ముంబై: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు విచారణలో భాగంగా సీబీఐ ఆదివారం కార్తీ చిదంబరంను ఢిల్లీ నుంచి ముంబైలోని బైకుల్లా జైలుకు తీసుకు వచ్చింది. అక్కడ ఐఎన్‌ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్, షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియాతో కలిపి విచారణ జరిపింది. ఇద్దరినీ ఒకే చోట కూర్చోబెట్టిన ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం ఉదయం 11.15 గంటల నుంచి నాలుగు గంటల పాటు ప్రశ్నించింది.
మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కార్తీని తిరిగి విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇద్దరినీ విచారణ జరుపుతున్న సమయంలో బైకుల్లా జైలు గేట్లను మూసి వేశారు. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 2007లో ఆయన కుమారుడు కార్తీ నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్‌ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విదేశీ నిధులకు అనుమతులు మంజూరు చేయించారనీ ఇంద్రాణి ఇటీవల సీబీఐ ఎదుట అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment