
కార్తీ చిదంబరానికి ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాసన్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి రూ. 45కోట్లు విలువైన షేర్లను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడిదారులకు కేటాయించడం, రూ. 2,262 కోట్లకు సంబంధించి ఫెమా నిబంధనల ఉల్లంఘన విషయంపై ఈ నోటీసులు జారీ అయ్యాయి.
కార్తీచిదంబరానికి సంబంధించిన కంపెనీలకు వాసన్ హెల్త్‌కేర్ వాటాదారు ద్వారకానాథన్‌కు మధ్య జరిగిన లావాదేవీల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. వాసన్ హెల్త్‌కేర్‌లోకి భారీమొత్తంలో నిధులు వచ్చాయని, ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈడీ ఆరోపణలు ఆధార రహితం, అసంబద్ధమని సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం తప్పుపట్టారు. కార్తికి నోటీసులతో తన గొంతును కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేదన్నారు.