మినరల్ లిమిటెడ్ కార్యాలయం ఉంది కానీ మైనింగ్ కార్యకలాపాలు పెరగడం లేదు. ఈ నేపథ్యంలో యువకులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. పాలకపక్షాలపై వ్యతిరేకత బీజేపీకి అననుకూల అంశం.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో దాని మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే అధికారంలో ఉండడంతో జనంలో పాలకపక్షాలపై వ్యతిరేకత హద్దులు దాటితే అదిక్కడ బీజేపీ అభ్యర్థికి అననుకూలం కావచ్చు. మందకొడిగా ప్రారంభమైన ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తన కొడుకు కార్తి గెలుపు కోసం చిదంబరం శివగంగలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నా రు. చిదంబరం దశాబ్దాల పాటు శివగంగ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నా నియోజకవర్గానికి ఏం చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ పార్టీ అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) అభ్యర్థి కూడా రంగంలో ఉండడంతో హిందువుల ఓట్లలో వచ్చే చీలిక బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చు. ఇక్కడి తేవర్ల ఓట్లు గణనీయంగానే ఈ పార్టీకి పడవచ్చని పరిశీలకుల అంచనా. కార్తి గెలుపు ఆయ న తండ్రి చిదంబరానికి అత్యంత ప్రతిష్టాత్మకరంగా మారింది. తండ్రి కంచుకోటలో కొడుకుకు పరీక్ష 1967లో ఏర్పడిన శివగంగ నుంచి చిదంబరం ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యా రు. టీఎంసీ తరఫున పోటీ చేసిన 1999లో ఒక్కసారే ఆయన ఇక్కడ ఓడిపోయారు. ఐదుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై, రెండుసార్లు టీఎంసీ తరఫున విజయం సాధించారు. 1999లో చిదంబరాన్ని కాంగ్రెస్ అభ్యర్థి ఈఎం సుదర్శన్ నాచయప్పన్ ఓడించారు. ఆరు అసెంబ్లీ సెగ్మెం ట్లు ఉన్న శివగంగలో మొత్తం ఓటర్లు 11,07, 575. ఇక్కడ పోలింగ్ ఏప్రిల్ 18న జరుగుతుం ది. టీఎంసీతోపాటు ప్రధాన ప్రాంతీయ పక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకే రెండేసిసార్లు ఇక్కడ గెలుపొందాయి. బీజేపీ అభ్యర్థి రాజా 1999లో 2,22,668 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలి చారు. ప్రస్తుతం బీజేపీ నుంచి రాజా బరిలోకి దిగగా, కాంగ్రెస్ నుంచి కార్తి చిదంబరం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
మళ్లీ ఈడీ ముందుకు వాద్రా
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రా వరుసగా రెండో రోజు గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ముగ్గురు అధికారులు వాద్రాను దాదాపు 9 గంటలకుపైగా ప్రశ్నించారు. లండన్‌లో ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో బుధవారం వాద్రా ఇచ్చిన సమాధానాలపై సంతృప్తిచెందకపోవడంతో రెండు రోజు విచారణకు పిలిచింది. తొలిరోజు మాదిరిగానే రెండో రోజు కూడా ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదుచేశారు. బికనీర్ భూకుంభకోణానికి సంబంధించి మరో మనీ ల్యాండరింగ్ కేసులో వాద్రా ఈ నెల 12న జైపూర్‌లో మళ్లీ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మరో కేసులో కార్తీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా గురువారం ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకేరోజు విచారణకు రావడంతో ఢిల్లీలోని జామ్‌నగర్ హౌజ్ ఈడీ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. ఆ ప్రాంగణంలో ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మీడియా ప్రతినిధులను నియంత్రించడానికి బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఉదయం 11 గంటలకు కార్తీ ఈడీ కార్యాలయానికి చేరుకోగా, 11.25 గంటలకు వాద్రా వచ్చారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకే సంబంధించి పి.చిదంబరంను శుక్రవారం విచారించే అవకాశాలున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మాల్యాతో తల్వార్‌కు సంబంధాలు: ఈడీ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాతో కార్పొరేట్ మధ్యవర్తి దీపక్ తల్వార్‌కు సంబంధాలు ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. విదేశాల్లో ఉన్న తల్వార్ కొడుకు ఫిబ్రవరి 11న తమ ముందు విచారణకు హాజరవుతున్నారని, ఇద్దరిని కలిపి ప్రశ్నించాల్సి ఉందని వెల్లడించింది. తల్వార్ కస్టడీని వారం పాటు పొడిగించాలని కోరగా కోర్టు ఫిబ్రవరి 12 వరకు అనుమతిచ్చింది. -
అప్రూవర్‌గా ఇంద్రాణి.. మరిన్ని చిక్కుల్లో కార్తీ
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు.. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు.. ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చిందో చెప్పాలని ఈడీ ప్రశ్నించింది. ఇదిలా ఉండగా ఈ కేసులో మరో నిందితురాలు, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి అప్రూవర్‌గా మారేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అయితే ఇంద్రాణి అప్రూవర్‌గా మారేందుకు గల కారణాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు భావిస్తోంది. ఆమె ఎవరి నుంచైనా బెదిరింపులు ఎదుర్కొంటున్నారా లేదా ఇందుకు ప్రతిగా మరేదైనా లాభం పొందాలనుకుంటున్నారా అన్న అంశాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక గత విచారణలో భాగంగా ఐఎన్ఎక్స్ మీడియాలో పెట్టుబడుల అనుమతికి కార్తీ చిదంబరం.. 1 మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ తన భర్త పీటర్‌ను డిమాండ్ చేశారని ఇంద్రాణి పేర్కొన్నారు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గతేడాది ఫిబ్రవరిలో కార్తీ చిదంబరం అరెస్టైన సంగతి తెలిసిందే. కార్తీ తండ్రి పి.చిదంబరం.. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఈ లావాదేవీలు జరగడంతో ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కార్తీ మరిన్ని చిక్కుల్లో పడనున్నట్లు తెలుస్తోంది. -
కార్తీ.. చట్టంతో ఆటలాడొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీం కోర్టు ఘాటైన హెచ్చరిక చేసింది. చట్టంతో ఆటలాడుకోవద్దని హితవు పలికింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరిన కార్తీని ముందుగా రూ.10 కోట్లు తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ‘ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోవచ్చని కాకపోతే విచారణకు మాత్రం సహకరించాలి’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. ‘విచారణకు సహకరించాల్సి ఉంటుందనే విషయాన్ని మీ క్లయింట్‌కు చెప్పండి. మీరు సహకరించలేదు. చాలా విషయాలు చెప్పాల్సి ఉంది’ అని కార్తీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం చెప్పింది. అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్స్ కోసం వచ్చే నెల ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కార్తీ కోరారు. మాజీ టెన్నిస్ ఆటగాడిగా, ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్‌గా, వ్యాపారవేత్తగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. -
సీబీఐ కోటలో ‘దేశం’ ఆటలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని అవసర మైన సందర్భాల్లో ఉప యోగించుకునేందుకు తెలుగుదేశం పార్టీ భారీ వ్యూహరచన చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. టీడీపీ ముఖ్యంగా రెండు ప్రయోజనాలను ఆశించే.. సీబీఐ ఉన్నతాధికారులతో సన్ని హిత సంబంధాలకు ప్రయత్నించి నట్లు తెలుస్తోంది. ఒకటి రాజకీయ ప్రత్యర్థులకు ఇబ్బందులు సృష్టించడం కాగా.. రెండోది తమపై విచారణకు ఆదేశిస్తే బయటపడే మార్గాలు అన్వేషించడం. ఇప్పటికిప్పుడే తెర వెనుక జరిగిన పరిణామాలు బయటకు వచ్చే అవకాశాల్లే నప్పటికీ..కాలక్రమేణా సీబీఐ కేసుల్లో కీలకంగా వ్యవహ రించిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు, మరో రాజ్యసభ సభ్యుని వ్యవ హారం బయటకు వస్తుం దని సీబీఐ వర్గాలే అంటు న్నాయి. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ అస్థానాపై అవినీతి కేసు నమోదు కావడం, డీఎస్పీ స్థాయి అధికారి ఒకరిని అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. ఈ సంస్థ అధికారు లతో టీడీపీ నేతల సంబంధాలపై ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. (కోర్టుకు చేరిన సీబీఐ పోరు) కార్తీ చిదంబరం కేసు నుంచే.. కేంద్ర మాజీ మంత్రి, కాం గ్రెస్ సీనియర్ నేత చిదం బరం కుమారుడు కార్తీ చిదంబరం కేసు సంద ర్భంగా అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్‌సీపీఎల్) డైరెక్టర్ చిన్న బాల నాగేశ్వర రెడ్డి (సీబీఎన్ రెడ్డి)ని కేసు నుంచి తప్పించేందుకు టీడీపీ రాజ్యసభ సభ్యుడొకరు సీబీఐ ఉన్నతాధికారితో చర్చలు జరిపారని సమా చారం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరం ద్వారా ఏఎస్‌సీపీఎల్ డైరెక్టర్లకు ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ డైరెక్టర్లను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ సంస్థ ముగ్గురు డైరెక్టర్లలో ఒకరైన సీబీఎన్ రెడ్డి.. కార్తీ చిదంబరానికి అత్యంత సన్నిహితుడు. మామూలుగా ఆ కేసులో సీబీఎన్ రెడ్డిని అరెస్టు చేస్తారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే.. సీబీఎన్ రెడ్డికి.. ఓ టీడీపీ ముఖ్య నేత కుమారుడితో పాటు ఆ పార్టీ ఎంపీ (రాజ్యసభ)కి సన్నిహిత సంబంధాలున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని సీబీఎన్ రెడ్డి అప్పట్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యుడిని సంప్రదించినట్లు సమాచారం. ‘నాకు తెలిసినంత వరకు సీబీఎన్ రెడ్డి విషయంలో ఆ టీడీపీ రాజ్యసభ సభ్యుడు చక్రం తిప్పారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారినే ఆయన కలిసి సీబీఎన్రెడ్డిని ఎలాగైనా బయటపడేయాలని కోరారు. అయితే ఆ డీల్‌లో ఎంత మొత్తం చేతులు మారిం దన్నది ఇప్పుడే చెప్పలేను. కొద్ది రోజులు ఆగితే.. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి’ అని సీబీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సీబీఐతోపాటు.. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)లోనూ టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నారని దానికి సంబంధించి ఆధారాలతో సహా వచ్చిన ఫిర్యాదును సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తొక్కిపెట్టారని ఆయన వెల్లడించారు. పోస్టింగుల్లోనూ ఒత్తిళ్లే! సీబీఐ పోస్టింగుల్లో సాధారణంగా రాజకీయ ఒత్తిడులు పెద్దగా ఉండవు. కానీ, టీడీపీ నేతలు కొందరు మాత్రం.. కావాల్సిన వారిని తమకు అనుకూలమైన పోస్టుల్లో నియమించుకునేందుకు అనేక ఒత్తిడులు తెచ్చారని ఢిల్లీ సీబీఐ కార్యాలయంలోని మరో అధికారి వెల్లడించారు. వీని ఒత్తిళ్ల ఫలితంగా నిజాయితీపరులైన అధికారులకు మంచి పోస్టులు దక్కకుండా పోయాయని ఆయన చెప్పారు. ‘రెండేళ్లుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి హవా (టీడీపీ నేతల) కొనసాగుతోంది. ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో చాలామంది అధికారులు ఈ విషయం తెలిసి విస్తుపోయారు. దీని కారణంగానే పరిస్థితులు దారుణంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. దక్షిణాదిలో సీబీఐ పోస్టుల్లో ఎవరిని నియమించాలో టీడీపీ నేతలు నిర్దేశించినట్లు జరిగింది’ అని సదరు అధికారి వివరించారు. (ఆస్ధాన మోదీ ఆస్ధానవాసే..) స్పెషల్ డైరెక్టర్ అవినీతి కేసులో కీలకంగా మారిన ఏపీకి చెందిన సతీష్ బాబుతోనూ టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీబీఐ అధికారులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. కేసు నుంచి బయటపడేస్తామని ఓ రాజ్యసభ సభ్యుడు అతనికి మాటిచ్చిన సంగతి ఏడాది క్రితమే వెలుగులోకి వచ్చిందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సీబీఐతో దోస్తీ చేసుకుని తమకు కావాల్సిన పనులు చేయించుకునేందుకు టీడీపీ ఎంపీలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. వారి అనుకూల మీడియా మాత్రం ఛీ(సీ)బీఐ అంటూ కథనాలు ప్రచురించడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
కార్తీ చిదంబరానికి ఈడీ షాక్
-
కార్తీ చిదంబరం విదేశీ పర్యటనకు సుప్రీం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ : మనీ ల్యాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్న సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం కుమరుడు కార్తీ చిదంబరానికి ఈనెల 20 నుంచి 31 వరకూ బ్రిటన్‌లో పర్యటించేందుకు మంగళవారం సుప్రీం కోర్టు అనుమతించింది. తన కుమార్తె అడ్మిషన్ కోసం కార్తీ చిదంబరం బ్రిటన్ పర్యటనకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్‌సెల్-మ్యాక్సి్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో కార్తీ చిదంబరం విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐలు కార్తీపై క్రిమినల్ కేసులను దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విదేశీ పర్యటనల కోసం కార్తీకి న్యాయస్ధానం ఇచ్చిన స్వేచ్ఛను ఆయన దుర్వినియోగం చేశారని ఈడీ సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. కాగా విదేశాల్లో కార్తీ కొత్తగా బ్యాంకు ఖాతాను ప్రారంభించడం లేదా మూసివేయడం చేయరాదనే నిబంధన సహా పలు షరతులపై ఆయన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతించింది. విమాన వివరాలు, భారత్‌కు తిరిగివచ్చే తేదీ వంటి వివరాలతో కార్తీ హామీ పత్రాన్ని సమర్పించాలని, స్వదేశానికి తిరిగి రాగానే తన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇచ్చేయాలని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. -
చిదంబరానికి ఊరట
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంనకు ఊరట లభించింది. ఆయన్ను ఆగస్ట్ 7వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదంటూ సీబీఐ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుకు 3 వారాల్లోగా బదులివ్వాలని స్పెషల్ కోర్టు జడ్జి సీబీఐను ఆదేశించారు. ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో చిదంబరంతోపాటు ఆయన కొడుకు కార్తీపై సీబీఐ చార్జిషీటు వేసింది. దీంతో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు కార్తీకి అనుమతి ఎయిర్‌సెల్–మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరం కొడుకు కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఓకేచెప్పింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వెళ్లేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. చిదంబరం కుటుంబంపై అసంతృప్తి సాక్షి ప్రతినిధి, చెన్నై: విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను దాచిన కేసులో చిదంబరం కుటుంబం విచారణకు హాజరు కాకపోవడాన్ని చెన్నై ఎగ్మూరు న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిలకు బ్రిటన్, అమెరికాలో ఉన్న ఆస్తులకు సంబంధించి నల్లధనం చట్టం కింద ఐటీ శాఖ కేసు వేసింది. ఈ కేసు సోమవారం విచారణకు రాగా ఆ ముగ్గురూ హాజరు కాలేదు. దీంతో వారిపై న్యాయమూర్తి మలర్విళి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30వ తేదీన వారంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. -
చిదంబరం ఇంట్లో చోరీ.. ట్విస్ట్
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఇంట్లో భారీ చోరీ జరిగింది. నుగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్ లో ఉన్న ఆయన ఇంట్లో లూటీ జరిగింది. చిదంబరం భార్య నళినీ చిదంబరం నెల రోజుల క్రితం ఊటీకి వెళ్లి, గత రాత్రి తిరిగొచ్చారు. తలుపులు తెరిచి చూసేసరికి అల్మరాలు ఓపెన్ చేసి ఉండటంతో దోపిడీ జరిగిన విషయాన్ని ఆమె గుర్తించారు. వెంటనే పోలీసులకు ఆమె సమాచారం అందించారు. విలువైన ఆభరణాలు, రూ. 1.50 లక్షల నగదు, ఆరు విలువైన చీరలు చోరీ అయినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఘటన వెనుక తమ ఇంట్లో పనిచేసే ఇద్దరు పనిమనుషుల హస్తం ఉండొచ్చని ఆమె అనుమానించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తే, మాస్క్‌లు ధరించిన ఇద్దరు మహిళలు ఇంట్లోకి వెళుతుండటం కనిపించింది. పదిరోజుల క్రితమే ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు వెనక్కి.. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి అరెస్టులు జరగలేదు. పోలీసు ఫిర్యాదుతో కంగారుపడ్డ ఆ పని మనుషుల కుటుంబ సభ్యులు.. చోరీకి గురైన సొత్తు వెనక్కి ఇస్తామని చిదంబరం ఫ్యామిలీకి చెప్పారు. దీంతో ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదివారం ఉదయం కార్తీ చిదంబరం కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఆభరణాలు ఏవీ చోరీ కాలేదని, కేవలం డబ్బు మాత్రమే అయిందని కార్తీ తెలిపారు. -
కార్తీ చిదంబరానికి ఊరట
సాక్షి, చెన్నై : విదేశీ ఆస్తులను వెల్లడించలేదనే ఆరోపణలపై ఆదాయ పన్ను శాఖ మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి వారెంటు జారీ చేసిన క్రమంలో మద్రాస్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కార్తీపై ఆదాయ పన్ను శాఖ నల్లధనానికి సంబంధించిన కేసులో జారీ చేసిన వారెంట్‌పై ఆదివారం అర్థరాత్రి చేపట్టిన విచారణలో మద్రాస్ హైకోర్టు ఆయనకు ఊరట కల్పించింది. కార్తీ విదేశాల నుంచి తిరిగివచ్చే వరకూ ఆయనపై జారీ చేసిన వారెంట్‌ను పక్కనపెట్టాలని ఐటీ శాఖను ఆదేశించింది. ఐటీ వారెంట్ నేపథ్యంలో కార్తీ అరెస్ట్‌ను నివారించేందుకు ఆయన న్యాయవాదులు ఏఆర్ఎల్ సుందరేశన్, సతీష్ పరాశరన్‌లు ఆదివారం రాత్రి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ అధికారిక నివాసాన్ని ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్‌తో సంబంధిత న్యాయమూర్తిని ఆశ్రయించాలని వారికి ప్రధాన న్యాయమూర్తి సూచించారు. -
చిదంబరానికి ముందస్తు బెయిల్
న్యూఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరానికి తాత్కాలిక ఊరట లభించింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కుంభకోణంలో తనను అరెస్ట్ చేయకుండా ఉండాలని చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ స్పెషల్ కోర్టు ఆమోదించింది. వచ్చే నెల అయిదు వరకు అంటే తదుపరి విచారణ వరకు చిదంబరాన్ని అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. బెయిల్ పిటీషన్ స్పందన తెలియజేయాలని ఈడీకి కోర్టు ఆదేశాలు జారీచేసింది. చిదంబరం తరుఫున కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. 800 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారని చిదంబరంపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిలో కోట్ల రూపాయలు ముడుపులు తనయుడు కార్తీ చిదంబరానికి ముట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసును ఈడీ, సీబీఐ మనీలాండరింగ్ ఆరోపణల కింద విచారిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్తీని సీబీఐ అరెస్ట్ కూడా చేసింది. కార్తీకి చెందిన రూ.1.16 కోట్ల ఆస్తులను 2017 సెప్టెంబర్‌లో ఈడీ అటాచ్ చేసింది. గతేడాది డిసెంబర్లో కార్తీ చిదంబరానికి చెందిన సన్నిహితుల నివాసాల్లో ఈడీ దాడులు జరిపింది. కార్తీకి చెందిన ఢిల్లీ, చెన్నైలోని ప్రాపర్టీలపై కూడా దాడులు నిర్వహించింది. ఈ కేసు దర్యాప్తును జాప్యం చేస్తున్నాయని ఏజెన్సీలపై సుప్రీంకోర్టు మండిపడింది కూడా. -
ఇదీ కాంగ్రెస్.. నవాజ్ షరీఫ్ మూమెంట్!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విదేశీ ఆస్తుల విషయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. తన విదేశీ ఆస్తులను వెల్లడించడంలో విఫలమైనా చిదంబరంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీశారు. చిదంబరం విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ‘నవాజ్ షరీఫ్ మూమెంట్’గా ఆమె అభివర్ణించారు. ఆయన ఆర్థిక అవకతవకలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. తన కుటుంబం విదేశీ ఆస్తులను వెల్లడించే విషయాన్ని చిదంబరం ఎందుకు మరిచిపోయారో వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ‘పలు కేసుల్లో స్వయంగా బెయిల్ మీద ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన పార్టీకి సంబంధించిన నేతపై విచారణ జరుపుతారో లేదో వెల్లడించాలి’ అని ఆమె పేర్కొన్నారు. ‘చిదంబరం విదేశీ పెట్టుబడుల వివరాల్ని పన్ను విభాగానికి వెల్లడించలేదు. ఇది నల్లధన చట్టాన్ని ఉల్లంఘించడమే. నల్లధనాన్ని నిరోధించేందుకు మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కింద విదేశాల్లో రహస్యంగా అక్రమ సంపదను దాచిపెట్టే భారతీయులను విచారించవచ్చు’ అని ఆమె తెలిపారు. విదేశాల్లో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నందకు, వాటి వివరాలు వెల్లడించనందకే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌ను ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాని పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు దేశానికి, కాంగ్రెస్ పార్టీకి చిందబరం వ్యవహారం నవాజ్ షరీఫ్ వ్యవహారంలా తయారైందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నెల 11న చెన్నై సిటీ కోర్టులో చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తీ, అతని భార్య శ్రీనిధిపై ఐటీ చట్టం 2015 సెక్షన్ 50 కింద కేసులు నమోదైనట్టు తెలిపారు. విదేశి ఆదాయం, ఆస్తుల వివరాలు వెల్లడించనందకే ఈ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. యూకేలోని కేంబ్రిడ్జ్‌లో 5.37 కోట్ల ఆస్తులు, వేరే చోట 80 లక్షల ఆస్తులు, అమెరికాలో 3.28 కోట్ల ఆస్తులు వంటి వెల్లడించని ఆస్తులు కలిగి ఉన్నందకే ఆయనపై చార్జ్ షీట్ నమోదైందని తెలిపారు. ఆయన కుమారుడు కార్తీ అమెరికాలోని నానో హోల్డింగ్స్ ఎల్ఎల్సీలో 3.28 కోట్ల, 80 లక్షల పెట్టుబడులు కలిగి ఉన్నట్టు ఆదాయ పన్ను చట్టం, నల్లధన చట్టం కింద నమోదైన చార్జ్ షీట్లో పేర్కొని ఉందని తెలిపారు. చిదంబరం ఆయన కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులు 14 దేశాలు, 21 విదేశి బ్యాంకుల్లో ఉన్నాయని, వాటి విలువ దాదాపు మూడు బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిపై చిదంబరం వివరణ ఇస్తూ.. సీతారామన్ వ్యాఖ్యలపై తాను స్పందించనని, ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉందని నిజానిజాలు అక్కడే తెలుస్తాయని అన్నారు. -
ఇదీ కాంగ్రెస్ ‘నవాజ్ షరీఫ్ మూమెంట్
-
చిదంబరం కుటుంబంపై ఐటీ చార్జిషీటు
చెన్నై: విదేశాల్లోని ఆస్తుల వివరాలు వెల్లడించలేదన్న ఆరోపణలతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) చార్జిషీట్లు దాఖలు చేసింది. చెన్నైలోని ప్రత్యేక కోర్టు ముందు ఈ చార్జిషీట్లను దాఖలు చేసింది. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న రూ.5.37 కోట్ల విలువైన ఆస్తి, రూ.80 లక్షల విలువైన మరో ఆస్తి, అమెరికాలోని రూ.3.28 కోట్ల విలువైన ఆస్తి వివరాలను నళిని, కార్తీ, శ్రీనిధి వెల్లడించలేదని ఐటీ శాఖ పేర్కొంది. కార్తీ సహ యజమానిగా ఉన్న చెస్ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ, చిదంబరం కుటుంబం ఈ వివరాల్ని దాచడం నల్లధన నిరోధక చట్టాన్ని అతిక్రమించినట్లేనని తెలిపింది. ఈ కేసులో కార్తీకి, ఆయన కుటుంబానికి గతంలో నోటీసులు జారీచేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో కార్తీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. కాగా, ఈ కేసులో విచారణ దాదాపు చివరి దశకు చేరుకుందని, అందుకే కోర్టు ముందు చార్జిషీటు దాఖలు చేసినట్లు ఐటీ శాఖ అధికారులు చెప్పారు. నల్లధన చట్టం ప్రకారం వెల్లడించని విదేశీ ఆస్తులపై 120 శాతం పన్ను విధించడమే కాకుండా దాదాపు పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.