ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని అవసర మైన సందర్భాల్లో ఉప యోగించుకునేందుకు తెలుగుదేశం పార్టీ భారీ వ్యూహరచన చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. టీడీపీ ముఖ్యంగా రెండు ప్రయోజనాలను ఆశించే.. సీబీఐ ఉన్నతాధికారులతో సన్ని హిత సంబంధాలకు ప్రయత్నించి నట్లు తెలుస్తోంది. ఒకటి రాజకీయ ప్రత్యర్థులకు ఇబ్బందులు సృష్టించడం కాగా.. రెండోది తమపై విచారణకు ఆదేశిస్తే బయటపడే మార్గాలు అన్వేషించడం.
ఇప్పటికిప్పుడే తెర వెనుక జరిగిన పరిణామాలు బయటకు వచ్చే అవకాశాల్లే నప్పటికీ..కాలక్రమేణా సీబీఐ కేసుల్లో కీలకంగా వ్యవహ రించిన కేంద్ర మాజీ మంత్రి ఒకరు, మరో రాజ్యసభ సభ్యుని వ్యవ హారం బయటకు వస్తుం దని సీబీఐ వర్గాలే అంటు న్నాయి. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ అస్థానాపై అవినీతి కేసు నమోదు కావడం, డీఎస్పీ స్థాయి అధికారి ఒకరిని అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. ఈ సంస్థ అధికారు లతో టీడీపీ నేతల సంబంధాలపై ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. (కోర్టుకు చేరిన సీబీఐ పోరు)
కార్తీ చిదంబరం కేసు నుంచే..
కేంద్ర మాజీ మంత్రి, కాం గ్రెస్ సీనియర్ నేత చిదం బరం కుమారుడు కార్తీ చిదంబరం కేసు సంద ర్భంగా అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్‌సీపీఎల్) డైరెక్టర్ చిన్న బాల నాగేశ్వర రెడ్డి (సీబీఎన్ రెడ్డి)ని కేసు నుంచి తప్పించేందుకు టీడీపీ రాజ్యసభ సభ్యుడొకరు సీబీఐ ఉన్నతాధికారితో చర్చలు జరిపారని సమా చారం. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరం ద్వారా ఏఎస్‌సీపీఎల్ డైరెక్టర్లకు ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ డైరెక్టర్లను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ సంస్థ ముగ్గురు డైరెక్టర్లలో ఒకరైన సీబీఎన్ రెడ్డి.. కార్తీ చిదంబరానికి అత్యంత సన్నిహితుడు.
మామూలుగా ఆ కేసులో సీబీఎన్ రెడ్డిని అరెస్టు చేస్తారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే.. సీబీఎన్ రెడ్డికి.. ఓ టీడీపీ ముఖ్య నేత కుమారుడితో పాటు ఆ పార్టీ ఎంపీ (రాజ్యసభ)కి సన్నిహిత సంబంధాలున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని సీబీఎన్ రెడ్డి అప్పట్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యుడిని సంప్రదించినట్లు సమాచారం. ‘నాకు తెలిసినంత వరకు సీబీఎన్ రెడ్డి విషయంలో ఆ టీడీపీ రాజ్యసభ సభ్యుడు చక్రం తిప్పారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారినే ఆయన కలిసి సీబీఎన్‌రెడ్డిని ఎలాగైనా బయటపడేయాలని కోరారు. అయితే ఆ డీల్‌లో ఎంత మొత్తం చేతులు మారిం దన్నది ఇప్పుడే చెప్పలేను. కొద్ది రోజులు ఆగితే.. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి’ అని సీబీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సీబీఐతోపాటు.. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)లోనూ టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నారని దానికి సంబంధించి ఆధారాలతో సహా వచ్చిన ఫిర్యాదును సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తొక్కిపెట్టారని ఆయన వెల్లడించారు.
పోస్టింగుల్లోనూ ఒత్తిళ్లే!
సీబీఐ పోస్టింగుల్లో సాధారణంగా రాజకీయ ఒత్తిడులు పెద్దగా ఉండవు. కానీ, టీడీపీ నేతలు కొందరు మాత్రం.. కావాల్సిన వారిని తమకు అనుకూలమైన పోస్టుల్లో నియమించుకునేందుకు అనేక ఒత్తిడులు తెచ్చారని ఢిల్లీ సీబీఐ కార్యాలయంలోని మరో అధికారి వెల్లడించారు. వీని ఒత్తిళ్ల ఫలితంగా నిజాయితీపరులైన అధికారులకు మంచి పోస్టులు దక్కకుండా పోయాయని ఆయన చెప్పారు. ‘రెండేళ్లుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి హవా (టీడీపీ నేతల) కొనసాగుతోంది. ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో చాలామంది అధికారులు ఈ విషయం తెలిసి విస్తుపోయారు. దీని కారణంగానే పరిస్థితులు దారుణంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. దక్షిణాదిలో సీబీఐ పోస్టుల్లో ఎవరిని నియమించాలో టీడీపీ నేతలు నిర్దేశించినట్లు జరిగింది’ అని సదరు అధికారి వివరించారు. (ఆస్ధాన మోదీ ఆస్ధానవాసే..)
స్పెషల్ డైరెక్టర్ అవినీతి కేసులో కీలకంగా మారిన ఏపీకి చెందిన సతీష్ బాబుతోనూ టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీబీఐ అధికారులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. కేసు నుంచి బయటపడేస్తామని ఓ రాజ్యసభ సభ్యుడు అతనికి మాటిచ్చిన సంగతి ఏడాది క్రితమే వెలుగులోకి వచ్చిందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సీబీఐతో దోస్తీ చేసుకుని తమకు కావాల్సిన పనులు చేయించుకునేందుకు టీడీపీ ఎంపీలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. వారి అనుకూల మీడియా మాత్రం ఛీ(సీ)బీఐ అంటూ కథనాలు ప్రచురించడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment