Indrani Mukherjeea
-
చిదంబరంపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తదితరులపై ఢిల్లీ కోర్టులో సీబీఐ చార్జిషీటు వేసింది. శుక్రవారం ప్రత్యేక కోర్టు జడ్జి లాల్ సింగ్‌కు దీనిని సమర్పించింది. ఈ చార్జిషీటులో పీటర్ ముఖర్జీ, చార్టెర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరరామన్, నీతి ఆయోగ్ మాజీ సీఈవో సింధుశ్రీ ఖుల్లర్, మాజీ ఉన్నతాధికారులు అనుప్ కె.పుజారి, ప్రబోధ్ సక్సేనా, రవీంద్ర ప్రసాద్‌లతోపాటు ఐఎన్ఎక్స్ మీడియా, ఏఎస్‌సీఎల్ అండ్ చెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థల పేర్లున్నాయి. అప్రూవర్‌గా మారిన మరో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ పేరు కూడా ఇందులో ఉంది. వీరిపై అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షాస్మృతి కింద పలు అభియోగాలు మోపింది. కాగా, ఇదే కేసులో చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. -
ఐఎన్ఎక్స్ కేసు : ఇంద్రాణి ముఖర్జియాను ప్రశ్నించిన సీబీఐ
ముంబై : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జియాను సీబీఐ అధికారులు మంగళవారం బైకుల్లా జైలులో ప్రశ్నించారు. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం అరెస్టయిన సంగతి తెలిసిందే. కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ బైకుల్లా జైలులో ఖైదుగా ఉన్నారు. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసు, మనీల్యాండరింగ్ కేసుల్లో ఆమె అప్రూవర్‌గా మారారు. కాగా ఐదు దేశాలకు పంపిన లెటర్ ఆఫ్ రెగొటరీస్‌ల విషయంలో తలెత్తిన ప్రశ్నలకు ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ఇంద్రాణిని సీబీఐ విచారించినట్టు సమాచారం. కుమార్తె హత్య కేసులో నిందితులైన ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు ఐఎన్ఎక్స్ మీడియా గ్రూప్ ప్రమోటర్లు కావడం గమనార్హం. -
ఐఎన్ఎక్స్ కేసు : అప్రూవర్‌గా ఇంద్రాణి ముఖర్జి
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి ముఖర్జి అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ కోర్టు గురువారం అంగీకరించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీ ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి ముఖర్జి అప్రూవర్‌గా మారితే తమకు అభ్యంతరం లేదని, ఇది కేసులో తమ వాదనను మరింత బలోపేతం చేస్తుందని సీబీఐ అంతకుముందు కోర్టుకు నివేదించింది. ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణి ముఖర్జీ ఈ కేసులో సాక్షిగా మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియాకు 2007లో తన తండ్రి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కార్తీ చిదంబరం రూ 305 కోట్ల విదేశీ పెట్టుబడులకు ఆమోద ముద్ర వేయించారని సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్నాయి. ఇదే కేసులో గత ఏడాది ఫిబ్రవరి 28న కార్తీ చిదంబరంను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. -
ఇంద్రాణీ ముఖర్జియాకు అస్వస్థత
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా(46) అస్వస్థతకు లోనయ్యారు. దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలులో అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను అధికారులు శుక్రవారం రాత్రి ఇక్కడి జేజే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇంద్రాణీకి సీసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి డీన్ ఎస్డీ ననంద్కర్ తెలిపారు. ఇంద్రాణీ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందన్నారు. 2012, ఏప్రిల్‌లో కుమార్తె షీనా బోరాను అత్యంత కిరాతకంగా హత్యచేసిన కేసులో ఇంద్రాణీని పోలీసులు 2015లో అరెస్ట్ చేశారు. -
ఇంద్రాణితో కలిపి కార్తీ విచారణ
ముంబై: ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణలో భాగంగా సీబీఐ ఆదివారం కార్తీ చిదంబరంను ఢిల్లీ నుంచి ముంబైలోని బైకుల్లా జైలుకు తీసుకు వచ్చింది. అక్కడ ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్, షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియాతో కలిపి విచారణ జరిపింది. ఇద్దరినీ ఒకే చోట కూర్చోబెట్టిన ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం ఉదయం 11.15 గంటల నుంచి నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కార్తీని తిరిగి విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇద్దరినీ విచారణ జరుపుతున్న సమయంలో బైకుల్లా జైలు గేట్లను మూసి వేశారు. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 2007లో ఆయన కుమారుడు కార్తీ నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విదేశీ నిధులకు అనుమతులు మంజూరు చేయించారనీ ఇంద్రాణి ఇటీవల సీబీఐ ఎదుట అంగీకరించారు. -
ఇంద్రాణి ముఖర్జియాను ప్రశ్నించనున్న సీబీఐ
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మీడియా మాజీ అధిపతి ఇంద్రాణి ముఖర్జియాను సీబీఐ ప్రశ్నించనుంది. ఈ మేరకు ఇంద్రాణి ముఖర్జియాను రెండు రోజుల పాటు సీబీఐ కస్టడీకి స్పెషల్ జడ్జి సునీల్ రాణా అప్పగించారు. ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్లు షీనా బోరా హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిద్దరి ఆధ్వర్యంలో నడిచిన ఐఎన్ఎక్స్ మీడియా(ప్రస్తుతం 9ఎక్స్ మీడియా)కి విదేశీ పెట్టుబడుల ప్రొమోషన్ బోర్డు(ఎఫ్ఐపీబీ) క్లియరెన్స్ కోసం 2007 సంవత్సరంలో కార్తీ చిదంబరం రూ.3.5 కోట్లు అక్రమంగా వసూలు చేశాడని, ఆ డబ్బులను తన కంపెనీలోకి అక్రమ మార్గంలో మళ్లించుకున్నాడని సీబీఐ 2017 మేలో కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను కార్తి చిదంబరం తోసిపుచ్చారు. షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాను 2015, ఆగస్టు 25న ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉంది. -
ఇంద్రాణీకి పీటర్ విడాకులు..!
షీనా బోరా హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణీ ముఖర్జీయాకు ఆమె భర్త పీటర్ ముఖర్జీయా విడాకులు ఇవ్వదలుచుకున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంద్రాణీ పుట్టినరోజున ఆమెకు గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇస్తానని లేఖ రాసిన పీటర్.. తాజాగా విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు ఆయన లాయర్ మిహిర్ ఘీవాలా తెలిపారు. షీనా కేసులో గత నవంబర్ లో పీటర్ ను కూడా నిందింతుడిగా చేరుస్తూ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీటర్ అరెస్టయిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 40కుపైగా ఉత్తరాలను ఇంద్రాణీ రాసింది. వాటిలో తాను ఏ తప్పు చేయలేదని, 2016లో మంచి జీవితం ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. మొదట్లో వాటికి సమాధానం ఇవ్వని పీటర్ డిసెంబర్21న వచ్చిన లేఖకు మాత్రం జనవరిలో ఇంద్రాణీ పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి సమాధానం ఇచ్చారు. 2015 సెప్టెంబర్ నుంచి బైకుల్లా మహిళా కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణీ తరచుగా తన ఒంటరితనాన్ని పీటర్ తో పంచుకోవడానికి ప్రయత్నించారని, తనకున్న వ్యాధి (మెదడుకు రక్తప్రసరణ సరిగా అవకపోవడం) ముదురుతోందని త్వరలోనే మరణిస్తానని ఆమె లేఖలో తెలిపిందని పీటర్ మరో లాయర్ ఆబోద్ పాండా తెలిపారు. తన చివరి రోజులు భరించలేని నొప్పితో కూడుకొని ఉంటాయా? అని డాక్టర్లను ప్రశ్నించినప్పుడు.. వారు అదేం ఉండదని ముందు కోమాలోకి వెళ్లి తర్వాత మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారని ఇంద్రాణీ లేఖలో వివరించింది. అందుకు సమాధానంగా.. విధిరాతను ఎవరూ మార్చలేరు. తాను జైలు అధికారులతో మాట్లాడుతానని ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తనకు తెలపాలని కోరతానని చెప్పారు. కాగా గురువారం పీటర్ ముఖర్జియా బెయిల్ పిటీషన్ పై కోర్టులో మళ్లీ వాదనలు జరగనున్నాయి.