హత్యకు గురయ్యే ముందు షీనా గర్భవతా? | Was Sheena Bora pregnant before being killed? | Sakshi
Sakshi News home page

హత్యకు గురయ్యే ముందు షీనా గర్భవతా?

Published Fri, Aug 28 2015 1:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

హత్యకు గురయ్యే ముందు షీనా గర్భవతా?

హత్యకు గురయ్యే ముందు షీనా గర్భవతా?

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. షీనా బోరాను హత్య చేసే సమయానికి ఆమె గర్భవతి అయినట్టు సమాచారం.  ముఖర్జియా కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఈ విషయం చెప్పారని ఆన్లైన్ మీడియా వెల్లడించింది.

ఆన్లైన్ మీడియా సమాచారం మేరకు.. షీనా ఓ వ్యక్తితో కలసి ఓ ఆగ్నేయాసియా దేశానికి బిజినెస్ ట్రిప్ వెళ్లారు. ఆ వ్యక్తి షీనా తల్లి ఇంద్రాణికి సన్నిహితుడు. ఇంద్రాణి ఈ విషయంపై ఆ వ్యక్తిని ప్రశ్నించగా, ఆయన షీనాతో కలసి వెళ్లినట్టు ఒప్పకున్నారు. తాను గర్భవతి అయినట్టు షీనా తన తల్లి ఇంద్రాణికి చెప్పారు. ఆ తర్వాత షీనా హత్యకు గురైంది. ఆమెను హత్య చేసి అడవుల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు.

ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా ఆమె కుమార్తె షీనాను గొంతు నులిమి చంపేసినట్టు వారి కారు డ్రైవర్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్‌ని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా ఇంటరాగేట్ చేశారు. కోల్‌కతాలో అరెస్టు చేసిన మూడో నిందితుడు సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి రెండోభర్త)ను పోలీసులు విచారించారు. హత్య జరిగిన తీరు సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ ఎస్పీరాయ్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement