కార్తి చిదంబరం (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ.. ఆయన సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఈడీ అధికారాన్ని కార్తి సవాల్ చేశారు. ఎఫ్ఐఆర్‌లో నమోదుచేయని విషయాలపై సీబీఐ, ఈడీలు తనను ప్రశ్నిస్తున్నాయని కార్తి చిదంబరం అన్నారు. 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక కోర్డు అక్రమంగా ఆమోదించిందంటూ దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయన్నారు.
కాగ, ఈ ఎఫ్‌ఐపీబీ క్లియరెన్స్ కోసం ముంబైకి చెందిన ఐఎన్‌ఎక్స్ మీడియా నుంచి కార్తి చిదంబరం రూ.3.5 కోట్లను పొందారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో కార్తి తండ్రి చిదంబరం కేంద్రంలో కీలక శాఖను నిర్వహిస్తున్నారు. ఈ కేసుపై కోర్టు రేపు వాదనలు విననుంది. తనకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలన్నీ తప్పుడవేనని, రాజకీయ దురుద్దేశ్యంతోనే ఈ ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇంద్రాణి ముఖర్జీతో పాటు బైకుల్లా జైలులో కార్తిని ప్రశ్నించిన అనంతరం, ఆయనను ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment