కార్తీ చిదంబరం కార్యాలయంలో ఐటీ, ఈడీ సోదాలు
సన్నిహితుల కార్యాలయాల్లోనూ...
నాలుగు గంటలు సాగిన తనిఖీలు
సాక్షి, చెన్నై: ఎయిర్ సెల్ , మ్యాక్సిస్ ఒప్పందాల వ్యవహారం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయు డు కార్తీ చిదంబరం మెడకు సైతం చుట్టుకునేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ కేసు విచారణలో భాగంగా మరో మారు ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌లు సంయుక్తంగా బుధవారం దాడులకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. చెన్నైలో నాలుగు గంటల పాటుగా నాలుగు చోట్ల తనిఖీలు జరిగాయి.ఎయిర్ సెల్, మ్యాక్సిస్ ఒప్పందాల వ్యవహారంలో సాగిన అవినీతి ఇప్పటికే టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్ చుట్టూ తిరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ కేసు విచారణకు మారన్ సహకరిస్తున్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఇదే కేసు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం వైపుగా కూడా మళ్లి ఉండటం చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంలో ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు ఇటీవల కార్తీ చిదంబరం, ఆయన సన్నిహితుల ఆస్తుల మీద దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఓ మారు దాడులు సాగాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం మరో మారు ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు దాడులకు దిగడంతో ఉత్కంఠ బయలు దేరి ఉన్నది.
మళ్లీ దాడులు : ఉదయాన్నే నాలుగు బృందాలుగా ఆదాయ పన్ను శాఖ, ఈడీ వర్గాలు రంగంలోకి దిగాయి. చెన్నైలోని కార్తీ చిదంబరం కార్యాలయం, నుంగంబాక్కంలోని మరో కార్యాలయం, వాసన్ ఐ కేర్‌కు చెందిన కార్యాలయాల్లో తనిఖీల్లో నిమగ్నం అయ్యారు. చిదంబరం సన్నిహిత మిత్రుల కార్యాలయాల్లోని తనిఖీలు చేపట్టారు. ఆయా సంస్థల్లో కార్తీ చిదంబరానికి ఏదేని వాటాలు ఉన్నాయా అన్న దిశగా ఈ దాడులు జరిగి ఉండటం గమనార్హం. నాలుగు గంటల పాటుగా సాగిన ఈ దాడుల పలు అంశాలపై దృష్టి పెట్టి తనిఖీలు సాగి ఉన్నది.
కాగా, దాడుల అనంతరం మీడియా ముందుకు వచ్చిన కార్తీ చిదంబరం అధికారుల తనిఖీలు చేసి వెళ్లారని, అయితే, ఇక్కడి నుంచి ఎలాంటి రికార్డులు తీసుకెళ్ల లేదని స్పష్టం చేశారు. తాజాగా జరిగిన దాడుల మేరకు తనకు ఏ సంస్థల్లోనూ వాటాలు లేవు అని పేర్కొంటూ, తన వద్ద ఎలాంటి విచారణ జరగలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ దాడులు జరిగినట్టుగా తాను భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.
మళ్లీ దాడులు!
Published Sun, Jan 17 2016 1:44 AM | Last Updated on Thu, Sep 27 2018 5:09 PM
Advertisement
Advertisement