కార్తీ చిదంబరం అరెస్టు | CBI arrests Karti Chidambaram | Sakshi

Published Thu, Mar 1 2018 9:04 AM | Last Updated on Wed, Mar 20 2024 3:39 PM

అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కొడుకు కార్తీని సీబీఐ బుధవారం చెన్నైలో అరెస్టు చేసింది. మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరయ్యేందుకు లండన్‌ నుంచి భారత్‌కు వచ్చిన కార్తీని చెన్నై విమానాశ్రయంలోనే సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడి కోర్టులో హాజరుపరిచింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా నుంచి కోట్ల రూపాయల మేర  ముడుపులు అందుకున్న కేసులో కార్తీని ప్రశ్నించేందుకు 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా.. ఒకరోజు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement