indrani mukerjea
-
షీనా బోరా కేసు.. ఇంద్రాణీ ముఖర్జీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: షీనా బోరా కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. విదేశాలకు వెళ్లే విషయంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు కొట్టిపారేసింది. అదే సమయంలో ఈ కేసు విచారణ ఆలస్యం అవుతుండడంతో ట్రయల్ కోర్టుపై అసహనం వ్యక్తం చేసింది.ఇంద్రాణీ ముఖర్జీ విదేశాలకు వెళ్లకుండా.. గతంలో బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను కిందటి ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టులో ఇంద్రాణీ ముఖర్జీ సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్ ధర్మాసనం.. ఇవాళ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. కేసు విచారణ జాప్యం అవుతుండడం దృష్టికి రావడంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏడాదిలోపు ఈ కేసుకు సంబంధించిన విచారణను పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.సీబీఐ వాదనఇది ఎంతో సున్నితమైన కేసుప్రస్తుతం ఈ కేసు విచారణ మధ్యలో ఉందిఇప్పటికే 96 మంది సాక్ష్యులను విచారించాం ఇలాంటి సమయంలో ఆమెకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడం సరికాదు. ఇంద్రాణీ తరఫు వాదనలు ఈ కేసులో సుప్రీం కోర్టు ఆమె బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇంకా 96 మంది సాక్ష్యులను విచారించాల్సిన అవసరం ఉంది. ట్రయల్ కోర్టులో విచారణ జరపాల్సిన బెంచ్ నాలుగు నెలల కూడా ఖాళీగానే ఉందికాబట్టి ఈ కేసు విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే ఉన్నాయి కాబట్టి మా క్లయింట్‌కు విదేశాలకు వెళ్లేందుకు ఊరట ఇవ్వాలి సీబీఐ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం.. ఇంద్రాణీ ముఖర్జీ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. షీనా బోరా కేసు: ట్విస్టుల మీద ట్విస్టులు, పోలీస్ డైరీలో ఏముందంటే..ముంబై మెట్రో వన్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున షీనా బోరా(22) 2012, ఏప్రిల్ 24న అదృశ్యమైంది. మళ్లీ ఆమె కనిపించనే లేదు. శవంగా తేలడంతో పోలీస్ దర్యాప్తు మొదలైంది. షీనా బోరా హత్యకేసులో కీలకసూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆమె కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ. తన రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో అరెస్టైన ఆమె.. సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆరేళ్ల తర్వాత బయటకు వచ్చారు. అయితే తన బిడ్డను తాను చంపుకోలేదని, ఆమె ఇంకా బతికే ఉందంటూ ఇంద్రాణీ మొదటి నుంచి వాదిస్తూ వస్తుండడం గమనార్హం.షీనా బోరా కేసు టైం లైన్ఏప్రిల్ 24, 2012: షీనా బోరా కనిపించకుండా పోయింది2015, ఆగష్టు 21: ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ అరెస్ట్.. నేరం ఒప్పుకోలు2015, ఆగష్టు 25: షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ అరెస్ట్ఆగష్టు 26, 2015: షీనా మాజీ భర్త సంజీవ్ ఖన్నా కోల్‌కతాలో అరెస్ట్2015, సెప్టెంబర్ 1: షీనా అసలు తండ్రిని తననేంటూ సిద్ధార్థ్ దాస్ ప్రకటన2015, సెప్టెంబర్ 18: షీనా బోరా కేసు సీబీఐకి అప్పగింత2015, నవంబర్ 19: పీటర్ ముఖర్జీ అరెస్ట్.. ఇంద్రాణీ, సంజీవ్, శ్యామ్వర్ మీద ఛార్జ్‌షీట్ దాఖలుఫిబ్రవరి 16, 2016: ఛార్జ్ షీట్లో పీటర్ ముఖర్జీ పేరు నమోదుజనవరి-ఫిబ్రవరి 2017: ఈ కేసులో విచారణ ప్రారంభంఅక్టోబర్ 2019: ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీలకు విడాకులు మంజూరుమార్చి 2020: పీటర్ ముఖర్జీకి బెయిల్ మంజూరుమే 18, 2022: ఇంద్రాణీ ముఖర్జీకి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. ఆరేళ్ల తర్వాత బయటకుఫ్రిబవరి 12, 2025: విదేశీ పర్యటనకు తనను అనుమతించాలని ఇంద్రాణీ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత.. ట్రయల్ ఏడాదిలోపు పూర్తి చేయాలని కింది కోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశం -
ఓటీటీలో దూసుకెళ్తున్న కాంట్రవర్సీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని మాత్రం స్ట్రీమింగ్ కావడానికి ముందు పలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఓ వెబ్ సిరీస్ మాత్రం రెండో వారంలోనూ దూసుకెళ్తోంది. దాదాపు 18 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఇంతకీ ఈ వెబ్ సిరీస్‌లో ఏంటంతా ప్రత్యేకత? (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా డాక్యుమెంటరీ తరహా వెబ్ సిరీసులు తీస్తోంది. అలా షీనా బోరా హత్య కేసు ఆధారంగా తీసిందే 'బరీడ్ ట్రూత్: ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ'. స్ట్రీమింగ్ కావడానికి ముందే కోర్టు, కేసుల వరకు వెళ్లిన ఈ సిరీస్.. ఫిబ్రవరి 29న ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. రిలీజైన రోజు నుంచే ఆదరణ దక్కించుకున్న ఈ సిరీస్‌కు ఇప్పటివరకు 2.2 మిలియన్ వ్యూస్, 6.9 మిలియన్ వాచ్ హవర్స్‌కి పైగా సొంతం చేసుకుంది. అలానే నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-7లో ఉంది. దాదాపు 18కి పైగా దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే నిజ జీవితంలో జరిగిన హత్య తాలుకూ కథతో తీసిన సిరీస్ కావడంతోనే ఈ రేంజ్ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మీరు చూడకపోతే ట్రై చేయండి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'భ్రమయుగం' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
Buried Truth Review In Telugu: ఇంద్రాణి ముఖర్జీ 'బరీడ్ ట్రూత్'.. ఎలా ఉందంటే?
మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జీ ఆధారంగా వచ్చి డాక్యు సీరిస్ వివాదాలతో పాటు.. చాలా కొత్త విషయాలను తెరమీదకు తెచ్చింది. కూతురు హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఇంద్రాణి చేస్తున్న వాదనకు మద్దతు పలికేలా ఈ సీరిస్ ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సిరీస్ విడుదలను అడ్డుకోవాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో… ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్‌దీప్ సర్దేశాయితో పాటు ఈ కేసును కవర్ చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరి ఇంటర్వ్యూలు ఈ సిరీస్‌లో మనం చూడొచ్చు. పోలిస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న లూప్‌హోల్స్ … లీగల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఈ క్రైం కథలో బ్లెండ్ అయ్యాయి. హై ప్రొఫైల్ కేసుల్లో పోలీసుల అత్యుత్సాహం… మీడియా ట్రయల్లాంటి సున్నితమైన అంశాలను కూడా ఈ సిరీస్ టచ్ చేసింది. బరీడ్ ట్రూత్ సిరీస్‌లో ఇంద్రాణి స్వయంగా తన వాదనను తానే టీవీ స్క్రీన్‌పై చెప్పుకోవడం… ఆడియన్స్‌కు మరింత ఆసక్తిని పెంచింది. 2012లో మాయమైన ఇంద్రాణి కూతురు షీనాబోరా హత్యకు గురైందని మూడేళ్ల తరువాత పోలీసులు గుర్తిస్తారు. అదీ ఓ సాధారణ వెహికిల్ చెకింగ్‌లో భాగంగా అరెస్టైన వ్యక్తి చెప్పిన సమాచారంతో ఈ మొత్తం కథ బయటకు వస్తుంది. కూతురు మూడేళ్ల పాటు కనిపించకుండా పోయినా ఇంద్రాణి ఎందుకు మాట్లాడలేదనే విషయంపై ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చాలా వరకు నిజమైన క్యారెక్టర్లతోనే స్టోరీ చెప్పే ప్రయత్నం జరిగింది. షీనాబోరాను తన చెల్లెలుగా మూడోభర్త కుటుంబానికి ఎందుకు పరిచయం చేసిందననే విషయంపై ఇంద్రాణి చెప్పిన సీక్రెట్ హైలెట్‌గా ఉంటుంది. తన తండ్రే తన కూతురికి తండ్రి అన్న విషయాన్ని ఇంద్రాణి ఈ సిరీస్‌లో రివీల్ చేస్తుంది. తాను 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కన్న తండ్రి తనను అత్యాచారం చేసిన విషయాన్ని ఇంద్రాణి చెబుతుంది. ఆ తరువాత మళ్లీ మళ్లీ అత్యాచారానికి గురయ్యానని.. తన తండ్రి ద్వారానే తాను తల్లినయ్యానని ఇంద్రాణి రివీల్ చేస్తుంది. షీనాబోరాను దాదాపు 16 ఏళ్ల పాటు దూరంగా ఉంచిన ఇంద్రాణి.. ఆ తరువాత ఎందుకు తన దగ్గరకు తెచ్చుకుంది. మూడో భర్త కొడుకుతో ఇంద్రాణి కూతురు ప్రేమలో పడటం లాంటి చాలా జుగుప్సాకరమైన విషయాలను ఈ సిరీస్‌లో చూపించారు. పీటర్ ముఖర్జీయా కుమారుడు రాహుల్, ఇంద్రాణి కూతురు షీనాబోరా ప్రేమ వల్లే ఈ హత్య జరిగిందనే చర్చ ఉంది. అయితే షీనాబోరా మిస్సయ్యాక రాహుల్ ఏవిధంగా ఆమెను వెతికే ప్రయత్నం చేశాడో ఈ సిరీస్ ద్వారా బయటకు వచ్చింది. పీటర్ ముఖర్జీయాకు షీనా హత్య గురించి తెలుసా? లేదా అనే విషయంపై ఈ సిరీస్‌లో కీలకమైన పాయింట్ రివీల్ చేశారు. షీనాబోరా హత్యకేసుకు సంబంధించి చాలా విషయాలు ఇప్పటికే అందరికీ తెలిసినా.. ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రేక్షకులకు చివరిగా ఒక మాట… కూతురిని హత్య చేసిందనే ఆరోపణలతో 6 ఏళ్లపాటు జైల్లో ఉన్న ఇంద్రాణి… ఈ సిరీస్‌లో కనిపించిన తీరు మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడా భయం.. పశ్చాత్తాపం లాంటివి లేకుండా హీరోయిన్లా ఇంద్రాణి డైలాగ్స్ చెప్పడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తన అందం చూసి పార్టీల్లో మగవాళ్లు పిచ్చోళ్లై పోతారని… ఆడవాళ్లు ఇబ్బందిగా ఫీలవుతారని ఇంద్రాణి చెప్పే డైలాగులు ఆమెలోని కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టాయి. మూడో పెళ్లి చేసుకున్నా… కన్న పిల్లలను చెల్లెలు, తమ్ముడిగా చెప్పుకున్నా అది తన ఎదుగుదలకే అని ఇంద్రాణి చెప్పిన మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. కాని మీ కూతురుని మీరు హత్య చేశారా? అనే ప్రశ్నకు… ఇంద్రాణి చెప్పిన సమాధానం… ఈ సీరిస్‌లోనే హైలట్‌గా నిలిచింది. -ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
ఎన్నో మలుపులు.. మరెన్నో చీకటి కోణాలు
అది దేశ వాణిజ్య నగరం ముంబై. 2012లో బయటపడ్డ ఓ నేరం.. దేశం మొత్తాన్ని ఆకర్షించింది. దాదాపు పదేళ్లకు పైనే దాని గురించి మాట్లాడుకునేలా చేసింది. తన రహస్యం ఎక్కడ బయటపడుతుందో అని సొంత బిడ్డను ఓ కన్నతల్లే పొట్టనబెట్టుకున్న కేసది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఈ వాస్తవ గాథ.. ఇప్పుడు డాక్యు-సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముంబై మెట్రో వన్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున షీనా బోరా(22) 2012, ఏప్రిల్ 24న అదృశ్యమైంది. మళ్లీ ఆమె కనిపించనే లేదు. శవంగా తేలడంతో పోలీస్ దర్యాప్తు మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రాణీ ముఖర్జీకి మీడియా ఎగ్జిక్యూటివ్‌గా సొసైటీలో మంచి పేరుంది. షీనా అంటే ప్రాణం అన్నట్లుగా ఇంద్రాణి ఉండేది. అలాంటిది పోలీసులు ఆమె వైపు మళ్లుతారని ఎవరూ ఊహించి ఉండరు. అప్పటికే అక్రమంగా ఆయుధాల్ని కలిగి ఉన్నాడనే అభియోగాలతో ఆమె డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ అరెస్ట్ అయ్యాడు. అతనిచ్చిన సమాచారమే.. మొత్తం కేసునే మలుపు తిప్పింది. ♦ఇంద్రాణీ ముఖర్జీ.. మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్ జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. ♦అప్పటికే వయసుకొచ్చిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. అప్పటికే వ్యాపారంలోనూ ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు నష్టాలు చవిచూస్తూ ఉంది. ఆ సమయంలోనే షీనా తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. అందుకు రెండో భర్త సంజీవ్ ఖన్నా సహకారం కోరింది. ♦రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు దర్యాప్తులో తేలింది. అసలు షీనాను ముంబైలోని ఆమె ఇంట్లోనే హత్యచేయాలని సంజీవ్‌ఖన్నా సూచించాడట. కానీ, ఆ ఇంట్లో షీనాతోపాటు తన భర్త(మూడో భర్త) పీటర్ ముఖర్జియా, కొడుకు రాహుల్ ముఖర్జియా కూడా ఉన్నందువల్లే ఇంద్రాణి ఆ ప్లాన్‌కు ఒప్పుకోలేదు. ఈ కేసులో రాహుల్ పేరు రావడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ♦దీంతో పీటర్ ముఖర్జియా ముంబైలో లేని సమయం చూసి.. షీనాను ఇంటికి పిలిచి హత్యచేయాలని ఇంద్రాణీ సంజీవ్‌కు సూచించింది. సొంతింట్లో హత్యజరిగితే పోలీసులు ఇంద్రాణీని అనుమానించే అవకాశం ఉండడంతో వద్దని సంజీవ్‌ఖన్నా ఆమెను వారించాడు. దీంతో ఇద్దరూ కలిసి.. కారులోనే షీనాను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం డ్రైవర్ శ్యాంరాయ్‌ను చేర్చుకుని హత్యకు కుట్ర పన్నారు. ♦1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలతో పాటు కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులైంది. కన్న కూతురు షీనాను హత్య చేసేందుకు ఎన్ని ప్లాన్లు వేసింది? ఏది వర్కవుట్ అయింది? పోలీస్ డైరీ ఆధారంగా.. షీనా బోరా హత్యకేసులో ముగ్గురు నిందితుల వాంగ్మూలాలతో పాటు... కాల్‌డాటా రికార్డులను పోలీసులు పోల్చిచూశారు. 23 ఏప్రిల్ 2012న జరిగిన సంఘటనలతో ఓ టైం లైన్ తయారు చేశారు. అది.. ఏప్రిల్ 23, 2012.. ఉదయం 9గంటలు: డ్రైవర్ శ్యాంరాయ్‌తో కలిసి ఇంద్రాణీ ముఖర్జీ.. రాయ్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహించింది. షీనాను హత్యచేశాక మృతదేహం ఎక్కడ పారేయ్యాలో నిర్ణయించుకుంది. ఉదయం 11.30నిమిషాలకు: రెండో భర్త సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసిన ఇంద్రాణి.. దాదాపు 7నిమిషాలు మాట్లాడింది. ఉదయం 11.37నిమిషాలకు: ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్‌టాప్ హోటల్లో సంజీవ్‌ఖన్నా కోసం ఇంద్రాణి ఓ రూమ్ బుక్ చేసింది. అది.. ఏప్రిల్ 24, 2012.. మద్యాహ్నం 1.47నిమిషాలకు: సంజీవ్ ఖన్నా కోల్‌కతా నుంచి ముంబై చేరుకుని... ట్యాక్సీలో హిల్‌టాప్ హోటల్ చేరుకున్నాడు. మద్యాహ్నం 1.53నిమిషాలకు: ఇంద్రాణికి కాల్చేసి తాను ముంబై చేరుకున్నానని చెప్పిన సంజీవ్‌ఖన్నా మద్యాహ్నం 2.38నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసి రూమ్‌లో సదుపాయాలు సరిగానే ఉన్నాయా అని అడిగి తెలుసుకుంది ఇంద్రాణి. మద్యాహ్నం 3.11నిమిషాలకు: మరోసారి రెండోభర్త సంజీవ్‌ఖన్నాకు కాల్చేసి... హత్యకు సంబంధించి ప్లాన్‌పై డిస్కస్ చేసింది ఇంద్రాణి. సాయంత్రం 6గంటలకు: హిల్‌టాప్ హోటల్ నుంచి సంజీవ్‌ఖన్నాను హిల్‌టాప్ హోటల్ నుంచి పికప్ చేసుకుంది. ఇంద్రాణి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు డ్రైవ్ చేస్తున్నారు. సాయంత్రం 6.45 నిమిషాలకు: ముంబైలోని లింకింగ్ రోడ్ చేరుకున్న ముగ్గురు... షీనాబోరా కోసం ఎదురుచూశారు. సాయంత్రం 7.03 నిమిషాలకు: లింకింగ్ రోడ్‌లోని నేషనల్ కాలేజ్ సమీపంలో తన కోసం వెయిట్ చేస్తున్న ఓపెల్ కోర్సా కారులో కూర్చుంది షీనా. సాయంత్రం 7.16నిమిషాలకు: ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్ శ్యాం మనోహర్.. నవీ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుంచి కారు ఐరోలీ వైపు ప్రయాణించింది. రాత్రి 8.27 నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు వేగంగా వెలుతున్న సమయంలో... కారు ఆపాల్సిందిగా డ్రైవర్‌ను ఇంద్రాణి ఆదేశించింది. అయితే అప్పటికే షీనాబోరాకు ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నాలు మత్తు మందు ఇచ్చిన విషయం డ్రైవర్‌కు తెలియదు. దీంతో తాను టాయిలెట్‌కు వెళతానని చెప్పి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు దిగి వెళ్లాడు. డ్రైవర్ వెళ్లగానే ఇంద్రాణీ తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. సంజీవ్‌ఖన్నా షీనా గొంతు నులిమి చంపేశాడు. డ్రైవర్ టాయిలెట్‌కు వెళ్లి తిరిగి రాగానే కారును దూరంగా పోనివ్వమని.. ఇంద్రాణి చెప్పింది. అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్ మార్చుకోవాలని ఇంద్రాణీ, సంజీవ్‌లు నిర్ణయించుకున్నారు. రాయ్‌గఢ్ వెళ్లడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాతంలోనే శవాన్ని పూడ్చిపెడదామని సంజీవ్ అన్నాడు. రాత్రి 9.01నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని విఖ్రోలి ప్రాంతంలో పోలీస్ గస్తీని చూడగానే వీరు ముగ్గురు భయపడ్డారు. రాత్రి 9.14నిమిషాలకు: వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి శవాన్ని కారులోనే ఉంచి పీటర్ ముఖర్జియా ఇంట్లోని గ్యారేజ్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 11.01 నిమిషాలకు: షీనా మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి... కారు డిక్కీలో ఉంచారు. అది.. ఏప్రిల్ 25, 2012 అర్థరాత్రి 12.19నిమిషాలకు: సంజీవ్‌ఖన్నా తన హిల్‌టాప్ హోటల్‌కు బయలేదేరాడు అర్ధరాత్రి 12.30నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు కాల్చేసిన ఇంద్రాణి... ఉదయం ఏంచేయాలనే దానిపై ఇద్దరు చర్చించుకున్నారు. అర్ధరాత్రి12. 57నిమిషాలకు: కారులోనే ఉన్న డ్రైవర్ శ్యాం రాయ్‌కు ఫోన్‌చేసింది ఇంద్రాణి. అర్ధరాత్రి 01.19నిమిషాలకు: మరోసారి డ్రైవర్ శ్యాంరాయ్‌కు ఫోన్ చేసిని ఇంద్రాణి... బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అర్ధరాత్రి 02.30నిమిషాలకు: తన గదిలోంచి కిందికి దిగివచ్చిన ఇంద్రాణీ... డ్రైవర్‌తో కలిసి హిల్‌టాప్ హోటల్‌కు బయలుదేరి వెళ్లింది. అర్ధరాత్రి 02.47 నిమిషాలకు: రాయ్‌గఢ్‌లోని గగోడే బుద్రుక్ గ్రామానికి బయలుదేరిన ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యాంరాయ్. తెల్లవారుజామున 04.21 నిమిషాలకు: గగోడే బుద్రుక్ గ్రామ సమీపంలో చేరుకోగానే... కారులోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తన కూతురు శవాన్ని చూసి భయపడ్డ ఇంద్రాణీ.. వెంటనే శవాన్ని దహనం చేయాలని చెప్పింది. తెల్లవారుజామున 04.33నిమిషాలకు: కారు దగ్గరికి వెళ్లి నిల్చున్న ఇంద్రాణి... సంజీవ్‌ఖన్న, శ్యాంరాయ్‌లు శవాన్ని మట్టుబెట్టేవరకు ఎదురుచూసింది. ఉదయం 05.13నిమిషాలకు: అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్దిదూరం వెళ్లి... తిరిగి శవాన్ని మట్టుబెట్టిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా చూసి ఇంటికి బయలుదేరారు. ఉదయం 07.33నిమిషాలకు: ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోయారు. ట్విస్టుల పర్వం సాగిందిలా.. ♦April 24, 2012: షీనా బోరా ఉద్యోగానికి సెలవు పెట్టింది. ఆమె ఉద్యోగానికే రాజీనామా చేసిందని ఒకవైపు మీడియా.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిందని కుటుంబం ప్రకటించింది. అప్పటికి మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. ♦May 23, 2012: నెలరోజుల తర్వాత.. మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లో షీనా బోరా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.. ఆపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు మొదలైంది. ♦August 2015: మూడేళ్ల తర్వాత.. కూతురిని చంపిందనే అభియోగాలపై ఇంద్రాణి ముఖర్జీ అరెస్ట్ అయ్యింది. ఆ మరుసటిరోజే కోల్‌కతాలో ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ♦August 2015: ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ శ్యామ్ రాయ్ కూడా అరెస్ట్ అయ్యాడు. ఈ ముగ్గురు నిందితుల్ని క్రైమ్ సీన్ రీక్రియేన్ చేశారు. దర్యాప్తులో డ్రైవర్ శ్యామ్ షీనాను హత్య చేసి.. మృతదేహాన్ని పడేశామని ఒప్పుకున్నాడు. ఇంద్రాణితో పాటు సంజీవ్ ఖన్నా కూడా ఇందులో భాగం అయ్యారని చెప్పాడు. ♦September 2015: షీనా బోరా కేసులో ఇది ఊహించని మలుపు. షీనా బోరా అసలు తండ్రిని తానేనంటూ కోల్‌కతాకు చెందిన సిద్ధార్థ దాస్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత.. కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ముగ్గురు నిందితులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ♦November 2015: షీనా బోరా హత్య కేసులో.. ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను సైతం సీబీఐ అరెస్ట్ చేసింది. ♦2016: ఇంద్రాణి ముఖర్జీ, ఆమె డ్రైవర్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత పీటర్ పేరును కూడా చేర్చారు. రాహుల్‌తో రిలేషన్షిప్ కారణంగానే.. ఇంద్రాణీ ఈ ఘాతుకానికి పాల్పడిందని సీబీఐ అందులో పేర్కొంది. ♦January-February 2017: కోర్టు విచారణ ప్రారంభం. షీనా బోరాను చంపేందుకు కుట్ర.. ఎత్తుకెళ్లి చంపడం.. ఆధారాలను నాశనం చేసే కుట్ర.. తప్పుడు సమాచారం ఇవ్వడం.. లాంటి అభియోగాలపై వాదప్రతివాదనలు మొదలయ్యాయి. ♦October 2019: ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాలకు విడాకులు మంజూరు చేసిన ముంబై ఫ్యామిలీ కోర్టు ♦March 2020: పీటర్ ముఖర్జియాకు బెయిల్ ♦July 2021: బెయిల్ కోరుతూ నాలుగు పిటిషన్లు దాఖలు చేస్తే.. అన్నింటిని సీబీఐ స్పెషల్ కోర్టు తిరస్కరించింది ♦August 2021: షీనా బోరా హత్య కేసు దర్యాప్తును ముగించినట్లు ప్రకటించుకున్న సీబీఐ ♦February 10, 2022: సుప్రీం కోర్టుకు చేరిన ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ అభ్యర్థన ♦February 18, 2022: సీబీఐతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరుతూ సుప్రీం నోటీసులు ♦March 25, 2022: ఇంద్రాణి ముఖర్జీ బెయిల్‌ను తిరస్కరించాలని సీబీఐ వాదన ♦May 18, 2022: ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్లు జైల్లో గడపడంతో సుప్రీం బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరాలు చెప్పలేదు.. మంజూరు చేసింది. కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటూ ఆరేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఇంద్రాణి(50)కి 2022లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని ఈ సందర్భంగా కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ ఇవ్వడమే సబబుగా భావించింది. సుప్రీం ఊరట ఇచ్చాక.. ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందామెకు. దీంతో.. మే 20, 2022 శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది.. జైలు నుంచి బయటకు వచ్చాక ఇంద్రాణి చెప్పిన తొలి మాట. ‘ఒక కుటుంబంలోని చీకటి రహస్యం..యావత్ దేశాన్ని కుదిపేసిన సంచలన కుంభకోణం’ .. ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ సందర్భంగా.. మొదట ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావించింది. అయితే, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సీబీఐ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన డివిజన్ బెంచ్.. దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను ఆదేశించింది. దీనికి నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. విచారణ పూర్తయ్యేవరకు ప్రసారం చేయబోమని న్యాయస్థానానికి తెలిపింది. తాజాగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో దీని విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. -
ఇంద్రాణీ ముఖర్జీతో కలిసి ఉండడానికి వీల్లేదు
ముంబై: ఇంద్రాణీ-పీటర్ ముఖర్జీల కూతురు విధీ ముఖర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తల్లితో కలిసి జీవించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను ముంబై ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించే ముందు సీబీఐ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. విధీ ముఖర్జీ గత కొన్ని సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తోంది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తన తల్లిని కలిసేందుకు సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆమె ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ కోర్టు ముందుకు రావడంతో ఆమె లండన్ నుంచి వచ్చారు. కన్నకూతురు షీనా బోరా హత్య కేసులో ప్రథమ నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ.. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే తల్లికి ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా.. ఆమెతో ఉండేందుకు అనుమతించాలని విధీ ముఖర్జీ తన అభ్యర్థనలో పేర్కొంది. అంతేకాదు.. 2015లో ఇంద్రాణీ అరెస్ట్ తర్వాత తల్లికి దూరమై తాను భావోద్వేగానికి లోనయ్యానని.. మైనర్‌గా ఉన్న తాను తల్లికి దూరమై కుమిలిపోయానని విధీ తన అభ్యర్థనలో చెప్పుకొచ్చింది. అయితే ప్రాసిక్యూషన్(సీబీఐ) మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. విధీ ముఖర్జీ సైతం ఈ కేసులో సాక్షిగా ఉందని, ఆమెను ఇప్పటివరకు ప్రశ్నించని విషయాన్ని కోర్టుకు తెలిపింది సీబీఐ. ఆధారాల సేకరణ పూర్తయ్యే వరకు ఇంద్రాణీ ఎవరినీ కలవడానికి.. అనుమతి లేదన్న విషయాన్ని సీబీఐ, ప్రత్యేక న్యాయస్తానానికి గుర్తు చేసింది. ఒకవేళ విధి పిటిషన్‌ను విచారణకు గనుక స్వీకరిస్తే.. ఇంద్రాణీ బెయిల్ సమయంలో సుప్రీం కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. ఈ తరుణంలో.. సీబీఐ వాదనలో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజనీత్ సంఘాల్.. విధీ ముఖర్జీ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కన్నకూతురైన షీనా బోరా(24)ను.. ఇంద్రాణీ ముఖర్జీ తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్‌తో కలిసి కారులో 2012లో దారుణంగా హత్య చేసి.. శవాన్ని రాయ్‌గఢ్ జిల్లా శివారులోని అడవుల్లో తగలబెట్టింది. 2015లో వేరే కేసులో అరెస్ట్ అయిన శ్యామ్వర్ రాయ్ నోరు విప్పడంతో ఈ సంచలన కేసు వెలుగు చూసింది. ఈ కుట్రలో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉందని తేలడంతో ఆయన్ని అరెస్ట్ చేయగా.. 2020లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆపై ఇంద్రాణీ-పీటర్లు విడాకులు తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, దుస్తులు తొలగించే హక్కు కూడా ఉంటుందా? -
షీనా బోరా మర్డర్ కేసు: ట్విస్టుల మీద ట్విస్టులు..
సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేదిగా ఉండడం వల్లే షీనా బోరా హత్య కేసు.. దేశంలో అంతగా సంచలనం సృష్టించించింది. మూడేళ్ల తర్వాత హత్యోదంతం వెలుగులోకి వస్తే.. కేసులో ప్రధాన నిందితురాలిగా జైల్లో ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ ఆరున్నరేళ్ల తర్వాత ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చింది. మీడియా ఎగ్జిక్యూటివ్‌గా సొసైటీలో మంచి పేరున్న ఇంద్రాణీ.. సొంత కూతురు షీనాను హత్య చేసేందుకు ఎన్ని ప్లాన్లు వేసింది? ఏది వర్కవుట్ అయింది? పోలీస్ డైరీ ఆధారంగా.. షీనా బోరా హత్యకేసులో కీలకసూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆమె కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ. రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసుల విచారణలో తేలింది. అసలు షీనాను ముంబైలోని ఆమె ఇంట్లోనే హత్యచేయాలని సంజీవ్‌ఖన్నా సూచించారు. కానీ, ఆ ఇంట్లో షీనాతోపాటు తన భర్త(మూడో భర్త) పీటర్ ముఖర్జియా, కొడుకు రాహుల్ ముఖర్జియా కూడా ఉన్నందువల్లే ఇంద్రాణి ఆ ప్లాన్‌కు ఒప్పుకోలేదు. ఈ కేసులో రాహుల్ పేరు రావడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అయితే పీటర్ ముఖర్జియా ముంబైలో లేని సమయం చూసి.. షీనాను ఇంటికి పిలిచి హత్యచేయాలని ఇంద్రాణీ సంజీవ్‌కు సూచించింది. అయితే సొంతింట్లో హత్యజరిగితే పోలీసులు ఇంద్రాణీని అనుమానించే అవకాశం ఉండడంతో వద్దని సంజీవ్‌ఖన్నా ఆమెను వారించాడు. దీంతో ఇద్దరూ కలిసి... కారులోనే షీనాను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం డ్రైవర్ శ్యాంరాయ్‌ను చేర్చుకుని హత్యకు కుట్ర పన్నారు. ఈ హత్యకేసులో ముగ్గురు నిందితుల వాంగ్మూలాలతో పాటు... కాల్‌డాటా రికార్డులను పోలీసులు పోల్చిచూశారు. 23 ఏప్రిల్ 2012న జరిగిన సంఘటనలతో ఓ టైం లైన్ తయారు చేశారు. అది.. ఏప్రిల్ 23, 2012.. ఉదయం 9గంటలు: డ్రైవర్ శ్యాంరాయ్‌తో కలిసి ఇంద్రాణీ ముఖర్జీ.. రాయ్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహించింది. షీనాను హత్యచేశాక మృతదేహం ఎక్కడ పారేయ్యాలో నిర్ణయించుకుంది. ఉదయం 11.30నిమిషాలకు: రెండో భర్త సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసిన ఇంద్రాణి.. దాదాపు 7నిమిషాలు మాట్లాడింది. ఉదయం 11.37నిమిషాలకు: ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్‌టాప్ హోటల్లో సంజీవ్‌ఖన్నా కోసం ఇంద్రాణి ఓ రూమ్ బుక్ చేసింది. అది.. ఏప్రిల్ 24, 2012.. మద్యాహ్నం 1.47నిమిషాలకు: సంజీవ్ ఖన్నా కోల్‌కతా నుంచి ముంబై చేరుకుని... ట్యాక్సీలో హిల్‌టాప్ హోటల్ చేరుకున్నాడు. మద్యాహ్నం 1.53నిమిషాలకు: ఇంద్రాణికి కాల్చేసి తాను ముంబై చేరుకున్నానని చెప్పిన సంజీవ్‌ఖన్నా మద్యాహ్నం 2.38నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసి రూమ్‌లో సదుపాయాలు సరిగానే ఉన్నాయా అని అడిగి తెలుసుకుంది ఇంద్రాణి. మద్యాహ్నం 3.11నిమిషాలకు: మరోసారి రెండోభర్త సంజీవ్‌ఖన్నాకు కాల్చేసి... హత్యకు సంబంధించి ప్లాన్‌పై డిస్కస్ చేసింది ఇంద్రాణి. సాయంత్రం 6గంటలకు: హిల్‌టాప్ హోటల్ నుంచి సంజీవ్‌ఖన్నాను హిల్‌టాప్ హోటల్ నుంచి పికప్ చేసుకుంది. ఇంద్రాణి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు డ్రైవ్ చేస్తున్నారు. సాయంత్రం 6.45 నిమిషాలకు: ముంబైలోని లింకింగ్ రోడ్ చేరుకున్న ముగ్గురు... షీనాబోరా కోసం ఎదురుచూశారు. సాయంత్రం 7.03 నిమిషాలకు: లింకింగ్ రోడ్‌లోని నేషనల్ కాలేజ్ సమీపంలో తన కోసం వెయిట్ చేస్తున్న ఓపెల్ కోర్సా కారులో కూర్చుంది షీనా. సాయంత్రం 7.16నిమిషాలకు: ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్ శ్యాం మనోహర్ నవీ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుంచి కారు ఐరోలీ వైపు ప్రయాణించింది. రాత్రి 8.27 నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు వేగంగా వెలుతున్న సమయంలో... కారు ఆపాల్సిందిగా డ్రైవర్‌ను ఇంద్రాణి ఆదేశించింది. అయితే అప్పటికే షీనాబోరాకు ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నాలు మత్తు మందు ఇచ్చిన విషయం డ్రైవర్‌కు తెలియదు. దీంతో తాను టాయిలెట్‌కు వెళతానని చెప్పి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు దిగి వెళ్లాడు. డ్రైవర్ వెళ్లగానే ఇంద్రాణీ తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. సంజీవ్‌ఖన్నా షీనా గొంతు నులిమి చంపేశాడు. డ్రైవర్ టాయిలెట్‌కు వెళ్లి తిరిగి రాగానే కారును దూరంగా పోనివ్వమని.. ఇంద్రాణి చెప్పింది. అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్ మార్చుకోవాలని ఇంద్రాణీ, సంజీవ్‌లు నిర్ణయించుకున్నారు. రాయ్‌గఢ్ వెళ్లడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాతంలోనే శవాన్ని పూడ్చిపెడదామని సంజీవ్ అన్నాడు. రాత్రి 9.01నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని విఖ్రోలి ప్రాంతంలో పోలీస్ గస్తీని చూడగానే వీరు ముగ్గురు భయపడ్డారు. రాత్రి 9.14నిమిషాలకు: వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి శవాన్ని కారులోనే ఉంచి పీటర్ ముఖర్జియా ఇంట్లోని గ్యారేజ్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 11.01 నిమిషాలకు: షీనా మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి... కారు డిక్కీలో ఉంచారు. అది.. ఏప్రిల్ 25, 2012 అర్థరాత్రి 12.19నిమిషాలకు: సంజీవ్‌ఖన్నా తన హిల్‌టాప్ హోటల్‌కు బయలేదేరాడు అర్ధరాత్రి 12.30నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు కాల్చేసిన ఇంద్రాణి... ఉదయం ఏంచేయాలనే దానిపై ఇద్దరు చర్చించుకున్నారు. అర్ధరాత్రి12. 57నిమిషాలకు: కారులోనే ఉన్న డ్రైవర్ శ్యామ్రాయ్కు ఫోన్‌చేసింది ఇంద్రాణి. అర్ధరాత్రి 01.19నిమిషాలకు: మరోసారి డ్రైవర్ శ్యాంరాయ్‌కు ఫోన్ చేసిని ఇంద్రాణి... బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అర్ధరాత్రి 02.30నిమిషాలకు: తన గదిలోంచి కిందికి దిగివచ్చిన ఇంద్రాణీ... డ్రైవర్‌తో కలిసి హిల్‌టాప్ హోటల్‌కు బయలుదేరి వెళ్లింది. అర్ధరాత్రి 02.47 నిమిషాలకు: రాయ్‌గఢ్‌లోని గగోడే బుద్రుక్ గ్రామానికి బయలుదేరిన ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యాంరాయ్. తెల్లవారుజామున 04.21 నిమిషాలకు: గగోడే బుద్రుక్ గ్రామ సమీపంలో చేరుకోగానే... కారులోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తన కూతురు శవాన్ని చూసి భయపడ్డ ఇంద్రాణీ.. వెంటనే శవాన్ని దహనం చేయాలని చెప్పింది. తెల్లవారుజామున 04.33నిమిషాలకు: కారు దగ్గరికి వెళ్లి నిల్చున్న ఇంద్రాణి... సంజీవ్‌ఖన్న, శ్యాంరాయ్‌లు శవాన్ని మట్టుబెట్టేవరకు ఎదురుచూసింది. ఉదయం 05.13నిమిషాలకు: అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్దిదూరం వెళ్లి... తిరిగి శవాన్ని మట్టుబెట్టిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా చూసి ఇంటికి బయలుదేరారు. ఉదయం 07.33నిమిషాలకు: ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోయారు. చదవండి: పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్‌తో షీనా సన్నిహితంగా ఉండడం వల్లే.. -
అందరినీ క్షమించేస్తున్నా: ఇంద్రాణి ముఖర్జీ
ముంబై: ఒకప్పటి మీడియా ప్రముఖురాలు ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చింది. కూతురు షీనాబోరా హత్యకేసులో జైలుకు వెళ్లిన ఆమె.. బెయిల్‌పై శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయ్యారు. ఈ క్రమంలో మీడియా ఆమెను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాత్రం నవ్వుతూ.. అన్నింటికి సమాధానం ఇచ్చుకుంటూ పోయారు. ఈ కేసులో ఇంద్రాణిని ఇరికించే ప్రయత్నం ఎవరైనా చేశారా? అని ప్రశ్న ఎదురుకాగా.. నన్ను ఇబ్బంది పెట్టిన అందరినీ క్షమించేస్తున్నా. అంతే అని బదులిచ్చారు. ఇక కూతురు(షీనా బోరా) బతికే ఉందా?.. ఆ వాదనను సమర్థిస్తారా? అనే ప్రశ్నను దాటవేశారామె. ‘‘ఈ కేసు గురించి ఇప్పడేం మాట్లాడలేను. జీవితాన్ని పలు దృకోణాల్లో చూడడం ఇప్పుడే నేర్చుకున్నా. దారిలో ఎందరినో కలుసుకున్నా. ఇదొక ప్రయాణం. ఓపికగా ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు సంతోషంగా ఉంది అని చెప్పింది యాభై ఏళ్ల ఇంద్రాణి ముఖర్జీ. బయటకు వెళ్లాక ఏం చేస్తారు అనే ప్రశ్నకు.. జైళ్లో ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా అంతే. ఎలాంటి ఆలోచనలు లేవు. న్యాయవ్యవస్థ మీద నమ్మకం మళ్లీ వచ్చింది. ఆలస్యం అయినా న్యాయం జరిగిందని నమ్ముతున్నా. సంతోషం తప్ప.. వేరే ఏ భావోద్వేగం లేదు నాలో. త్వరలో ఓ బుక్ రాయాలనుకుంటున్నా. కానీ, అది జైలు జీవితం గురించి మాత్రం కాదు అని చెప్పారామె. చదవండి: ఇంద్రాణి ముఖర్జీ పతనం ఎలా అయ్యిందంటే.. -
Indrani Mukerjea: కూతురి హత్య కేసులో ఆరేళ్ల తర్వాత బయటకు..
చాలా చాలా సంతోషంగా ఉంది.. బెయిల్ మీద బయటకు వచ్చిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన మొదటి మాట ఇది. సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయగా.. రెండు లక్షల రూపాయల షూరిటీ బాండ్ మీద అనుమతి ఇచ్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. శుక్రవారం సాయంత్రం దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యింది ఆమె. సుమారు ఆరున్నరేళ్ల తర్వాత ఇంద్రాణి బయటి ప్రపంచాన్ని చూసింది. ముంబై: కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ(50)కి.. సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా కోర్టు.. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆపై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో.. శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలు, కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులై.. ఇలా నేరపూరిత స్వభావంతో వార్తల్లోకి ఎక్కింది. ముగ్గురు భర్తల ఇంద్రాణి.. ఇంద్రాణి ముఖర్జీకి మొదటి భర్తతో కలిగిన సంతానం షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే.. మూడేళ్ల వరకు ఆ విషయం బయటకు పొక్కలేదు. 2012లో షీనా బోరాను హత్య చేయగా.. మూడేళ్ల తర్వాత ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్య కేసు గురించి తెలిసింది. షీనా బోరాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపారని.. ఆమెను తన చెల్లెలిగా పరిచయం చేసుకున్నారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఇంద్రాణీ ముఖర్జీ మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్ అనే కుమారుడు జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. అప్పటికే పెద్దదయిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. ఆమె తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇందుకోసం ప్లాన్ చేసి.. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో షీనాను హత్య చేసింది. ఈ కేసులో 2015 సెప్టెంబర్‌లో ఇంద్రాణీ, సంజీవ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం మూడో భర్త పీటర్ ముఖర్జియాను సైతం అదుపులోకి తీసుకున్నారు. బతికే ఉందని డ్రామాలు 2019లో జైల్లో ఉండగానే పీటర్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2020లో పీటర్‌కు బెయిల్ వచ్చింది. ఇంద్రాణీ జైల్లో శిక్ష పొందుతున్న సమయంలో.. తన కుమార్తె ప్రాణాలతోనే ఉందని సీబీఐకి లేఖ రాసింది. షీనా బోరాను జైలు అధికారి ఒకరు కశ్మీర్లో చూశానని చెప్పిందని ఆ లేఖలో పేర్కొన్న ఇంద్రాణి.. ఈ విషయమై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ మీద బయటకు రావడం కోసం అనేక సార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆరున్నరేళ్లపాటు శిక్ష అనుభవించాక ఎట్టకేలకు ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ 68 మందిని మాత్రమే విచారించింది. చదవండి: షీనా బతికే ఉందా? బయటకొచ్చిన ఇంద్రాణి ఏం చెప్పిందంటే.. -
షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ లెదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీకి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ 68 మందిని మాత్రమే విచారించింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం లేదని, బెయిల్ ఇవ్వాలంటూ ఇంద్రాణి తరఫున వాదిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రొహ్తగి పేర్కొన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఇప్పట్లో ఈ కేసు విచారణ పూర్తయ్యేలా లేనందున బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. ‘‘ఈ కేసులో ఆరున్నరేళ్లుగా ఇంద్రాణి జైల్లోనే ఉన్నారు. ఇప్పటివరకు 50 శాతం మంది సాక్షుల విచారణ కూడా పూర్తి కాలేదు. చాలాకాలం గా జైల్లో ఉన్నందున బెయిల్ ఇస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏమిటీ కేసు...? ఇంద్రాణి ముఖర్జీకి ఆమె మొదటి భర్తతో పుట్టిన కుమార్తె షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే మూడేళ్ల వరకు ఆ విషయమే బయటకు రాలేదు. ఇంద్రాణి తన మొదటి భర్తతో విడిపోయాక సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనికి విడాకులిచ్చి ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. షీనా తన కుమార్తె అని కాకుండా తన చెల్లి అనే అందరికీ పరిచయం చేసింది. ఆమె కనిపించకపోతే అమెరికా వెళ్లిపోయిందని ఇంద్రాణి అందరినీ నమ్మబలు కుతూ వచ్చింది. అయితే మరో కేసులో ఇంద్రాణి డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తుండగా తల్లే కుమార్తెను చంపిన విషయం తేలింది. కారులో ప్రయాణిస్తుండగా షీనా బోరాకు ఊపిరాడ నివ్వకుండా చేసి తల్లి ఇంద్రాణియే చంపితే, ఆమెకు భర్త పీటర్ ముఖర్జీ, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ సహకరించినట్టుగా తేలింది. దీంతో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ని 2015లో అరెస్ట్ చేశారు. ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీకి మొదటి భార్య సంతానమైన రాహుల్ ముఖర్జీతో షీనా ప్రేమలో పడింది. వారిద్దరి మధ్య అఫైర్‌ని ఉందని తెలిసి తట్టుకోలేక ఇంద్రాణి కన్నకూతురని చూడకుండా పథకం ప్రకారం హత్య చేసిందని విచారణలో తేలింది. మరోవైపు జైల్లో ఉండగానే పీటర్, ఇంద్రాణిలు విడాకులు తీసుకున్నారు. 2019లో వారికి విడాకులు మంజూరయ్యాయి. చదవండి: గుజరాత్ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. హార్దిక్ పటేల్ రాజీనామా -
ఆమె బతికే ఉంది.. నమ్మరా?! మరో ట్విస్టు
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మరోసారి వార్తల్లో నిలిచింది. చనిపోయిందని భావిస్తున్న తన కూతురు షీనా బోరా బతికే ఉందంటూ (జనవరి 24, సోమవారం) ముంబైలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఒక రాతపూర్వక దరఖాస్తును లాయర్ ద్వారా కోర్టుకు సమర్పించింది. ఈ దరఖాస్తు కాపీని సీబీఐకి అందజేసిన కోర్టు. ఫిబ్రవరి 4వ తేదీన తన ప్రతిస్పందన ఫైల్ చేయాలని కోర్టు ఆదేశించింది. (షీనా బోరా హత్య కేసు : మరో సంచలన ట్విస్ట్) ఈ విషయాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి తెలియజేసినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించింది. తాను రాసిన లేఖపై సీబీఐ ఎలాంటి చర్య తీసుకుందో తెలుసుకోవాలని ఇంద్రాణి కోర్టును కోరింది. దీనిపై మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు తాపే ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. అంతేకాదు బోరా ఖచ్చితంగా బతికే ఉంది అనేందుకు తన వద్ద బలమైన కారణం ఉందని తెలిపింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఇంద్రాణి తనకు సత్వరమే న్యాయం చేయాలని కోరింది కాగా తన కూతురు షీనా బోరా బతికే ఉందంటూ గత ఏడాది డిసెంబరులో ఇంద్రాణి సీబీఐ డైరెక్టర్‌కు ఒక లేఖ రాసింది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. కశ్మీర్లో షీనా బోరాను కలిశానని సహ ఖైదీ తనకు చెప్పిందని ఆమె తన లేఖలో పేర్కొంది. కశ్మీర్లో షీనా బోరా కోసం గాలింపు చేపట్టాలని ఆమె సీబీఐని కోరిన సంగతి తెలిసిందే. -
షీనా బోరా హత్య కేసు : మరో సంచలన ట్విస్ట్
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్యకేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. తన కూతురు షీనా బతికే ఉందని ఈ హత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా మాజీ వ్యవస్థాపకురాలు ఇంద్రాణి ముఖర్జీ సీబీఐని ఆశ్రయించడం సంచలనంగా మారింది. దీనిపై విచారణ జరిపించాలని ఇంద్రాణి డిమాండ్ చేయంటా హాట్ టాపిక్‌గా నిలిచింది. తన కూతురు షీనా బోరా బతికే ఉందని ఇంద్రాణి సీబీఐ డైరెక్టర్‌కు ఒక లేఖ రాసింది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. కశ్మీర్లో షీనా బోరాను కలిశానని ఇటీవల జైలులోని సహ ఖైదీ తనకు చెప్పిందని ఆమె తన లేఖలో పేర్కొంది. కశ్మీర్లో షీనా బోరా కోసం గాలింపు చేపట్టాలని ఆమె సీబీఐని కోరింది. దీంతో ఈ లేఖపై విచారణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఇంద్రాణి తరఫు న్యాయవాది దీనిపై స్పందించారు. ఇంద్రాణి నేరుగా సీబీఐకి లేఖ రాశారని, ఈ లేఖలో ఆమె ఏమి ప్రస్తావించారో తనకు తెలియదని అన్నారు. దీనిపై సమాచారం సేకరిస్తానని చెప్పారు. కాగా షీనా బోరా ఇంద్రాణి మొదటి భర్త కుమార్తె. ఇంద్రాణి ముఖర్జీ తన ఇద్దరు పిల్లలు షీనా, మిఖాయిల్‌లను గౌహతిలో వదిలి ముంబైకి వెళ్లి అక్కడ మీడియా బారన్ పీటర్ ముఖర్జీని వివాహం చేసుకుంది. ఇంద్రాణి షీనాను తన సోదరిగా పీటర్‌కు పరిచయం చేసింది. అనూహ్యంగా 2012లో షీనా అదృశ్యమైంది. దాదాపు మూడేళ్ల తరువాత కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఇంద్రాణి ముఖర్జీని 2015లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ముంబైలోని బైకుల్లా జైలులో ఇంద్రాణి ఉంటున్నసంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మూడు ఛార్జిషీట్లు, రెండు అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అలాగే ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జీను నిందితులుగా పేర్కొంది. డబ్బు, ఇల్లు కోసం షీనా తల్లిని బ్లాక్ మెయిల్ చేసేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ తుపాకీ పట్టుబడటం, అతని వాంగ్మూలం ఆధారంగా ఇంద్రాణి షీనాను హత్య చేసిందని సీబీఐ ఆరోపించింది. అయితే విచారణ సమయంలో పీటర్, ఇంద్రాణి విడాకులు తీసుకోగా, పీటర్ కు 2020లో బెయిల్ లభించింది. ఈ కేసులో గత నెలలో ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
ఇంద్రాణి ముఖర్జీయా సహా 40 మంది ఖైదీలకు కోవిడ్
ముంబై: కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విస్తరిస్తోంది. చిన్న, పెద్ద, బీద, ధనిక తేడాలేం లేకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తోంది. తాజాగా జైల్లోకి కూడా ఎంటరయ్యింది మహమ్మారి. 38 మంది ఖైదీలు కోవిడ్ బారిన పడ్డారు. ఈ ఘటన కరోనాతో విలవిల్లాడుతున్న మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబై బైకుల్లా జైలులో 38 ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో షీనా బోరా హత్య కేసు నిందితురాలు అయిన ఇంద్రాణి ముఖర్జీయా కూడా ఉన్నారు. జైలు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాక నగరంలోని పరం శాతిధాం వృద్ధాశ్రమంలో 58 మందికి కోవిడ్ సోకినట్లు తెలిసింది. ఇక మంగళవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 58,924 కోవిడ్ కేసులు నమోదవ్వగా.. 351 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు మూడు లక్షలకు చేరువవ్వగా.. 2,023 మంది మరణించారు. చదవండి: మీ కక్కుర్తి తగలడా.. ప్రాణం కన్న బీరే ముఖ్యమా? -
సంచలన ‘ఆత్మకథ’
కీలక స్థానాల్లో పనిచేసి పదవులనుంచి తప్పుకున్న వారు రాసే పుస్తకాలకు మంచి గిరాకీ ఉంటుంది. వారు బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో సంచలనాత్మకమైన ఘటనలు జరిగుంటే ఇది మరిన్ని రెట్లు పెరుగుతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్, కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ తదితరులు రాసిన ఆత్మకథలు చెప్పుకోదగ్గ వివాదం రేపాయి. ఇందులో సంజయ బారు పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఆధారంగా అదే పేరుతో చలనచిత్రంగా కూడా వచ్చింది. కనుక ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ మారియా ‘లెట్ మీ సే ఇట్ నౌ’ పేరిట వెలు వరించిన గ్రంథం అందరిలోనూ ఆసక్తి కలిగించడంలో ఆశ్చర్యం లేదు. ముంబై నగరం ఒకప్పుడు మాఫియా డాన్ల అడ్డా. వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను, సినీ నటుల్ని బెదిరించి డబ్బులు గుంజడం, మాట విననివారిని కిడ్నాప్ చేయడం, నేర సామ్రాజ్యంపై ఆధిపత్యం కోసం పోరాటాలు అక్కడ నిత్యకృత్యం. 2008 నవంబర్ 26న ముంబై నగరంపై ఉగ్రవాదులు విరుచుకుపడి 173మంది పౌరులను పొట్టనబెట్టుకున్న ఘటన వీటన్నిటినీ తలదన్నింది. కన్నకూతురు షీనా బోరాను పథకం ప్రకారం రప్పించి, తన భర్తతో కలిసి ఆమెను పొట్టనబెట్టుకున్న ఇంద్రాణి ముఖర్జీ ఉదంతం కూడా అక్కడిదే. ఇలాంటి మహానగరంలోని పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా, ప్రత్యేకించి పోలీస్ కమిషనర్‌గా పని చేసిన రాకేష్ ఆత్మ కథ రాశారంటే ఆసక్తి అత్యంత సహజం. పైగా రాకేష్ వివాదాలకు కేంద్ర బిందువుగా వున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ అధికారి అశోక్ కామ్టే భార్య వినీత తన భర్త మరణానికి రాకేష్ వ్యవహరించిన తీరే కారణమని ఆరోపించారు. ఆ రోజు పోలీస్ కంట్రోల్ రూం ఇన్చార్జిగా వున్న రాకేష్ సరిగా మార్గదర్శకత్వం చేయనందువల్లే అశోక్ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు బలయ్యారని ఒక పుస్తకంలో ఆమె చెప్పారు. అప్పట్లో రాకేష్ ఈ ఆరో పణలు కొట్టి పారేసినా తాజాగా ఆ ఎపిసోడ్ గురించి ఈ పుస్తకంలో ఏం రాసి వుంటారన్నది చూడా ల్సివుంది. అలాగే రాకేష్‌ను పదవీ విరమణకు చాలా ముందుగానే పోలీస్ కమిషనర్ పదవినుంచి తప్పించడం అప్పట్లో సంచలనం రేపింది. దాంతోపాటు బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఆయన కలవడం పెను వివాదమైంది. ఇంత నేపథ్యంవున్న రాకేష్ పుస్తకం రాశారంటే చదవకుండా ఎలావుంటారు? అయితే ఈ ఆత్మకథలో ఇతరత్రా అంశాలకంటే ఉగ్రవాది కసబ్ గురించి ఆయన చెప్పిన అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దాని చుట్టూ వివాదం రాజేసేందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ప్రయత్నించారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరేలు రెండూ కసబ్ పేరును దినేశ్ చౌధరి అని మార్చి, నకిలీ ఐడీ కార్డు సృష్టించి, అతనితో కాషాయ రంగు తాడు కట్టించి, మారణాయుధాలిచ్చి ఉగ్రవాద దాడులకు పంపాయని రాకేష్ తెలిపారు. పీయూష్ గోయెల్ అభ్యంతరమల్లా ఈ సంగతి ఇన్నాళ్లూ ఎందుకు దాచివుంచారన్నదే. అందుకాయన రాకేష్‌తోపాటు అప్పటి యూపీఏ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగుందన్నది గోయెల్ అనుమానం. వాస్తవానికి ఈ సమాచారం కొత్తదేమీ కాదు. ఆ దాడి జరిగిన మరుసటి రోజునుంచే ఉగ్రవాదుల గురించి, వారి పన్నాగాల గురించి పుంఖానుపుంఖాలుగా కథ నాలు వెలువడ్డాయి. కసబ్‌ను ప్రశ్నించే క్రమంలో వెల్లడైన అంశాలన్నీ మీడియాలో అప్పట్లోనే ప్రము ఖంగా వచ్చాయి. ఉగ్రవాదుల వద్ద హైదరాబాద్, బెంగళూరు కళాశాలల్లో చదువుకుంటున్నట్టు దొంగ గుర్తింపు కార్డులుండటం, వాటిపై హిందువుల పేర్లు వుండటం పాత కథే. ఉగ్రవాద దాడులకు పథక రచన చేసింది ఐఎస్ఐ కనుక, దాడులు చేసేది భారత్‌లో కనుక తమ సంగతి బయట పడకుండా వుండటం కోసం, దర్యాప్తు సంస్థలను పక్కదోవ పట్టించేందుకు, అయోమయం సృష్టిం చేందుకు ఇదంతా చేసివుంటారని సులభంగానే గ్రహించవచ్చు. ఇలాంటివి బయటపడినప్పుడు వెల్లడించడానికి ప్రభుత్వాలకు అభ్యంతరం ఎందుకుంటుంది? రాకేష్ మారియా కూడా దాన్ని తొలి సారి బయటపెడుతున్నట్టు ప్రకటించలేదు. కసబ్‌ను తానే స్వయంగా ప్రశ్నించారు గనుక, దర్యా ప్తును పక్కదోవ పట్టించే పన్నాగంతో ఐఎస్ఐ ఏమేం చేసిందో చెప్పడానికి ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రాణాలకు తెగించి కసబ్‌ను సజీవంగా పట్టుకున్న కానిస్టేబుల్ గురించి కూడా రాకేష్ ప్రస్తావించారు. కసబ్ సజీవంగా పట్టుబడకపోయివుంటే పాకి స్తాన్ కుట్రను రుజువు చేయడం కష్టమయ్యేది. దేశంలో అంతక్రితమూ, ఆ తర్వాత అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. వీటన్నిటిలో పాకిస్తాన్ ప్రమేయం వున్న సంగతి తెలుస్తూనే వున్నా అందుకు అవసరమైన పక్కా సాక్ష్యాలివ్వడం సాధ్యపడలేదు. ముంబై మహానగరం ఆర్థిక రాజధాని కనుక ఉగ్రవాదుల దాడి ఘటన గురించి తెలిసిన వెంటనే నగర పోలీసులు వారిని మట్టు బెడతారని పాకిస్తాన్ ఊహించింది. కానీ పాక్ అంచనాలకు భిన్నంగా అనుకోకుండా కసబ్ పోలీసులకు చిక్కాడు. ఒకప్పుడు తాము ఇష్టపడే నేతలు లేదా సెలబ్రిటీలు రాసిన ఆత్మకథల కోసం జనం ఆసక్తి కనబరిచేవారు. వారి జీవితాల నుంచి నేర్చుకోవాల్సింది వుంటుందన్న భావనే అందుకు కారణం. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. పదవీకాలంలో వివాదాస్పదులుగా పేరు తెచ్చుకున్నవారు రాసినా, ఆత్మకథల్లో వివాదాల ప్రస్తావనవున్నా వాటికి పఠితలు అధికంగానే వుంటున్నారు. ఈ పుస్తకంలో రాకేష్ తన తదనంతరం పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అహ్మద్ జావేద్, మరో పోలీస్ అధికారి దేవేన్ భారతిల గురించి చేసిన ప్రస్తావనలు ఇప్పుడు ముంబై పోలీసుల్లో కాక పుట్టిస్తున్నాయి. తన గురించి వున్నవీ లేనివీ రాశారని జావేద్ అంటున్నారు. ఏదేమైనా మారియా పుస్తకం విడుదలైన రోజే కావలసినంత వివాదం రేపింది. -
వైద్యం అందకపోతే చచ్చిపోతాను!
ముంబై: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలైన మీడియా బాస్ ఇంద్రాణి ముఖర్జీ సోమవారం ముంబై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర పన్నుతోందని ఈ పిటిషన్లో ఆరోపించిన ఆమె.. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఎమోషనల్‌గా అభ్యర్థించారు. వీలైనంత త్వరగా తనకు వైద్యం సహాయం అందకపోతే తాను చనిపోతానని, తన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో సత్వరమే బెయిల్ ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని వేడుకున్నారు. ‘దాదాపు ఏడాది కిందట రాహుల్ ముఖర్జీ ఈ కేసులో తదుపరి సాక్షి అని ప్రాసిక్యూషన్ పేర్కొంది. 14 నెలలు అయినా ఇప్పటివరకు అతన్ని కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టలేదు. మరోవైపు అతడు కీలక సాక్షి అంటూ.. అతని సాక్ష్యం ఇవ్వని కారణంగా నాకుబెయిల్ నిరాకరిస్తూ వస్తున్నారు’ అని వాదనల సందర్భంగా ఇంద్రాణి న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలా సాక్షిని ప్రవేశపెట్టకుండా తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. దీంతో ఈ కేసులో వాదనలను వేగవంతం చేయాలని ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లను ఆదేశించిన జడ్జి బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. -
‘చిదంబరాన్ని అరెస్టు చేయడం సంతోషంగా ఉంది’
ముంబై: ఐఎన్ఎక్స్ కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్ట్‌పై ఇంద్రాణీ ముఖర్జీ స్పందించారు. అనూహ్యంగా ఐఎన్ఎక్స్ కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ ముఖర్జీ గురువారం ముంబై కోర్టు వెలుపల మాట్లాడుతూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్ట్ అవటం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐన్‌ఎక్స్ మీడియా సంస్థను స్థాపించిన ఇంద్రాణి ముఖర్జీ ఆమె భర్త పీటర్ కేసులో అప్రూవర్లుగా మారడంతో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. భారీ హైడ్రామాల మధ్య గత గురువారం చిదంబరాన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. కస్టడీలో ఉన్న చిదంబరం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. కోర్టులో అతనికి ఎదురుదెబ్బ తగిలింది. కాగా, 2017లో ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ముందు ఇంద్రాణి ఇచ్చిన వాంగ్మూలమే చిదంబరం అరెస్టుకు దారి తీసింది. విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం కోరినట్టుగా ఇంద్రాణీ ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ముందు పేర్కొన్నారు. ఆ సంవత్సరంలో ఐఎన్ఎక్స్ సంస్థకు రూ.305 కోట్ల విదేశీ నిధులు వచ్చాయని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. -
ఆస్పత్రిలో చేరిన ఇంద్రాణి ముఖర్జియా
ముంబై : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు, షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కాగా షీనా బోరా హత్య కేసులో భాగంగా కోర్టుకు హాజరైన ఇంద్రాణి వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మ గురువారం పలు సంచలన విషయాలు వెల్లడించారు. షీనా హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణి ముఖర్జియా తనచేత షీనా పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేయించారని, తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణి అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా ఇంద్రాణి సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఇంద్రాణి దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్ప తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంద్రాణి ఆస్పత్రిలో చేరడం గమనార్హం. కాగా ఆమె ఇది వరకు కూడా పలుమార్లు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
ఇంద్రాణీ చెబితే.. తప్పక అలా చేశా!
ముంబై : సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగుచూసింది. షీనాను హత్య చేసిన తర్వాత ఆమె పేరుతో ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. షీనాను హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణీ ముఖర్జియా అప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మతో చెప్పి ఆ మెయిల్ ఐడీ క్రియేట్ చేయించారు. తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణీ అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. రాజీనామా లేఖలో షీనాబోరా సంతకాన్ని ఫోర్జరీ చేశానని, ఇంద్రాణీ నుంచి తనకు ఎలాంటి తప్పుడు సంకేతాలు రాకపోవడంతో ఆ పని చేసినట్లు వెల్లడించారు. ఇంద్రాణీ దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్పా తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ స్కైప్ ఐడీ నుంచి కాల్స్ కూడా మాట్లాడినట్లు కోర్టులో వివరించారు. 2012 ఏప్రిల్‌లో షీనా బోరా హత్యకు గురికాగా, మూడేళ్ల అనంతరం 2015లో ముంబై పోలీసులు ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్ ముఖర్జీయాను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ తన వాంగ్ములంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
ఐసీయూలో ఇంద్రాణీ ముఖర్జియా..పలు అనుమానాలు
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్నఇంద్రాణీ ముఖర్జియా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కుమార్తె హత్య కేసులో ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్న ఆమెను అపస్మారక స్థితిలో అసుపత్రికి తరలించడం చర్చనీయాంశమైంది. తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఇంద్రాణీని జైలు అధికారులు ముంబైలోని జేజే హాస్పిటల్‌కి తరలించారు. ప్రసుత్తం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇంద్రాణీపై విష ప్రయోగం జరిగిందా లేక డ్రగ్ మోతాదు ఎక్కువైందా అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని జేజే హాస్పిటల్ డీన్ ఎస్డీ నానంద్కర్ వెల్లడించారు. రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. దీంతో ఇంద్రాణీ ముఖర్జియా ఆకస్మిక అనారోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఆసుపత్రిలోముఖర్జీని కలవటానికి ప్రయత్నించిన ఆమె వ్యక్తిగత న్యాయవాది గుంజన్ మంగళను వైద్యులు అనుమతించలేదు. ముందుగా జైలు అధికారుల అనుమతి తీసుకోవాలని వైద్యులు అతనికి సూచించారు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కూడా నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జీతో కలిసి సొంత కూతుర్ని హతమార్చిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
ఆస్పత్రిలో చేరిన ఇంద్రాణి
ముంబై : షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు అనుమానిస్తున్నారు. అయితే, జైలు అధికారులుగానీ, ఆస్పత్రి వర్గాలుగానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. గతంలో కూడా అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణీని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. -
‘బరువు తగ్గాలా....సీబీఐకి ఫోన్ చేయండి’
న్యూఢిల్లీ : బరువు తగ్గడానికి మనలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. జిమ్‌కి వెళ్లడం, వర్కవుట్లు చేయడం, ఆయసం వచ్చేలా పరుగులు పెట్టడం ఇవన్నీ బరువు తగ్గే ప్రక్రియలో భాగంగా ఎంచుకుంటుంటారు. అయితే ఈ ఆపసోపాలేమీ పడక్కర్లేదట. బరువు తగ్గాలనుకునే వారందరికి సులువైన ఉపాయం చెప్తా అంటున్నారు కార్తీ చిదంబరం. అది ఏంటో ఆయన మాటల్లోనే విందాం...‘బరువు తగ్గాలనుకునే వారు జిమ్‌కు వెళ్లి కష్టపడక్కర్లేదు. కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సీబీఐ కస్టడీలో ఉంటూ వారి కాంటీన్ తిండి తింటే చాలు. వెంటనే బరువు తగ్గిపోతారు. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న నేను చాలా తక్కువ తింటున్నాను. ఫలితంగా చాలా బరువు కోల్పోయాను. ఇప్పుడు నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఎందుకంటే పాత బట్టలన్ని లూజ్ అయిపోయాయి'' అని తెలిపారు. 12 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న కార్తీ చిదంబరాన్ని సోమవారం న్యూఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించారు. ఈ సందర్భంగా తన భద్రత దృష్ట్యా తీహార్ జైలులో తనకు ప్రత్యేక గదిని, బాత్రూమ్ని కేటాయించాలని కోర్టును అభ్యర్థించారు. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సునీల్ రాణా ఈ అభ్యర్థనను తిరస్కరించారు. జైలు అధికారులే కార్తీ భద్రతకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ఒకవేళ కోర్టు ఆదేశిస్తే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతిస్తామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఐఎన్ఎక్స్ కేసులో కార్తీ చిదంబరం నిందితుడిగా ఉన్నారు. తన తండ్రి పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ముఖర్జీల ఐఎన్ఎక్స్ మీడియా కంపెనీకి రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు క్లియరెన్స్ ఇప్పించడం కోసం వారి వద్ద నుంచి రూ. 3 కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జీ స్టేట్మెంట్ను కూడా సీబీఐ రికార్డు చేసింది. ప్రస్తుతం ఐఎన్ఎక్స్ మీడియా హౌజ్‌కు సహవ్యవస్థాపకులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలు కూడా కుమార్తె షీనా బోరాను హత్య కేసులో జైలులో ఉన్నారు. పీటర్ ముఖర్జీని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కస్టడీకి తీసుకోనున్నామని సీబీఐ తెలిపింది. గత నెల 28న కార్తి చిదంబరాన్ని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
చిక్కుల్లో చిదంబరం: బుక్ చేసిన ఇంద్రాణి
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. బుధవారం చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్నిచెన్నైలో సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా, తాజాగా ఇంద్రాణి ముఖర్జీ స్టేట్మెంట్ చర్చనీయాంశమైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం తన కుమారుడు కార్తీకి సహాయం చేయమని కోరారని ఇంద్రాణి ముఖర్జీ దర్యాప్తు సంస్థ విచారణలో పేర్కొన్నట్టుగా వివిధ మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఢిల్లీలోని హోటల్ హయత్‌లో కార్తీని కలుసుకున్నట్టుగా కూడా ఆమె వెల్లడించారు. అలాగే కార్తీ చిదంబరానికి చెందిన విదేశీ, స్వదేశీ సంస్థలకు చెల్లించిన ముడుపులకు (రూ.4.5 కోట్లు) సంబంధించి ఐఎన్ఎక్స్ న్యూస్ మాజీ డైరెక్టర్ పీటర్ ముఖర్జీ సంతకం చేసిన నాలుగు ఇన్వాయిస్లను ఐఎన్ఎక్స్ మీడియా సీబీఐకి అందించింది. వీటిని సీబీఐ, ఈడీ పరిశీలిస్తున్నాయి. మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.5 కోట్లు) ముడుపుల కేసు విచారణ సందర్భంగా ఐఎన్ఎక్స్ న్యూస్ మాజీ డైరెక్టర్, కుమార్తె షీనా బోరా హత్యకేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జీని సీబీఐ, ఈడీ తాజాగా ప్రశ్నించాయి. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం పొందే క్రమంలో తన కుమారుడి వ్యాపారానికి సహకరించాలని చిదంబరమే తనను స్వయంగా కోరినట్టు ఇంద్రాణి తెలిపినట్టు సమాచారం. ఆయన కోరిక మేరకే తాను కొంత సహకరించానని కూడా ఇంద్రాణి వాగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో అతి త్వరలో చిదంబరాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కాగా బుధవారం అరెస్ట్ చేసిన కార్తీ చిదంబరాన్ని ప్రశ్నించడానికి వీలుగా ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతినిచ్చింది. సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ కార్తీకి కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు కార్తీ చిదంబరం అరెస్ట్‌పై స్పందించిన కాంగ్రెస్.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమను ఎన్డీయే సర్కారు ఇబ్బందులు పెడుతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
కార్తీ చిదంబరం అరెస్టు
-
కార్తీ చిదంబరం అరెస్టు
న్యూఢిల్లీ: అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కొడుకు కార్తీని సీబీఐ బుధవారం చెన్నైలో అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరయ్యేందుకు లండన్ నుంచి భారత్‌కు వచ్చిన కార్తీని చెన్నై విమానాశ్రయంలోనే సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడి కోర్టులో హాజరుపరిచింది. ఐఎన్ఎక్స్ మీడియా నుంచి కోట్ల రూపాయల మేర ముడుపులు అందుకున్న కేసులో కార్తీని ప్రశ్నించేందుకు 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా.. ఒకరోజు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ కోర్టులో హాజరుపర్చాలంది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కార్తీని అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఆరోపించగా.. ఇందులో ప్రభుత్వ జోక్యం ఏదీ లేదని, చట్ట ప్రకారమే దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. అయితే, ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి నాటి ఆర్థిక మంత్రి చిదంబరంను కూడా కలిశామని అప్పటి ఐఎన్ఎక్స్ డైరెక్టర్లు ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ సీబీఐ, ఈడీల విచారణలో వెల్లడించడం సంచలనం రేపుతోంది. విచారణకు సహకరించడం లేదనే.. విచారణకు సహకరించకపోవడం వల్లనే కార్తీని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సీబీఐ స్పష్టం చేసింది. అలాగే, ఆయన పలుమార్లు విదేశాలకు వెళ్తుండటంతో అక్కడి బ్యాంకుల్లోని సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉందంది. విచారణకు హాజరవకుండా పూర్తిగా విదేశాల్లోనే ఉండిపోయే పరిస్థితి కూడా ఉందని, అందువల్లనే అదుపులోకి తీసుకుని విచారిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ వాదనను కార్తీ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. గతంలోనే ఎన్నోసార్లు సీబీఐ, ఈడీలు కార్తిని విచారించాయనీ, ఇప్పుడు కూడా ఈడీ విచారణకు హాజరవ్వడానికే ఆయన భారత్ వచ్చారని కోర్టుకు తెలిపారు. ఆయన అరెస్టుకు సరైన కారణాలే లేవన్నారు. కాగా, ఐఎన్ఎక్స్ మీడియా కేసుతోపాటు 2006లో ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందానికి ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులపై కూడా సీబీఐ విచారిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మనీలాండరింగ్ కేసులో కార్తీని ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. రాజకీయ కక్షతోనే.. రాజకీయ కక్షతోనే బీజేపీ ప్రభుత్వం కార్తీని అరెస్టు చేయించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్డీయే హయాంలో వెలుగుచూస్తున్న కుంభకోణాలు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఎత్తుగడ వేసిందంది. కాంగ్రెస్ ప్రజలకు నిజాలు చెప్పడాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని ఇలాంటి చర్యలతో ఆపలేరని ఆ పార్టీ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి బీభత్సంగా మాటలను వాడే ప్రధాని మోదీ.. గత 10 రోజుల్లో బీజేపీ హయంలో రూ. 30 వేల కోట్ల కుంభకోణాలు బయటపడినా నోరు తెరవడం లేదన్నారు. ‘వేల కోట్లు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యాను ప్రభుత్వం ఏం చేయదు. కేసు విచారణకు హాజరయ్యేందుకు విదేశం నుంచి తిరిగొచ్చిన కార్తీని అరెస్టు చేస్తుంది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. ప్రభుత్వ జోక్యం లేదు.. కార్తీ చిదంబరం కేసులో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదనీ, ఉండదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. చట్టం ప్రకారమే దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయనీ ఆయన తప్పు చేశారో లేదో ఆధారాలే చెబుతాయని పేర్కొన్నారు. కేసు విచారణకు రాకముందే.. సీబీఐ, ఈడీలు తప్పుడు కేసులతో తనను, తన కుటుంబ సభ్యలను తరచూ వేధిస్తున్నాయని, తమ ప్రాథమిక హక్కులను రక్షించాలని కోరుతూ చిదంబరం గతవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దర్యాప్తు సంస్థలు తమపై ‘అక్రమ విచారణలు’ జరపకుండా అడ్డుకోవాలని ఆయన పిటిషన్లో కోరారు. అయితే సుప్రీంకోర్టులో చిదంబరం పిటిషన్ ఇంకా విచారణకు కూడా రాకముందే కార్తిని సీబీఐ అరెస్టు చేయడం గమనార్హం. మార్చి 1న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసుపై స్టే విధించాలనీ, లేదా కనీసం విచారణను కొద్దికాలం వాయిదా వేయాలంటూ కార్తి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. గతవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కార్తి తరఫున వాదిస్తున్న కపిల్ సిబల్ కూడా ‘మీరు కార్తీని అరెస్టు చేయాలని అనుకుంటున్నారా?’ అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించడం గమనార్హం. ఏమిటీ ఐఎన్ఎక్స్ కేసు? ఐఎన్ఎక్స్ మీడియా కేసు 2007 మార్చిలో పి.చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటిది. కూతురి హత్యకేసులో నిందితులుగా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న భార్యాభర్తలు ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీల చేతుల్లో అప్పట్లో ఈ కంపెనీ ఉండేది. తమ కంపెనీలోకి 46 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించాలంటూ వారు.. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ)కి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల అనంతరం ఎఫ్ఐపీబీ ఐఎన్ఎక్స్ మీడియాలో 46 శాతం ఎఫ్‌డీఐకి అనుమతినిచ్చింది. అయితే అప్పటికే 26 శాతం ఎఫ్‌డీఐలు ఐఎన్ఎక్స్లో ఉన్నాయి. ఆ విషయాన్ని ముఖర్జీలు ఎఫ్ఐపీబీ వద్ద దాచిపెట్టారు. పరిమితికి మించి రూ. 305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులను తీసుకున్నారు. ఈ అవకతవకలను ఆదాయ పన్ను శాఖ గుర్తించి, ఆర్థిక శాఖను సైతం అప్రమత్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ సూచన మేరకు గతేడాది మే 15న సీబీఐ తొలి కేసును నమోదు చేసింది. ఆ తర్వాత జరిపిన సోదాల్లో తమకు పలు ఆధారాలు లభించాయని ఈడీ, సీబీఐలు చెబుతున్నాయి. తండ్రి మద్దతుతోనే.. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతుల విషయంలో జరిగిన ఉల్లంఘనలను సరిచేసేందుకు కార్తీ తమ నుంచి పది లక్షల డాలర్లు తీసుకున్నట్లు ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీ ఇటీవల సీబీఐ విచారణలో బయటపెట్టారు. అందుకు అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న తన తండ్రి పీ చిదంబరం సహకరిస్తారని కార్తీ చెప్పాడని వారు వెల్లడించారు. ‘కార్తీ కోరిన 10 లక్షల డాలర్లలో 7 లక్షల డాలర్లను(రూ.3.10 కోట్లు) కార్తీకి విదేశాల్లోని ఆయన అనుబంధ సంస్థల ద్వారా అందించాం’ అని ముఖర్జీలు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలోనూ స్పష్టం చేశారు. ‘ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ. 305 కోట్ల విదేశీ పెట్టుబడులను అక్రమంగా పొందాం. ఆ పెట్టుబడులను క్రమబద్ధీకరించేందుకు కార్తీని సంప్రదించాం. అనంతరం ఆయనకు చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్‌సీపీఎల్), దాని అనుబంధ సంస్థలకు 7 లక్షల డాలర్లు(రూ. 3.10 కోట్లు) అందజేశాం. ఆ తరువాత మా ఐఎన్ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడుల అంశానికి లైన్ క్లియరైంది’ అని ఇంద్రాణి, పీటర్లు వెల్లడించినట్లుగా తన దర్యాప్తు నివేదికల్లో సీబీఐ, ఈడీ తెలిపాయి. అనుమతులివ్వవద్దంటూ ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు సూచించిన విషయాన్ని కూడా సీబీఐ ప్రస్తావించింది. చిదంబరంను అరెస్టు చేసే అవకాశం సీబీఐ, ఈడీల విచారణలో మరో విషయాన్ని కూడా పీటర్, ఇంద్రాణి ముఖర్జీలు బయటపెట్టారు. అక్రమ లావాదేవీలను క్రమబద్ధం చేసుకునే క్రమంలో భాగంగా తాము అప్పటి ఆర్థికమంత్రి చిదంబరంను నార్త్‌బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో కలిశామని వెల్లడించారు. ‘నా కుమారుడి వ్యాపారాలకు సహకరించండి. అందుకు విదేశీ నిధులందజేయండి’ అని చిదంబరం తమను కోరారని దర్యాప్తు సంస్థలకు తెలిపారు. ఆ తరువాత తాము ఢిల్లీలోని పార్క్ హయత్ హోటల్లో కార్తీని కలిశామని, తమ పని చేసేందుకు ఆయన 10 లక్షల డాలర్లు కోరారని దర్యాప్తులో వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను కూడా దర్యాప్తు సంస్థలు ప్రశ్నించే అవకాశముందని, అవసరమైతే అరెస్ట్ కూడా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కార్తీ – ఐఎన్ఎక్స్ మీడియా కేసు పూర్వాపరాలు 2017 మే 15: ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి 2007లో రూ.305 కోట్ల పెట్టుబడులను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతించటంలో అవకతవకలు జరిగాయనీ, ఆ సమయంలో కార్తీ తండ్రి చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. 2017 జూన్ 16: కేంద్ర హోం శాఖలోని ది ఫారినర్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఎఫ్ఆర్ఆర్వో), బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్లు కార్తీపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశాయి. 2017 ఆగస్టు 10: లుకౌట్ సర్క్యులర్‌పై మద్రాస్ హైకోర్టు స్టే. వారెంట్లు లేనందున లుకౌట్ నోటీసు చెల్లదని తీర్పు. 2017 ఆగస్టు 14: మద్రాస్ హైకోర్టు స్టే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 2017 ఆగస్టు 18: ఆగస్టు 23న సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా కార్తీకి సుప్రీంకోర్టు ఆదేశం. 2017 ఆగస్టు 23: సీబీఐ కోర్టులో హాజరైన కార్తీ 2017 సెప్టెంబర్ 11: కార్తీకి విదేశాల్లో ఉన్నట్లు భావిస్తున్న 25 ఆస్తుల వివరాలను, లావాదేవీలను సీబీఐ సీల్డు కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. 2017 సెప్టెంబర్ 22: విదేశాల్లో బ్యాంకు అకౌంట్లను కార్తీ మూసివేస్తున్నందున దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకున్నట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. 2017 అక్టోబర్ 9: కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తన కుమార్తెను చేర్పించేందుకు లండన్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో కార్తీ పిటిషన్ వేశారు. అక్కడ ఏ బ్యాంకుకూ వెళ్లబోనని అందులో పేర్కొన్నారు. 2017 అక్టోబర్ 9: బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే తనను, తన కుమారుడిని వేధిస్తోందంటూ చిదంబరం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2017 డిసెంబర్ 8: ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసులో సీబీఐ సమన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కార్తీ. 2018 జనవరి 31: తనతోపాటు మరికొందరిపై ఉన్న రెండు లుకౌట్ నోటీసులపై కార్తీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచింది. 2018 ఫిబ్రవరి 16: దేశ, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టటంలో సహకరించారంటూ కార్తీ చార్టెర్డ్ అకౌంటెంట్భాస్కరరామన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2018 ఫిబ్రవరి 24: సీబీఐ దర్యాప్తుతో తన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందనీ, వెంటనే నిలిపివేసేలా ఆదేశివ్వాలని సుప్రీంకోర్టులో చిదంబరం పిటిషన్ వేశారు. -
ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా ఆదాయపు పన్ను ఎగవేత, ఇతరత్రా ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీని 2 వారాలు పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ ఫిబ్రవరి 5న ప్రత్యేక న్యాయస్థానం ఇంద్రాణిని అరెస్ట్ చేయాని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే షీనాబోరా హత్యకేసులో నిందితురాలైన ఇంద్రాణి ఇదివరకే అరెస్టయి ముంబైలోని బైకుల్లా జైల్లో కస్టడీలో ఉంది. ఐఎన్ఎక్స్ మీడియా ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) నియమాలను ఉల్లంఘించి మారిషస్ నుంచి పెట్టుబడులు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి.మనీ లాండరింగ్ విషయంలో ఐఎన్ఎక్స్ మీడియా అధిపతి పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణిపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. కాగా, 2012 ఏప్రిల్ 23న జరిగిన షీనా బోరా హత్యకు గురికాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్ గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పిన విషయం తెలిసిందే.షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
'పూడ్చి పెట్టకముందు.. పెట్టిన తర్వాత ఫోన్ చేసింది'
సాక్షి, ముంబయి : దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు మరోసారి తేటతెల్లమైంది. స్వయంగా పీటర్ ముఖర్జియానే షీనా హత్యకు ప్లాన్ చేయించారా అనే కోణంలో కూడా కేసు మలుపు తిరగనుంది. ఎందుకంటే ఆ రోజు హత్య చేసిన తర్వాత షీనాను పూడ్చి పెట్టిన ప్రాంతం నుంచి పీటర్‌కు ఇంద్రాణి ఫోన్ చేసినట్లు ఆమె డ్రైవర్ ఈ కేసులో అప్రూవర్ అయిన శ్యామ్వర్ రాయ్ చెప్పాడు. దీంతో పీటర్‌కు తెలిసే ఈ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. 2012 ఏప్రిల్ 23న షీనా బోరా హత్య జరిగిన విషయం తెలిసిందే. ఇంద్రాణి తన మాజీ భర్త, డ్రైవర్ శ్యామ్వర్రాయ్తో కలిసి కన్న కూతురునే కడతేర్చింది. ఈ హత్య ఘటన దేశంలో సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన సాక్షి శ్యామ్వర్ రాయ్ అప్రూవర్‌గా మారి ప్రస్తుతం సీబీఐకు సహకరిస్తున్నాడు. అయితే, పీటర్ తరపు న్యాయవాది ప్రస్తుతం శ్యామ్వర్ రాయ్ వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ఆయనకు శ్యామ్ ఈ విషయాలు వెల్లడించాడు. ఆ రోజు ఇంద్రాణి రెండుసార్లు పీటర్‌కు ఫోన్ చేశారని, హత్య చేసిన తర్వాత పూడ్చిపెట్టేందుకు వెళ్లే సమయంలో ఓసారి, పూడ్చిపెట్టిన తర్వాత మరోసారి రెండుసార్లు ఫోన్ చేసినట్లు తెలిపాడు. తనకు కూడా పనిబాగా పూర్తి చేశావంటూ కితాబిచ్చారని వెల్లడించాడు. -
‘ఆ ఆరుగురిపై చర్యలెందుకు లేవు?’
చెన్నై: విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శులపై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో గత 2006లో ముంబైలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థను పారిశ్రామికవేత్త పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలు నిర్వహించారు. ఆ సమయంలో కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కుమారుడు కార్తీ చట్టవిరుద్ధంగా ఐఎన్ఎక్స్ సంస్థకు అనుమతి ఇప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా సదరు సంస్థ నుంచి కార్తీ చిదంబరం లంచాలు తీసుకున్నట్లు, ఆ సంస్థను పరోక్షంగా తన కట్టడిలో ఉంచుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. గత మే నెలలో దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ కార్తీ చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ ముంబై, ఢిల్లీలోగల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపింది. ఇలా వుండగా శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్తీ చిదంబరంను వెతుకుతున్న నేరస్థునిగా ప్రకటించడంతో ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి ఎం.దురైసామి ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది. అనంతరం కేసు విచారణను ఆగస్టు ఏడవ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అయితే, ఈ విషయంతో సంబంధం ఉన్న ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శులపై మాత్రం చర్యలెందుకు తీసుకోలేదని చిదంబరం కేంద్రాన్ని నిలదీశారు. -
పెట్రోల్ పోసేముందు లిప్‌స్టిక్ పెట్టి జుట్టుకట్టింది
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ దిమ్మతిరిగే విషయాలు చెప్పాడు. షీనాను ఇంద్రాణి ఎలా చంపేశారో పూసగుచ్చినట్లు ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించారు. షీనాను గొంతునులిమి చంపిన తర్వాత ఇంద్రాణి ఆమె ముఖంపై కూర్చుని 'ఇదిగో నీ ఫ్లాట్ ఇక్కడే ఉంది. ఇక జరిగిన విషయాలు ఎవరితో చెప్పకు.. చెబితే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని ఇంద్రాణి బెదిరించినట్లు వివరించాడు. షీనా బోరా కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్‌ఖన్నాను అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం నాటి విచారణ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో షీనాను హత్య చేసిన విధానం వివరించాడు. 'ఏప్రిల్ 24, 2012న షీనాబోరాను కారులో తీసుకెళ్లాం. దారిలో మెడిసిన్ కాక్ టెయిల్, ఆల్కహాల్ ఇచ్చాం. సరిగ్గా అప్పుడు ఇంద్రాణి ఆమెకు ఎదురుగా కూర్చుంది. వెనుకాలే కూర్చున్న ఇంద్రాణి మాజీ భర్త షీనా జుట్టును గట్టిగా పట్టుకోగా ఒక్కసారిగా ఇంద్రాణి ఆమె గొంతును నులిమింది. దీంతో ఆర్తనాదాలు చేసే ప్రయత్నం చేస్తుండగా నేను నోరు మూశాను. ఆ సమయంలో ఆమె నా బొటన వేలిని కొరికింది. కొద్ది సేపట్లోనే ఆమె ప్రాణం పోయింది. ఆ తర్వాత ఆమె మృతదేహంతో వెళ్లే సమయంలోనే కారులో షీనా ముఖంపై కూర్చున్న ఇంద్రాణి 'ఇదిగో ఇక్కడే ఉంది నీ ఫ్లాట్' అంటూ నాకు ఇవ్వాల్సిన ఫ్లాట్‌ను గుర్తు చేసింది. అనంతరం అడవిలోకి వెళ్లాం. ఆ సమయంలో షీనా పెదాలకు లిప్‌స్టిక్ రాసి జుట్టుకట్టింది. ఆ తర్వాత పెట్రోల్పోయగా ఆమె నిప్పంటించింది. వెంటనే తిరిగొచ్చి దారిలో కాఫీ తాగాం. అప్పుడే ఈ విషయం మర్చిపోవాలని నాకు వార్నింగ్ ఇచ్చారు' అని శ్యామ్వర్ రాయ్ కోర్టుకు వివరించాడు. -
షీనా బోరా హత్య కేసులో సంచలన విషయాలు
-
ఆమెను కొట్టినమాట నిజమే!
ముంబై: మాజీ మీడియా అధిపతి ఇంద్రాణి ముఖర్జియా శరీరంపై తీవ్ర గాయాలు ఉన్న విషయం నిజమేనని, ఆమె చేతిపై, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని వైద్య నివేదిక స్పష్టం చేసింది. ముంబైలోని బైకుల్లా జైలు సిబ్బంది తనపై దాడిచేసి తీవ్రంగా కొట్టారని కోర్టులో ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కూతురు షీనాబోరా హత్యకేసులో ప్రధాని నిందితురాలిగా బైకులా జైలులో ఇంద్రాణి గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇదే జైలులో తోటి మహిళ ఖైదీ మంజుల మృతిపై ఆమె కోర్టులో సాక్ష్యం తెలిపారు. తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే.. మంజులకు పట్టిన గతే నీకు పడుతుందని జైలు అధికారులు తనను హెచ్చరించినట్టు చెప్పారు. తనపై జైలు సిబ్బంది దాడి చేశారని తెలిపారు. మహిళా ఖైదీ మంజుల షెత్యేపై జైలు సిబ్బంది కిరాతకంగా వ్యవహరించి.. ఆమె మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జైలు సిబ్బందిపై నాగపాద్ పోలీసులు కేసు నమోదుచేశారు. చదవండి: మహిళా ఖైదీపై అత్యంత క్రూరత్వం.. -
‘గొంతుకు చీర బిగించి ఈడ్చుకెళ్తుంటే చూశాను’
ముంబయి: ముంబయిలోని బైకుల్లా జైలులో చోటు చేసుకున్న దారుణాన్ని బుధవారం ఇంద్రాణి ముఖర్జియా కోర్టుకు వివరించారు. జైలు అధికారులు మంజులా షెట్యి అనే ఖైదీపట్ల ఎంత అనుచితంగా ప్రవర్తించారో వెల్లడించారు. కోడిగుడ్లు దొంగిలించిందనే కారణంతో మంజులా అనే ఖైదీని ఆ జైలు సూపరింటెండెంట్ చాలా దారుణంగా కొట్టడమే కాకుండా బ్యాటన్‌తో లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె చనిపోవడంతో జైలులో పెద్ద ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ఇంద్రాణిపై కూడా జైలు అధికారులు దాడి చేసినట్లు ఆమె తరుపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేయడంతో ఆమెను కోర్టులో హాజరుపరచాల్సిందిగా బైకుల్లా జైలు అధికారులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం కోర్టులో హాజరైన ఇంద్రాణి ‘మా పక్క సెల్లోనే ఉంటున్న మంజుల గొంతుకు చీరను చుట్టేసి జైలు సూపరింటెండెంట్ అధికారిణి బయటకు ఈడ్చేసుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాన్ని నేను నా సహచర ఖైదీలం సెల్ తలుపు రంధ్రంలో నుంచి చూశాం. ఈ విషయం నేను ఎవరితోనైనా చెబితే నాకు అలాంటి గతే పడుతుందని హెచ్చరించారు. బాధితురాలపట్ల అమానవీయంగా ప్రవర్తిస్తుంటే నేను కళ్లారా చూశాను’ అని వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం తన కూతురు షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. -
‘ఇంద్రాణిని ఒకసారి తీసుకురండి’
ముంబయి: కూతురుని హత్య చేయించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియాను తమ ముందు హాజరుపరచాలని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం బైకుల్లా జైలు అధికారులను ఆదేశించింది. బుధవారం ఆమెను కోర్టుకు తీసుకురావాలని చెప్పింది. బైకుల్లా జైలులో జరిగిన అల్లర్లలో ఇంద్రాణిని జైలు సిబ్బంది వేధించారని, ఆమె ఒంటిపై, తలకు గాయాలు కూడా అయ్యాయని పేర్కొంటూ ఆమె తరుపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో తాజాగా లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకొని తోటి ఖైదీ మరణించడంతో తానిప్పుడు భయపడుతున్నానని, జైలులో తీవ్ర హింస జరుగుతుందని కూడా కోర్టుకు సమర్పించిన పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. మెదడుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న ఇంద్రాణికి ఏదైనా జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కూడా అందులో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారు చేస్తున్న ఆరోపణలు నిజమోకాదో తెలుసుకునేందుకు కోర్టుకు తీసుకురావాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. -
200మందితో కలిసి జైలులో ఇంద్రాణి రచ్చ
ముంబయి: కన్నకూతురుని హత్య చేయించిన కేసులో జైలులో ఉంటున్న ఇంద్రాణి ముఖర్జియా చాలా రోజుల తర్వాత వార్తల్లోకి వచ్చారు. ఆమె ప్రస్తుతం ఉంటున్న జైలులో నానా హంగామా చేశారు. 200మంది తోటి ఖైదీలతో కలిసి జైలులో ఆందోళనకు, అల్లరికి పాల్పడ్డారు. ఈ క్రమంలో జైలులోని సామాన్లు ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని కూడా గాయపరిచారు. దీంతో ఆమెను ఇతర ఖైదీలను అదుపులోకి తీసుకొని మరోసారి తాజా అభియోగాలు నమోదు చేశారు. కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రస్తుతం ఇంద్రాణి ముఖర్జియా ముంబయిలోని బైకుల్లా జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ జైలులోని మంజురా షెట్యే అనే ఒక ఖైదీని ఓ పోలీసు అధికారిణి తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ అంశంపై నిన్న శనివారం ఉదయం నుంచి జైలులోని మహిళా ఖైదీలంతా కూడా ఆందోళన చేయడం మొదలుపెట్టారు. చాలామంది జైలు పైకి ఎక్కి వార్తా పేపర్లను తగులబెడుతూ జైలు అధికారుల వ్యతిరేక నినాదాలు ఇచ్చారు. ఇందులో మొత్తం 251మంది ఖైదీలు ఉండగా వారిలో 200మంది ఆందోళనకు దిగారు. వీరిలో ఇంద్రాణి ముఖర్జియా కూడా ఉండటంతో ఆమెపై కూడా కేసులు నమోదు చేశారు. -
షీనా బోరా కేసులో మరో ట్విస్టు!
ముంబై: దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా (24) హత్య కేసులో మరో ట్విస్టు ఇది. షీనా హత్యకు గురైన ఐదేళ్ల తర్వాత ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, సవతి తండ్రి పీటర్ ముఖర్జియాలపై సీబీఐ హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు కూడా దాఖలైంది. చార్జిషీటుపై పసీబీఐ ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక కోర్టులో విచారణ కూడా మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రాహుల్ ముఖర్జియా తండ్రి పీటర్ ముఖర్జియాకు మద్దతు పలికాడు. ఆయన నిర్దోషి అని, ఆయనకు షీనా హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. తన కూతురైన షీనాకు, సవతి కొడుకైన రాహుల్ మధ్య అనుబంధం ఉండటం.. అది తనకు గిట్టకపోవడం వల్లే ఆమెను ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ తన తండ్రికి మద్దతు పలుకడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2012 ఏప్రిల్ నెలలో షీనాను కారులో ముంబై శివార్లకు తీసుకెళ్లిన ఇంద్రాణి.. తన మాజీ భర్త, డ్రైవర్ల సహాయంతో ఆమెను పీకనులిమి చంపేసిందని ఆరోపణలున్నాయి. సగం కాలిన స్థితిలో ఉన్న షీనాబోరా మృతదేహం 2015 సంవత్సరంలో ముంబై సమీపంలోని అడవుల్లో దొరికింది. అదే సంవత్సరం ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టుచేశారు. -
‘ఆయన నుంచి విడాకులు కావాలి’
ముంబై: షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్. ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జియా నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. విడాకులకు దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనికి ట్రయల్ కోర్టు అనుమతి అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. షీనా బోరా హత్య కేసులో తనను పీటర్ ఇరికించారని భావిస్తున్న ఇంద్రాణియా ఆయన నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ఆమె తన మొదటి నుంచి సంజీవ్ ఖన్నా నుంచి విడిపోయారు. తర్వాత మీడియా ప్రముఖుడు పీటర్ ముఖర్జియాను పెళ్లాడారు. పీటర్, మాజీ భర్తతో కలసి సొంత కూతురు షీనా బోరాను హత్య చేసినట్టు ఇంద్రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం చార్జిషీటు దాఖలైంది. ఫిబ్రవరి 1 నుంచి కోర్టులో విచారణ మొదలవుతుంది. -
షీనా బోరా హత్యకేసులో మరో మలుపు
-
షీనా బోరా హత్యకేసులో మరో మలుపు
షీనాబోరా (24) హత్య జరిగిన ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, సవతి తండ్రి పీటర్ ముఖర్జియాలపై హత్య, నేరపూరిత కుట్ర ఆరోపణలు మోపారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలైంది. వీటిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విచారణ మొదలవుతుంది. ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా మీద షీనా సోదరుడు మిఖాయిల్ బోరా మీద హత్యాయత్నం చేసిన నేరం మోపారు. తన సోదరి అదృశ్యం కావడం గురించి పదే పదే ప్రశ్నలు అడగడం వల్లే అతడిని చంపాలని ఇంద్రాణి భావించినట్లు సీబీఐ తెలిపింది. ఈ కేసులో నాలుగో నిందితుడైన శ్యామ్వర్ రాయ్ కూడా హత్యకు సహకరించినా, ఆ తర్వాత అతడు సీబీఐకి అప్రూవర్‌గా మారిపోయాడు. ఆస్తి వివాదంలోనే షీనాబోరాను ఇంద్రాణి హతమార్చిందని సీబీఐ ఆరోపించింది. ఈ హత్య ప్లాన్ మొత్తం పీటర్‌కు బాగా తెలుసని చెప్పింది. 2012 ఏప్రిల్ నెలలో షీనాను కారులో ముంబై శివార్లకు తీసుకెళ్లిన ఇంద్రాణి.. తన మాజీ భర్త, డ్రైవర్ల సహాయంతో ఆమెను పీకపిసికి చంపేసిందని ఆరోపణలున్నాయి. సగం కాలిన స్థితిలో ఉన్న షీనాబోరా మృతదేహం 2015 సంవత్సరంలో ముంబై సమీపంలోని అడవుల్లో దొరికింది. అదే సంవత్సరం ఆగస్టులో ఇంద్రాణిని అరెస్టుచేశారు. -
ఆ హత్య గురించి రెండోభర్తకు తెలుసట!
కన్నకూతురు షీనా బోరాను ఇంద్రాణి చంపుతున్న విషయం.. ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీకి పూర్తిగా తెలుసునట. ఈ విషయాన్ని పేర్కొంటూ ఈ సంచలనాత్మక హత్యకేసులో సీబీఐ రెండో అనుబంధ చార్జిషీటు దాఖలుచేసింది. తనకు ఈ హత్య గురించి ఏమీ తెలియదని ఇంతకుముందు పీటర్ వాదించినా.. హత్య నుంచి మృతదేహాన్ని తరలించడం ప్రతి విషయంలోనూ అతడి పాత్ర కూడా ఉందని సీబీఐ తాజా చార్జిషీటులో పేర్కొంది. అతడిపై నేరారోపణ మోపడంపై వాదనలు శనివారం ప్రారంభం కానున్నాయి. 2012 ఏప్రిల్ నెలలో షీనాబోరా (24)ను కారులో గొంతు నులిమి చంపేశారు. ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె మాజీ డ్రైవర్ శ్యామవర్ రాయ్ తదితరుల హస్తం ఇందులో ఉందని ఆరోపణలొచ్చాయి. తర్వాత ఆమె మృతదేహాన్ని పొరుగున ఉన్న రాయగడ్ జిల్లాలోని ఓ అడవిలో పారేశారు. ఆ ముగ్గురినీ గత సంవత్సరం ఆగస్టు నెలలో అరెస్టు చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి శ్యామ్వర్ రాయ్‌ని అరెస్టుచేసి విచారించినప్పుడు అతడు బయటపెట్టడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. తర్వాతి నుంచి అతడు అప్రూవర్‌గా మారాడు. పీటర్ ముఖర్జీతో తన సంబంధం విషయం తెలియని షీనాబోరా.. అతడి కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుందని, అదే జరిగితే ఆమెకు ఆస్తిలో చాలా భాగం వెళ్లిపోతుందన్న భయంతోనే ఇంద్రాణి ఆమెను చంపడానికి ప్లాన్ వేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. -
సంచలన కేసులో నేడే వాదోపవాదాలు
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుకు సంబంధించి కోర్టులో విచారణ నేడు ప్రారంభంకానుంది. ముంబయి కోర్టులో ఈ విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియాతోపాటు ఆమె భర్త పీటర్ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్ ఖన్నా తరుపునుంచి వాదోపవాదాలు కోర్టు నేడు విననుంది. మరోపక్క, ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ఇంద్రాణి డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారి కీలక సాక్ష్యం ఇచ్చేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. అతడి తరుపునుంచి కూడా న్యాయవాది వాదనలు కోర్టు రికార్డు చేసుకోనుంది. 2012లో తన కూతురు అయిన షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా దారుణంగా హత్య చేయించింది. స్వయంగా తాను కూడా ఈ హత్యలో పాల్గొన్నది. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటికే అందరిని విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసి కోర్టుకు అందించింది. సీబీఐ చార్జిషీట్ ప్రకారం కుటుంబ ఆస్తి తగాదాల కారణంగానే షీనాని హత్య చేశారు. ఇంద్రాణి ఆమె మాజీ భర్తకు కలిగిన సంతానమే షీనా. అయితే, మాజీ భర్త సంజీవ్ తో విడిపోయిన ఇంద్రాణి అనంతరం పీటర్ ముఖర్జియాను వివాహం చేసుకొంది. పీటర్ కొడుకు రాహుల్ కు తన కూతురును సొంత చెల్లిగా పరిచయం చేసింది. దీంతో అతడు షీనాతో సంబంధం పెట్టుకున్నాడు. ఇదంతా కూడా భవిష్యత్తులో ఆస్తి తగాదాలకు దారి తీస్తుందని, అసలుకే మోసం వస్తుందని గ్రహించిన ఇంద్రాణి పథకం ప్రకారం 2012 ఏప్రిల్ 24న హత్య చేసి ఆమె మృతదేహాన్ని రాయ్ గఢ్ లోని అటవీ ప్రాంతంలో పాతిపెట్టించగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. -
ఒకప్పుడు హై ప్రొఫైల్ .. ఇప్పుడు జైలు లైఫ్
-
మా ఆయనకు అమ్మాయిల పిచ్చి!
షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితుడు పీటర్ ముఖర్జియా విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని కూడా అతడి మాజీ భార్య షబ్నమ్ సింగ్ తెలిపారు. పీటర్ ముఖర్జియాకు వయసులో ఉన్న అమ్మాయిలంటే పిచ్చి అని ఆమె చెప్పారు. ‘‘పీటర్‌కు అసలు నైతిక విలువలు అనేవి లేవు. అతడి చుట్టూ ఎప్పుడూ వయసులో ఉన్న అమ్మాయిలు ఉండాల్సిందే. లేట్ నైట్ పార్టీలంటే అతడికి చాలా ఇష్టం. అతడి జీవితంలో చాలామంది మహిళలున్నారు. అసలు అందుకే నేను విడాకులు తీసుకున్నాను’’ అని ఆమె పోలీసు విచారణలో వెల్లడించారు. ఆమె చాలా కాలం క్రితమే ఈ విషయాలను సీబీఐకి చెప్పినా, ఇన్నాళ్ల పాటు ఆ ప్రకటన కాపీలను రహస్యంగా ఉంచారు. వాటిని ఇటీవలే పీటర్ తరఫు న్యాయవాది మిహిర్ ఘీవాలాకు, ఇంద్రాణి ముఖర్జియా తరఫు న్యాయవాది గంజన్ మంగ్లాకు అప్పగించారు. కాగా, షబ్నమ్ సింగ్ వెల్లడించిన విషయాల్లో ఈ కేసుకు సంబంధం లేని మరో అంశం కూడా ఉంది. అయితే.. ఆ విషయం బయటకు వస్తే సంబంధిత వ్యక్తి పరువు ప్రతిష్ఠలు మంటగలుస్తాయని అంటున్నారు. పీటర్ గురించి సంచలన విషయాలు వెల్లడించడంతో షబ్నమ్ సింగ్‌కు భద్రత కల్పించాలని ప్రత్యేక కోర్టు జడ్జి హెచ్ఎస్ మహాజన్ ఆదేశించారు. తాను ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు.. పీటర్ తన ఇంటికి వస్తానన్నాడని, అప్పుడు వేరే అమ్మాయితో వచ్చాడని ఆమె చెప్పారు. ఆ వచ్చిన మహిళను తన గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేశాడని.. ఆమె పేరు ఇంద్రాణి అని తన వాంగ్మూలంలో తెలిపారు. అప్పుడే ‘నువ్వు బాగుపడవు’ అని పీటర్‌తో అన్నానన్నారు. ఇంద్రాణి గత చరిత్ర గురించి తెలిసి కూడా పీటర్ ఆమెను పెళ్లి చేసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందని చెప్పారు. -
భర్తతో కుట్ర పన్ని, మాజీ భర్తతో కలసి..
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. షీనా హత్యకు మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియా కుట్ర పన్నారని సీబీఐ కోర్టుకు నివేదించింది. ఇంద్రాణి ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జియాతో కలసి కూతురు షీనా హత్యకు కుట్ర చేసిందని సీబీఐ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ఇంద్రాణి .. తన రెండో భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌తో కలసి షీనాను హత్య చేసినట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే. పీటర్ కొడుకు రాహుల్‌తో షీనా బోరా లవ్ ఎఫైర్‌ను ఇంద్రాణి, పీటర్ వ్యతిరేకించారని, ఆమె హత్యకు కుట్ర పన్నారని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో పీటర్‌కు బెయిల్ ఇవ్వవద్దంటూ సీబీఐ కోర్టుకు విన్నవించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, పీటర్‌కు బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేసే అవకాశముందని కోర్టుకు తెలియజేసింది. న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. గతేడాది నవంబర్‌లో పీటర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంద్రాణిని, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌లను కూడా అరెస్ట్ చేశారు. ఎన్నో మలుపులు తిరిగిన షీనా హత్య కేసులో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగు చూశాయి. ఇంద్రాణికి మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం షీనా కాగా, పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్. ఇంద్రాణికి పీటర్ మూడో భర్త. షీనా, రాహుల్ ప్రేమలో పడటాన్ని ఇంద్రాణి, పీటర్ తీవ్రంగా వ్యతిరేకించారు. షీనా హత్యకు ఇంద్రాణి, పీటర్ కుట్రపన్నారని సీబీఐ కోర్టుకు నివేదించింది. ఇంద్రాణి .. రెండో భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌తో కలసి 2012 ఏప్రిల్‌లో షీనాను హత్య చేశారు. -
'ఆ రోజు గట్టి హగ్.. గాఢమైన ముద్దు ఇస్తాను'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు ఆమె భర్త, తాను కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉంటున్న పీటర్ ముఖర్జియా ఓ ఘాటు ప్రేమ లేఖ రాశారు. ఈ ఏడాది జనవరిలో తన భార్య ఇంద్రాణి పుట్టిన రోజు సందర్భంగా జైలులో ఉన్న ఆమెకు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలతోపాటు తన ప్రేమను రంగరించి ఓ లేఖ పంపించారు. 'నీవు ఒక రోజు నీ అమాయకత్వాన్ని నిరూపించుకోగలవు. నేను కూడా నీ తరుపున ప్రార్థిస్తున్నాను. ఈ పీడకల నిన్ను వదిలి మంచి రోజు నీకు వస్తుంది' అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే ఒకరినొకరు పలకరించుకుంటున్నారని, గత నెలలో ఆమె పుట్టిన రోజుకు సంబంధించి స్వీట్లు కూడా తినిపించుకున్నారని అధికార వర్గాల సమాచారం. ఆయన స్వయంగా తన చేతి రాతతో జనవరి 3న ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖను ఎలా ప్రారంభించారంటే.. 'ముమూ మై డియరెస్ట్.. ఈ రోజు నీ జీవితంలో ప్రత్యేకమైన రోజు.. నా కైతే ఇంకా చాలా ప్రత్యేకం. మనం కలిసినప్పటి నుంచి నీ ప్రతి పుట్టిన రోజును కలిసే జరుపుకున్నాం. కానీ ఈ ఏడాది మాత్రం చాలా దగ్గరగా ఉన్నా ఎంతో దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేవుడు చాలా గొప్పవాడు. దీనికి త్వరలోనే ముగింపు ఇస్తాడు. మనిద్దరం ఏం చక్కా రోమియో జులియెట్ లాగా త్వరలోనే ఒకరినొకరం తిరిగి కలుసుకుంటాం. అది కోర్టు ప్రాంగణం కావొచ్చు.. నివాసం కావొచ్చు. నీకు ఎదురైనప్పుడు మాత్రం బాధ మొత్తం పోయేలా మంచి సంతోషాన్ని ఇస్తాను. నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంక్షిప్త లేఖ ద్వారా నేను నిన్ను ఇలా చేరుకుంటున్నాను. కానీ, నీ రోజంటూ వచ్చిన తర్వాత ఒక గట్టి కౌగిలి.. గాఢమైన ముద్దు ఇస్తాను' అంటూ ఆ లేఖలో రాశారు. -
ఇంద్రాణికి మరోసారి చుక్కెదురు
ముంబయి: కన్నకూతురు షీనాబోరాను హతమార్చిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జీయాకు మరోసారి చుక్కెదురు అయింది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. అవసరం అయితే ఇంద్రాణీ ప్రయివేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చేందుకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది. కాగా తన ఆరోగ్యం బాగోలేదని, బలహీనత కారణంగా తాను కళ్లు తిరిగి పడిపోతున్నానని, తనకు బెయిల్ మంజూరు చేస్తే ఆసుపత్రిలో చూపించుకుంటానని ఇంద్రాణీ ముఖర్జీయా బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
'నా భార్యకు ఆశ ఎక్కువ'
ముంబై: తన భార్య ఇంద్రాణి అత్యాశపరురాలని ఆమె భర్త పీటర్ ముఖర్జియా పేర్కొన్నారు. తన కోర్కెలను నెరవేర్చుకోవడం కోసం సొంత పిల్లలను త్యాగం చేసిందని, వదులుకుందని విరుచుకుపడ్డారు. ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్య కేసులో రెండోసారి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ లో తొలిసారిగా భార్యకు వ్యతిరేకంగా ఆయన ఆరోపణలు చేశారు. 60 ఏళ్ల పీటర్ ముఖర్జియా షీనా బోరా హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్నారు. తన ప్రతిభాసామర్థ్యాలతో ఉన్నతస్థితికి ఎదిగి సమాజంలో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న తాను ఇంద్రాణి మాయలో పడి చివరికి జైలుపాలయ్యానని బెయిల్ పిటిషన్ లో పీటర్ వాపోయారు. 2012 నాటి షీనా బోరా కేసులో వీరిద్దరితో పాటు ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామవర్ రాయ్ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 31న విచారణకు రానుంది. గత నెలలో పీటర్ ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. -
'స్పృహ కోల్పోతున్నాను.. బెయిల్ ఇవ్వండి'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెలాఖరు వరకు (మార్చి 31)వాయిదా వేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం వెలువరించింది. తన ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆస్పత్రిలో చూపించుకునేందుకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ గత ఫిబ్రవరి నెలలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల బలహీనత కారణంగా తాను తరుచూ కళ్లు తిరిగి పడిపోతున్నానని పిటిషన్ లో పేర్కొంది. కన్న కూతురుని దేశం నివ్వెరపోయేలా ఇంద్రాణి హత్య చేసిన విషయం తెలిసిందే. -
మరోసారి ఇంద్రాణిపై జైల్లోనే ప్రశ్నల వర్షం
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో నిందితులను మరోసారి విచారించేందుకు సీబీఐకి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా, మరో ఇద్దరు నిందితులను మరోసారి జైలులోనే సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. 'మేం ఇంద్రాణిని, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను, ఆమె డ్రైవర్ శ్యాం రాయ్‌ని మరోసారి జైలులోనే విచారించాలని అనుకుంటున్నాము' అని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అందుకు కోర్టు అనుమతిచ్చినట్లు చెప్పారు. -
విధీ కోసం ఇంద్రాణికి ప్రత్యేక అనుమతి
ముంబై: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియాకు సీబీఐ న్యాయస్థానం ప్రత్యేక అనుమతులిచ్చింది. ఇంద్రాణి రెండో కూతురు విధీ చదువుల నిమిత్తం చెక్కులపై సంతకాలు చేసేందుకు ఓకే చెప్పింది. రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో నిందితులు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, శ్యామ్ రాయ్ లను సీబీఐ అధికారులు సోమవారం కోర్టులో హాజరుపర్చారు. జనవరి 16 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన కోర్టు.. చెక్కులపై సంతకాలకు కూడా అనుమతించింది. కోర్టు హాలు బయట ఇంద్రాణి- విధీలు కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తల్లీకూతుళ్లు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. విచారణ అనంతరం తిరిగి జైలుకు వెళ్లేందుకు పోలీస్ వ్యాన్ ఎక్కిన సందర్భంలోనూ ఇరువురూ భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు జైలు తిండి తనకు పడటంలేదని, ఇంటినుంచి భోజనం తెప్పించుకుంటానన్న సంజీవ్ ఖన్నా అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. విధీ.. ఇంద్రాణి- సంజీవ్ ఖన్నాల కూతురు. -
కూతుర్ని చంపి పార్టీ చేసుకున్నారట!
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరిన్ని దిగ్ర్భాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీబీఐ విచారణలో భాగంగా సంజీవ్ ఖన్నా స్నేహతుడు, వ్యాపారవేత్త మంగలేష్ జలన్ (60)ను ప్రశ్నించారు. ఈ క్రమంలో షీనా హత్య తరువాత, ఆమె మృతదేహాన్ని ముంబైకి తరలించే ముందు కోలకత్తాలో్ని ఒక ప్రముఖ క్లబ్ లో మందు పార్టీ చేసుకున్నారని తెలిపారు. సీబీఐకి సమర్పించిన చేతిరాతలో ఉన్న ఒక పేజీ రిపోర్టులో ఆయన కీలకమైన విషయాలను వెల్లడించారు. షీనా హత్య తరువాత ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా ఏప్రిల్ 25న కోలకత్తా క్రికెట్ అండ్ ఫుట్‌బాల్ క్లబ్ లో పార్టీ చేసుకుంటూ చాలా ఉత్సాహంగా కనిపించారన్నారు. ఇద్దరూ మద్యం తాగుతూ కులాసాగా, సంతోషంగా ఉండడడాన్నిగమనించిన తాను ఖన్నాను ప్రశ్నించానన్నారు. ముంబైలో ఉన్న తన కూతురు విధిని చూడ్డానికి వెళుతున్నానంటూ ఖన్నా ఉత్సాహంగా చెప్పారన్నారు. సీసీ అండ్ ఎఫ్‌సీ లో చాలా సీనియర్ సభ్యుడైన ఖన్నా తనకు 30 ఏళ్లుగా తెలుసనన్నారు. కానీ ఇంద్రాణితో తనకు పెద్దగా పరిచయంలేదని జలన్ సీబీఐతో చెప్పారు. కాగా షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ లను సీబీఐ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. అనంతరం ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను కూడా నిందితునిగా పేర్కొంటూ రిమాండ్ చేసింది. తల్లీకూతుళ్ల మధ్య తగాదాలు, బెదిరింపులు, ఆస్తి వివాదాలు, రాహుల్‌తో ప్రేమ వ్యవహారం నచ్చని ఇంద్రాణి ముఖర్జీ.. షీనా హత్యకు పథకం వేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన సీబీఐ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సంజీవ్ ఖన్నా స్నేహితుడును జలన్ కూడా విచారించింది. ఆయన ఇచ్చిన కీలక సమాచారంతో్ షీనాబోరా హత్య కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. -
వాళ్లు ఎలా కలిశారు?.. ఎవరు విడదీశారు?
ముంబై: రాహుల్ ముఖర్జీయా, షీనా బోరా విధివంచిత ప్రేమికులు. వారు ఎప్పుడు తొలిసారి కలుసుకున్నారు? ఎలా ప్రేమలో పడ్డారు? నిశ్చితార్థం జరిగిన తర్వాత విషాదకర పరిస్థితుల్లో ఎలా వేరయ్యారు? 2012లో షీనాబోరా దారుణ హత్యకు ముందు జరిగిన సంఘటనలేమిటి? అప్పటి పరిణామాలన్నింటినీ రాహుల్ ముఖర్జీయా పోలీసులకు పూస గుచ్చినట్టు వివరించాడు. తమ ప్రేమబంధం గురించి తెలుసుకొని షీనాబోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీయా తీవ్రంగా నిస్పృహకు లోనైందని తెలిపాడు. అకస్మాత్తుగా షీనాబోరా కనిపించకపోవడం తనను మానసికంగా కుంగదీసిందని, ఆమె మిస్సింగ్ వెనుక ఇంద్రాణి ప్రమేయం ఉండవచ్చునని అనుమానించానని రాహుల్ చెప్పాడు. షీనాబోరా హత్యకేసులో ప్రధాన హంతకురాలిగా మీడియా అధిపతి పీటర్ ముఖర్జీయా రెండో భార్య ఇంద్రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఎప్పుడూ కలిశారు? 2008లో రాహుల్ ముంబై వర్లిలోని మార్లో అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న తన తండ్రి పీటర్ ముఖర్జీయా నివాసానికి మారాడు. అప్పడే షీనాను తొలిసారి చూశాడు. 'వర్లీ ఫ్లాట్‌లోనే నేను తొలిసారి షీనాను చూశాను. ఆ తర్వాత మేం తరచూ కలుసుకున్నాం. ఇది మా మధ్య సన్నిహిత స్నేహాన్ని ఏర్పరిచింది' అని రాహుల్ పోలీసులకు ఇచ్చిన తన వాంగ్మూలంలో తెలిపాడు. ఆ తర్వాత నెల రోజులకే తాను లండన్ వెళ్లానని, అక్కడ కొన్నాళ్లు ఉండిన తర్వాత మళ్లీ ముంబై వచ్చానని చెప్పాడు. అయితే ఈసారి ఇంట్లో ఉండకుండా వేరే చోట ఉండాలని పీటర్‌తో ఇంద్రాణి చెప్పించిందని, దీంతో తాను ఖార్దండలో ఫ్లాట్ తీసుకున్నానని తెలిపాడు. మొదటిసారి అప్పుడే చెప్పింది..! యావత్ ప్రపంచం అనుకుంటున్నట్టు తాను ఇంద్రాణి సోదరిని కాదని, ఆమె కూతురినని ఓరోజు స్వయంగా షీనాబోరానే చెప్పిందని రాహుల్ పోలీసులకు తెలిపాడు. 'నా తండ్రి సహకారంతో నేను ప్రైమ్ ఫొకస్లో ఉద్యోగం సంపాదించాను. షీనాను కూడా తరచూగా కలుస్తుండేవాణ్ని. క్రమంగా మేం ప్రేమలో పడిపోయాం. ఒక రోజు తను వచ్చి 'నేను ఇంద్రాణి చెల్లెల్ని కాదు కూతరిని' అని చెప్పింది. మా అనుబంధం గురించి ఇంద్రాణికి తెలియడంతో తను కోపాద్రిక్తురాలైంది. ఈ విషయమై నా తండ్రితో తను కోట్లాడింది. వెంటనే షీనాను గువాహటి పంపించింది' అని రాహుల్ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత 2009లో షీనాను ఢిల్లీకి పంపించారు. అక్కడ తీవ్ర అనారోగ్యంతో తను ఆస్పత్రి పాలైంది. ఆస్పత్రిలో ఉన్న ఆమెను ఇంద్రాణి, ఆమె మాజీ ప్రియుడు పరామర్శించారు. ఆ తర్వాత ఇంద్రాణి ఒత్తిడి మేరకు బెంగళూరు వచ్చిన షీనా బోరా.. ఇంద్రాణి మాజీ ప్రియుడితో కొంతకాలం ఉంది. 'ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదు. ఇంట్లోని వస్తువులన్ని అమ్మి బెంగళూరు వెళ్లి షీనాను కలుసుకున్నాను. ఆమె తన చాలా బలహీనంగా ఉంది. మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందే ఔషధాలను వేసుకోమని ఇంద్రాణి షీనాకు ఇచ్చింది. ఆ ఔషధాలను వైద్యుడికి చూపిస్తే వాటిని వెంటనే మానేయాలని మాకు సూచించాడు. ఆ మందులు తీసుకోవడం మానిన తర్వాత ఆమె కోలుకుంది. షీనా తాత-నాయనమ్మ, మా అమ్మ అనుమతి తీసుకొని ఆమెను డెహ్రాడూన్‌లోని మా ఇంటికి తీసుకెళ్లాను' అని రాహుల్ తెలిపాడు. ఆ తర్వాత 2009 చివర్లో ఈ ప్రేమ జంట ముంబైకి వచ్చింది. షీనాకు ఉద్యోగం దొరికింది. అంధేరిలోని ఓ అద్దె ఇంట్లో ఇద్దరు మకాం వేశారు. ఈ విషయం తెలియడంతో పీటర్, ఇంద్రాణి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. 2011 అక్టోబర్‌లో రాహుల్, షీనా డెహ్రాడూన్ వెళ్లి నిశ్చితార్థం చేసుకున్నారు. షీనా తాత-నాయనమ్మ, రాహుల్ తల్లి అనుమతితో ఈ నిశ్చితార్థం జరిగింది. వారు మళ్లీ ముంబైకి రావడంతో నిశ్చితార్థం గురించి ఇంద్రాణికి తెలిసింది. ఈ సమయంలో ఆమె ఎంతో మారిన మనిషిలా కనిపించిందని రాహుల్ తెలిపాడు. షీనా ఎలా అదృశ్యమైంది? ఆ తర్వాత ఓసారి ఇంద్రాణి షీనాను డిన్నర్‌కు పిలిచింది. షీనా హత్యకు ముందురోజు కూడా ఆమెను ఇంద్రాణి డిన్నర్‌కు పిలిచింది. షీనాకు నిశ్చితార్థం కానుక ఇస్తానని చెప్పింది. హత్యకు ముందు రోజు 2012, ఏప్రిల్ 24న షీనాను నేను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చాను. ఆ రోజు ఇంద్రాణి పదేపదే ఫోన్ చేసింది. షీనా రావడానికి ఎంత సమయం తీసుకుంటుందని పదేపదే అడిగింది. ఆ తర్వాత ఇంద్రాణి చెప్పిన అడ్రస్‌కు మేం వెళ్లాం. అక్కడికి షెవ్రోలె కారులో ఇంద్రాణి, మరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు. డ్రైవర్ సీటులో శ్యామ్రాయ్ ఉన్నాడు' అని రాహుల్ వివరించాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా అని తేలింది. ఆ తర్వాత షీనా ఇక ఎప్పటికీ కనిపించలేదని, ఆమె ఫోన్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాలేదని రాహుల్ తెలిపాడు. ఆ తర్వాత ఓ రోజు ఆమె తన మొబైల్ నుంచి ఓ మెసెజ్ వచ్చిందని, తాను కొత్త ప్రేమికుడిని చూసుకున్నానని, అతనితో ఆనందంగా ఉన్నానని ఆ మెసెజ్‌లో పేర్కొని ఉందని రాహుల్ చెప్పాడు. షీనా మిస్సింగ్‌పై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని వివరించాడు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, ఆమె మాజీ డ్రైవర్ శ్యాంరావులకు వ్యతిరేకంగా రాహుల్ వాంగ్మూలం ఇచ్చాడు. పీటర్ పాత్ర ఏమిటి? షీనా హత్యకేసులో పీటర్ ముఖర్జీయా పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షీనా హత్య కుట్ర పీటర్‌కు తెలుసని పేర్కొంటూ సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. అయితే రాహుల్ మాత్రం ఒక్కసారి మాత్రమే తన వాంగ్మూలంలో పీటర్ పేరు ప్రస్తావించాడు. అంతకుమించి ఎలాంటి విషయాలు తెలుపలేదని తెలుస్తున్నది. పోలీసులు నమోదుచేసిన చార్జ్‌షీట్‌లోని ఈ వివరాలను మిడ్డే పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. -
'నా ఆనందం కోసం ఆలోచించావా?'
న్యూఢిల్లీ: 'రాహుల్‌తో నా జీవితం ఆనందంగా, భద్రంగా ఉంటుంది. తల్లిదండ్రులుగా నన్ను ప్రేమించేవారికి అంతకన్నా ఇంకేం కావాలి?'.. షీనా బోరా తన తల్లి ఇంద్రాణి ముఖర్జీయాకు రాసిన లేఖ ఇది. వరుసకు సవతి సోదరుడయ్యే రాహుల్‌తో షీనా బోరా డేటింగ్ చేస్తుండటంతో ఇంద్రాణి కుటుంబంలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఆ సమయంలో తన సొంత నిర్ణయాలు తాను తీసుకునేందుకు అనుమతించాలంటూ షీనా బోరా తల్లి ఇంద్రాణికి ఈమెయిల్ లేఖ రాసిందని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. 2012లో షీనాను ఇంద్రాణి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఈ హత్య ఘటనకు ముందే తల్లి ఇంద్రాణికి షీనా రాసిన లేఖలోని వివరాలను సీబీఐ వెల్లడించింది. ' నీ జీవితంలో నీకు ఏదైతే ఆనందం ఇస్తుందో అదే నువ్వు చేశావు. నాకు కూడా అంతే వర్తిస్తుంది. దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? నాలోను కొంతవరకు నీ లక్షణాలే ఉన్నాయి. నా జీవితాన్ని నేను వెతుక్కుంటాను. నువ్వు దాని గురించి కలతపడకు' అని షీనా తల్లిని ఉద్దేశించి లేఖలో పేర్కొంది. షీనా బోరా రాహుల్‌తో ప్రేమలో మునిగి ఉండటంతో వారిద్దరూ విడిపోవాల్సిందేనని ఇంద్రాణి ఒత్తిడి తెచ్చి ఉంటుందని, ఈ నేపథ్యంలోనే షీనా ఈ లేఖ రాసిందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు తన చిన్న కూతురు వైదేహీతో షీనా బోరా సన్నిహితంగా ఉండటం, తన భర్త, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీయాతో దగ్గరవుతుండటం కూడా ఇంద్రాణి సహించలేకపోయిందని, తన ఆస్తులను ఎక్కడ షీనా బోరా సొంతం చేసుకుంటుందోనని, వైదేహీని తనకు దూరం చేస్తుందేమోననే భావనతోనే ఇంద్రాణి ఆమె హత్యకు ఒడిగట్టి ఉండవచ్చునని దర్యాప్తు వర్గాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా సవతి తండ్రి పీటర్‌కు కూడా షీనా లేఖ రాసిందని, అందులో 'నా సమస్య ఇంద్రాణితోనే. అది నా వ్యక్తిగత విషయం. మీరు ఇంద్రాణికి ఈ విషయాన్ని చెప్పి ఒప్పించండి. అంతేకానీ నన్ను-రాహుల్‌ను దూషించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు' అని షీనా పేర్కొందని సీబీఐ తెలిపింది. -
ఇంద్రాణికి డెంగ్యూ!
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా డెంగ్యూతో బాధపడుతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. గత ఏడు రోజులుగా ఆమె డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు ఆమె ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు కోర్టుకు వివరించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం జైలులో ఉంచే చికిత్స అందిస్తున్నామని వైద్యులు తప్పనిసరిగా ఆస్పత్రికిగా తరలించాలంటే ఆ పని చేస్తామని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లి అటు జైలు అధికారులను, షీనా కేసు దర్యాప్తు అధికారులు ఇంద్రాణి కలవరపెట్టిన విషయం తెలిసిందే. ఆమెకు కొద్ది రోజులపాటు చికిత్స చేసి తిరిగి జైలుకు తరలించారు. 2012 ఏప్రిల్ నెలలో తన కన్న కూతురు 24 ఏళ్ల షీనా బోరాను ఇంద్రాణి మరికొందరితో కలిసి హత్య చేయగా.. ఆమెను పోలీసులు గత ఆగస్టు 25న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బైకుల్లా జైలులో ఉంది. -
ఒంటరిగా ఉండలేకపోతున్నాను
ముంబై: షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా జైలుగదిలో ఒంటరిగా ఉండలేకపోతోందిట. సెల్ లో ఒంటరిగా ఉండడం వల్ల తనకు డిప్రెషన్ మరింత పెరుగుతుందని ఆమె ఆందోళన చెందుతోంది. అందుకే తనను ఐసోలేటెడ్ సెల్లో ఉంచొద్దంటూ జైలు అధికారులకు ఇంద్రాణి మొరపెట్టుకుంది. జైళ్ల శాఖ ముఖ్య కార్యదర్శి డా. విజయ్ సత్బీర్ సింగ్ జైల్లో ఆమెను కలిసినపుడు ఒంటరిగా ఉండలేకపోతున్నానని, తనను ఏకాకిగా ఉంచొద్దంటూ విజ్జప్తి చేసింది. అసలే డిప్రెషన్‌తో బాధపడుతున్న తనకు, విడిగా సెల్లో ఒంటరిగా ఉండడం కష్టంగా ఉందని తెలిపింది. ఇది తన మానసిక స్థితిని మరింత దెబ్బ తీస్తుందని, తను ప్రత్యేక సెల్లో ఉంచొద్దని ఇంద్రాణి కోరింది. ఆమె విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆమె అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆమెను వేరే సెల్ కు తరలించనున్నట్లు తెలుస్తోంది. కన్న కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉండి విచారణ నిమిత్తం జైలు అధికారుల కస్టడీలో ఉన్న ఇంద్రాణి మోతాదుకు మించిన మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను జేజే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందచేశారు. కోలుకున్న అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించారు. -
అస్పత్రి నుంచి ఇంద్రాణీ డిశ్చార్జ్
-
స్పృహలోకి ఇంద్రాణి
-
స్పృహలోకి ఇంద్రాణి
ముంబయి: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్పృహలోకి వచ్చింది. దీంతో ఇక ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని వైద్యులు ధృవీకరించారు. తన కూతురు షీనాబోరాను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పరిస్థితి శనివారం అకస్మాత్తుగా విషమంగా మారిన విషయం తెలిసిందే. బైకలా జైల్లో ఉన్న ఆమె కొన్ని మాత్రలు వేసుకున్న వెంటనే ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటంతో హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలింది. దీంతో వెంటిలేటర్ ద్వారా ఆమెకు ఆక్సిజన్ అందించారు. కాగా, ఈ కేసు నేపథ్యంలో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక మరేదైనా తెలియని కారణం ఉందా ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఆమె ఫిట్స్ నిరోధానికి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అది కూడా జైలు అధికారుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి.కానీ ఆ మాత్రలను అధిక మోతాదులో ఇంద్రాణి వాడటం వల్లే అపస్మారక స్థితిలోనికి వెళ్లారని వైద్యులు అంటున్నారు. -
నేడు కోర్టుకు షీనా బోరా హత్యకేసులో నిందితులు
-
'ఇప్పుడు తీస్కో.. త్రీ బెడ్రూమ్ ఫ్లాట్..'
ఆ కారులో నలుగురున్నారు. తల్లిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కూతురు.. ఊరుకుంటే కూతురే కోడలై తన ఆర్థిక ఆధిపత్యానికి చెక్ పెడుతుందనుకున్న తల్లి.. తన నుంచి విడిపోయాక బాగా బతుకుతున్న మాజీ భార్యతో లాభపడొచ్చనుకున్న భర్త.. డబ్బున్నోళ్లకు నమ్మినబంటుగా ఉంటే ఆర్థికంగా ఎదగొచ్చనుకున్న డ్రైవర్. అలా వారి ప్రయాణం సాగుతుండగానే.. తల్లి చేతులు కూతురి మెడను చుట్టేశాయి. 'ఏమే.. నాకు పుట్టి నన్నే బెదిరిస్తావా.. త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ అడుగుతావా.. ఇప్పుడు తీస్కోవే.. త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్..' అంటూ ఇంద్రాణి తన కూతురు షీనా గొంతు నులుముతుంటే.. కదలనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా. ఆ సమయంలో కారు లోపలే ఉన్న డ్రైవర్ శ్యామ్ రాయ్ ...పోలీసుల విచారణలో షీనా బోరా హత్యకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించాడు. ఆర్థికంగా అండ దొరుకుతుందనే ఆశే తప్ప షీనా హత్యకు సహకరించడం వెనుక ఎలాంటి ఉద్దేశాలు లేవని డ్రైవర్ శ్యామ్ రాయ్ పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్న అతడు అప్రూవర్ గా మారతాడన్నది తాజా సమాచారం. సాధ్యమైనంతమేరలో శిక్ష నుంచి తప్పించుకోవాలని భావిస్తున్న శ్యామ్.. అప్రూవర్ గా మారాలనుకుంటున్నాడని, దీంతో గడిచిన నెల రోజులుగా సంచలనాలు సృష్టించిన షీనా హత్యకేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనని ముంబై పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. పోలీసులు తెలిపిన మరికొన్ని వివరాలు.. కుబేరుడైన పీటర్ ముఖర్జియా జీవితంలోకి మూడో భార్యగా ప్రవేశించినప్పటికీ ఆయనపై ఇంద్రాణి ముఖర్జీయా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించేది. ఆర్థిక విషయాలన్నీ ఆమె కనుసన్నల్లోనే సాగేవి. అలాంటిది.. పీటర్ కుమారుడు రాహుల్ ను షీనా పెళ్లి చేసుకుంటే గనుక ఆ కుటుంబ ఆస్తులపై పట్టు కోల్పోతాననే భయం ఇంద్రాణిని వెంటాడింది. అందుకే రాహుల్ తో రిలేషన్ కట్ చేసుకోవాలని షీనాపై ఒత్తిడి తెచ్చింది. షీనా మాత్రం ఇంద్రాణి ఒత్తిళ్లకు బెదరలేదు సరికదా.. రివర్స్ లో తల్లినే బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. 'నీ గత జీవితానికి సంబంధించిన వివరాలన్నీ రాహుల్, పీటర్ లకు చెప్పేస్తా. నీ చెల్లెలిగా వారు నా మాట నమ్ముతారు' అని హెచ్చరించేది. మాట్లాడకుండా ఉండాలంటే ప్రస్తుతానికి బంద్రా హిల్స్ లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ తనకు కొనివ్వాలని డిమాండ్ చేసింది. ఒకవేళ షీనాకు ఫ్లాట్ కొనిచ్చినప్పటికీ మళ్లీ తనను బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండదనే అపనమ్మకంతో తీవ్రంగా ఆలోచించిన ఇంద్రాణి.. షీనాను అడ్డు తొలిగించుకోవడం ఒక్కటే దారి అని బలంగా విశ్వసించింది. అందుకే తన స్వహస్తాలతో కన్న కూతురినే కడతేర్చింది. -
స్క్రీన్ ప్లే ఒకటే...కథ వేరు
ముంబై: నగర పోలీసు కమిషనర్ పదవి నుంచి రాకేశ్ మారియాను తప్పించడంలో 20 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రే పునరావృతమైంది. అదే స్క్రీన్ ప్లే, అదే ఉద్వాసన పర్వం చోటుచేసుకుంది. 1992, డిసెంబర్ నెలలో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం జరిగిన అల్లర్లు, 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సంఘటనల మూలాలా కూపీని లాగేందుకు ప్రయత్నించడంతో నాడు ముంబై పోలీసు కమిషనర్‌గా ఉన్న అమరజీత్ సింగ్ సామ్రాను ఆ కుర్చి నుంచి తప్పించారు. ఇప్పుడు షీరా బోరా హత్య కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న రాకేశ్ మారియాను పదోన్నతి పేరిట పదవి నుంచి తప్పించారు. రాకేశ్ మారియా, సామ్రాలు ఇద్దరూ పబ్లిసిటీ పిచ్చోళ్లే. మీడియాకు మంచి మిత్రులే. ఇద్దరూ శాఖాపరంగా పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలను బహిరంగంగా ఒప్పుకోవడంలో ఎప్పుడూ సంశయించిన సందర్భాలు లేవు. పబ్లిసిటీ పిచ్చి తమ హక్కని, అది పోలీసులకు ఉండరాదన్నది రాజకీయ నేతల పిచ్చి నమ్మకం. విలేకర్ల సమావేశాల్లో నోరు మరీ అంతగా విప్పి మాట్లాడవద్దని 20 ఏళ్ల క్రితం నాడు కేంద్ర హోం మంత్రిగా ఉన్న ఎస్బీ చవాన్ బహిరంగంగా సామ్రాకు హితవు చెప్పారు. హోం మంత్రి, అందులోనూ హెడ్మాస్టర్ లాంటి ఎస్బీ చవాన్ లాంటి వ్యక్తి చెబితే వినాలా, వద్దా ? పర్వవసానంగా వారం రోజుల్లోనే సామ్రా కుర్చీని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో వచ్చిన సతీష్ సాహ్నీ పబ్లిసిటీ జోలికి వెళ్లకుండా తన పనేదో తాను కామ్‌గా చేసుకుపోయారు. అప్పటికి ముస్లింల హృదయాల్లో రగులుతున్న అగ్నిని చల్లార్చడంలో విజయం సాధించారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మొహల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. అయినా ఆ ఘనత తనదేనంటూ సాహ్నీ ఎన్నడూ మీడియా ముందు గొంతు విప్పుకోలేదు. అయినప్పుటికీ ఆ రోజుల్లోని పరిస్థితులను చక్కదిద్దడంలో ఆయన చూపిన చొరవకు మీడియా ఎక్కువనే ప్రచారం ఇచ్చింది. ప్రస్తుత షీరా బోరా హత్య కేసులో రాకేశ్ మారియా అత్యుత్సాహం చూపించడం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఎందుకో నచ్చలేదు. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జియాను, ఇతర నిందితులను ఇంటరాగేట్ చేయడం కోసం మారియా ఖర్ పోలీసు స్టేషన్లోనే మకాం వేశారు. ఈ నెలాఖరులోగానే ఈ కేసును పూర్తిగా ఛేదించేస్తానని మీడియా ముందు సవాల్ కూడా చేశారు. ముంబై కమిషనర్‌గా ఆయన ఇచ్చిన ఆఖరి ప్రకటన బహూశ ఇదే కాబోలు. ఈలోగానే తనకు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ అంతగా ప్రాముఖ్యతలేని హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు వచ్చాయని తెల్సింది. అప్పుడు క్రాఫోర్డ్ మార్కెట్లోని తన కార్యాలయానికి వెళ్లి ఆ ఉత్తర్వులను అందుకున్నారు. మీడియాకు మిత్రుడవడంతో మారియా బదిలీ వార్తకు పత్రికలన్నీ విశేష ప్రాధాన్యతనిచ్చాయి. దాంతో కంగుతిన్న ఫడ్నవీస్.....షీనా బోరా హత్య కేసును మాత్రం మారియానే పర్యవేక్షించేలా ఉత్తర్వులు జారీ చేశారు. మారియా బదిలీ వ్యవహారంలో షీనాబోరా కేసులోని నిందితులు ఫడ్నవీస్‌ను ప్రభావితం చేశారా ? అన్న ప్రశ్నకు ఆధారాలు మాత్రం ప్రస్తుతానికి లేవు. కానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు మారియా మంచి మిత్రుడన్న విషయం అందరికి తెల్సిందే. మీడియా ముందు మారియా అతిగా ప్రచారం పొందడం కూడా ఫడ్నవీస్‌కు నచ్చలేదన్నది ఆయన సన్నిహిత వర్గాల కథనం. మరి ప్రచారం ప్రజానాయకులకుండాలిగానీ పోలీసులకుంటే ఎలా ! -
లిప్‌స్టిక్ వేసి.. పెర్ఫ్యూమ్ రాసి
ముంబయి: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. షీనా బోరాను హత్య చేసిన అనంతరం ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా ... మృతదేహానికి లిప్ స్టిక్ రాయడంతో పాటు తలను కూడా అందంగా దువ్వి ముస్తాబు చేసిందట. ఈ విషయాన్ని షీనా కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు వెల్లడించారు. ఎటువంటి చెడువాసన రావద్దని ఆలోచించిందే ఏమో కానీ, షీనా మృతదేహానికి పెర్ఫ్యూమ్ కూడా రాసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రాయ్ గఢ్ తీసుకెళ్లి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ తో కలిసి దహనం చేసింది. అయితే మార్గమధ్యలో పోలీసులు తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న షీనా బోరా గురించి ప్రశ్నించగా ఆమెకు ఆరోగ్యం బాగాలేదని నిద్రపోతుందని ఇంద్రాణి చెప్పినట్లు ఓ అధికారి వెల్లడించారు. షీనాను హత్య చేసిన రోజు (ఏప్రిల్ 24, 2012) వర్లీలోని ఇంద్రాణీ ఇంట్లోనే షీనా మృతదేహాన్ని ఉంచారు.మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని కారులో తరలిస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు లిప్ స్టిక్, పెర్ఫ్యూమ్ ఆమెకు రాయడం తల దువ్వడం వంటివి చేసినట్లు పోలీసుల విచారణలో ఇంద్రాణీ వివరించింది. కాగా పోలీస్ కస్టడీ నేటితో ముగియనుండటంతో ఇంద్రాణీ ముఖర్జియాను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. షీనా హత్య తర్వాత మెయిల్ ఐడీ క్రియేట్.. షీనా హత్య అనంతరం మృతదేహం ఆనవాళ్లు కూడా గుర్తించడం కష్టమని భావించిన ఇంద్రాణీ.. ఓ ఉద్యోగికి చెప్పి కూతురి పేరిట హాట్ మెయిల్ అకౌంట్ క్రియేట్ చేయించింది. అయితే షీనా అమెరికాలో చాలా బిజీగా ఉన్నట్లు ఆ ఉద్యోగికి చెప్పి అకౌంట్ ఓపెన్ చేయించి.. ఆ ఐడీ నుంచి చాలా మందికి ఇంద్రాణీ ఈమెయిల్స్ పంపినట్లు అంగీకరించింది. -
షీనాను హత్య చేసింది నేనే!
అంగీకరించిన ఇంద్రాణి ♦ పీటర్‌తో ఇంద్రాణి, ఖన్నా, రాయ్‌ల ముఖాముఖి.. ♦ చివరి నిమిషంలో మొదటి భర్త ♦ సిద్ధార్థ్దాస్ను ప్రవేశపెట్టిన పోలీసులు ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసు మిస్టరీ వీడింది. ఇన్నాళ్లూ అమెరికాలో షీనా బతికే ఉందంటూ బుకాయిస్తూ వచ్చిన షీనాబోరా కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జియా తానే కూతుర్ని హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఇంతకుమించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఈ కేసులో నిందితులైన వారందరితో పాటు, ఇంద్రాణి భర్త, స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియాను గురువారమూ విచారించారు. బుధవారం దాదాపు 12గంటలపాటు విచారించిన పీటర్‌ను గురువారం ఉదయం11.30 గంటలకు ఖర్ పోలీస్ స్టేషన్‌కు రప్పించారు. పీటర్‌తో పాటు.. కేసులో నిందితులందరినీ ఒకరి వెంట ఒకరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి ప్రశ్నించారు. పీటర్‌తో ఆయన భార్య ఇంద్రాణిని ముఖాముఖిగా కూర్చోబెట్టి ఇంటరాగేట్ చేశారు. వీరి మధ్య అనైతిక సంబంధాలతో పాటు పీటర్ ఇంద్రాణిల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లోతుగా ఆరా తీశారు. వివిధ కంపెనీల్లో పీటర్‌కు ఉన్న షేర్ల వివరాలు, తన కొడుకు రాహుల్‌కు, భార్య ఇంద్రాణికి, ఆమె కూతుళ్లు షీనా, విధిలకు పీటర్ ఎంతెంత డబ్బులు ఇచ్చిందీ తెలుసుకున్నారు. ఆ తరువాత ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాం రాయ్‌లను కూడా పీటర్‌తో ముఖాముఖిగా ఉంచి దర్యాప్తు చేశారు. చివరి నిమిషంలో ఇంద్రాణి మొదటి భర్త, షీనాబోరా తండ్రి సిద్ధార్థదాస్‌ను అనూహ్యంగా ఇంద్రాణి ముందు ప్రవేశపెట్టి ముఖాముఖి విచారించారు. ఈ విచారణ అంతా డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో కొనసాగింది. మరోవైపు రాయ్‌గఢ్ అడవుల్లో దొరికిన అస్థికలు షీనావా కాదా అని నిర్ధారించేందుకు కలీనాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలు ప్రారంభించింది. -
నేరాన్ని అంగీకరించి కుప్పకూలిన ఇంద్రాణి
-
పీటర్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ముంబై: షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా భర్త, స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియాను పోలీసులు ఈరోజు మళ్లీ విచారణ చేయనున్నారు. పీటర్ స్వగృహంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు కొన్ని డాక్యుమెంట్లను, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి చేపట్టిన దర్యాప్తు, విచారణలో భాగంగా నిన్న ఆయనను 12 గంటల పాటు ప్రశ్నించి, కొన్ని విషయాలను రాబట్టుకున్నారు. కలినాలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఈ కేసుకు సంబంధించి లభ్యమైన ఆధారాలను వారు పరిశీలిస్తున్నారు. కుళ్లిపోయిన మృతదేహాం నుంచి కొన్ని శాంపిల్స్,ఇంద్రాణి నుంచి కొన్ని శాంపిల్స్ ను సేకరించారు. ఖేర్ పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా పోలీసులు ఆయనకు సమాచారమిచ్చారు. ఆయన స్టేట్మెంట్ నోట్ చేసుకుంటామని ముంబై పోలీసులు తెలిపారు. కూతుర్ని హత్య చేసిందన్న ఆరోపణలతో ఇంద్రాణీ ముఖర్జియా ఆగస్టు 25న అరెస్టయిన విషయం విదితమే. ఇంద్రాణీ, పీటర్ లకు ఒకే విధమైన ప్రశ్నలను ఇచ్చి సమాధానమివ్వాలని కోరారు. ఆర్థిక సంబంధమైన విషయాలు.. వివిధ కంపెనీలలో వాటా, షేర్ల వివరాలపై ఎక్కువగా ప్రశ్నలు ఉన్నట్లు తెలుస్తోంది. భార్య ఇంద్రాణీకి, కుమారుడు రాహుల్, షీనాబోరా, మరో కూతురు వైదేహిలకు నగదు ఎంత మొత్తం ఇచ్చేవారో తెలపాలని అధికారులు ఆయనను ప్రశ్నించారు. -
నేరం ఒప్పుకున్న ఇంద్రాణి!
ముంబై: కూతురు హత్య కేసులో అరెస్టైన ఇంద్రాణి ముఖర్జియా పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నట్టు తెలిసింది. ఈ హత్యలో తన పాత్ర ఉన్నట్టు ఆమె అంగీకరించారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల పాటు పొంతనలేని సమాధానాలు చెబుతూ వచ్చిన ఆమె ఎట్టకేలకు నేరం ఒప్పుకున్నట్టు తెలిపాయి. తన కూతురు షీనా బోరా హత్యకు గురికాలేదని, బతికేవుందని ఇంద్రాణి చెప్పింది. షీనా అమెరికాలో ఉంటోందని, తనపై ద్వేషంతో నే ఆమె బయటకు రావడం లేదని ఇంద్రాణి నమ్మబలికింది. ఆమె చెప్పిన దాంట్లో పరస్పర విరుద్ధ విషయాలు ఉన్నాయని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. షీనా హత్య కేసులో అరెస్టైన ముగ్గురు నిందితుల పాత్రపై ఆరా తీస్తున్నామని చెప్పారు. మిగతా ఇద్దరు నిందితులు నేరం ఒప్పుకున్నారని అనుకుని ఆమె కూడా నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది. కాగా, బాంద్రా కోర్టులో తన చిన్న కూతురు విధిని కలిసినప్పుడు ఇంద్రాణి కన్నీళ్లు పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
ఆ అవశేషాలు షీనా బోరావేనా ?
ముంబై: దాదాపు మూడేళ్ల క్రితం రాయ్‌గఢ్ జిల్లాలో దొరికిన గుర్తు తెలియని శవం అవశేషాలు షీనా బోరావేనా ? అయితే వాటిని ఎలా గుర్తించడం ? సాధారణంగా తల్లిదండ్రులు, వారి ఇతర సంతానం డీఎన్ఏలతో అవశేషాల నుంచి తీసిన డీఎన్ఏను పోల్చి గుర్తిస్తారు. సర్వ సాధారణంగా ముక్కలు ముక్కలుగా నరికిన శవం నుంచి డీఎన్ఏను గుర్తించడం దాదాపు అసాధ్యమని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు మరెలా ఆ అవశేషాలు షీనా బోరావేనా, కాదా ? అన్న అంశాన్ని ఎలా తేల్చాలి ? షీనా బోరా ఇప్పటికీ బతికే ఉందని, అమెరికాలో ఉంటోందని సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితురాలైన ఇంద్రాణి పోలీసు ఇంటరాగేషన్‌లో మాటమార్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత బలం చేకూరింది. ప్రతి మనిషికి ప్రత్యేకమైన పలు వరుస ఉంటుంది. ఆ పలు వరుస ద్వారాగానీ, 2డీ లేదా 3డీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించి కచ్చితంగా గుర్తించవచ్చని ఫోరెన్సిక్ నిపుణలు చెబుతున్నారు. అనుమానిత స్కల్పై ముఖం ఫైల్ ఫొటోను సూపర్ ఇంపోజ్ చేసి కూడా గుర్తించవచ్చని వారు అంటున్నారు. ఒకప్పుడు సంచలనం సృష్టించిన నిఠారి హత్య కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 19 మంది పిల్లల కపాలాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి అక్కడ ముఖ పునర్నిర్మాణం ద్వారా 16 మంది పిల్లలను కచ్చితంగా గుర్తించారు. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ కూడా ఉపయోగించవచ్చని నిపుణులు తెలియజేశారు. నోయిడా పోలీసులు 2006లో చండీగఢ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా అక్కడి డాక్టర్లు డాక్టర్ సంజీవ్, డాక్టర్ రాజీవ్ గిరోటి (డీఎన్ఏ) నిపుణులు కంప్యూటర్ సూపరింపోజ్, 3డీ ద్వారా ముఖాలను పునర్నిర్మించి ఆ కపాలాలు ఎవరివో గుర్తించారు. ప్రస్తుతం షీనా బోరాగా భావిస్తున్న అవశేషాలను 2012, మే 23వ తేదీన రాయ్‌గఢ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో స్కల్, ఎముకలు, పంటి శాంపిల్స్‌ను ముంబైలోని జేజే ఆస్పత్రికి పంపించారు. ఎలాంటి మిస్సింగ్ కేసు దాఖలు కాకపోవడం, దర్యాప్తు ముందుకు సాగకపోవడం ఆ అవశేషాలు చాలాకాలం జేజే ఆస్పత్రిలోనే ఉండిపోయాయి. అనంతరం వాటిని ఆస్పత్రి వర్గాలు తిరిగి ముంబై పోలీసులకు అప్పగించారు. అవి, ముఖ్యంగా స్కల్, పను వరుస ఇప్పటికీ భద్రంగా ఉన్నాయని షీరా బోరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. పంటి వరుస ద్వారా ఆ అవశేషాలు షీనా బోరావేనా ? అన్న విషయాన్ని గుర్తించాలంటే ఆమె ఎప్పుడైన డెంటిస్ట్ దగ్గరికి వెళ్లారా? అన్న విషయం తేలాలి. వెళ్లినట్టయితే అక్కడ అందుకు సంబంధించిన రికార్డులు ఉండాలి. అలా లేనప్పుడు 2 డీ లేదా 3డీ లేదా కంప్యూటర్ సూపర్ ఇంపోజ్ ద్వారా స్కల్‌ను ముఖంగా మార్చి గుర్తించడమే ప్రత్యామ్నాయ మార్గాలు. ఆ సాంకేతిక పరిజ్ఞానం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో లేదు. ముంబైలోని కెమ్ ఆస్పత్రి, చండీగఢ్‌లోని ఎఫ్ఎస్ఎల్ ఆస్పత్రిలో మాత్రమే ఉంది. -2డీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించాలంటే: అనుమానిత వ్యక్తి ఫొటోలు కావాలి. స్కల్ కావాలి. ఒక చిత్రకారుడు, ఓ ఫోరిన్సెక్ ఆంత్రోపాలజిస్ట్ కలసి ముఖాన్ని పనర్నిర్మిస్తారు. కొన్ని సందర్భాల్లో స్కల్ రేడియో గ్రాఫ్‌లను కూడా వినియోగిస్తారు. -3డీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖాన్ని పునర్నిర్మించాలంటే: బంకబట్టి, ఇతర పదార్థాలను ఉపయోగించి స్కల్‌ను ముఖ విగ్రహంగా మలుస్తారు. దీనికోసం హై రెసల్యూషన్గల త్రీ డెమైన్షనల్ కంప్యూటర్ చిత్రాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇందులోనూ చిత్రకారుడు, ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్ట్ పరస్పర సహకారం అవసరం. ఇదివరకు 2డీ, కంప్యూటర్ చిత్రాల ద్వారా విడివిడిగా ముఖాలను పునర్నిర్మించేవారు. ఇప్పుడు 3డీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కంప్యూటర్ చిత్రాలను, 3డీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకకాలంలో ఉపయోగించి ముఖాలను పునర్నిర్మిస్తున్నారు. -
షీనా బోరా బతికే ఉంది: ఇంద్రాణి
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. షీనా బోరా బతికే ఉందని, అమెరికాలో ఉంటోందని ఉందని పోలీసు ఇంటరాగేషన్ లో ఆమె తల్లి ఇంద్రాణి ముఖార్జియా తెలిపినట్టు సమాచారం. తనపై ఉన్న ద్వేషంతోనే ఆమె ఎవరికీ కనిపించకుండా ఉండిపోయిందని ఇంద్రాణి చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. 24 ఏళ్ల షీనా బోరా 2012, ఏప్రిల్ 24న హత్యకు గురైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా షీనా అమెరికా వెళ్లిందని మూడేళ్లుగా ఇంద్రాణి చెబుతూ వచ్చింది. షీనా నిజంగా అమెరికా వెళ్లిందా, లేదా అనేది గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. షీనా హత్యకు గురైన సమయంలో అమెరికా వెళ్లిన ప్రయాణికుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు ఇంటరాగేషన్ సమయంలో పోలీసులకు ప్రశ్నలకు ఇంద్రాణి సరిగా సమాధానం చెప్పలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. సంజీవ్ ఖన్నాను దుమ్మెత్తి పోసినట్టు వెల్లడించాయి. -
కోర్టులో పడిపోయిన ఇంద్రాణి!
ముంబై: కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి ఇంద్రాణి ముఖర్జియాను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్భంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇంద్రాణిని విచారిస్తున్న సమయంలో ఆమె కోర్టులో కళ్లు తిరిగిపడిపోయింది. కాగా, కాసేపటికి ఇంద్రాణి తేరుకుంది. అనంతరం విచారణ చేపట్టిన కోర్టు.. ఆమె పోలీస్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకూ పొడిగించింది. ఇంద్రాణి ముఖర్జియాను విచారించడానికి మరికొంత సమయం కావాలని ముంబై పోలీసులు కోర్టుకు విన్నవించారు. వారి అభ్యర్థనను మన్నించిన కోర్టు.. ఆమె కస్టడీని పొడిగించింది. ఇదిలా ఉండగా ఇంద్రాణిపై విషప్రయోగం జరిగే అవకాశం ఉన్నందున ఆమె ఇంటి నుంచి ఆహారాన్ని అనుమతించకూడదని ప్రాసిక్యూషన్ వాదించింది. -
ఇంద్రాణి పోలీస్ కస్టడీ పొడిగింపు
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి ఇంద్రాణి ముఖర్జియా పోలీస్ కస్టడీని స్థానిక కోర్టు సెప్టెంబర్ 5 వరకూ పొడిగించింది. షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఇంద్రాణి ముఖర్జీయాను విచారించడానికి మరికొంత సమయం కావాలని ముంబై పోలీసులు కోర్టుకు విన్నవించారు. వారి అభ్యర్థనను మన్నించిన కోర్టు.. ఆమె కస్టడీని పొడిగించింది. కాగా, మరోవైపు ఇంద్రాణి ముఖర్జీ తరుపున వాదనలు కూడా వాడివేడిగా జరిగాయి. ఇప్పటికే ఇంద్రాణిని 80-90 గంటలు విచారించారని.. ఇంకా ఇంద్రాణిని పోలీస్ కస్టడీలో తీసుకోవాల్సిన అవసరం లేదని ఇంద్రాణి తరపు న్యాయవాది వాదించారు. ఇప్పటికే ఆమెపై హత్యకేసును నమోదు చేసిన పోలీసులకు కస్టడీ అవసరం లేదన్నారు. అయితే ఇంద్రాణి తరుపు న్యాయవాది వాదనతో ఏకీభవించని కోర్టు.. ఆమె పోలీస్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకూ పొడిగించింది. -
ఆ సూట్‌కేసు మిఖైల్‌ను చంపి దాచేందుకేనా?
ముంబై: షీనా బోరా హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆదివారం షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీయాకు చెందిన ముంబై నివాస ప్రాంతంలో వారు ఓ సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు. ఈ సూట్‌కేస్ షీనా సోదరుడు మిఖైల్‌ను హత్య చేసి అందులో దాచి అటవీ ప్రాంతంలో షీనా హత్య చేసిన ప్రాంతంలోనే ఖననం చేసేందుకు సమీకరించారని పోలీసుల అనుమానం. కాగా, ఆధారాల సేకరణ కోసం షీనా హత్య జరిగిన తీరును తెలుసుకోవడానికి ఈ కేసులో నిందితులైన ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌లను ముంబై పోలీసులు ఆదివారం రాయ్‌గఢ్ జిల్లా అడవికి తీసుకెళ్లారు. ఇంద్రాణి, ఖన్నాలు హత్యకు కారణం నువ్వంటే.. నువ్వని పరస్పరం ఆరోపణలకు దిగారని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు.. నిందితులైన ఇంద్రాణి ముఖర్జియా, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నారు. -
షీనా బోరా అసలు తండ్రి ఎవరు?
-
'ఆ రోజే అమ్మ నన్ను చంపాలనుకుంది'
ముంబై: షీనా బోరా హత్య కేసులో ఎన్నో కొత్త విషయాలు, కుట్రలు వెలుగు చూస్తున్నాయి. తన తల్లి ఇంద్రాణి ముఖర్జియా తన సోదరి షీనాను హత్య చేసిన రోజే (2012 ఏప్రిల్ 24) తననూ చంపాలని ప్రయత్నించిందని మైకేల్ బోరా పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే ప్రమాదం నుంచి తాను తప్పించుకున్నానని చెప్పాడు. ముంబై పోలీసు బృందంతో కలసి గువహాటి నుంచి ఇక్కడకు వచ్చిన మైకేల్ విచారణలో కీలక విషయాలు చెప్పాడు. రాహుల్ ముఖర్జియాతో షీనా పెళ్లి విషయం గురించి మాట్లాడేందుకు ముంబైలో ఇంటికి రావాల్సిందిగా తన తల్లి పిలిచిందని మైకేల్ వెల్లడించాడు. మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చారని, తాగగానే తల తిరిగినట్టు అనిపించిందని చెప్పాడు. ఆ సమయంలో షీనాను తీసుకువస్తామని ఇంద్రాణి, ఆమె మాజీ భర్త (రెండో భర్త) సంజీవ్ ఖన్నా వెళ్లారని, ఆ సమయంలో తాను ఇంట్లో నుంచి పారిపోయానని తెలిపాడు. షీనాతో పాటు తనను చంపేందుకు ఇంద్రాణి పథకం పన్నిందని చెప్పాడు. ఆ సమయంలో ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ విదేశాల్లో ఉన్నారని చెప్పాడు. ఆ తర్వాత ఇంద్రాణి, ఖన్నా.. షీనాను తీసుకుని నిశ్చితార్థం కోసం ఉంగరం కొనేందుకు వెళ్లారని పోలీసులు చెప్పారు. ఓ హాటల్లో ఆమెకు మద్యం తాగించి గొంతునులిచి చంపేశారు. ఆ తర్వాత వర్లిలోని ఇంద్రాణి ఇంటికి రాగా ఇంట్లో మైకేల్ కనిపించలేదు. మైకేల్‌ను కూడా చంపేందుకు ఇంద్రాణి పథకం వేసిందని కారు డ్రైవర్ రాయ్ కూడా పోలీసుల విచారణలో చెప్పాడు. పీటర్‌పై తన పట్టు కోల్పోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోతాననే ఉద్దేశంతో ఇంద్రాణి.. షీనాను చంపినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అంతేగాక షీనా.. రాహుల్‌ను పెళ్లి చేసుకుంటే ఆమె తన కుమార్తె అని అందరికీ తెలుస్తుందని కూడా భయపడినట్టు చెప్పారు. ఇంద్రాణి.. పీటర్‌ను పెళ్లి చేసుకునే సమయంలో షీనా తన కూతురనే విషయం దాచిపెట్టి సోదరిగా పరిచయం చేసింది. పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్ కాగా, మొదటి భర్త ద్వారా ఇంద్రాణికి పుట్టిన పిల్లలు షీనా, మైకేల్లు. -
షీనా హత్య కేసులో కీలక మలుపు
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు దర్యాప్తులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, షీనా హత్యలో పాలుపంచుకున్నట్లు షీనా తల్లి, ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్త సంజీవ్ ఖన్నా శుక్రవారం పోలీసు విచారణలో అంగీకరించారు. దీంతో మాజీ భర్త ఖన్నా, డ్రైవర్ రాయ్‌ల సహకారంతో షీనాను సొంత తల్లి ఇంద్రాణినే హత్య చేసిందన్న వాదనకు బలం చేకూరింది. కోల్‌కతా నుంచి తీసుకువచ్చిన ఖన్నాను, ఇంద్రాణిని, ఆమె డ్రైవర్ శ్యామ్ రాయ్‌ని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా సమక్షంలో ఖార్ పోలీస్ స్టేషన్లో ఒకేసారి, ఒకే దగ్గర విచారించారు. అనంతరం, తమ విచారణలో ఖన్నా నేరాన్ని అంగీకరించాడని రాకేశ్ మారియా తెలిపారు. విచారణలో గువాహటి నుంచి తీసుకువచ్చిన ఇంద్రాణి కుమారుడు, షీనా సోదరుడు మైఖేల్ బోరా కూడా అక్కడే ఉన్నారు. కాగా, షీనా బోరా అస్తిపంజర శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని శనివారం డీఎన్ఏ పరీక్షలకు పంపిస్తామని మారియా తెలిపారు. షీనా పాస్‌పోర్ట్‌ను డెహ్రాడూన్‌లో స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పాస్‌పోర్ట్ లభించడంతో షీనా అమెరికా వెళ్లిందన్న కథనంపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. మైఖేల్ చెప్పిన ఆంశాలపై కూడా దృష్టి పెట్టామని మారియా చెప్పారు. అంతకుముందు, నిందితులు ముగ్గురిని పోలీసులు రాయ్‌గఢ్ అడవిలో షీనా మృతదేహాన్ని తగలబెట్టిన ప్రాంతానికి తీసుకెళ్లారు. నాటకీయ పరిణామాలు.. షీనా హత్యకేసు దర్యాప్తులో శుక్రవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు జరిగాయి. కోల్‌కతాలో అరెస్ట్ చేసిన ఖన్నాను శుక్రవారం ఉదయం ముంబై కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.స్థానిక బాంద్రా కోర్టు ఆగస్ట్ 31 వరకు పోలీస్ కస్టడీకి పంపించింది. ఐపీసీ 364(అపహరణ), 302(హత్య), 201(సాక్ష్యాల నాశనం) సెక్షన్ల కింద కేసు పెట్టి కోర్టులో హాజరుపర్చారు. షీనా హత్యలో ఖన్నాది క్రియాశీల పాత్రని, పూర్తి వివరాలు రాబట్టేందుకు విచారించాన్న వాదనతో ఏకీభవించిన కోర్టు ఖన్నాను పోలీసు కస్టడీకి పంపించింది. ఇంద్రాణి, ఖన్నా, ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ రాయ్.. 2012 ఏప్రిల్ 24న షీనాకు ముంబైలో ఒక హోటల్ గదిలో మద్యం తాగించి, కార్లో తీసుకెళ్తూ గొంతు నులిమి చంపారని, రాయ్‌గఢ్ జిల్లాలోని పెన్ పట్టణ శివార్లలోని అడవిలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగలపెట్టారని పోలీసులు కోర్టుకు తెలిపారు. కాగా, షీనా సోదరుడు, ఇంద్రాణి కుమారుడు మైఖేల్‌ను కూడా పోలీసులు గువాహటి నుంచి ముంబై తీసుకువచ్చారు. తన సోదరి హత్యకు సంబంధించి తనవద్ద కీలక ఆధారాలున్నాయని మైఖేల్ చెప్పడంతో ఆయనను గురువారం గువాహటిలో విచారించిన ముంబై పోలీసులు, తదుపరి విచారణ కోసం శుక్రవారం ముంబై తీసుకువచ్చారు. తన సోదరికి న్యాయం జరగాలని, అందుకు అవసరమైన పూర్తి సహకారం పోలీసులకు అందిస్తానని మైఖేల్ పేర్కొన్నారు. ఇంద్రాణి ప్రస్తుత భర్త స్టార్ మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియాను, ఆయన సోదరుడు గౌతమ్‌ను పోలీసులు విచారించారు. మారియా సమక్షంలో పీటర్‌ను ఖార్ పోలీస్ స్టేషన్లో 10 నిమిషాలు ప్రశ్నించి వదిలేశారు. షీనాతో సాన్నిహిత్యంపై పీటర్ కుమారుడు రాహుల్‌ను ప్రశ్నించడం తెలిసిందే. ప్రస్తుత భర్త పీటర్ కుమారుడు రాహుల్, తన కూతురు షీనా ల సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక ఇంద్రాణి ఈ హత్యకు పాల్పడిందా? ఇందులో ఆర్థిక కోణమేదైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, తాము చేసిన నేరాన్ని గుర్తు చేసేలా.. ‘నీ టీనేజ్ పిల్లలను గొంతు నులిమి చంపి ఉండకపోతే.. మనవళ్లు బహుమతిగా లభించేవారు’ అనే అర్థం వచ్చేలా 2014లో ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యాఖ్యకు ఇంద్రాణి లైక్ కొడ్తూ స్పందించడం గమనార్హం. ‘నువ్వెవరినైనా మోసం చేశావంటే దానర్థం.. ఆ వ్యక్తి తెలివితక్కువవాడని కాదు.. నిన్ను నీ అర్హతకు మించి విశ్వసించాడని అర్థం’ అనే మరో కామెంట్‌ను కూడా గత ఏడాది ఖన్నా పోస్ట్ చేశాడు. ఇంద్రాణిని కలవనివ్వడం లేదు! షీనా బోరా హత్య కేసు దర్యాప్తునకు ఉపయోగపడే అవకాశమున్న మరో ఆధారాన్ని పోలీసులు సంపాదించారు. 2012 ఏప్రిల్‌లో షీనా హత్యానంతరం, షీనాకు చెందిన ఎముకల ముక్కలను పరీక్షల నిమిత్తం పెన్ పోలీసులు 2012, మే నెలలో ముంబైలోని జేజే ఆసుపత్రికి పంపించారు. ఆ శాంపిల్స్‌ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ ఎముక ముక్కలను పరీక్షించి, వాటితో వయసు, స్త్రీయా లేక పురుషుడా, మృతికి కారణాలు.. మొదలైన వాటిని నిర్ధారించలేమంటూ 2013లోనే నివేదిక పంపించామని జేజే ఆసుపత్రి డీన్ టీపీ లహానే వెల్లడించారు. కాగా, ఇంద్రాణితో ఆమె లాయర్లను పోలీసులు కలుసుకోనివ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై ముంబైలోని మరో కోర్టు విచారణ జరిపింది. నిందితుల హక్కులపై సుప్రీంకోర్టు మార్గనిర్దేశాల ప్రకారం వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. -
హత్యకు గురయ్యే ముందు షీనా గర్భవతా?
-
హత్యకు గురయ్యే ముందు షీనా గర్భవతా?
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. షీనా బోరాను హత్య చేసే సమయానికి ఆమె గర్భవతి అయినట్టు సమాచారం. ముఖర్జియా కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఈ విషయం చెప్పారని ఆన్లైన్ మీడియా వెల్లడించింది. ఆన్లైన్ మీడియా సమాచారం మేరకు.. షీనా ఓ వ్యక్తితో కలసి ఓ ఆగ్నేయాసియా దేశానికి బిజినెస్ ట్రిప్ వెళ్లారు. ఆ వ్యక్తి షీనా తల్లి ఇంద్రాణికి సన్నిహితుడు. ఇంద్రాణి ఈ విషయంపై ఆ వ్యక్తిని ప్రశ్నించగా, ఆయన షీనాతో కలసి వెళ్లినట్టు ఒప్పకున్నారు. తాను గర్భవతి అయినట్టు షీనా తన తల్లి ఇంద్రాణికి చెప్పారు. ఆ తర్వాత షీనా హత్యకు గురైంది. ఆమెను హత్య చేసి అడవుల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా ఆమె కుమార్తె షీనాను గొంతు నులిమి చంపేసినట్టు వారి కారు డ్రైవర్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్‌ని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా ఇంటరాగేట్ చేశారు. కోల్‌కతాలో అరెస్టు చేసిన మూడో నిందితుడు సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి రెండోభర్త)ను పోలీసులు విచారించారు. హత్య జరిగిన తీరు సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ ఎస్పీరాయ్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. -
'తల్లి రీ- ఎంట్రీతో కూతురి లైఫ్‌స్టైల్ మారింది'
అప్పటిదాకా ఆమె ప్రపంచం వేరు. ఆహ్లాదకరమైన గువహటిలో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఎగిరే పక్షిలా ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేది షీనా బోరా. తన అందాన్ని పొగిడే స్నేహితురాళ్లకు తల్లి ఇంద్రాణి ఫొటోను చూపిస్తూ.. 'చూడండే.. మా అమ్మ ఎంత అందంగా ఉందో. నావీ ఆమె పోలికలే' అంటూ మురిసిపోయేదట! ఆమె చిన్నానాటి స్నేహితుడు, గువాహటికి చెందిన అర్నాబ్ సిక్దార్.. షీనా బోరాకు సంబంధించిన కొత్త విషయాలను మీడియాకు చెప్పారు. 'స్కూల్లో జరిగే ఆర్ట్స్, మ్యూజిక్ కాంపిటీషన్ అన్నింట్లోనూ షీనా పాల్గొనేంది. అవంటే ఆమెకు చాలా ఇంట్రెస్ట్. అంతేకాదు ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడాఎక్కువే. తాత ఉపేంద్ర కుమార్, అమ్మమ్మ, అన్నయ్య మిఖైల్ అంటే షీనాకు ప్రాణం. వాళ్లు కూడా ఆమెను గారాబం చేసేవాళ్లు. బంగారమొకెత్తుగా చూసుకునేవాళ్లు. ఎప్పుడైనా తల్లిదండ్రుల ప్రస్తావన వస్తే.. 'అమ్మానాన్న విడిపోయారు. ప్రస్తుతం అమ్మ విదేశాల్లో ఉంది' అని మాతో చెప్పేంది..' అంటూ షీనా చిన్ననాటి సంగతులు చెప్పుకొచ్చాడు అర్నాబ్. అలా హాయిగా సాగుతున్న షీనా జీవితం తల్లి ఇంద్రాణి రీ- ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది.. 'తొమ్మిది, పదో తరగతుల్లో షీనాలో ఊహించని మార్పు! కొత్త కొత్త లగ్జరీ కార్లలో తిరుగుతుండేది. ఆ వయసులోనే ప్రపంచ యాత్రలకు వెళ్లొచ్చేది. ఈ మార్పు మాకు వింతగా అనిపించేది. తర్వాతగానీ మాకు తెలిసిరాలేదు.. విదేశాల నుంచి షీనా తల్లి(ఇంద్రాణి) తిరిగొచ్చిందని. 2012లో గువాహటి వదిలి ముంబై వెళ్లిపోయిన తర్వాత షీనాను కలవలేదు. తాజాగా హత్యోదంతం వెలుగులోకి రావడంతో నా చిన్ననాటి స్నేహితురాలిని ఎప్పటికీ కలవలేనని తెలిసొచ్చింది' అని చెప్పాడు అర్నాబ్ సిక్దార్. -
'ఇంద్రాణి మాజీ భర్త.. షీనాను చంపారు'
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా ఆమె కుమార్తె షీనాను గొంతు నులిమి చంపేసినట్టు వారి కారు డ్రైవర్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్‌ని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా ఇంటరాగేట్ చేశారు. కోల్‌కతాలో అరెస్టు చేసిన మూడో నిందితుడు సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి రెండోభర్త)ను పోలీసులు విచారించా రు. హత్య జరిగిన తీరు సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ ఎస్పీరాయ్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. -
షీనా బోరా హత్యకు కారణాలు నాకు తెలుసు!
గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ పాత్ర గురించి మరిన్ని విషయాలు బయటపెడతానంటున్నాడు కొడుకు మిఖైల్ బోరా. తన సోదరిని తల్లి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తెలుసంటున్నాడు. అయితే పోలీసుల ముందు తల్లి నేరాన్ని ఒప్పకోకపోతే మాత్రం తాను మాత్రం సాక్షిగా మారతానని తెలిపాడు. 'నా సోదరిని తల్లే హత్య చేసిందని నేను నమ్ముతున్నా. అందుకు సంబంధించి పూర్తి కారణాలు నాకు తెలుసు. ఒక కారణం అయితే కాదు. చాలా కారణాలే ఉన్నాయి. ఆమె నేరాన్ని అంగీకరించని పక్షంలో.. నేను ఏది చేయాల్సిన అవసరం వస్తుందో అది కచ్చితంగా చేస్తా.ఆగస్టు 31 వరకూ ఇంద్రాణికి పోలీస్ కస్టడీ విధించారు. వారి విచారణలో నేరాన్ని ఒప్పుకోకపోతే మాత్రం ఆ హత్య గల కారణాలను చెబుతా'అని మిఖైల్ బోరా తెలిపాడు. 2012లో హత్యకు గురైన షీనా బోరా కేసులో టీవీ మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణిని బుధవారం అరెస్టు చేశారు. స్టార్ ఇండియా 2002లో స్టార్ ఇండియా సీఈఓగా పీటర్ ఉన్నప్పుడు ఇంద్రాణిని పెళ్లాడాడు. అంతకుముందే ఇద్దరికీ జరిగిన వివాహాలకు విడాకులూ అయ్యాయి. అయితే ఆమెకు సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నాలతో తనకు జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని పీటర్ దగ్గర దాచింది. అనంతరం చోటు చేసుకున్నపరిణామాలు కూతురు షీనా బోరా హత్యకు దారి తీశాయి. ఆ విషయాన్ని దాచి పెట్టిన ఇంద్రాణి.. షీనా అమెరికాకు వెళ్లినట్లు అందర్నీనమ్మించింది. ఈ హత్య కేసులో ఇంద్రాణి పాత్ర ఉందని తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు. -
షీనా హత్య కేసులో ఊహించని మలుపులెన్నో!
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న న్యూస్ ఎక్స్ సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణి ముఖర్జియా లీలలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నాయి. నాటకీయ ఫక్కీలో పోలీసులు ఈ కేసును ఛేదించారు. అక్రమ ఆయుధాల కేసులో పట్టుబడిన ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ మనోహర్ పోలీసుల విచారణలో నోరు విప్పడంతో గుట్టు రట్టైంది. సొంత కూతురైన షీనా బోరానిని ఇంద్రాణి హత్య చేయించినట్టు అతడు వెల్లడించాడు. షీనా బోరానిని మొదట ఇంద్రాణి చెల్లెలు భావించారు. అయితే తర్వాత వాస్తవం వెల్లడైంది. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జియాను ఇంద్రాణి రెండో వివాహం చేసుకుంది. అప్పటికే పీటర్ కు ఇద్దరు కొడుకులు, ఇంద్రాణికి కొడుకు, కూతురు ఉన్నారు. రెండో పెళ్లి సమయంలో కూతురు షీనాను చెల్లెలిగా భర్తకు ఇంద్రాణి పరిచయం చేసింది. వరస తెలియకుండా షీనాతో పీటర్ రెండో కుమారుడు ప్రేమవ్యవహారం నడిపాడు. ఈ విషయం ఇంద్రాణి తెలియడంతో డ్రైవర్ తో షీనాను హత్య చేయింది. ఎవరికీ అనుమానం రాకుండా షీనాను అమెరికా పంపించినట్టు నమ్మబలుకుతూ వచ్చింది. చివరకు గుట్టు రట్టు కావడంతో జైలు పాలైంది. ఇంద్రాణి మొదటి భర్త సంజీవ్ కన్నాను కూడా పోలీసులు కోల్ కతాలో అరెస్ట్ చేశారు.