ఇంద్రాణికి డెంగ్యూ! | Indrani Mukerjea suspected to be suffering from dengue in jail | Sakshi
Sakshi News home page

ఇంద్రాణికి డెంగ్యూ!

Published Wed, Oct 28 2015 4:32 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

ఇంద్రాణికి డెంగ్యూ! - Sakshi

ఇంద్రాణికి డెంగ్యూ!

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా డెంగ్యూతో బాధపడుతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. గత ఏడు రోజులుగా ఆమె డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు ఆమె ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు కోర్టుకు వివరించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం జైలులో ఉంచే చికిత్స అందిస్తున్నామని వైద్యులు తప్పనిసరిగా ఆస్పత్రికిగా తరలించాలంటే ఆ పని చేస్తామని చెప్పారు.

ఈ నెల ప్రారంభంలో అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లి అటు జైలు అధికారులను, షీనా కేసు దర్యాప్తు అధికారులు ఇంద్రాణి కలవరపెట్టిన విషయం తెలిసిందే. ఆమెకు కొద్ది రోజులపాటు చికిత్స చేసి తిరిగి జైలుకు తరలించారు. 2012 ఏప్రిల్ నెలలో తన కన్న కూతురు 24 ఏళ్ల షీనా బోరాను ఇంద్రాణి మరికొందరితో కలిసి హత్య చేయగా.. ఆమెను పోలీసులు గత ఆగస్టు 25న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బైకుల్లా జైలులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement