ముంబయి: కన్నకూతురు షీనాబోరాను హతమార్చిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జీయాకు మరోసారి చుక్కెదురు అయింది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. అవసరం అయితే ఇంద్రాణీ ప్రయివేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చేందుకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది. కాగా తన ఆరోగ్యం బాగోలేదని, బలహీనత కారణంగా తాను కళ్లు తిరిగి పడిపోతున్నానని, తనకు బెయిల్ మంజూరు చేస్తే ఆసుపత్రిలో చూపించుకుంటానని ఇంద్రాణీ ముఖర్జీయా బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇంద్రాణికి మరోసారి చుక్కెదురు
Published Fri, Apr 1 2016 3:47 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM
Advertisement
Advertisement