ఓటీటీలో ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని మాత్రం స్ట్రీమింగ్ కావడానికి ముందు పలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. తాజాగా నెట్ఫ్లిక్స్లో రిలీజైన ఓ వెబ్ సిరీస్ మాత్రం రెండో వారంలోనూ దూసుకెళ్తోంది. దాదాపు 18 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఇంతకీ ఈ వెబ్ సిరీస్‌లో ఏంటంతా ప్రత్యేకత?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా డాక్యుమెంటరీ తరహా వెబ్ సిరీసులు తీస్తోంది. అలా షీనా బోరా హత్య కేసు ఆధారంగా తీసిందే 'బరీడ్ ట్రూత్: ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ'. స్ట్రీమింగ్ కావడానికి ముందే కోర్టు, కేసుల వరకు వెళ్లిన ఈ సిరీస్.. ఫిబ్రవరి 29న ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
రిలీజైన రోజు నుంచే ఆదరణ దక్కించుకున్న ఈ సిరీస్‌కు ఇప్పటివరకు 2.2 మిలియన్ వ్యూస్, 6.9 మిలియన్ వాచ్ హవర్స్‌కి పైగా సొంతం చేసుకుంది. అలానే నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-7లో ఉంది. దాదాపు 18కి పైగా దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే నిజ జీవితంలో జరిగిన హత్య తాలుకూ కథతో తీసిన సిరీస్ కావడంతోనే ఈ రేంజ్ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మీరు చూడకపోతే ట్రై చేయండి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'భ్రమయుగం' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment