ఆమెను కొట్టినమాట నిజమే!
ముంబై: మాజీ మీడియా అధిపతి ఇంద్రాణి ముఖర్జియా శరీరంపై తీవ్ర గాయాలు ఉన్న విషయం నిజమేనని, ఆమె చేతిపై, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని వైద్య నివేదిక స్పష్టం చేసింది. ముంబైలోని బైకుల్లా జైలు సిబ్బంది తనపై దాడిచేసి తీవ్రంగా కొట్టారని కోర్టులో ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కూతురు షీనాబోరా హత్యకేసులో ప్రధాని నిందితురాలిగా బైకులా జైలులో ఇంద్రాణి గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఇదే జైలులో తోటి మహిళ ఖైదీ మంజుల మృతిపై ఆమె కోర్టులో సాక్ష్యం తెలిపారు. తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే.. మంజులకు పట్టిన గతే నీకు పడుతుందని జైలు అధికారులు తనను హెచ్చరించినట్టు చెప్పారు. తనపై జైలు సిబ్బంది దాడి చేశారని తెలిపారు. మహిళా ఖైదీ మంజుల షెత్యేపై జైలు సిబ్బంది కిరాతకంగా వ్యవహరించి.. ఆమె మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జైలు సిబ్బందిపై నాగపాద్ పోలీసులు కేసు నమోదుచేశారు.
చదవండి: మహిళా ఖైదీపై అత్యంత క్రూరత్వం..