సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ఇవ్వడాన్ని కవిత సుప్రీం కోర్టులో గతంలోనే సవాల్ చేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ నుంచి కవిత నోటీసులు అందుకున్నారు. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు రాలేనని సీబీఐ, ఈడీలకు కవిత లేఖలు రాశారు. కాగా, లిక్కర్ కేసులో కవిత గత ఏడాది మార్చిలో ఈడీ ముందు పలుమార్లు విచారణకు హాజరయ్యారు. సీబీఐ మాత్రం హైదరాబాద్‌లోని నివాసంలోనే ఆమెను సాక్షిగా విచారించింది.
ఇటీవలే అనూహ్యంగా లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 41 ఏ కింద విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేసింది. దీంతో కవిత సీబీఐ, ఈడీల ముందు మళ్లీ హాజరవ్వాలా లేదా అన్న విషయంలో సుప్రీంకోర్టులో 19న జరగనున్న విచారణ కీలకంగా మారనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇటీవల వరుసగా సమన్లు జారీ చేస్తోంది. ఈకేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment