
పి.చిదంబరం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బడ్జెట్ రెండో దశ సమావేశాలు, కాంగ్రెస్ ప్లీనరీ నేపథ్యంలో ఐఎన్‌ఎక్స్ మీడియా అవీనితి కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరంను సీబీఐ ప్రశ్నించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో ఆయన కొడుకు కార్తీ అరెస్టయిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు ‘నీరవ్ మోదీ..’ అని నినాదాలు చేస్తే తాము ‘చిదంబరం..’ అని నినదిస్తామని కొందరు బీజేపీ ఎంపీలు బహిరంగంగానే ప్రకటించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం ద్వారా తమ ప్రతిష్టకు జరిగిన నష్టాన్ని కొంతవరకైనా భర్తీ చేసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం.