ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసుల నమోదు తక్కువగా ఉందని ఉపశమనం పొందుతున్న వేళ జైల్లో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఓ జైలులో ఆరుగురు చిన్నారులతో సహా 39 మంది మహిళా ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు నివారణ చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలోని బైకుల్లా మహిళా జైలులో పది రోజుల కిందట ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. అధికారికంగా మాత్రం శనివారం తెలిపారు. కరోనా బారినపడిన 39 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పాజిటివ్ తేలిన అనంతరం వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అయితే వారిలో ఓ గర్భిణి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటివరకు మొత్తం 120 మంది ఖైదీలు, సిబ్బంది కరోనా బారినపడినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment