Byculla jail
-
Indrani Mukerjea: కూతురి హత్య కేసులో ఆరేళ్ల తర్వాత బయటకు..
చాలా చాలా సంతోషంగా ఉంది.. బెయిల్ మీద బయటకు వచ్చిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన మొదటి మాట ఇది. సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయగా.. రెండు లక్షల రూపాయల షూరిటీ బాండ్ మీద అనుమతి ఇచ్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. శుక్రవారం సాయంత్రం దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యింది ఆమె. సుమారు ఆరున్నరేళ్ల తర్వాత ఇంద్రాణి బయటి ప్రపంచాన్ని చూసింది. ముంబై: కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ(50)కి.. సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా కోర్టు.. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆపై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో.. శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలు, కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులై.. ఇలా నేరపూరిత స్వభావంతో వార్తల్లోకి ఎక్కింది. ముగ్గురు భర్తల ఇంద్రాణి.. ఇంద్రాణి ముఖర్జీకి మొదటి భర్తతో కలిగిన సంతానం షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే.. మూడేళ్ల వరకు ఆ విషయం బయటకు పొక్కలేదు. 2012లో షీనా బోరాను హత్య చేయగా.. మూడేళ్ల తర్వాత ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్య కేసు గురించి తెలిసింది. షీనా బోరాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపారని.. ఆమెను తన చెల్లెలిగా పరిచయం చేసుకున్నారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఇంద్రాణీ ముఖర్జీ మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్ అనే కుమారుడు జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. అప్పటికే పెద్దదయిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. ఆమె తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇందుకోసం ప్లాన్ చేసి.. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో షీనాను హత్య చేసింది. ఈ కేసులో 2015 సెప్టెంబర్‌లో ఇంద్రాణీ, సంజీవ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం మూడో భర్త పీటర్ ముఖర్జియాను సైతం అదుపులోకి తీసుకున్నారు. బతికే ఉందని డ్రామాలు 2019లో జైల్లో ఉండగానే పీటర్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2020లో పీటర్‌కు బెయిల్ వచ్చింది. ఇంద్రాణీ జైల్లో శిక్ష పొందుతున్న సమయంలో.. తన కుమార్తె ప్రాణాలతోనే ఉందని సీబీఐకి లేఖ రాసింది. షీనా బోరాను జైలు అధికారి ఒకరు కశ్మీర్లో చూశానని చెప్పిందని ఆ లేఖలో పేర్కొన్న ఇంద్రాణి.. ఈ విషయమై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ మీద బయటకు రావడం కోసం అనేక సార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆరున్నరేళ్లపాటు శిక్ష అనుభవించాక ఎట్టకేలకు ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ 68 మందిని మాత్రమే విచారించింది. చదవండి: షీనా బతికే ఉందా? బయటకొచ్చిన ఇంద్రాణి ఏం చెప్పిందంటే.. -
జైల్లో కరోనా కల్లోలం: 6 మంది పిల్లలతో సహా 39 మందికి పాజిటివ్
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసుల నమోదు తక్కువగా ఉందని ఉపశమనం పొందుతున్న వేళ జైల్లో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఓ జైలులో ఆరుగురు చిన్నారులతో సహా 39 మంది మహిళా ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు నివారణ చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని బైకుల్లా మహిళా జైలులో పది రోజుల కిందట ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. అధికారికంగా మాత్రం శనివారం తెలిపారు. కరోనా బారినపడిన 39 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పాజిటివ్ తేలిన అనంతరం వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అయితే వారిలో ఓ గర్భిణి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటివరకు మొత్తం 120 మంది ఖైదీలు, సిబ్బంది కరోనా బారినపడినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. -
ఇంద్రాణి ముఖర్జీయా సహా 40 మంది ఖైదీలకు కోవిడ్
ముంబై: కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విస్తరిస్తోంది. చిన్న, పెద్ద, బీద, ధనిక తేడాలేం లేకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తోంది. తాజాగా జైల్లోకి కూడా ఎంటరయ్యింది మహమ్మారి. 38 మంది ఖైదీలు కోవిడ్ బారిన పడ్డారు. ఈ ఘటన కరోనాతో విలవిల్లాడుతున్న మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబై బైకుల్లా జైలులో 38 ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో షీనా బోరా హత్య కేసు నిందితురాలు అయిన ఇంద్రాణి ముఖర్జీయా కూడా ఉన్నారు. జైలు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాక నగరంలోని పరం శాతిధాం వృద్ధాశ్రమంలో 58 మందికి కోవిడ్ సోకినట్లు తెలిసింది. ఇక మంగళవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 58,924 కోవిడ్ కేసులు నమోదవ్వగా.. 351 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు మూడు లక్షలకు చేరువవ్వగా.. 2,023 మంది మరణించారు. చదవండి: మీ కక్కుర్తి తగలడా.. ప్రాణం కన్న బీరే ముఖ్యమా? -
జైల్లో రియాకు కనీసం ఫ్యాన్, బెడ్ కూడా లేదా..
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మంగళవారం అరెస్టు అయిన రియా చక్రవర్తిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకున్న రియాకు ఈ రోజు(శుక్రవారం) కోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, మరో నలుగురు నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది. మొదటిసారి రియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో రియా బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించగా.. ఈసారి కూడా బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు నిందితుల తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారు. (రియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ) ఇదిలా ఉండగా.. బైకుల్లా జైలులో నటి రియా సీలింగ్ ఫ్యాన్, మంచం కూడా లేని ఓ సెల్లో ఉన్నట్లు సమాచారం. రియాకు జైలులో భద్రత కారణంగా మూడు షిఫ్టుల్లో ఇద్దరు చొప్పున కానిస్టేబుళ్లు సెక్యూరిటీగా ఉంటున్నారు. రియా పడుకునేందుకు కేవలం చాప మాత్రమే ఉన్నట్లు. కనీసం మంచం, దిండు కూడా ఇవ్వలేనట్లు తెలుస్తోంది. కాగా రియా సెల్లో ఫ్యాన్ లేదని అధికారులు తెలిపారు. ఒకవేళ కోర్టు అనుమతిస్తే ఆమెకు టేబుల్ ఫ్యాన్ అందిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా బైకుల్లా జైలులో గత కొంత కాలంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఖైదీలకు పసుపు పాలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమె పక్కనే ఉన్న సెల్లో కుమార్తె షీనా బోరాను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియా ఉన్నారు. (2 సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే; అవునా!) -
బలవంతంగా ఒప్పించారు: రియా
ముంబై: ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న రియాచక్రవర్తి తనకు జైల్లో ప్రాణభయం ఉన్నదనీ, తనపై మోపినవి బెయిలబుల్ నేరాలు కనుక తక్షణమే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. తాను అమాయకురాలిననీ, తనని తప్పుడు కేసులో ఇరికించారనీ రియా తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. మంగళవారం మెజిస్ట్రేటు కోర్టు రియా బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించడంతో రియా, ఆమె సోదరుడు షోవిక్‌లు నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద బెయిల్ కోసం ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. రియాని ప్రశ్నించింది పురుష అ«ధికారులేనని ఆమె న్యాయవాది సతీష్ మనే షిండే అన్నారు, ఆ సమయంలో కనీసం మహిళా పోలీసు అధికారి కానీ, కానిస్టేబుల్ కానీ లేకపోవడాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. నేరం అంగీకరించేలా రియాపై ఒత్తిడిచేశారని ఆమె లాయర్ ఆరోపించారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ల బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు రానుందని షిండే తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో మంగళవారం స్థానిక కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు జ్యూడీషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. నేరం రుజువైతే రియా, ఆమె సోదరుడు షోవిక్ పదిసంవత్సరాలకు తగ్గకుండా కారాగార శిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. -
మహిళా ఖైదీకి కరోనా పాజిటివ్
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా తేలగా తాజాగా మహిళా ఖైదీకి కూడా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. ముంబై సమీపంలోని బైకుల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళా ఖైదీకి ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను క్వారెంటైన్‌కు పంపించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ద్వారా మరెవరికైనా వైరస్ సోకిందా అనే కోణంలో జైలు అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. కాగా మహారాష్ట్రలో ఓ మహిళా ఖైదీకి కరోనా సోకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. (ఖైదీలకు కరోనా.. హైకోర్టు ఆగ్రహం) కాగా మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సెంట్రల్ ముంబైలోని అర్థూర్ రోడ్ జైలులో ఖైదీలకు, అధికారులకు కరోనా సోకడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. జైల్లో ఖైదీలను వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆర్ధూర్ జైలులో 77 ఖైదీలకు, 27 మంది జైలు అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,228 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. (కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాలివే) -
ఆస్పత్రిలో చేరిన ఇంద్రాణి
ముంబై : షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు అనుమానిస్తున్నారు. అయితే, జైలు అధికారులుగానీ, ఆస్పత్రి వర్గాలుగానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. గతంలో కూడా అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణీని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. -
ఇంద్రాణితో కలిపి కార్తీ విచారణ
ముంబై: ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణలో భాగంగా సీబీఐ ఆదివారం కార్తీ చిదంబరంను ఢిల్లీ నుంచి ముంబైలోని బైకుల్లా జైలుకు తీసుకు వచ్చింది. అక్కడ ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్, షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియాతో కలిపి విచారణ జరిపింది. ఇద్దరినీ ఒకే చోట కూర్చోబెట్టిన ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం ఉదయం 11.15 గంటల నుంచి నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కార్తీని తిరిగి విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇద్దరినీ విచారణ జరుపుతున్న సమయంలో బైకుల్లా జైలు గేట్లను మూసి వేశారు. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 2007లో ఆయన కుమారుడు కార్తీ నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విదేశీ నిధులకు అనుమతులు మంజూరు చేయించారనీ ఇంద్రాణి ఇటీవల సీబీఐ ఎదుట అంగీకరించారు. -
ఆమెను కొట్టినమాట నిజమే!
ముంబై: మాజీ మీడియా అధిపతి ఇంద్రాణి ముఖర్జియా శరీరంపై తీవ్ర గాయాలు ఉన్న విషయం నిజమేనని, ఆమె చేతిపై, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని వైద్య నివేదిక స్పష్టం చేసింది. ముంబైలోని బైకుల్లా జైలు సిబ్బంది తనపై దాడిచేసి తీవ్రంగా కొట్టారని కోర్టులో ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కూతురు షీనాబోరా హత్యకేసులో ప్రధాని నిందితురాలిగా బైకులా జైలులో ఇంద్రాణి గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇదే జైలులో తోటి మహిళ ఖైదీ మంజుల మృతిపై ఆమె కోర్టులో సాక్ష్యం తెలిపారు. తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే.. మంజులకు పట్టిన గతే నీకు పడుతుందని జైలు అధికారులు తనను హెచ్చరించినట్టు చెప్పారు. తనపై జైలు సిబ్బంది దాడి చేశారని తెలిపారు. మహిళా ఖైదీ మంజుల షెత్యేపై జైలు సిబ్బంది కిరాతకంగా వ్యవహరించి.. ఆమె మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జైలు సిబ్బందిపై నాగపాద్ పోలీసులు కేసు నమోదుచేశారు. చదవండి: మహిళా ఖైదీపై అత్యంత క్రూరత్వం.. -
‘గొంతుకు చీర బిగించి ఈడ్చుకెళ్తుంటే చూశాను’
ముంబయి: ముంబయిలోని బైకుల్లా జైలులో చోటు చేసుకున్న దారుణాన్ని బుధవారం ఇంద్రాణి ముఖర్జియా కోర్టుకు వివరించారు. జైలు అధికారులు మంజులా షెట్యి అనే ఖైదీపట్ల ఎంత అనుచితంగా ప్రవర్తించారో వెల్లడించారు. కోడిగుడ్లు దొంగిలించిందనే కారణంతో మంజులా అనే ఖైదీని ఆ జైలు సూపరింటెండెంట్ చాలా దారుణంగా కొట్టడమే కాకుండా బ్యాటన్‌తో లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె చనిపోవడంతో జైలులో పెద్ద ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ఇంద్రాణిపై కూడా జైలు అధికారులు దాడి చేసినట్లు ఆమె తరుపు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేయడంతో ఆమెను కోర్టులో హాజరుపరచాల్సిందిగా బైకుల్లా జైలు అధికారులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం కోర్టులో హాజరైన ఇంద్రాణి ‘మా పక్క సెల్లోనే ఉంటున్న మంజుల గొంతుకు చీరను చుట్టేసి జైలు సూపరింటెండెంట్ అధికారిణి బయటకు ఈడ్చేసుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాన్ని నేను నా సహచర ఖైదీలం సెల్ తలుపు రంధ్రంలో నుంచి చూశాం. ఈ విషయం నేను ఎవరితోనైనా చెబితే నాకు అలాంటి గతే పడుతుందని హెచ్చరించారు. బాధితురాలపట్ల అమానవీయంగా ప్రవర్తిస్తుంటే నేను కళ్లారా చూశాను’ అని వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం తన కూతురు షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. -
‘ఇంద్రాణిని ఒకసారి తీసుకురండి’
ముంబయి: కూతురుని హత్య చేయించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియాను తమ ముందు హాజరుపరచాలని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం బైకుల్లా జైలు అధికారులను ఆదేశించింది. బుధవారం ఆమెను కోర్టుకు తీసుకురావాలని చెప్పింది. బైకుల్లా జైలులో జరిగిన అల్లర్లలో ఇంద్రాణిని జైలు సిబ్బంది వేధించారని, ఆమె ఒంటిపై, తలకు గాయాలు కూడా అయ్యాయని పేర్కొంటూ ఆమె తరుపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో తాజాగా లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకొని తోటి ఖైదీ మరణించడంతో తానిప్పుడు భయపడుతున్నానని, జైలులో తీవ్ర హింస జరుగుతుందని కూడా కోర్టుకు సమర్పించిన పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. మెదడుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న ఇంద్రాణికి ఏదైనా జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కూడా అందులో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారు చేస్తున్న ఆరోపణలు నిజమోకాదో తెలుసుకునేందుకు కోర్టుకు తీసుకురావాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. -
బైకుల్లా జైలు.. ఓ భయంకర నిజం
ముంబయి: కూతురుని హత్య చేయించిన నేరంకింద ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా ఉంటున్న ముంబయిలోని బైకుల్లా జైలులో రెండు రోజుల కిందట జరిగిన సంఘటనకు సంబంధించి ఓ భయంకర నిజం వెలుగులోకి వచ్చింది. ఆ జైలులోని మహిళా విభాగం హెడ్ మనిషా పోకార్కర్ చేతుల్లో చావుదెబ్బలు తిని ప్రాణాలు విడిచిన ఓ మహిళా ఖైదీపై అత్యంత అమానవీయ దాడి జరిగిందని తెలిసింది. ఆమెను క్రూరంగా వేధించారని, లైంగిక వేధింపులకు గురిచేశారని తెలిసింది. దాదాపు హత్య చేసినట్లుగా పోకార్కర్ వ్యవహరించారని, ఓ బ్యాటన్‌తో ఆ మహిళను బయటకు చెప్పలేనంత దారుణంగా హింసించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. బైకుల్లా జైలులో రెండు రోజులుగా దాదాపు 200మంది మహిళా ఖైదీలు ఆందోళన చేస్తున్నారు. అందులో జీవితకారగార శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని మనిషా పోర్కర్ అత్యంత దారుణంగా కొట్టి అమానవీయంగా వ్యవహరించారు. భోజనం చేసే సమయంలో ఆ ఖైదీ రెండు కోడుగుడ్లు దొంగిలించిందనే కారణంతోనే ఆమెపై చేయి చేసుకొని హింసించారు. దీంతో తీవ్ర గాయాలపాలయిన ఆ యువతి ప్రాణాలుకోల్పోయింది. ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ జైలు అధికారులను సస్పెండ్ చేశారు. మహిళా ఖైదీని బ్యాటన్‌తో లైంగికంగా వేధించిన విషయం బయటకు రావడంతో తమ ప్రాణాలకు ఇక ఎక్కడ రక్షణ ఉంటుందని ఖైదీలంతా వాపోతున్నారు. ఈ చర్యకు పాల్పడిన పోకార్కర్పై కఠిన చర్యలు తీసుకోలేకుంటే తమ క్లెయింట్ ఇంద్రాణీని వేరే జైలుకు తరలించాలంటూ ఆమె తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికి బైకుల్లా జైలు ఘటన పెద్ద దుమారమే రేపుతోంది. -
మహిళా ఖైదీపై అత్యంత క్రూరత్వం..
తన ఉదయపు అల్పాహారంలో రెండు కోడిగుడ్లు, ఐదు బ్రెడ్డుముక్కలు తక్కువగా వచ్చాయని ఫిర్యాదు చేయడమే ఆ మహిళ ఖైదీ తప్పైంది. జైలర్లు ఆమెపై అత్యంత క్రూరంగా దాడి చేశారు. అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఇది ముంబై బైకుల్లా జైలులో అనుమానాస్పదంగా మృతి చెందిన 38 ఏళ్ల మంజులా షెత్యే ఉదంతం ఇది. ఆమె మృతితో బైకుల్లా జైలులోని తోటి మహిళా ఖైదీలు ఆందోళనకు దిగి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ అలర్ల ఘటనలో ఇదే జైలులో ఉంటున్న మాజీ మీడియా అధిపతి ఇంద్రాణి ముఖర్జీ సహా పలువురు ఖైదీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంజుల మృతి ఉదంతంపై ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మహిళా ఖైదీ అయిన మంజుల తన సత్ప్రవర్తన కారణంగా తన బ్యారక్ వార్డన్‌గా గుర్తింపు పొందింది. అయితే, ఈ నెల 23న ఉదయం 9 గంటలకు మంజుల తనకు ఇచ్చిన అల్పాహారంలో రెండు కోడిగుడ్లు, బ్రెడ్డు ముక్కలు తక్కువ ఇవ్వడంతో ఈ విషయాన్ని జైలు అధికారిణి మనీషా పోఖర్‌కర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో మనీషా పోఖర్కర్ ఆమెను తన ప్రైవేటు గదికి పిలిపించుకుందని, ఆ వెంటనే మంజుల బాధతో విలవిలలాడుతున్న అరుపులు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధతో అల్లాడుతూ ఆమె తన బ్యారక్ తిరిగి వచ్చిందని, ఆ తర్వాత మహిళా కానిస్టేబుళ్లు (బిందు నాయ్‌కడే, వసీమా షైక్, షీతల్ షెగావంకర్, సురేఖ గుల్వే, ఆర్తీ షింగ్నే తదితరులు) ఆమె బ్యారక్‌లోకి వచ్చి తన దుస్తులు విప్పేసి నగ్నంగా మార్చారని, ఇద్దరు కానిస్టేబుళ్లు (బిందు, సురేఖ) ఆమె కాళ్లు విడదీయగా.. వసీమ ఆమె ప్రైవేటు అంగంలోకి లాఠీని దూర్చి కిరాతకంగా ప్రవర్తించిందని, దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆమెకు ఎలాంటి వైద్యసాయం చేయలేదని, ఆమె బాత్రూంలో స్పృహ తప్పిపడిపోయిన తర్వాత మొదట రెసిడెంట్ డాక్టర్ వద్దకు, తర్వాత జేజే ఆస్పత్రికి తరలించారని సాక్షులు వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంజుల చనిపోయింది. ఈ ఘటనతో ఆగ్రహించిన మహిళా ఖైదీలు బైకులా జైలులో ఆందోళనకు, అల్లర్లకు దిగారు. ఈ ఘటనలో కూతురు షీనా బోర్రా హత్యకేసులో ఇదే జైలులో ఉంటున్న ఇంద్రాణి ముఖర్జీపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. -
200మందితో కలిసి జైలులో ఇంద్రాణి రచ్చ
ముంబయి: కన్నకూతురుని హత్య చేయించిన కేసులో జైలులో ఉంటున్న ఇంద్రాణి ముఖర్జియా చాలా రోజుల తర్వాత వార్తల్లోకి వచ్చారు. ఆమె ప్రస్తుతం ఉంటున్న జైలులో నానా హంగామా చేశారు. 200మంది తోటి ఖైదీలతో కలిసి జైలులో ఆందోళనకు, అల్లరికి పాల్పడ్డారు. ఈ క్రమంలో జైలులోని సామాన్లు ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని కూడా గాయపరిచారు. దీంతో ఆమెను ఇతర ఖైదీలను అదుపులోకి తీసుకొని మరోసారి తాజా అభియోగాలు నమోదు చేశారు. కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రస్తుతం ఇంద్రాణి ముఖర్జియా ముంబయిలోని బైకుల్లా జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ జైలులోని మంజురా షెట్యే అనే ఒక ఖైదీని ఓ పోలీసు అధికారిణి తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ అంశంపై నిన్న శనివారం ఉదయం నుంచి జైలులోని మహిళా ఖైదీలంతా కూడా ఆందోళన చేయడం మొదలుపెట్టారు. చాలామంది జైలు పైకి ఎక్కి వార్తా పేపర్లను తగులబెడుతూ జైలు అధికారుల వ్యతిరేక నినాదాలు ఇచ్చారు. ఇందులో మొత్తం 251మంది ఖైదీలు ఉండగా వారిలో 200మంది ఆందోళనకు దిగారు. వీరిలో ఇంద్రాణి ముఖర్జియా కూడా ఉండటంతో ఆమెపై కూడా కేసులు నమోదు చేశారు.