చెన్నై: షాద్‌నగర్ కేసులోని నిందితులను శుక్రవారం తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ పి చిదంబరం ట్విటర్‌లో స్పందించారు. 'అత్యాచారమనేది ఒక క్రూరమైన నేరం. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. అత్యాచారానికి పాల్పడిన నిందితులను నేను సమర్థించకున్నా.. ఎన్‌కౌంటర్ హత్యలు మన వ్యవస్థకు మచ్చ అని విమర్శించారు.
Rape is an heinous crime. It must be dealt with strictly under the provisions of law. While I hold no brief for the alleged perpetrators of this dastardly act, “encounter” killings are a blot to our system. While I understand the urge for instant justice, this is not the way. https://t.co/BzVkLlSgYW
— Karti P Chidambaram (@KartiPC) December 6, 2019
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు, తమిళనాడు శివగంగ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తీ చిదంబరం.. ఎన్‌కౌంటర్ హత్యలు మన వ్యవస్థకు మచ్చ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. సత్వర న్యాయం కోసం.. ఎన్‌కౌంటర్ సరైన మార్గం కాదని అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసులో సీన్ రీకన్‌స్ట్రక‌్షన్ కోసం నిందితులను శుక్రవారం తెల్లవారుజామున షాద్‌నగర్ చటాన్‌పల్లి శివారుకు తీసుకురాగా.. వారు పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా నలుగురు నిందితులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment