sheena bora murder case
-
షీనా బోరా మర్డర్ కేసు: ట్విస్టుల మీద ట్విస్టులు..
సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేదిగా ఉండడం వల్లే షీనా బోరా హత్య కేసు.. దేశంలో అంతగా సంచలనం సృష్టించించింది. మూడేళ్ల తర్వాత హత్యోదంతం వెలుగులోకి వస్తే.. కేసులో ప్రధాన నిందితురాలిగా జైల్లో ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ ఆరున్నరేళ్ల తర్వాత ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చింది. మీడియా ఎగ్జిక్యూటివ్‌గా సొసైటీలో మంచి పేరున్న ఇంద్రాణీ.. సొంత కూతురు షీనాను హత్య చేసేందుకు ఎన్ని ప్లాన్లు వేసింది? ఏది వర్కవుట్ అయింది? పోలీస్ డైరీ ఆధారంగా.. షీనా బోరా హత్యకేసులో కీలకసూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆమె కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ. రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసుల విచారణలో తేలింది. అసలు షీనాను ముంబైలోని ఆమె ఇంట్లోనే హత్యచేయాలని సంజీవ్‌ఖన్నా సూచించారు. కానీ, ఆ ఇంట్లో షీనాతోపాటు తన భర్త(మూడో భర్త) పీటర్ ముఖర్జియా, కొడుకు రాహుల్ ముఖర్జియా కూడా ఉన్నందువల్లే ఇంద్రాణి ఆ ప్లాన్‌కు ఒప్పుకోలేదు. ఈ కేసులో రాహుల్ పేరు రావడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అయితే పీటర్ ముఖర్జియా ముంబైలో లేని సమయం చూసి.. షీనాను ఇంటికి పిలిచి హత్యచేయాలని ఇంద్రాణీ సంజీవ్‌కు సూచించింది. అయితే సొంతింట్లో హత్యజరిగితే పోలీసులు ఇంద్రాణీని అనుమానించే అవకాశం ఉండడంతో వద్దని సంజీవ్‌ఖన్నా ఆమెను వారించాడు. దీంతో ఇద్దరూ కలిసి... కారులోనే షీనాను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం డ్రైవర్ శ్యాంరాయ్‌ను చేర్చుకుని హత్యకు కుట్ర పన్నారు. ఈ హత్యకేసులో ముగ్గురు నిందితుల వాంగ్మూలాలతో పాటు... కాల్‌డాటా రికార్డులను పోలీసులు పోల్చిచూశారు. 23 ఏప్రిల్ 2012న జరిగిన సంఘటనలతో ఓ టైం లైన్ తయారు చేశారు. అది.. ఏప్రిల్ 23, 2012.. ఉదయం 9గంటలు: డ్రైవర్ శ్యాంరాయ్‌తో కలిసి ఇంద్రాణీ ముఖర్జీ.. రాయ్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహించింది. షీనాను హత్యచేశాక మృతదేహం ఎక్కడ పారేయ్యాలో నిర్ణయించుకుంది. ఉదయం 11.30నిమిషాలకు: రెండో భర్త సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసిన ఇంద్రాణి.. దాదాపు 7నిమిషాలు మాట్లాడింది. ఉదయం 11.37నిమిషాలకు: ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్‌టాప్ హోటల్లో సంజీవ్‌ఖన్నా కోసం ఇంద్రాణి ఓ రూమ్ బుక్ చేసింది. అది.. ఏప్రిల్ 24, 2012.. మద్యాహ్నం 1.47నిమిషాలకు: సంజీవ్ ఖన్నా కోల్‌కతా నుంచి ముంబై చేరుకుని... ట్యాక్సీలో హిల్‌టాప్ హోటల్ చేరుకున్నాడు. మద్యాహ్నం 1.53నిమిషాలకు: ఇంద్రాణికి కాల్చేసి తాను ముంబై చేరుకున్నానని చెప్పిన సంజీవ్‌ఖన్నా మద్యాహ్నం 2.38నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసి రూమ్‌లో సదుపాయాలు సరిగానే ఉన్నాయా అని అడిగి తెలుసుకుంది ఇంద్రాణి. మద్యాహ్నం 3.11నిమిషాలకు: మరోసారి రెండోభర్త సంజీవ్‌ఖన్నాకు కాల్చేసి... హత్యకు సంబంధించి ప్లాన్‌పై డిస్కస్ చేసింది ఇంద్రాణి. సాయంత్రం 6గంటలకు: హిల్‌టాప్ హోటల్ నుంచి సంజీవ్‌ఖన్నాను హిల్‌టాప్ హోటల్ నుంచి పికప్ చేసుకుంది. ఇంద్రాణి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు డ్రైవ్ చేస్తున్నారు. సాయంత్రం 6.45 నిమిషాలకు: ముంబైలోని లింకింగ్ రోడ్ చేరుకున్న ముగ్గురు... షీనాబోరా కోసం ఎదురుచూశారు. సాయంత్రం 7.03 నిమిషాలకు: లింకింగ్ రోడ్‌లోని నేషనల్ కాలేజ్ సమీపంలో తన కోసం వెయిట్ చేస్తున్న ఓపెల్ కోర్సా కారులో కూర్చుంది షీనా. సాయంత్రం 7.16నిమిషాలకు: ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్ శ్యాం మనోహర్ నవీ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుంచి కారు ఐరోలీ వైపు ప్రయాణించింది. రాత్రి 8.27 నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు వేగంగా వెలుతున్న సమయంలో... కారు ఆపాల్సిందిగా డ్రైవర్‌ను ఇంద్రాణి ఆదేశించింది. అయితే అప్పటికే షీనాబోరాకు ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నాలు మత్తు మందు ఇచ్చిన విషయం డ్రైవర్‌కు తెలియదు. దీంతో తాను టాయిలెట్‌కు వెళతానని చెప్పి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు దిగి వెళ్లాడు. డ్రైవర్ వెళ్లగానే ఇంద్రాణీ తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. సంజీవ్‌ఖన్నా షీనా గొంతు నులిమి చంపేశాడు. డ్రైవర్ టాయిలెట్‌కు వెళ్లి తిరిగి రాగానే కారును దూరంగా పోనివ్వమని.. ఇంద్రాణి చెప్పింది. అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్ మార్చుకోవాలని ఇంద్రాణీ, సంజీవ్‌లు నిర్ణయించుకున్నారు. రాయ్‌గఢ్ వెళ్లడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాతంలోనే శవాన్ని పూడ్చిపెడదామని సంజీవ్ అన్నాడు. రాత్రి 9.01నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని విఖ్రోలి ప్రాంతంలో పోలీస్ గస్తీని చూడగానే వీరు ముగ్గురు భయపడ్డారు. రాత్రి 9.14నిమిషాలకు: వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి శవాన్ని కారులోనే ఉంచి పీటర్ ముఖర్జియా ఇంట్లోని గ్యారేజ్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 11.01 నిమిషాలకు: షీనా మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి... కారు డిక్కీలో ఉంచారు. అది.. ఏప్రిల్ 25, 2012 అర్థరాత్రి 12.19నిమిషాలకు: సంజీవ్‌ఖన్నా తన హిల్‌టాప్ హోటల్‌కు బయలేదేరాడు అర్ధరాత్రి 12.30నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు కాల్చేసిన ఇంద్రాణి... ఉదయం ఏంచేయాలనే దానిపై ఇద్దరు చర్చించుకున్నారు. అర్ధరాత్రి12. 57నిమిషాలకు: కారులోనే ఉన్న డ్రైవర్ శ్యామ్రాయ్కు ఫోన్‌చేసింది ఇంద్రాణి. అర్ధరాత్రి 01.19నిమిషాలకు: మరోసారి డ్రైవర్ శ్యాంరాయ్‌కు ఫోన్ చేసిని ఇంద్రాణి... బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అర్ధరాత్రి 02.30నిమిషాలకు: తన గదిలోంచి కిందికి దిగివచ్చిన ఇంద్రాణీ... డ్రైవర్‌తో కలిసి హిల్‌టాప్ హోటల్‌కు బయలుదేరి వెళ్లింది. అర్ధరాత్రి 02.47 నిమిషాలకు: రాయ్‌గఢ్‌లోని గగోడే బుద్రుక్ గ్రామానికి బయలుదేరిన ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యాంరాయ్. తెల్లవారుజామున 04.21 నిమిషాలకు: గగోడే బుద్రుక్ గ్రామ సమీపంలో చేరుకోగానే... కారులోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తన కూతురు శవాన్ని చూసి భయపడ్డ ఇంద్రాణీ.. వెంటనే శవాన్ని దహనం చేయాలని చెప్పింది. తెల్లవారుజామున 04.33నిమిషాలకు: కారు దగ్గరికి వెళ్లి నిల్చున్న ఇంద్రాణి... సంజీవ్‌ఖన్న, శ్యాంరాయ్‌లు శవాన్ని మట్టుబెట్టేవరకు ఎదురుచూసింది. ఉదయం 05.13నిమిషాలకు: అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్దిదూరం వెళ్లి... తిరిగి శవాన్ని మట్టుబెట్టిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా చూసి ఇంటికి బయలుదేరారు. ఉదయం 07.33నిమిషాలకు: ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోయారు. చదవండి: పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్‌తో షీనా సన్నిహితంగా ఉండడం వల్లే.. -
అందరినీ క్షమించేస్తున్నా: ఇంద్రాణి ముఖర్జీ
ముంబై: ఒకప్పటి మీడియా ప్రముఖురాలు ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చింది. కూతురు షీనాబోరా హత్యకేసులో జైలుకు వెళ్లిన ఆమె.. బెయిల్‌పై శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయ్యారు. ఈ క్రమంలో మీడియా ఆమెను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాత్రం నవ్వుతూ.. అన్నింటికి సమాధానం ఇచ్చుకుంటూ పోయారు. ఈ కేసులో ఇంద్రాణిని ఇరికించే ప్రయత్నం ఎవరైనా చేశారా? అని ప్రశ్న ఎదురుకాగా.. నన్ను ఇబ్బంది పెట్టిన అందరినీ క్షమించేస్తున్నా. అంతే అని బదులిచ్చారు. ఇక కూతురు(షీనా బోరా) బతికే ఉందా?.. ఆ వాదనను సమర్థిస్తారా? అనే ప్రశ్నను దాటవేశారామె. ‘‘ఈ కేసు గురించి ఇప్పడేం మాట్లాడలేను. జీవితాన్ని పలు దృకోణాల్లో చూడడం ఇప్పుడే నేర్చుకున్నా. దారిలో ఎందరినో కలుసుకున్నా. ఇదొక ప్రయాణం. ఓపికగా ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు సంతోషంగా ఉంది అని చెప్పింది యాభై ఏళ్ల ఇంద్రాణి ముఖర్జీ. బయటకు వెళ్లాక ఏం చేస్తారు అనే ప్రశ్నకు.. జైళ్లో ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా అంతే. ఎలాంటి ఆలోచనలు లేవు. న్యాయవ్యవస్థ మీద నమ్మకం మళ్లీ వచ్చింది. ఆలస్యం అయినా న్యాయం జరిగిందని నమ్ముతున్నా. సంతోషం తప్ప.. వేరే ఏ భావోద్వేగం లేదు నాలో. త్వరలో ఓ బుక్ రాయాలనుకుంటున్నా. కానీ, అది జైలు జీవితం గురించి మాత్రం కాదు అని చెప్పారామె. చదవండి: ఇంద్రాణి ముఖర్జీ పతనం ఎలా అయ్యిందంటే.. -
Indrani Mukerjea: కూతురి హత్య కేసులో ఆరేళ్ల తర్వాత బయటకు..
చాలా చాలా సంతోషంగా ఉంది.. బెయిల్ మీద బయటకు వచ్చిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన మొదటి మాట ఇది. సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయగా.. రెండు లక్షల రూపాయల షూరిటీ బాండ్ మీద అనుమతి ఇచ్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. శుక్రవారం సాయంత్రం దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యింది ఆమె. సుమారు ఆరున్నరేళ్ల తర్వాత ఇంద్రాణి బయటి ప్రపంచాన్ని చూసింది. ముంబై: కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ(50)కి.. సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా కోర్టు.. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆపై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో.. శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలు, కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులై.. ఇలా నేరపూరిత స్వభావంతో వార్తల్లోకి ఎక్కింది. ముగ్గురు భర్తల ఇంద్రాణి.. ఇంద్రాణి ముఖర్జీకి మొదటి భర్తతో కలిగిన సంతానం షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే.. మూడేళ్ల వరకు ఆ విషయం బయటకు పొక్కలేదు. 2012లో షీనా బోరాను హత్య చేయగా.. మూడేళ్ల తర్వాత ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్య కేసు గురించి తెలిసింది. షీనా బోరాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపారని.. ఆమెను తన చెల్లెలిగా పరిచయం చేసుకున్నారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఇంద్రాణీ ముఖర్జీ మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్ అనే కుమారుడు జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. అప్పటికే పెద్దదయిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. ఆమె తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇందుకోసం ప్లాన్ చేసి.. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో షీనాను హత్య చేసింది. ఈ కేసులో 2015 సెప్టెంబర్‌లో ఇంద్రాణీ, సంజీవ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం మూడో భర్త పీటర్ ముఖర్జియాను సైతం అదుపులోకి తీసుకున్నారు. బతికే ఉందని డ్రామాలు 2019లో జైల్లో ఉండగానే పీటర్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2020లో పీటర్‌కు బెయిల్ వచ్చింది. ఇంద్రాణీ జైల్లో శిక్ష పొందుతున్న సమయంలో.. తన కుమార్తె ప్రాణాలతోనే ఉందని సీబీఐకి లేఖ రాసింది. షీనా బోరాను జైలు అధికారి ఒకరు కశ్మీర్లో చూశానని చెప్పిందని ఆ లేఖలో పేర్కొన్న ఇంద్రాణి.. ఈ విషయమై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ మీద బయటకు రావడం కోసం అనేక సార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆరున్నరేళ్లపాటు శిక్ష అనుభవించాక ఎట్టకేలకు ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ 68 మందిని మాత్రమే విచారించింది. చదవండి: షీనా బతికే ఉందా? బయటకొచ్చిన ఇంద్రాణి ఏం చెప్పిందంటే.. -
షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ లెదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీకి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ 68 మందిని మాత్రమే విచారించింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం లేదని, బెయిల్ ఇవ్వాలంటూ ఇంద్రాణి తరఫున వాదిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రొహ్తగి పేర్కొన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఇప్పట్లో ఈ కేసు విచారణ పూర్తయ్యేలా లేనందున బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. ‘‘ఈ కేసులో ఆరున్నరేళ్లుగా ఇంద్రాణి జైల్లోనే ఉన్నారు. ఇప్పటివరకు 50 శాతం మంది సాక్షుల విచారణ కూడా పూర్తి కాలేదు. చాలాకాలం గా జైల్లో ఉన్నందున బెయిల్ ఇస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏమిటీ కేసు...? ఇంద్రాణి ముఖర్జీకి ఆమె మొదటి భర్తతో పుట్టిన కుమార్తె షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే మూడేళ్ల వరకు ఆ విషయమే బయటకు రాలేదు. ఇంద్రాణి తన మొదటి భర్తతో విడిపోయాక సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనికి విడాకులిచ్చి ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. షీనా తన కుమార్తె అని కాకుండా తన చెల్లి అనే అందరికీ పరిచయం చేసింది. ఆమె కనిపించకపోతే అమెరికా వెళ్లిపోయిందని ఇంద్రాణి అందరినీ నమ్మబలు కుతూ వచ్చింది. అయితే మరో కేసులో ఇంద్రాణి డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తుండగా తల్లే కుమార్తెను చంపిన విషయం తేలింది. కారులో ప్రయాణిస్తుండగా షీనా బోరాకు ఊపిరాడ నివ్వకుండా చేసి తల్లి ఇంద్రాణియే చంపితే, ఆమెకు భర్త పీటర్ ముఖర్జీ, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ సహకరించినట్టుగా తేలింది. దీంతో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ని 2015లో అరెస్ట్ చేశారు. ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీకి మొదటి భార్య సంతానమైన రాహుల్ ముఖర్జీతో షీనా ప్రేమలో పడింది. వారిద్దరి మధ్య అఫైర్‌ని ఉందని తెలిసి తట్టుకోలేక ఇంద్రాణి కన్నకూతురని చూడకుండా పథకం ప్రకారం హత్య చేసిందని విచారణలో తేలింది. మరోవైపు జైల్లో ఉండగానే పీటర్, ఇంద్రాణిలు విడాకులు తీసుకున్నారు. 2019లో వారికి విడాకులు మంజూరయ్యాయి. చదవండి: గుజరాత్ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. హార్దిక్ పటేల్ రాజీనామా -
ఆమె బతికే ఉంది.. నమ్మరా?! మరో ట్విస్టు
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మరోసారి వార్తల్లో నిలిచింది. చనిపోయిందని భావిస్తున్న తన కూతురు షీనా బోరా బతికే ఉందంటూ (జనవరి 24, సోమవారం) ముంబైలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఒక రాతపూర్వక దరఖాస్తును లాయర్ ద్వారా కోర్టుకు సమర్పించింది. ఈ దరఖాస్తు కాపీని సీబీఐకి అందజేసిన కోర్టు. ఫిబ్రవరి 4వ తేదీన తన ప్రతిస్పందన ఫైల్ చేయాలని కోర్టు ఆదేశించింది. (షీనా బోరా హత్య కేసు : మరో సంచలన ట్విస్ట్) ఈ విషయాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి తెలియజేసినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించింది. తాను రాసిన లేఖపై సీబీఐ ఎలాంటి చర్య తీసుకుందో తెలుసుకోవాలని ఇంద్రాణి కోర్టును కోరింది. దీనిపై మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు తాపే ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. అంతేకాదు బోరా ఖచ్చితంగా బతికే ఉంది అనేందుకు తన వద్ద బలమైన కారణం ఉందని తెలిపింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఇంద్రాణి తనకు సత్వరమే న్యాయం చేయాలని కోరింది కాగా తన కూతురు షీనా బోరా బతికే ఉందంటూ గత ఏడాది డిసెంబరులో ఇంద్రాణి సీబీఐ డైరెక్టర్‌కు ఒక లేఖ రాసింది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. కశ్మీర్లో షీనా బోరాను కలిశానని సహ ఖైదీ తనకు చెప్పిందని ఆమె తన లేఖలో పేర్కొంది. కశ్మీర్లో షీనా బోరా కోసం గాలింపు చేపట్టాలని ఆమె సీబీఐని కోరిన సంగతి తెలిసిందే. -
షీనా బోరా హత్య కేసు : మరో సంచలన ట్విస్ట్
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్యకేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. తన కూతురు షీనా బతికే ఉందని ఈ హత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా మాజీ వ్యవస్థాపకురాలు ఇంద్రాణి ముఖర్జీ సీబీఐని ఆశ్రయించడం సంచలనంగా మారింది. దీనిపై విచారణ జరిపించాలని ఇంద్రాణి డిమాండ్ చేయంటా హాట్ టాపిక్‌గా నిలిచింది. తన కూతురు షీనా బోరా బతికే ఉందని ఇంద్రాణి సీబీఐ డైరెక్టర్‌కు ఒక లేఖ రాసింది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. కశ్మీర్లో షీనా బోరాను కలిశానని ఇటీవల జైలులోని సహ ఖైదీ తనకు చెప్పిందని ఆమె తన లేఖలో పేర్కొంది. కశ్మీర్లో షీనా బోరా కోసం గాలింపు చేపట్టాలని ఆమె సీబీఐని కోరింది. దీంతో ఈ లేఖపై విచారణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఇంద్రాణి తరఫు న్యాయవాది దీనిపై స్పందించారు. ఇంద్రాణి నేరుగా సీబీఐకి లేఖ రాశారని, ఈ లేఖలో ఆమె ఏమి ప్రస్తావించారో తనకు తెలియదని అన్నారు. దీనిపై సమాచారం సేకరిస్తానని చెప్పారు. కాగా షీనా బోరా ఇంద్రాణి మొదటి భర్త కుమార్తె. ఇంద్రాణి ముఖర్జీ తన ఇద్దరు పిల్లలు షీనా, మిఖాయిల్‌లను గౌహతిలో వదిలి ముంబైకి వెళ్లి అక్కడ మీడియా బారన్ పీటర్ ముఖర్జీని వివాహం చేసుకుంది. ఇంద్రాణి షీనాను తన సోదరిగా పీటర్‌కు పరిచయం చేసింది. అనూహ్యంగా 2012లో షీనా అదృశ్యమైంది. దాదాపు మూడేళ్ల తరువాత కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఇంద్రాణి ముఖర్జీని 2015లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ముంబైలోని బైకుల్లా జైలులో ఇంద్రాణి ఉంటున్నసంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మూడు ఛార్జిషీట్లు, రెండు అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అలాగే ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జీను నిందితులుగా పేర్కొంది. డబ్బు, ఇల్లు కోసం షీనా తల్లిని బ్లాక్ మెయిల్ చేసేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ తుపాకీ పట్టుబడటం, అతని వాంగ్మూలం ఆధారంగా ఇంద్రాణి షీనాను హత్య చేసిందని సీబీఐ ఆరోపించింది. అయితే విచారణ సమయంలో పీటర్, ఇంద్రాణి విడాకులు తీసుకోగా, పీటర్ కు 2020లో బెయిల్ లభించింది. ఈ కేసులో గత నెలలో ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
పీటర్ ముఖర్జియా విడుదల
ముంబై: 2012నాటి సంచలన షీనా బోరా హత్య కేసులో గత నాలుగేళ్లుగా జైళ్లో ఉంటున్న పీటర్ ముఖర్జియాకు శుక్రవారం విడుదల అయ్యారు. బాంబే హైకోర్టు ఆయనకు ఫిబ్రవరిలోనే బెయిల్ ఇచ్చినప్పటికీ.. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఆరువారాల పాటు ఆ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఆ స్టే గడువు గురువారంతో ముగిసింది. సీబీఐ అప్పీల్ చేసుకోకపోవడంతో ఆయన శుక్రవారం విడుదల అయ్యారు. సొంత కూతురు హత్యకు సంబంధించిన ఈ కేసులో ముఖర్జియా మాజీ భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన ముద్దాయి. పీటర్ ముఖర్జియా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లుగా ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని బెయిల్ ఉత్తర్వుల్లో బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. -
పీటర్ ముఖర్జీకి బెయిల్
ముంబై: మాజీ మీడియా అధిపతి పీటర్ ముఖర్జీకి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖర్జీ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ నితిన్ సంబ్రే గురువారం విచారణ చేపట్టారు. షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జీకి ప్రమేయమున్నట్లు సీబీఐ ఎటువంటి ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొన్నారు. ముఖర్జీ తన పాస్‌పోర్టును సీబీఐకి అప్పగించడంతోపాటు రూ.2 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఈ కేసులో సాక్షులుగా ఉన్న తన కుమారుడు రాహుల్, కుమార్తె నిధితో మాట్లాడరాదని జస్టిస్ నితిన్ సంబ్రే స్పష్టం చేశారు. ఈ విషయంలో సీబీఐ అప్పీల్ చేసుకునేందుకు వీలుగా బెయిల్ అమలుపై ఆరు వారాల స్టే విధించారు. షీనా బోరా హత్య కేసులో 2015లో అరెస్టయిన ముఖర్జీ అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. షీనా బోరా హత్య కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ కూడా 2015 నుంచి జైలులోనే ఉన్నారు. (చదవండి: మహారాష్ట్రలో దిశ చట్టం!) -
వైద్యం అందకపోతే చచ్చిపోతాను!
ముంబై: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలైన మీడియా బాస్ ఇంద్రాణి ముఖర్జీ సోమవారం ముంబై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర పన్నుతోందని ఈ పిటిషన్లో ఆరోపించిన ఆమె.. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఎమోషనల్‌గా అభ్యర్థించారు. వీలైనంత త్వరగా తనకు వైద్యం సహాయం అందకపోతే తాను చనిపోతానని, తన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో సత్వరమే బెయిల్ ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని వేడుకున్నారు. ‘దాదాపు ఏడాది కిందట రాహుల్ ముఖర్జీ ఈ కేసులో తదుపరి సాక్షి అని ప్రాసిక్యూషన్ పేర్కొంది. 14 నెలలు అయినా ఇప్పటివరకు అతన్ని కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టలేదు. మరోవైపు అతడు కీలక సాక్షి అంటూ.. అతని సాక్ష్యం ఇవ్వని కారణంగా నాకుబెయిల్ నిరాకరిస్తూ వస్తున్నారు’ అని వాదనల సందర్భంగా ఇంద్రాణి న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలా సాక్షిని ప్రవేశపెట్టకుండా తనకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. దీంతో ఈ కేసులో వాదనలను వేగవంతం చేయాలని ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లను ఆదేశించిన జడ్జి బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. -
‘అతడు ఓ సైలెంట్ కిల్లర్; అప్పుడు తనేం చేశాడు మరి?’
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మాజీ మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా సైలెంట్ కిల్లర్‌లా వ్యవహరించారని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. సవతి కూతురును దారుణంగా హత్య చేయించారనే ఆరోపణలతో 2015లో పీటర్ అరెస్టైన సంగతి తెలిసిందే. షీనా తల్లి, పీటర్ రెండో భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలిగా ఉన్న ఈ కేసులో తనకు బెయిలు కావాలంటూ పీటర్ మరోసారి అప్పీలు చేశారు. ఈ క్రమంలో షీనా బోరా హత్యకేసు శుక్రవారం మరోసారి సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది.(వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..) ఈ నేపథ్యంలో పీటర్‌కు బెయిలు నిరాకరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ భరత్ బదామీ కోర్టుకు విఙ్ఞప్తి చేశారు. ఈ కేసులో పీటర్ ముద్దాయి అని నిరూపించడానికి సీబీఐ వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయని విన్నవించారు. షీనా హత్య జరిగినపుడు తన క్లైంట్ లండన్‌లో ఉన్నారని పీటర్ న్యాయవాది పేర్కొనగా.. ఇందుకు ప్రతిగా భరత్ వాదిస్తూ 26/11 ముంబై పేలుళ్ల కేసును ప్రస్తావించారు. ‘లష్కర్ ఏ తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ అతడికి ఈ పేలుళ్ల కేసుతో సంబంధం లేదని చెప్పలేం. అలాగే పీటర్ లండన్‌లో ఉన్నప్పటికీ అతడు షీనా కేసులో నిందితుడు కాకుండా పోడు’ అని వాదించారు. ‘ పీటర్‌కు అన్నీ తెలుసు. తన కొడుకు రాహుల్ షీనా గురించి ఆరా తీసినపుడే మందలించి ఉండాల్సింది. పీటర్ ఓ సైలెంట్ కిల్లర్. కొడుకును మార్చకుండా అతడు ఏం చేశాడు మరి’ అని భరత్ తన వాదనలు వినిపించారు. దీంతో ఆయన బెయిలు అప్పీలు మరోసారి తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది.(‘ఆ రెండు రోజులు ఎవరినీ ఫ్లాట్‌లోకి రానివ్వలేదు’) షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నందుకే షీనాను హత్య చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. -
‘ఆ రెండు రోజులు ఎవరినీ ఫ్లాట్‌లోకి రానివ్వలేదు’
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు విచారణలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. షీనా తల్లి, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ కలిసి ఉద్దేశపూర్వకంగానే షీనా బోరాను హత్యచేసినట్లు ఇటీవలే కీలక సాక్షి సీబీఐ కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్.. వర్లీ ఏరియాలోని మార్లో బిల్డింగ్(ఇంద్రాణీ- పీటర్ల నివాసం) మేనేజర్ మధుకర్ ఖిల్జీని విచారించారు. ఈ క్రమంలో... షీనా బోరా హత్య జరిగిన నాటి నుంచి(ఏప్రిల్ 24, 2012) రెండు రోజుల పాటు (ఏప్రిల్ 24-26) రెండు రోజుల పాటు ఇంద్రాణీ తన ఫ్లాట్‌లోకి ఎవరినీ రానివ్వలేదని మధుకర్ పేర్కొన్నాడు. షీనాతో పాటుగా ఆమె సోదరుడు మైఖేల్ బోరాను కూడా హత్య చేసేందుకు ఇంద్రాణీ ప్రణాళిక రచించారని తెలిపాడు. ’ షీనా తన చెల్లెలని ఇంద్రాణీ చెప్పారు. ఏప్రిల్ 23 న నన్ను పిలిచి తన అనుమతి లేకుండా ఎవరినీ ఫ్లాట్ దగ్గరికి కూడా రానివ్వొద్దని చెప్పారు. ముఖ్యంగా పీటర్ కొడుకు రాహుల్ ముఖర్జీ(ఇంద్రాణీ సవతి కొడుకు)ని అస్సలు అనుమతించొద్దన్నారు. అందుకే రాహుల్ మార్లోకు వచ్చినప్పుడు మేము అడ్డుకున్నాం’ అని మధుకర్ కోర్టుకు తెలిపాడు. కాగా ఇప్పటికే ఈ కేసులో మధుకర్‌తో కలిసి 28 సాక్షులను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు, షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న ఇంద్రాణీ ప్రస్తుతం బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు సీబీఐ కోర్టులో బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా 27వ సాక్షిని ప్రాసిక్యూషన్ లాయర్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా... షీనా తల్లి, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ కలిసి ఉద్దేశపూర్వకంగానే షీనా బోరాను హత్యచేసినట్లు సదరు సాక్షి పేర్కొన్నారు. ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న ఇంద్రాణి స్నేహితుడు, ఆమె వద్ద పనిచేసే ఉద్యోగి అయిన ప్రితుల్ సంఘ్వీ విచారణలో భాగంగా పలు విషయాలు కోర్టుకు వెల్లడించారు.‘ 2002 నుంచి నాకు ఇంద్రాణి పరిచయం. నా ఇంట్లో తను అద్దెకు ఉండేది. ఆ తర్వాత ఆమె కంపెనీలో మేనేజర్‌గా జాయిన్ అయ్యాను. ఇంద్రాణి, ఆమె భర్త పీటర్ ముఖర్జీ ఇచ్చే పార్టీలకు తరచుగా హాజరయ్యేవాడిని. ఆ సమయంలో షీనా కూడా ఒకటి రెండుసార్లు అక్కడికి వచ్చింది. ఇంద్రాణి.. షీనాను తన చెల్లిగా మా అందరికీ పరిచయం చేసింది. అయితే పీటర్ కొడుకు రాహుల్‌తో షీనా రిలేషన్షిప్లో ఉండటం ఆ దంపతులిద్దరికీ నచ్చలేదు. 2008 నుంచి వాళ్లను విడదీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ కుదరకపోవడంతో ఓరోజు.. వాళ్లిద్దరు ఉండే ఏరియాకు నన్ను కూడా రమ్మన్నారు. అయితే నాకు ఆరోజు వేరే పని ఉండటంతో రాలేనని చెప్పాను. ఆ తర్వాత ఇంద్రాణి.. షీనాను తనతో పాటు తీసుకువెళ్లగా, రాహుల్‌ని.. పీటర్ తీసుకువెళ్లాడు. ఇంతలోనే షీనా కనిపించడం లేదనే వార్త బయటికి వచ్చింది’ అని ప్రితుల్ సింగ్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షీనాను హత్య చేయడం వెనుక ఇంద్రాణికి ఉన్న ఉద్దేశమేమిటో నిరూపించేందుకు సీబీఐకి బలమైన సాక్ష్యం లభించినట్లైంది. (విడిపోనున్న ఇంద్రాణి దంపతులు) ఇంద్రాణి- పీటర్ ముఖర్జీ షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ఆస్పత్రిలో చేరిన ఇంద్రాణి ముఖర్జియా
ముంబై : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు, షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కాగా షీనా బోరా హత్య కేసులో భాగంగా కోర్టుకు హాజరైన ఇంద్రాణి వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మ గురువారం పలు సంచలన విషయాలు వెల్లడించారు. షీనా హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణి ముఖర్జియా తనచేత షీనా పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేయించారని, తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణి అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా ఇంద్రాణి సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఇంద్రాణి దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్ప తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంద్రాణి ఆస్పత్రిలో చేరడం గమనార్హం. కాగా ఆమె ఇది వరకు కూడా పలుమార్లు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
ఇంద్రాణీ చెబితే.. తప్పక అలా చేశా!
ముంబై : సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగుచూసింది. షీనాను హత్య చేసిన తర్వాత ఆమె పేరుతో ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. షీనాను హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణీ ముఖర్జియా అప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మతో చెప్పి ఆ మెయిల్ ఐడీ క్రియేట్ చేయించారు. తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణీ అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. రాజీనామా లేఖలో షీనాబోరా సంతకాన్ని ఫోర్జరీ చేశానని, ఇంద్రాణీ నుంచి తనకు ఎలాంటి తప్పుడు సంకేతాలు రాకపోవడంతో ఆ పని చేసినట్లు వెల్లడించారు. ఇంద్రాణీ దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్పా తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ స్కైప్ ఐడీ నుంచి కాల్స్ కూడా మాట్లాడినట్లు కోర్టులో వివరించారు. 2012 ఏప్రిల్‌లో షీనా బోరా హత్యకు గురికాగా, మూడేళ్ల అనంతరం 2015లో ముంబై పోలీసులు ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్ ముఖర్జీయాను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ తన వాంగ్ములంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
ఇంద్రాణీ ముఖర్జియాకు అస్వస్థత
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా(46) అస్వస్థతకు లోనయ్యారు. దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలులో అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను అధికారులు శుక్రవారం రాత్రి ఇక్కడి జేజే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇంద్రాణీకి సీసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి డీన్ ఎస్డీ ననంద్కర్ తెలిపారు. ఇంద్రాణీ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందన్నారు. 2012, ఏప్రిల్‌లో కుమార్తె షీనా బోరాను అత్యంత కిరాతకంగా హత్యచేసిన కేసులో ఇంద్రాణీని పోలీసులు 2015లో అరెస్ట్ చేశారు. -
ఆస్పత్రిలో చేరిన ఇంద్రాణి
ముంబై : షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు అనుమానిస్తున్నారు. అయితే, జైలు అధికారులుగానీ, ఆస్పత్రి వర్గాలుగానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. గతంలో కూడా అధిక మోతాదులో మందులు తీసుకున్న కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణీని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. -
'పూడ్చి పెట్టకముందు.. పెట్టిన తర్వాత ఫోన్ చేసింది'
సాక్షి, ముంబయి : దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు మరోసారి తేటతెల్లమైంది. స్వయంగా పీటర్ ముఖర్జియానే షీనా హత్యకు ప్లాన్ చేయించారా అనే కోణంలో కూడా కేసు మలుపు తిరగనుంది. ఎందుకంటే ఆ రోజు హత్య చేసిన తర్వాత షీనాను పూడ్చి పెట్టిన ప్రాంతం నుంచి పీటర్‌కు ఇంద్రాణి ఫోన్ చేసినట్లు ఆమె డ్రైవర్ ఈ కేసులో అప్రూవర్ అయిన శ్యామ్వర్ రాయ్ చెప్పాడు. దీంతో పీటర్‌కు తెలిసే ఈ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. 2012 ఏప్రిల్ 23న షీనా బోరా హత్య జరిగిన విషయం తెలిసిందే. ఇంద్రాణి తన మాజీ భర్త, డ్రైవర్ శ్యామ్వర్రాయ్తో కలిసి కన్న కూతురునే కడతేర్చింది. ఈ హత్య ఘటన దేశంలో సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన సాక్షి శ్యామ్వర్ రాయ్ అప్రూవర్‌గా మారి ప్రస్తుతం సీబీఐకు సహకరిస్తున్నాడు. అయితే, పీటర్ తరపు న్యాయవాది ప్రస్తుతం శ్యామ్వర్ రాయ్ వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ఆయనకు శ్యామ్ ఈ విషయాలు వెల్లడించాడు. ఆ రోజు ఇంద్రాణి రెండుసార్లు పీటర్‌కు ఫోన్ చేశారని, హత్య చేసిన తర్వాత పూడ్చిపెట్టేందుకు వెళ్లే సమయంలో ఓసారి, పూడ్చిపెట్టిన తర్వాత మరోసారి రెండుసార్లు ఫోన్ చేసినట్లు తెలిపాడు. తనకు కూడా పనిబాగా పూర్తి చేశావంటూ కితాబిచ్చారని వెల్లడించాడు. -
పెట్రోల్ పోసేముందు లిప్‌స్టిక్ పెట్టి జుట్టుకట్టింది
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ దిమ్మతిరిగే విషయాలు చెప్పాడు. షీనాను ఇంద్రాణి ఎలా చంపేశారో పూసగుచ్చినట్లు ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించారు. షీనాను గొంతునులిమి చంపిన తర్వాత ఇంద్రాణి ఆమె ముఖంపై కూర్చుని 'ఇదిగో నీ ఫ్లాట్ ఇక్కడే ఉంది. ఇక జరిగిన విషయాలు ఎవరితో చెప్పకు.. చెబితే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని ఇంద్రాణి బెదిరించినట్లు వివరించాడు. షీనా బోరా కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్‌ఖన్నాను అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం నాటి విచారణ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో షీనాను హత్య చేసిన విధానం వివరించాడు. 'ఏప్రిల్ 24, 2012న షీనాబోరాను కారులో తీసుకెళ్లాం. దారిలో మెడిసిన్ కాక్ టెయిల్, ఆల్కహాల్ ఇచ్చాం. సరిగ్గా అప్పుడు ఇంద్రాణి ఆమెకు ఎదురుగా కూర్చుంది. వెనుకాలే కూర్చున్న ఇంద్రాణి మాజీ భర్త షీనా జుట్టును గట్టిగా పట్టుకోగా ఒక్కసారిగా ఇంద్రాణి ఆమె గొంతును నులిమింది. దీంతో ఆర్తనాదాలు చేసే ప్రయత్నం చేస్తుండగా నేను నోరు మూశాను. ఆ సమయంలో ఆమె నా బొటన వేలిని కొరికింది. కొద్ది సేపట్లోనే ఆమె ప్రాణం పోయింది. ఆ తర్వాత ఆమె మృతదేహంతో వెళ్లే సమయంలోనే కారులో షీనా ముఖంపై కూర్చున్న ఇంద్రాణి 'ఇదిగో ఇక్కడే ఉంది నీ ఫ్లాట్' అంటూ నాకు ఇవ్వాల్సిన ఫ్లాట్‌ను గుర్తు చేసింది. అనంతరం అడవిలోకి వెళ్లాం. ఆ సమయంలో షీనా పెదాలకు లిప్‌స్టిక్ రాసి జుట్టుకట్టింది. ఆ తర్వాత పెట్రోల్పోయగా ఆమె నిప్పంటించింది. వెంటనే తిరిగొచ్చి దారిలో కాఫీ తాగాం. అప్పుడే ఈ విషయం మర్చిపోవాలని నాకు వార్నింగ్ ఇచ్చారు' అని శ్యామ్వర్ రాయ్ కోర్టుకు వివరించాడు. -
ఇంద్రాణిని కొట్టారు, దూషించారు!
సీబీఐ కోర్టులో ఆమె తరఫు న్యాయవాది ఫిర్యాదు ముంబై: షీనాబోరా హత్యకేసులో నిందితు రాలు ఇంద్రాణి ముఖర్జీని బైకల్లా జైలు సిబ్బంది కొట్టారని, దూషించారని ఆమె తరఫు న్యాయవాది గుంజన్ మంగ్లా సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆందోళన చేస్తే లైంగికదాడి చేస్తానంటూ జైలు సిబ్బంది, సూపరింటెండెంట్ బెదిరించారన్నారు. ఇంద్రాణి కాళ్లు, చేతులు, ముఖంపై గాయాలను తనకు చూపించారని, జైలు సిబ్బందిపై ఫిర్యాదు చేయాలని ఆమె కోరిందన్నారు. విచారణ జరిపిన కోర్టు బుధవారం ఇంద్రాణిని హాజరుపరచాలని ఆదేశించింది. బైకల్లా జైలు ఖైదీ మంజురా (45) ముంబైలోని జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. జైలు సిబ్బంది తీవ్రంగా కొట్టడంతోనే మంజురా మృతిచెందిందని ఆరోపిస్తూ ఇంద్రాణి సహా ఖైదీలు ఆందోళన చేపట్టారు. జైలు డాబాపైకెక్కి వార్తా పత్రికలకు నిప్పు అంటిస్తూ జైలు సిబ్బందికి వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు మంజురాను జైలు సిబ్బంది తీవ్రంగా హింసించారని, జననాంగంలోకి లాఠీ జొప్పించారని పోలీసులు చెప్పారు. ఆందోళన విషయమై జైలు అధికారి ఒకరు స్పందిస్తూ.. ఆహారం తీసుకోవద్దని, ఆందోళనను ఆపడానికి ప్రయత్నిస్తే పిల్లలను అడ్డుగా ఉంచుకోవాలని ఖైదీలను ఇంద్రాణి ఉసిగొల్పారని ఆరోపించారు. -
తల్లి పీక కోసిన కొడుకు అరెస్టు
కన్నతల్లిని పీక కోసి, కత్తితో నాలుగైదు సార్లు పొడిచి మరీ చంపిన కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. దేశంలోనే అత్యంత సంచలనాత్మకమైన షీనాబోరా హత్యకేసును విచారిస్తున్న ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ గనోరే భార్య దీపాలి ఇటీవల హత్యకు గురయ్యారు. తల్లిని పీక కోసి చంపేసిన ఆయన కుమారు సిద్ధాంత్.. ఆమె రక్తంతో ఇంట్లో నేలమీద ఒక స్మైలీ వేయడంతో పాటు.. ''ఆమె అంటే విసుగెత్తిపోయింది. నన్ను పట్టుకుని ఉరితీయండి'' అని రాశాడు. సిద్ధాంత్ నేషనల్ కాలేజిలో ఇంజనీరింగ్ చదువును సగంలో ఆపేశాడు. గత రెండు నెలలుగా ఎవరితోనూ పెద్దగా కలవడం లేదని, అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండట్లేదని అతడి స్నేహితులు తెలిపారు. కన్నతల్లిని పీక కోసి చంపి.. రక్తాక్షరాలు! హత్య తర్వాత రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు పారిపోయిన సిద్ధాంత్‌ను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. ముంబై నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. అక్కడి హోటల్లో ఉండగా విశ్వసనీయంగా సమాచారం అంది పోలీసులు వెళ్లడంతో సిద్ధాంత్ దొరికిపోయాడు. -
కన్నతల్లిని పీక కోసి చంపి.. రక్తాక్షరాలు!
దేశంలోనే అత్యంత సంచలనాత్మకమైన షీనాబోరా హత్యకేసును విచారిస్తున్న పోలీసు అధికారి భార్య హత్యకు గురయ్యారు. దాంతో ఒక్కసారిగా అందరికీ షాక్ తగిలినట్లయింది. ఈ కేసుకు, ఆమె హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనుకున్నారు. కానీ, చివరకు ఆమె కన్న కొడుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. జ్ఞానేశ్వర్ గనోరే అనే ఇన్స్పెక్టర్ భార్య దీపాలి హత్యకు గురయ్యారు. అయితే ఆయన కొడుకు సిద్ధాంత్ గత రాత్రి నుంచి ఇంట్లో లేకుండా అదృశ్యం కావడంతో అతడిని ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. అతడి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లిని పీక కోసి చంపేసిన అతడు.. ఆమె రక్తంతో ఇంట్లో నేలమీద ఒక స్మైలీ వేయడంతో పాటు.. ''ఆమె అంటే విసుగెత్తిపోయింది. నన్ను పట్టుకుని ఉరితీయండి'' అని రాశాడు. గనోరే విధి నిర్వహణ ముగించుకుని బుధవారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తాళాలు బూట్లు పెట్టుకునే ర్యాక్‌లో ఉన్నాయి. అతడు తలుపు తెరిచి చూసేసరికి తన భార్య దీపాలి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేశారు. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలో ఉంచారు. పోలీసులు హత్యకేసు నమోదుచేసి, అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధాంత్ నేషనల్ కాలేజిలో ఇంజనీరింగ్ చదువును సగంలో ఆపేశాడు. గత రెండు నెలలుగా ఎవరితోనూ పెద్దగా కలవడం లేదని, అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండట్లేదని అతడి స్నేహితులు తెలిపారు. తల్లీ కొడుకుల మధ్య గొడవ ఏంటో తెలియదు గానీ, అతడు నాలుగైదు సార్లు కత్తితో పొడిచి, పీక కోసి మరీ కిరాతకంగా చంపాడు. పైగా తనను పట్టుకుని ఉరి తీయాలని కూడా రక్తంతో రాశాడు! -
షీనా బోరా కేసులో మరో ట్విస్టు!
ముంబై: దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా (24) హత్య కేసులో మరో ట్విస్టు ఇది. షీనా హత్యకు గురైన ఐదేళ్ల తర్వాత ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, సవతి తండ్రి పీటర్ ముఖర్జియాలపై సీబీఐ హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు కూడా దాఖలైంది. చార్జిషీటుపై పసీబీఐ ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక కోర్టులో విచారణ కూడా మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రాహుల్ ముఖర్జియా తండ్రి పీటర్ ముఖర్జియాకు మద్దతు పలికాడు. ఆయన నిర్దోషి అని, ఆయనకు షీనా హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. తన కూతురైన షీనాకు, సవతి కొడుకైన రాహుల్ మధ్య అనుబంధం ఉండటం.. అది తనకు గిట్టకపోవడం వల్లే ఆమెను ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ తన తండ్రికి మద్దతు పలుకడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2012 ఏప్రిల్ నెలలో షీనాను కారులో ముంబై శివార్లకు తీసుకెళ్లిన ఇంద్రాణి.. తన మాజీ భర్త, డ్రైవర్ల సహాయంతో ఆమెను పీకనులిమి చంపేసిందని ఆరోపణలున్నాయి. సగం కాలిన స్థితిలో ఉన్న షీనాబోరా మృతదేహం 2015 సంవత్సరంలో ముంబై సమీపంలోని అడవుల్లో దొరికింది. అదే సంవత్సరం ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టుచేశారు. -
ఇంద్రాణి, పీటర్‌పై హత్యాభియోగాలు
ముంబై: సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో విచారణకు వీలుగా ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జియా, సంజీవ్ ఖన్నాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేసింది. ఈ ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120 (బి) (నేరపూరిత కుట్ర), 302 (హత్య), 364 (కిడ్నాప్), 203 (తప్పుడు సమాచారం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) ప్రకారం కేసు నమోదైంది. ఇవికాకుండా షీనా సోదరుడు మిఖాయిల్ బోరా హత్యకు కుట్ర పన్నినందుకు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాలపై ఐసీపీ 307 (హత్యాప్రయత్నం), 120 (బి) సెక్షన్ల ప్రకారం అదనంగా కేసు నమోదు చేశారు. ఈ కేసును ఫిబ్రవరి 1న విచారిస్తామని జడ్జి హెచ్ మహాజన్ తెలిపారు. కాగా, తనకు పీటర్ నుంచి విడాకులు కావాలని ఇంద్రాణి కోరగా.. ఈ విషయంలో కోర్టు చేయగలిగేది ఏమీ లేదని జడ్జి తెలిపారు. ఇంద్రాణి ముఖర్జియా తన కుమార్తె షీనాను 2012లో హత్య చేసి మృతదేహాన్ని రాయ్‌గడ్ జిల్లాలోని అడవుల్లో కాల్చివేసిన విషయం తెలిసిందే. -
‘ఆయన నుంచి విడాకులు కావాలి’
ముంబై: షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్. ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జియా నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. విడాకులకు దరఖాస్తు చేసేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనికి ట్రయల్ కోర్టు అనుమతి అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. షీనా బోరా హత్య కేసులో తనను పీటర్ ఇరికించారని భావిస్తున్న ఇంద్రాణియా ఆయన నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ఆమె తన మొదటి నుంచి సంజీవ్ ఖన్నా నుంచి విడిపోయారు. తర్వాత మీడియా ప్రముఖుడు పీటర్ ముఖర్జియాను పెళ్లాడారు. పీటర్, మాజీ భర్తతో కలసి సొంత కూతురు షీనా బోరాను హత్య చేసినట్టు ఇంద్రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం చార్జిషీటు దాఖలైంది. ఫిబ్రవరి 1 నుంచి కోర్టులో విచారణ మొదలవుతుంది. -
షీనా బోరా హత్యకేసులో మరో మలుపు
-
షీనా బోరా హత్యకేసులో మరో మలుపు
షీనాబోరా (24) హత్య జరిగిన ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, సవతి తండ్రి పీటర్ ముఖర్జియాలపై హత్య, నేరపూరిత కుట్ర ఆరోపణలు మోపారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలైంది. వీటిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విచారణ మొదలవుతుంది. ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా మీద షీనా సోదరుడు మిఖాయిల్ బోరా మీద హత్యాయత్నం చేసిన నేరం మోపారు. తన సోదరి అదృశ్యం కావడం గురించి పదే పదే ప్రశ్నలు అడగడం వల్లే అతడిని చంపాలని ఇంద్రాణి భావించినట్లు సీబీఐ తెలిపింది. ఈ కేసులో నాలుగో నిందితుడైన శ్యామ్వర్ రాయ్ కూడా హత్యకు సహకరించినా, ఆ తర్వాత అతడు సీబీఐకి అప్రూవర్‌గా మారిపోయాడు. ఆస్తి వివాదంలోనే షీనాబోరాను ఇంద్రాణి హతమార్చిందని సీబీఐ ఆరోపించింది. ఈ హత్య ప్లాన్ మొత్తం పీటర్‌కు బాగా తెలుసని చెప్పింది. 2012 ఏప్రిల్ నెలలో షీనాను కారులో ముంబై శివార్లకు తీసుకెళ్లిన ఇంద్రాణి.. తన మాజీ భర్త, డ్రైవర్ల సహాయంతో ఆమెను పీకపిసికి చంపేసిందని ఆరోపణలున్నాయి. సగం కాలిన స్థితిలో ఉన్న షీనాబోరా మృతదేహం 2015 సంవత్సరంలో ముంబై సమీపంలోని అడవుల్లో దొరికింది. అదే సంవత్సరం ఆగస్టులో ఇంద్రాణిని అరెస్టుచేశారు. -
జైలు నుంచి ఇంద్రాణి విడుదల
-
జైలు నుంచి ఇంద్రాణి విడుదల
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతితో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమెకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఒకరోజు పాటు పోలీసుల పర్యవేక్షణలో ఆమె జైలు బయట గడపనున్నారు. తన కుమార్తె షీనా బోరా హత్యకేసులో గత ఏడాది ఆగస్టులో ఇంద్రాణి అరెస్టయ్యారు. మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి షీనాను ఇంద్రాణి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంద్రాణి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త పీటర్ ముఖర్జియా కూడా ఇదే కేసులో జైలుపాలయ్యారు. తన మేనకోడలి పెళ్లి చూసేందుకు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇటీవల పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. -
ఆ హత్య గురించి రెండోభర్తకు తెలుసట!
కన్నకూతురు షీనా బోరాను ఇంద్రాణి చంపుతున్న విషయం.. ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీకి పూర్తిగా తెలుసునట. ఈ విషయాన్ని పేర్కొంటూ ఈ సంచలనాత్మక హత్యకేసులో సీబీఐ రెండో అనుబంధ చార్జిషీటు దాఖలుచేసింది. తనకు ఈ హత్య గురించి ఏమీ తెలియదని ఇంతకుముందు పీటర్ వాదించినా.. హత్య నుంచి మృతదేహాన్ని తరలించడం ప్రతి విషయంలోనూ అతడి పాత్ర కూడా ఉందని సీబీఐ తాజా చార్జిషీటులో పేర్కొంది. అతడిపై నేరారోపణ మోపడంపై వాదనలు శనివారం ప్రారంభం కానున్నాయి. 2012 ఏప్రిల్ నెలలో షీనాబోరా (24)ను కారులో గొంతు నులిమి చంపేశారు. ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె మాజీ డ్రైవర్ శ్యామవర్ రాయ్ తదితరుల హస్తం ఇందులో ఉందని ఆరోపణలొచ్చాయి. తర్వాత ఆమె మృతదేహాన్ని పొరుగున ఉన్న రాయగడ్ జిల్లాలోని ఓ అడవిలో పారేశారు. ఆ ముగ్గురినీ గత సంవత్సరం ఆగస్టు నెలలో అరెస్టు చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి శ్యామ్వర్ రాయ్‌ని అరెస్టుచేసి విచారించినప్పుడు అతడు బయటపెట్టడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. తర్వాతి నుంచి అతడు అప్రూవర్‌గా మారాడు. పీటర్ ముఖర్జీతో తన సంబంధం విషయం తెలియని షీనాబోరా.. అతడి కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుందని, అదే జరిగితే ఆమెకు ఆస్తిలో చాలా భాగం వెళ్లిపోతుందన్న భయంతోనే ఇంద్రాణి ఆమెను చంపడానికి ప్లాన్ వేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. -
ఒకప్పుడు హై ప్రొఫైల్ .. ఇప్పుడు జైలు లైఫ్
-
షీనాబోరా తల్లి పాత్రలో బాలీవుడ్ నటి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనాబోరా హత్య ఉదంతాన్ని తెరకెక్కిస్తున్నారు. బెంగాలీ భాషలో తీస్తున్న 'డార్క్ చాకొలెట్' సినిమాలో షీనాబోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీయా పాత్రలో బాలీవుడ్ నటి మహిమా చౌదరి నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా మహిమ ఈ విషయం చెప్పింది. ఇంద్రాణిని స్ఫూర్తిగా తీసుకుని ఈ పాత్ర పోషించినట్టు తెలిపింది. 'షీనాబోరా హత్యను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. ఇందులో షీనాబోరా తల్లి పాత్రలో నటించాను. నాకిదే తొలి బెంగాలీ చిత్రం. ఈ సినిమాలో నటించినందుకు ఎంతో ఉత్సుకతగా ఉంది' అని మహిమ చెప్పింది. అగ్నిదేవ్ ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమా చౌదరితో పాటు రియా సేన్, ముంతాజ్ సార్కర్, రాజేశ్ శర్మ నటించారు. ఇంద్రాణి తన మాజీ భర్త (రెండో భర్త) సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌తో కలసి కూతురు (మొదటి భర్త ద్వారా) షీనాబోరాను హత్య చేయించడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియా కొడుకు, షీనాబోరా ప్రేమించుకోవడం, ఇతర ఆర్థిక వ్యవహారాలు ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. -
మా ఆయనకు అమ్మాయిల పిచ్చి!
షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితుడు పీటర్ ముఖర్జియా విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని కూడా అతడి మాజీ భార్య షబ్నమ్ సింగ్ తెలిపారు. పీటర్ ముఖర్జియాకు వయసులో ఉన్న అమ్మాయిలంటే పిచ్చి అని ఆమె చెప్పారు. ‘‘పీటర్‌కు అసలు నైతిక విలువలు అనేవి లేవు. అతడి చుట్టూ ఎప్పుడూ వయసులో ఉన్న అమ్మాయిలు ఉండాల్సిందే. లేట్ నైట్ పార్టీలంటే అతడికి చాలా ఇష్టం. అతడి జీవితంలో చాలామంది మహిళలున్నారు. అసలు అందుకే నేను విడాకులు తీసుకున్నాను’’ అని ఆమె పోలీసు విచారణలో వెల్లడించారు. ఆమె చాలా కాలం క్రితమే ఈ విషయాలను సీబీఐకి చెప్పినా, ఇన్నాళ్ల పాటు ఆ ప్రకటన కాపీలను రహస్యంగా ఉంచారు. వాటిని ఇటీవలే పీటర్ తరఫు న్యాయవాది మిహిర్ ఘీవాలాకు, ఇంద్రాణి ముఖర్జియా తరఫు న్యాయవాది గంజన్ మంగ్లాకు అప్పగించారు. కాగా, షబ్నమ్ సింగ్ వెల్లడించిన విషయాల్లో ఈ కేసుకు సంబంధం లేని మరో అంశం కూడా ఉంది. అయితే.. ఆ విషయం బయటకు వస్తే సంబంధిత వ్యక్తి పరువు ప్రతిష్ఠలు మంటగలుస్తాయని అంటున్నారు. పీటర్ గురించి సంచలన విషయాలు వెల్లడించడంతో షబ్నమ్ సింగ్‌కు భద్రత కల్పించాలని ప్రత్యేక కోర్టు జడ్జి హెచ్ఎస్ మహాజన్ ఆదేశించారు. తాను ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు.. పీటర్ తన ఇంటికి వస్తానన్నాడని, అప్పుడు వేరే అమ్మాయితో వచ్చాడని ఆమె చెప్పారు. ఆ వచ్చిన మహిళను తన గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేశాడని.. ఆమె పేరు ఇంద్రాణి అని తన వాంగ్మూలంలో తెలిపారు. అప్పుడే ‘నువ్వు బాగుపడవు’ అని పీటర్‌తో అన్నానన్నారు. ఇంద్రాణి గత చరిత్ర గురించి తెలిసి కూడా పీటర్ ఆమెను పెళ్లి చేసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందని చెప్పారు. -
భర్తతో కుట్ర పన్ని, మాజీ భర్తతో కలసి..
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. షీనా హత్యకు మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియా కుట్ర పన్నారని సీబీఐ కోర్టుకు నివేదించింది. ఇంద్రాణి ముఖర్జియా తన భర్త పీటర్ ముఖర్జియాతో కలసి కూతురు షీనా హత్యకు కుట్ర చేసిందని సీబీఐ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ఇంద్రాణి .. తన రెండో భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌తో కలసి షీనాను హత్య చేసినట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే. పీటర్ కొడుకు రాహుల్‌తో షీనా బోరా లవ్ ఎఫైర్‌ను ఇంద్రాణి, పీటర్ వ్యతిరేకించారని, ఆమె హత్యకు కుట్ర పన్నారని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో పీటర్‌కు బెయిల్ ఇవ్వవద్దంటూ సీబీఐ కోర్టుకు విన్నవించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, పీటర్‌కు బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేసే అవకాశముందని కోర్టుకు తెలియజేసింది. న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. గతేడాది నవంబర్‌లో పీటర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంద్రాణిని, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌లను కూడా అరెస్ట్ చేశారు. ఎన్నో మలుపులు తిరిగిన షీనా హత్య కేసులో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగు చూశాయి. ఇంద్రాణికి మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం షీనా కాగా, పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్. ఇంద్రాణికి పీటర్ మూడో భర్త. షీనా, రాహుల్ ప్రేమలో పడటాన్ని ఇంద్రాణి, పీటర్ తీవ్రంగా వ్యతిరేకించారు. షీనా హత్యకు ఇంద్రాణి, పీటర్ కుట్రపన్నారని సీబీఐ కోర్టుకు నివేదించింది. ఇంద్రాణి .. రెండో భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌తో కలసి 2012 ఏప్రిల్‌లో షీనాను హత్య చేశారు. -
షీనా కేసులో అప్రూవర్‌గా కారు డ్రైవర్
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన సాక్షి.. హంతకుల్లో ఒకరు అప్రూవర్‌గా మారాడు. అందుకు కోర్టు సోమవారం అనుమతినిచ్చింది. కన్న కూతురైన షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా ఆమె మాజీ భర్త, డ్రైవర్ కలిసి దారుణంగా గొంతునులిమి చంపిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులందరినీ జైలులో వేసి విచారిస్తుండగా ఇంద్రాణి కారు డ్రైవర్ అయిన శ్యామ్వర్ రాయ్ మొత్తం నిజాలు చెప్పేందుకు ముందుకొచ్చాడు. ఈ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు తనకు తెలుసని, అప్రూవర్ గా మారిపోతానని అందుకు అవకాశం ఇవ్వాలని గత నెలలో కోర్టుకు అభ్యర్థించుకున్నాడు. దీంతో సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా కూడా ఇప్పటికే జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
షీనా హత్య కేసు: అప్రూవర్ గా మారనున్న డ్రైవర్
ముంబై: షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్ గా మారనున్నాడు. ఈ విషయాన్ని కోర్టుకు సీబీఐ తెలిపింది. తనకు క్షమాభిక్ష పెట్టాలని రాయ్ కోర్టుకు రాసిన రెండు పేజీల లేఖను అధికారులు కోర్టుకు అందజేశారు. అప్రూవర్ గా మారే నిర్ణయం తనదేనని, ఎవరూ తనపై ఒత్తిళ్లు తేవడం లేదని, జరిగిన విషయం మొత్తాన్ని కోర్టుకు తెలుపుతానని తనకు క్షమాభిక్ష పెట్టాలని రాయ్ లేఖలో కోరారు. గత నెల మే11న తాను అప్రూవర్ గా మారతానని రాయ్ కోర్టులో చెప్పిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగష్టులో రాయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. -
'ఆ రోజు గట్టి హగ్.. గాఢమైన ముద్దు ఇస్తాను'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు ఆమె భర్త, తాను కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉంటున్న పీటర్ ముఖర్జియా ఓ ఘాటు ప్రేమ లేఖ రాశారు. ఈ ఏడాది జనవరిలో తన భార్య ఇంద్రాణి పుట్టిన రోజు సందర్భంగా జైలులో ఉన్న ఆమెకు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలతోపాటు తన ప్రేమను రంగరించి ఓ లేఖ పంపించారు. 'నీవు ఒక రోజు నీ అమాయకత్వాన్ని నిరూపించుకోగలవు. నేను కూడా నీ తరుపున ప్రార్థిస్తున్నాను. ఈ పీడకల నిన్ను వదిలి మంచి రోజు నీకు వస్తుంది' అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే ఒకరినొకరు పలకరించుకుంటున్నారని, గత నెలలో ఆమె పుట్టిన రోజుకు సంబంధించి స్వీట్లు కూడా తినిపించుకున్నారని అధికార వర్గాల సమాచారం. ఆయన స్వయంగా తన చేతి రాతతో జనవరి 3న ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖను ఎలా ప్రారంభించారంటే.. 'ముమూ మై డియరెస్ట్.. ఈ రోజు నీ జీవితంలో ప్రత్యేకమైన రోజు.. నా కైతే ఇంకా చాలా ప్రత్యేకం. మనం కలిసినప్పటి నుంచి నీ ప్రతి పుట్టిన రోజును కలిసే జరుపుకున్నాం. కానీ ఈ ఏడాది మాత్రం చాలా దగ్గరగా ఉన్నా ఎంతో దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేవుడు చాలా గొప్పవాడు. దీనికి త్వరలోనే ముగింపు ఇస్తాడు. మనిద్దరం ఏం చక్కా రోమియో జులియెట్ లాగా త్వరలోనే ఒకరినొకరం తిరిగి కలుసుకుంటాం. అది కోర్టు ప్రాంగణం కావొచ్చు.. నివాసం కావొచ్చు. నీకు ఎదురైనప్పుడు మాత్రం బాధ మొత్తం పోయేలా మంచి సంతోషాన్ని ఇస్తాను. నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంక్షిప్త లేఖ ద్వారా నేను నిన్ను ఇలా చేరుకుంటున్నాను. కానీ, నీ రోజంటూ వచ్చిన తర్వాత ఒక గట్టి కౌగిలి.. గాఢమైన ముద్దు ఇస్తాను' అంటూ ఆ లేఖలో రాశారు. -
ఇంద్రాణికి మరోసారి చుక్కెదురు
ముంబయి: కన్నకూతురు షీనాబోరాను హతమార్చిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జీయాకు మరోసారి చుక్కెదురు అయింది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. అవసరం అయితే ఇంద్రాణీ ప్రయివేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చేందుకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది. కాగా తన ఆరోగ్యం బాగోలేదని, బలహీనత కారణంగా తాను కళ్లు తిరిగి పడిపోతున్నానని, తనకు బెయిల్ మంజూరు చేస్తే ఆసుపత్రిలో చూపించుకుంటానని ఇంద్రాణీ ముఖర్జీయా బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
'నా భార్యకు ఆశ ఎక్కువ'
ముంబై: తన భార్య ఇంద్రాణి అత్యాశపరురాలని ఆమె భర్త పీటర్ ముఖర్జియా పేర్కొన్నారు. తన కోర్కెలను నెరవేర్చుకోవడం కోసం సొంత పిల్లలను త్యాగం చేసిందని, వదులుకుందని విరుచుకుపడ్డారు. ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్య కేసులో రెండోసారి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ లో తొలిసారిగా భార్యకు వ్యతిరేకంగా ఆయన ఆరోపణలు చేశారు. 60 ఏళ్ల పీటర్ ముఖర్జియా షీనా బోరా హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్నారు. తన ప్రతిభాసామర్థ్యాలతో ఉన్నతస్థితికి ఎదిగి సమాజంలో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న తాను ఇంద్రాణి మాయలో పడి చివరికి జైలుపాలయ్యానని బెయిల్ పిటిషన్ లో పీటర్ వాపోయారు. 2012 నాటి షీనా బోరా కేసులో వీరిద్దరితో పాటు ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామవర్ రాయ్ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 31న విచారణకు రానుంది. గత నెలలో పీటర్ ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. -
'స్పృహ కోల్పోతున్నాను.. బెయిల్ ఇవ్వండి'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెలాఖరు వరకు (మార్చి 31)వాయిదా వేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం వెలువరించింది. తన ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆస్పత్రిలో చూపించుకునేందుకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ గత ఫిబ్రవరి నెలలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల బలహీనత కారణంగా తాను తరుచూ కళ్లు తిరిగి పడిపోతున్నానని పిటిషన్ లో పేర్కొంది. కన్న కూతురుని దేశం నివ్వెరపోయేలా ఇంద్రాణి హత్య చేసిన విషయం తెలిసిందే. -
విధీ కోసం ఇంద్రాణికి ప్రత్యేక అనుమతి
ముంబై: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియాకు సీబీఐ న్యాయస్థానం ప్రత్యేక అనుమతులిచ్చింది. ఇంద్రాణి రెండో కూతురు విధీ చదువుల నిమిత్తం చెక్కులపై సంతకాలు చేసేందుకు ఓకే చెప్పింది. రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో నిందితులు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, శ్యామ్ రాయ్ లను సీబీఐ అధికారులు సోమవారం కోర్టులో హాజరుపర్చారు. జనవరి 16 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన కోర్టు.. చెక్కులపై సంతకాలకు కూడా అనుమతించింది. కోర్టు హాలు బయట ఇంద్రాణి- విధీలు కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తల్లీకూతుళ్లు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. విచారణ అనంతరం తిరిగి జైలుకు వెళ్లేందుకు పోలీస్ వ్యాన్ ఎక్కిన సందర్భంలోనూ ఇరువురూ భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు జైలు తిండి తనకు పడటంలేదని, ఇంటినుంచి భోజనం తెప్పించుకుంటానన్న సంజీవ్ ఖన్నా అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. విధీ.. ఇంద్రాణి- సంజీవ్ ఖన్నాల కూతురు. -
పీటర్‌కు లై డిటెక్షన్ పరీక్షకు అనుమతి
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియాకు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ అధికారులు శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్నారు. ఆయనకు నవంబర్ 30న ఈ పరీక్షలు చేసే అవకాశం ఉన్నట్లు సన్ని హిత వర్గాలు చెబుతున్నాయి. పీటర్ ముఖర్జియాను షీనా బోరా హత్య కేసులో గత వారం రోజుల కిందటే సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇప్పటికే పలుమార్లు ఈ కేసుకు సంబంధించి కోర్టు అనుమతితో ప్రశ్నించినా సరైన విధంగా సమాధానాలు చెప్పకపోవడంతోపాటు విచారణకు సహకరించని నేపధ్యంలో ఆయనకు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించి ఆమేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన భార్య షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియా జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
షీనా కేసులో ఇంటర్‌పోల్ సాయం
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీ దంపతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల గురించి సీబీఐ ఆరా తీస్తోంది. 2006-07లో 9 వేర్వేరు కంపెనీల్లో సుమారు 9 వందల కోట్ల రూపాయల పెట్టుబడులపై విచారించేందుకు సీబీఐ ఇంటర్‌పోల్ సహాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో పీటర్ ముఖర్జీ కస్టడీని కూడా పొడగించాలన్న సీబీఐ విన్నపాన్ని కోర్టు మన్నించింది. -
వాళ్లు ఎలా కలిశారు?.. ఎవరు విడదీశారు?
ముంబై: రాహుల్ ముఖర్జీయా, షీనా బోరా విధివంచిత ప్రేమికులు. వారు ఎప్పుడు తొలిసారి కలుసుకున్నారు? ఎలా ప్రేమలో పడ్డారు? నిశ్చితార్థం జరిగిన తర్వాత విషాదకర పరిస్థితుల్లో ఎలా వేరయ్యారు? 2012లో షీనాబోరా దారుణ హత్యకు ముందు జరిగిన సంఘటనలేమిటి? అప్పటి పరిణామాలన్నింటినీ రాహుల్ ముఖర్జీయా పోలీసులకు పూస గుచ్చినట్టు వివరించాడు. తమ ప్రేమబంధం గురించి తెలుసుకొని షీనాబోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీయా తీవ్రంగా నిస్పృహకు లోనైందని తెలిపాడు. అకస్మాత్తుగా షీనాబోరా కనిపించకపోవడం తనను మానసికంగా కుంగదీసిందని, ఆమె మిస్సింగ్ వెనుక ఇంద్రాణి ప్రమేయం ఉండవచ్చునని అనుమానించానని రాహుల్ చెప్పాడు. షీనాబోరా హత్యకేసులో ప్రధాన హంతకురాలిగా మీడియా అధిపతి పీటర్ ముఖర్జీయా రెండో భార్య ఇంద్రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఎప్పుడూ కలిశారు? 2008లో రాహుల్ ముంబై వర్లిలోని మార్లో అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న తన తండ్రి పీటర్ ముఖర్జీయా నివాసానికి మారాడు. అప్పడే షీనాను తొలిసారి చూశాడు. 'వర్లీ ఫ్లాట్‌లోనే నేను తొలిసారి షీనాను చూశాను. ఆ తర్వాత మేం తరచూ కలుసుకున్నాం. ఇది మా మధ్య సన్నిహిత స్నేహాన్ని ఏర్పరిచింది' అని రాహుల్ పోలీసులకు ఇచ్చిన తన వాంగ్మూలంలో తెలిపాడు. ఆ తర్వాత నెల రోజులకే తాను లండన్ వెళ్లానని, అక్కడ కొన్నాళ్లు ఉండిన తర్వాత మళ్లీ ముంబై వచ్చానని చెప్పాడు. అయితే ఈసారి ఇంట్లో ఉండకుండా వేరే చోట ఉండాలని పీటర్‌తో ఇంద్రాణి చెప్పించిందని, దీంతో తాను ఖార్దండలో ఫ్లాట్ తీసుకున్నానని తెలిపాడు. మొదటిసారి అప్పుడే చెప్పింది..! యావత్ ప్రపంచం అనుకుంటున్నట్టు తాను ఇంద్రాణి సోదరిని కాదని, ఆమె కూతురినని ఓరోజు స్వయంగా షీనాబోరానే చెప్పిందని రాహుల్ పోలీసులకు తెలిపాడు. 'నా తండ్రి సహకారంతో నేను ప్రైమ్ ఫొకస్లో ఉద్యోగం సంపాదించాను. షీనాను కూడా తరచూగా కలుస్తుండేవాణ్ని. క్రమంగా మేం ప్రేమలో పడిపోయాం. ఒక రోజు తను వచ్చి 'నేను ఇంద్రాణి చెల్లెల్ని కాదు కూతరిని' అని చెప్పింది. మా అనుబంధం గురించి ఇంద్రాణికి తెలియడంతో తను కోపాద్రిక్తురాలైంది. ఈ విషయమై నా తండ్రితో తను కోట్లాడింది. వెంటనే షీనాను గువాహటి పంపించింది' అని రాహుల్ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత 2009లో షీనాను ఢిల్లీకి పంపించారు. అక్కడ తీవ్ర అనారోగ్యంతో తను ఆస్పత్రి పాలైంది. ఆస్పత్రిలో ఉన్న ఆమెను ఇంద్రాణి, ఆమె మాజీ ప్రియుడు పరామర్శించారు. ఆ తర్వాత ఇంద్రాణి ఒత్తిడి మేరకు బెంగళూరు వచ్చిన షీనా బోరా.. ఇంద్రాణి మాజీ ప్రియుడితో కొంతకాలం ఉంది. 'ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదు. ఇంట్లోని వస్తువులన్ని అమ్మి బెంగళూరు వెళ్లి షీనాను కలుసుకున్నాను. ఆమె తన చాలా బలహీనంగా ఉంది. మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందే ఔషధాలను వేసుకోమని ఇంద్రాణి షీనాకు ఇచ్చింది. ఆ ఔషధాలను వైద్యుడికి చూపిస్తే వాటిని వెంటనే మానేయాలని మాకు సూచించాడు. ఆ మందులు తీసుకోవడం మానిన తర్వాత ఆమె కోలుకుంది. షీనా తాత-నాయనమ్మ, మా అమ్మ అనుమతి తీసుకొని ఆమెను డెహ్రాడూన్‌లోని మా ఇంటికి తీసుకెళ్లాను' అని రాహుల్ తెలిపాడు. ఆ తర్వాత 2009 చివర్లో ఈ ప్రేమ జంట ముంబైకి వచ్చింది. షీనాకు ఉద్యోగం దొరికింది. అంధేరిలోని ఓ అద్దె ఇంట్లో ఇద్దరు మకాం వేశారు. ఈ విషయం తెలియడంతో పీటర్, ఇంద్రాణి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయి. 2011 అక్టోబర్‌లో రాహుల్, షీనా డెహ్రాడూన్ వెళ్లి నిశ్చితార్థం చేసుకున్నారు. షీనా తాత-నాయనమ్మ, రాహుల్ తల్లి అనుమతితో ఈ నిశ్చితార్థం జరిగింది. వారు మళ్లీ ముంబైకి రావడంతో నిశ్చితార్థం గురించి ఇంద్రాణికి తెలిసింది. ఈ సమయంలో ఆమె ఎంతో మారిన మనిషిలా కనిపించిందని రాహుల్ తెలిపాడు. షీనా ఎలా అదృశ్యమైంది? ఆ తర్వాత ఓసారి ఇంద్రాణి షీనాను డిన్నర్‌కు పిలిచింది. షీనా హత్యకు ముందురోజు కూడా ఆమెను ఇంద్రాణి డిన్నర్‌కు పిలిచింది. షీనాకు నిశ్చితార్థం కానుక ఇస్తానని చెప్పింది. హత్యకు ముందు రోజు 2012, ఏప్రిల్ 24న షీనాను నేను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చాను. ఆ రోజు ఇంద్రాణి పదేపదే ఫోన్ చేసింది. షీనా రావడానికి ఎంత సమయం తీసుకుంటుందని పదేపదే అడిగింది. ఆ తర్వాత ఇంద్రాణి చెప్పిన అడ్రస్‌కు మేం వెళ్లాం. అక్కడికి షెవ్రోలె కారులో ఇంద్రాణి, మరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు. డ్రైవర్ సీటులో శ్యామ్రాయ్ ఉన్నాడు' అని రాహుల్ వివరించాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా అని తేలింది. ఆ తర్వాత షీనా ఇక ఎప్పటికీ కనిపించలేదని, ఆమె ఫోన్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాలేదని రాహుల్ తెలిపాడు. ఆ తర్వాత ఓ రోజు ఆమె తన మొబైల్ నుంచి ఓ మెసెజ్ వచ్చిందని, తాను కొత్త ప్రేమికుడిని చూసుకున్నానని, అతనితో ఆనందంగా ఉన్నానని ఆ మెసెజ్‌లో పేర్కొని ఉందని రాహుల్ చెప్పాడు. షీనా మిస్సింగ్‌పై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని వివరించాడు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, ఆమె మాజీ డ్రైవర్ శ్యాంరావులకు వ్యతిరేకంగా రాహుల్ వాంగ్మూలం ఇచ్చాడు. పీటర్ పాత్ర ఏమిటి? షీనా హత్యకేసులో పీటర్ ముఖర్జీయా పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షీనా హత్య కుట్ర పీటర్‌కు తెలుసని పేర్కొంటూ సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. అయితే రాహుల్ మాత్రం ఒక్కసారి మాత్రమే తన వాంగ్మూలంలో పీటర్ పేరు ప్రస్తావించాడు. అంతకుమించి ఎలాంటి విషయాలు తెలుపలేదని తెలుస్తున్నది. పోలీసులు నమోదుచేసిన చార్జ్‌షీట్‌లోని ఈ వివరాలను మిడ్డే పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. -
'నా తండ్రి అమాయకుడు'
ముంబై: షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన పీటర్ ముఖర్జియా కొడుకు, షీనా బోరా ప్రియుడు రాహుల్ స్పందించాడు. తన తండ్రి అమాయకుడనీ, ఈ కేసుతో ఆయనకేమీ సంబంధం లేదని వ్యాఖ్యానించాడు. తన తండ్రిపై చేసిన ఆరోపణలు దారుణమన్నాడు. నిన్న సీబీఐ అదుపులోకి తీసుకున్న తండ్రి పీటర్ ను సీబీఐ ఆఫీసులో కలవడానికి వచ్చిన రాహుల్ శనివారం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ కేసులో ప్రధాన ముద్దాయి, షీనాబోరా తల్లి ఇంద్రాణి శుక్రవారం మీడియాముందు నోరు విప్పింది. ఎప్పటిలాగానే తాను అమాయకురాలినని వాదించింది. ఈ కేసుతో పీటర్ ముఖర్జియాకు ఉన్న సంబంధంపై మాట్లాడానికి నిరాకరించింది. అటు పీటర్ కూడా సీబీఐ ఆరోపణలను ఖండించాడు. కాగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో మీడియా టైకూన్, ఇంద్రాణీ భర్త పీటర్ ముఖర్జియా ను నిందితుడుగా పేర్కొంటూ చార్జ్ షీట్ దాఖలు చేసింది. హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ కుట్ర కేసు అభియోగాలను నమోదు చేసింది. షీనా హత్య గురించి తెలిసినా కొడుకు రాహుల్ ను తెలియకుండా దాచిపెట్టారన్నది సీబీఐ వాదన. మరోవైపు ముగ్గురు ప్రధాన నిందితుల జ్యుడీషియల్ కస్టడీని డిసెంబర్ 3 వ తేదీవరకు పొడిగించింది సీబీఐ కోర్టు. -
షీనాబోరా హత్యకు కారణాలివే..!
ముంబై: సస్పెన్స్ క్రైమ్ థిల్లర్ లా సాగిపోతున్న షీనాబోరా హత్య కేసులో సీబీఐ విచారణ ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆర్థిక కారణాలు, రాహుల్ ముఖర్జియాతో సంబంధం, ఇంద్రాణిని బ్లాక్మెయిల్ చేయడం లాంటివే షీనాబోరా హత్యకు ప్రధాన కారణాలని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొన్నది. కోట్ల రూపాయల ఆర్థిక వివాదాలే షీనాబోరా హత్యకు కారణాలని పేర్కొంది. ముఖ్యంగా 1300 కోట్ల రూపాయల లావాదేవీలు ఇందులో ప్రధానమని తెలిపింది. తల్లీ కూతుళ్ల మధ్య నెలకొన్ని వివాదాలే ఇంద్రాణిని షీనా హత్యకు పురికొల్పాయని సీబీఐ తేల్చింది. ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణిని ప్రధాన నిందితురాలిగా పేర్కొన్న సీబీఐ, ఇప్పటికే మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ ను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుత భర్త, మీడియా టై్కూన్ పీటర్ ముఖర్జియాను నాలుగో ముద్దాయిగా చేర్చింది. ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియా కేవలం ఆస్తి, డబ్బు కోసమే ఓ పథక ప్రకారం షీనాను హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించాలని చూశారు. షీనాను అంతం చేస్తే ఆస్తి అంతా తన రెండో కూతురు నిధికే దక్కుతుందనేది సంజీవ్ పథకం. రాహుల్ ముఖర్జీ, షీనాల పెళ్లి జరిగితే ఆస్తి అంతా అతను ఎగరేసుకుపోతాడనే భయంతో పీటర్ ముఖర్జీయా ఈ కుట్రలో భాగం పంచుకున్నాడు. ఇక మొదటినుంచి తల్లీ కూతుళ్ల మధ్య తగాదాలు ఉన్నాయి. ప్రధానంగా రాహుల్ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం ఇంద్రాణికి నచ్చలేదు. పైగా షీనాపై ఉన్న ఆస్తులు తిరిగి తనకు దక్కవేమోనన్న భయం ఆమెను పట్టుకుంది. ఈ నేపథ్యంలో 2004 లో షీనాకు బహుమతిగా ఇచ్చిన ఏడు బెడ్రూంల ఫ్లాట్‌ను 2010లో ఆమెకు తెలియకుండానే ఇంద్రాణి విక్రయించింది. దీంతో వివాదం మరింత రగిలింది. తామిద్దరం ప్రపంచానికి తెలిసినట్టుగా అక్కాచెల్లెళ్లం కాదు, తల్లీకూతుళ్లమనే విషయాన్ని బయటపెడతానని షీనా బ్లాక్‌మెయిల్‌కు దిగింది. ఈ క్రమంలో షీనా హత్యకు పథకం వేశారని సీబీఐ పేర్కొంది. 'షీనా జాగ్రత్తగా ఉండు' అంటూ ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాల రెండవ కూతురు విధి.. సోదరి షీనాకు ఒక ఎస్సెమ్మెస్ చేసినట్టు కోర్టుకు సీబీఐ వెల్లడించింది. తల్లి ఇంద్రాణి పథకాన్ని పసిగట్టిన విధి షీనాను ముందుగానే హెచ్చరించిందని సీబీఐ పేర్కొంది. 2012, ఏప్రిల్ 24న ఇంద్రాణి ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ కలిసి షీనా బోరాను హత్య చేసి మారుమూల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వెలుగుచూసిన ఈ హత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ సీబీఐకి సవాల్‌గా మారింది. -
మద్యం మత్తులో 'షీనా' గుట్టు విప్పాడు
ముంబై: క్రైమ్ వార్తలకు ఎందుకంత ప్రాధాన్యం లభిస్తుంది? ఎందుకంటే ప్రతి నేరం తనదైన కొత్త తరహాలోచోటుచేసుకుంటుంది. ఎంటర్టైన్మెంట్ కంటే మిన్నగా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఎంతటి నేరమైనా చివరికి వెలుగులోకి రాకాతప్పదని.. నేరస్తులకు శిక్షా తప్పదని తెలిసిందే! ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసూ అలాంటిదే. మర్డర్ జరిగిన మూడేళ్ల తర్వాత.. మద్యం మత్తు తలకెక్కిన ఒక సాయంత్రాన షీనా హత్య గుట్టువీడింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడు, ఇంద్రాణి ముఖర్జియా మాజీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్.. మర్డర్ మిస్టరీని ఎలా రివీల్ చేసిందీ పోలీసు అధికారి ఒకరువెల్లడించారు. ముంబైలో (2012) కదులుతున్న కారులో షీనాను హత్య చేసిన అనంతరం ఇంద్రాణి ముఖర్జియా, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ లు కలిసి శవాన్ని రాయ్ గఢ్ అడవుల్లో పాతిపెట్టారు. ఆ తరువాత సంజీవ్ కోల్ కతాకు, ఇంద్రాణి ఇంగ్లాండ్ కు వెళ్లిపోయారు. శ్యామ్ రాయ్ సొంత ఊరికి వెళ్లి కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు.. ఇంద్రాణి ఇచ్చిన 5 లక్షల రూపాయలత! ఊర్లో వ్యాపారాన్ని నమ్మకస్తుడైన స్నేహితుడికి అప్పజెప్పి మళ్లీ ముంబై వచ్చి ఆటో డ్రవర్ అవతారం ఎత్తాడు. సహచర డ్రైవర్లకు అప్పుడప్పుడు మందు పార్టీలు గట్రా ఇచ్చేవాడు. అలా ఓ రోజు మద్యం మత్తులో.. మూడేళ్లుగా తన మనసులోనే దాచుకున్న మర్డర్ మిస్టరీని తోటి ఆటోడ్రైవర్ కు చెప్పేశాడు. విన్నవాడు మామూలోడు కాదు.. పోలీస్ ఇన్ఫార్మర్! ఖర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ దినేశ్ కదమ్ కు నమ్మకమైన ఇన్ఫార్మర్లలో ఒకడైన ఆ ఆటోడ్రైవర్.. శ్యామ్ రాయ్ తనతో పంచుకున్న విషయాలన్నీ పూసగుచ్చాడు. 'షీనా హత్య గురించిగానీ, ఇంద్రాణి ముఖర్జియా గురించిగానీ తెలిసే అవకాశం లేదని నమ్మడం వల్లే శ్యామ్ రాయ్.. తోటి ఆటో డ్రైవర్ దగ్గర గుట్టు విప్పి ఉంటాడు' అని శ్యామ్ అరెస్టు అనంతరం ఇన్ స్పెక్టర్ దినేశ్ కదమ్ చెప్పారు. ఇన్ఫార్మర్ చెప్పిన సంగతుల ఆగస్లు 21న శ్యామ్ రాయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా షీనా హత్య, శవం పూడ్చివేత తదితర నేరాలను శ్యామ్ ఒప్పేసుకున్నాడు. తర్వాతి వారమే ఖర్ పోలీసులు కేసు నమోదు చేసి ఇంద్రాణియా ముఖర్జీను అరెస్టు చేశారు. అయితే శ్యామ్ రాయ్ వెల్లడించిన అంశాలను మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేసేలోపే కేసుపై రాజకీయదుమారం చెలరేగింది. ప్రస్తుతం షీనా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
'మాత్రలు కాదు.. నా తల్లి మరణమే కారణం'
ముంబయి: తన వద్ద ఏ మాత్రలు లేవని, ఎవరూ వాటిని ఇవ్వలేదని, అసలు తాను ఏ మాత్రలు వేసుకోలేదని షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఆమెతల్లి ఇంద్రాణి ముఖర్జియా పేర్కొంది. తన తల్లి మరణం గురించి తెలుసుకొని తీవ్ర విచారంలోకి కూరుకుపోయానని, దిగ్భ్రాంతికి లోనవ్వడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లానని చెప్పింది. మోతాదుకు మించిన మాత్రలు వేసుకోవడం ద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్లిందని భావించి ఆమెను జేజే ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్న అనంతరం మంగళవారం రాత్రి డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన అస్వస్థతకు తల్లి మరణమే కారణమని చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఇంద్రాణిని బైకుల్లా మహిళా ఖైదీల జైలుకు తరలించారు. -
స్పృహలోకి ఇంద్రాణి
-
స్పృహలోకి ఇంద్రాణి
ముంబయి: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్పృహలోకి వచ్చింది. దీంతో ఇక ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని వైద్యులు ధృవీకరించారు. తన కూతురు షీనాబోరాను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పరిస్థితి శనివారం అకస్మాత్తుగా విషమంగా మారిన విషయం తెలిసిందే. బైకలా జైల్లో ఉన్న ఆమె కొన్ని మాత్రలు వేసుకున్న వెంటనే ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటంతో హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలింది. దీంతో వెంటిలేటర్ ద్వారా ఆమెకు ఆక్సిజన్ అందించారు. కాగా, ఈ కేసు నేపథ్యంలో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక మరేదైనా తెలియని కారణం ఉందా ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఆమె ఫిట్స్ నిరోధానికి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అది కూడా జైలు అధికారుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి.కానీ ఆ మాత్రలను అధిక మోతాదులో ఇంద్రాణి వాడటం వల్లే అపస్మారక స్థితిలోనికి వెళ్లారని వైద్యులు అంటున్నారు. -
నేడు కోర్టుకు షీనా బోరా హత్యకేసులో నిందితులు
-
షీనా బోరా హత్యకేసు సీబీఐకి
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిష్పాక్షిక దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి కేపీ భక్షి శుక్రవారం ప్రకటించారు. ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా ఆకస్మిక బదిలీపై మీడియాలో వచ్చిన వార్తలతో ప్రభుత్వం కలత చెందిందని, ఈ కేసులో ప్రభుత్వానికి ప్రత్యేక ఆసక్తి లేదని ప్రజలకు తెలియజెప్పేందుకే సీబీఐకి అప్పగించాలని నిర్ణయించామని అన్నారు. 2012 ఏప్రిల్ 24న షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసిన విషయం విదితమే. ఈ హైప్రొఫైల్ కేసును ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా పర్యవేక్షించారు. నిందితులను ఆయనే ప్రశ్నించారు కూడా. అయితే అకస్మాత్తుగా ఈనెల 8న ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో బదిలీ జరిగినప్పటికీ షీనా కేసును మారియాయే పర్యవేక్షిస్తారని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే మారియా స్థానంలో ముంబై పోలీసు కమిషనర్‌గా నియమితులైన అహ్మద్ జావేద్‌కు పీటర్, ఇంద్రాణి ముఖర్జియాలతో పరిచయముందని శుక్రవా రం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఆయనే అంగీకరించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. -
షీనాబోరా హత్యకేసులో మరో మలుపు!
-
షీనాబోరా హత్యకేసులో మరో మలుపు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత కమిషనర్ జావేద్ అహ్మద్ ఈ కేసు విచారణ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడం, పాత కమిషనర్ రాకేష్ మారియాను దీన్నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరగడం లాంటి పరిణామాల నేపథ్యంలో.. ఈ తలనొప్పి తమకెందుకని సర్కారు భావించినట్లు తెలుస్తోంది. షీనా బోరా హత్యకేసు గురించిన పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా తాను డీజీపీని కోరారని, ఆయన నుంచి నివేదిక రాగానే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి దీనిపై సమగ్రంగా చర్చించామని మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కేపీ బక్షీ తెలిపారు. ఈ హత్యకేసు దర్యాప్తు పూర్తి నిష్పక్షపాతంగా జరగాలని, స్థానిక పోలీసులు లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల జోక్యం ఏమాత్రం లేకుండా ఉండాలనే మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ చేతుల్లోనే షీనా బోరా హత్యకు గురైనట్లు కథనాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చూస్తున్న ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు మధ్యలో పదోన్నతి కల్పించి ఆయనను వేరే పదవిలోకి బదిలీ చేయడం, ఆ తర్వాత ఏ పదవిలో ఉన్నా.. మారియానే కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని చెప్పడం లాంటి అనేక మలుపులు తిరిగాయి. చివరకు ఈ కేసు ఇప్పుడు సీబీఐ చేతికి వెళ్లింది. -
'ఇప్పుడు తీస్కో.. త్రీ బెడ్రూమ్ ఫ్లాట్..'
ఆ కారులో నలుగురున్నారు. తల్లిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కూతురు.. ఊరుకుంటే కూతురే కోడలై తన ఆర్థిక ఆధిపత్యానికి చెక్ పెడుతుందనుకున్న తల్లి.. తన నుంచి విడిపోయాక బాగా బతుకుతున్న మాజీ భార్యతో లాభపడొచ్చనుకున్న భర్త.. డబ్బున్నోళ్లకు నమ్మినబంటుగా ఉంటే ఆర్థికంగా ఎదగొచ్చనుకున్న డ్రైవర్. అలా వారి ప్రయాణం సాగుతుండగానే.. తల్లి చేతులు కూతురి మెడను చుట్టేశాయి. 'ఏమే.. నాకు పుట్టి నన్నే బెదిరిస్తావా.. త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ అడుగుతావా.. ఇప్పుడు తీస్కోవే.. త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్..' అంటూ ఇంద్రాణి తన కూతురు షీనా గొంతు నులుముతుంటే.. కదలనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా. ఆ సమయంలో కారు లోపలే ఉన్న డ్రైవర్ శ్యామ్ రాయ్ ...పోలీసుల విచారణలో షీనా బోరా హత్యకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించాడు. ఆర్థికంగా అండ దొరుకుతుందనే ఆశే తప్ప షీనా హత్యకు సహకరించడం వెనుక ఎలాంటి ఉద్దేశాలు లేవని డ్రైవర్ శ్యామ్ రాయ్ పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్న అతడు అప్రూవర్ గా మారతాడన్నది తాజా సమాచారం. సాధ్యమైనంతమేరలో శిక్ష నుంచి తప్పించుకోవాలని భావిస్తున్న శ్యామ్.. అప్రూవర్ గా మారాలనుకుంటున్నాడని, దీంతో గడిచిన నెల రోజులుగా సంచలనాలు సృష్టించిన షీనా హత్యకేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనని ముంబై పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. పోలీసులు తెలిపిన మరికొన్ని వివరాలు.. కుబేరుడైన పీటర్ ముఖర్జియా జీవితంలోకి మూడో భార్యగా ప్రవేశించినప్పటికీ ఆయనపై ఇంద్రాణి ముఖర్జీయా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించేది. ఆర్థిక విషయాలన్నీ ఆమె కనుసన్నల్లోనే సాగేవి. అలాంటిది.. పీటర్ కుమారుడు రాహుల్ ను షీనా పెళ్లి చేసుకుంటే గనుక ఆ కుటుంబ ఆస్తులపై పట్టు కోల్పోతాననే భయం ఇంద్రాణిని వెంటాడింది. అందుకే రాహుల్ తో రిలేషన్ కట్ చేసుకోవాలని షీనాపై ఒత్తిడి తెచ్చింది. షీనా మాత్రం ఇంద్రాణి ఒత్తిళ్లకు బెదరలేదు సరికదా.. రివర్స్ లో తల్లినే బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. 'నీ గత జీవితానికి సంబంధించిన వివరాలన్నీ రాహుల్, పీటర్ లకు చెప్పేస్తా. నీ చెల్లెలిగా వారు నా మాట నమ్ముతారు' అని హెచ్చరించేది. మాట్లాడకుండా ఉండాలంటే ప్రస్తుతానికి బంద్రా హిల్స్ లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ తనకు కొనివ్వాలని డిమాండ్ చేసింది. ఒకవేళ షీనాకు ఫ్లాట్ కొనిచ్చినప్పటికీ మళ్లీ తనను బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండదనే అపనమ్మకంతో తీవ్రంగా ఆలోచించిన ఇంద్రాణి.. షీనాను అడ్డు తొలిగించుకోవడం ఒక్కటే దారి అని బలంగా విశ్వసించింది. అందుకే తన స్వహస్తాలతో కన్న కూతురినే కడతేర్చింది. -
షీనా కేసులో మహారాష్ట్ర కీలక నిర్ణయం
షీనా బోరా హత్యకేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు ఉన్నట్టుండి పదోన్నతి ఇవ్వడంతో పలు వర్గాల నుంచి అనేక రకాల అనుమానాలు వచ్చాయి. ఆయనకు డీజీపీగా పదోన్నతి కల్పించడం.. ఈ కేసు నుంచి పక్కకు తప్పించడానికేనా అని అనేకమంది ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ మహారాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. హోదా మారినా, పోస్టు మారినా కూడా.. షీనా బోరా హత్యకేసు పూర్తిగా ఓ కొలిక్కి వచ్చేవరకు ఆ కేసు దర్యాప్తు మొత్తం రాకేష్ మారియా సారథ్యంలోనే జరుగుతుందని మహారాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ (హోం వ్యవహారాలు) ఓ ప్రకటనలో తెలిపారు. -
షీనా బోరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం
హత్య జరిగిన తీరేకాదు.. దర్యాప్తు జరుగుతున్న తీరులోనూ సంచలనాలు సృష్టిస్తోన్న షీనా బోరా కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు ప్రభుత్వం ఉన్నపళంగా పదోన్నతి కల్పించింది. మారియాను హోం గార్డ్స్ డీజీగా నియమిస్తూ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భారీ ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్న నేపథ్యంలో మారియా బదిలీపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అవన్నీ ఊహాగానాలేనని, సాధారణ ప్రమోషన్లలో భాగంగానే మారియా డీజీగా నియమితులయ్యారని ముంబై పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయంపై మహారాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కేపీ బక్షి మాట్లాడుతూ.. రాకేశ్ మారియా బదిలీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అహ్మద్ జావేద్‌ను ముంబై నగర నూతన కమిషనర్‌గా నియమించినట్లు, తక్షణమే ఈ నియమకాలు అమలులోకి రానున్నట్లు చెప్పారు. అయితే కొత్త కమిషనరే షీనా హత్య కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తారా? లేక ఏసీపీ స్థాయి అధికారులతోనే దర్యాప్తును ముగించేస్తారా? అనే విషయాలపై స్పష్టత రాలేదులేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. -
ఆ అస్థికలు షీనావే.. చిక్కుల్లో ఇంద్రాణి
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. షీనా బోరా హత్యకు గురైనట్టు నిర్ధారణైంది. రాయగఢ్ అడవుల్లో పోలీసులు సేకరించిన అస్థికలు షీనా బోరావేనని డీఎన్ఏ పరీక్షల్లో తేలినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నమూనాలు ఇంద్రాణి డీఎన్ఏతో సరిపోలినట్టు పరీక్షల్లో రుజువైందని సమాచారం. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో షీనా బోరాను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆమె శవాన్ని రాయగఢ్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇటీవల నిందితులను సంఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లి అస్థికలు, పుర్రెను సేకరించారు. పరీక్షల్లో ఈ అస్థికలు షీనా బోరావేనని తేలింది. ఈ రోజు ముంబై పోలీసులు ఇంద్రాణి ముఖర్జియా, కారు డ్రైవర్ రాయ్‌లను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. మరో నిందితుడు, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు పోలీస్ కస్టడీ పొడగించారు. -
ఇంద్రాణి, డ్రైవర్‌కు జ్యుడిషియల్ కస్టడీ
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, కారు డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్‌లకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో మరో నిందితుడు, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు పోలీస్ కస్టడీ పొడగించారు. సోమవారం నాటితో నిందితులకు పోలీస్ కస్టడీ ముగియడంతో ముంబై పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఇంద్రాణి, కారు డ్రైవర్లను జైలుకు తరలించారు. సంజీవ్ ఖన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు ఖన్నాను కోల్‌కతా తీసుకువెళ్లనున్నారు. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో కూతురు షీనా బోరాను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో అనైతిక విషయాలు వెలుగుచూశాయి. -
'విచారణకు ఇంద్రాణి సహకరించడం లేదు'
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితులకు ఈ నెల 7 వరకు పోలీస్ కస్టడీ పొడగించారు. ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ నిందితులుగా ఉన్నారు. శనివారం వీరిని కోర్టులో ప్రవేశపెట్టారు. షీనా హత్య కేసులో ఇంద్రాణి సహకరించడంలేదని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసు విచారణ కోసం నిందితులకు రిమాండ్ పొడగించాలని పోలీసులు కోర్టును కోరారు. కోర్టు నిందితులకు కస్టడీ పొడగించడంతో పోలీసులు వారిని ఖర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఇంద్రాణి తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో కన్న కూతురు షీనాను హత్య చేసిన సంగతి తెలిసిందే. -
పీటర్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ముంబై: షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా భర్త, స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియాను పోలీసులు ఈరోజు మళ్లీ విచారణ చేయనున్నారు. పీటర్ స్వగృహంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు కొన్ని డాక్యుమెంట్లను, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి చేపట్టిన దర్యాప్తు, విచారణలో భాగంగా నిన్న ఆయనను 12 గంటల పాటు ప్రశ్నించి, కొన్ని విషయాలను రాబట్టుకున్నారు. కలినాలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఈ కేసుకు సంబంధించి లభ్యమైన ఆధారాలను వారు పరిశీలిస్తున్నారు. కుళ్లిపోయిన మృతదేహాం నుంచి కొన్ని శాంపిల్స్,ఇంద్రాణి నుంచి కొన్ని శాంపిల్స్ ను సేకరించారు. ఖేర్ పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా పోలీసులు ఆయనకు సమాచారమిచ్చారు. ఆయన స్టేట్మెంట్ నోట్ చేసుకుంటామని ముంబై పోలీసులు తెలిపారు. కూతుర్ని హత్య చేసిందన్న ఆరోపణలతో ఇంద్రాణీ ముఖర్జియా ఆగస్టు 25న అరెస్టయిన విషయం విదితమే. ఇంద్రాణీ, పీటర్ లకు ఒకే విధమైన ప్రశ్నలను ఇచ్చి సమాధానమివ్వాలని కోరారు. ఆర్థిక సంబంధమైన విషయాలు.. వివిధ కంపెనీలలో వాటా, షేర్ల వివరాలపై ఎక్కువగా ప్రశ్నలు ఉన్నట్లు తెలుస్తోంది. భార్య ఇంద్రాణీకి, కుమారుడు రాహుల్, షీనాబోరా, మరో కూతురు వైదేహిలకు నగదు ఎంత మొత్తం ఇచ్చేవారో తెలపాలని అధికారులు ఆయనను ప్రశ్నించారు. -
నేరం ఒప్పుకున్న ఇంద్రాణి!
ముంబై: కూతురు హత్య కేసులో అరెస్టైన ఇంద్రాణి ముఖర్జియా పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నట్టు తెలిసింది. ఈ హత్యలో తన పాత్ర ఉన్నట్టు ఆమె అంగీకరించారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల పాటు పొంతనలేని సమాధానాలు చెబుతూ వచ్చిన ఆమె ఎట్టకేలకు నేరం ఒప్పుకున్నట్టు తెలిపాయి. తన కూతురు షీనా బోరా హత్యకు గురికాలేదని, బతికేవుందని ఇంద్రాణి చెప్పింది. షీనా అమెరికాలో ఉంటోందని, తనపై ద్వేషంతో నే ఆమె బయటకు రావడం లేదని ఇంద్రాణి నమ్మబలికింది. ఆమె చెప్పిన దాంట్లో పరస్పర విరుద్ధ విషయాలు ఉన్నాయని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. షీనా హత్య కేసులో అరెస్టైన ముగ్గురు నిందితుల పాత్రపై ఆరా తీస్తున్నామని చెప్పారు. మిగతా ఇద్దరు నిందితులు నేరం ఒప్పుకున్నారని అనుకుని ఆమె కూడా నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది. కాగా, బాంద్రా కోర్టులో తన చిన్న కూతురు విధిని కలిసినప్పుడు ఇంద్రాణి కన్నీళ్లు పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
నేడు ఇంద్రాణి భర్త వాంగ్మూలం
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి భర్త టీవీ మీడియా టైకూన్, స్టార్ ఇండియా మాజీ చైర్మన్ పీటర్ ముఖర్జియా వాంగ్మూలాన్ని బుధవారం రికార్డు చేయనున్నారు. గత వారమే ఆయన వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ముంబయి పోలీసులు కోరగా తాను లిఖిత పూర్వక వివరణ ఇస్తానని చెప్పారు. అందుకు నిరాకరించిన పోలీసులు నేరుగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని అన్నారు. దీంతో ఆయన బుధవారం నేరుగా వచ్చి వాంగ్మూలం ఇవ్వనున్నట్లు తెలిసింది. షీనా హత్య గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఆయన కేసు దర్యాప్తునకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. 2012లో పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి ముఖర్జియా తన కన్నకూతురిని హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. -
ఆ సూట్‌కేసు మిఖైల్‌ను చంపి దాచేందుకేనా?
ముంబై: షీనా బోరా హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆదివారం షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీయాకు చెందిన ముంబై నివాస ప్రాంతంలో వారు ఓ సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు. ఈ సూట్‌కేస్ షీనా సోదరుడు మిఖైల్‌ను హత్య చేసి అందులో దాచి అటవీ ప్రాంతంలో షీనా హత్య చేసిన ప్రాంతంలోనే ఖననం చేసేందుకు సమీకరించారని పోలీసుల అనుమానం. కాగా, ఆధారాల సేకరణ కోసం షీనా హత్య జరిగిన తీరును తెలుసుకోవడానికి ఈ కేసులో నిందితులైన ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌లను ముంబై పోలీసులు ఆదివారం రాయ్‌గఢ్ జిల్లా అడవికి తీసుకెళ్లారు. ఇంద్రాణి, ఖన్నాలు హత్యకు కారణం నువ్వంటే.. నువ్వని పరస్పరం ఆరోపణలకు దిగారని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు.. నిందితులైన ఇంద్రాణి ముఖర్జియా, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నారు. -
షీనా హత్య కేసులో కీలక మలుపు
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు దర్యాప్తులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, షీనా హత్యలో పాలుపంచుకున్నట్లు షీనా తల్లి, ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్త సంజీవ్ ఖన్నా శుక్రవారం పోలీసు విచారణలో అంగీకరించారు. దీంతో మాజీ భర్త ఖన్నా, డ్రైవర్ రాయ్‌ల సహకారంతో షీనాను సొంత తల్లి ఇంద్రాణినే హత్య చేసిందన్న వాదనకు బలం చేకూరింది. కోల్‌కతా నుంచి తీసుకువచ్చిన ఖన్నాను, ఇంద్రాణిని, ఆమె డ్రైవర్ శ్యామ్ రాయ్‌ని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా సమక్షంలో ఖార్ పోలీస్ స్టేషన్లో ఒకేసారి, ఒకే దగ్గర విచారించారు. అనంతరం, తమ విచారణలో ఖన్నా నేరాన్ని అంగీకరించాడని రాకేశ్ మారియా తెలిపారు. విచారణలో గువాహటి నుంచి తీసుకువచ్చిన ఇంద్రాణి కుమారుడు, షీనా సోదరుడు మైఖేల్ బోరా కూడా అక్కడే ఉన్నారు. కాగా, షీనా బోరా అస్తిపంజర శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని శనివారం డీఎన్ఏ పరీక్షలకు పంపిస్తామని మారియా తెలిపారు. షీనా పాస్‌పోర్ట్‌ను డెహ్రాడూన్‌లో స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పాస్‌పోర్ట్ లభించడంతో షీనా అమెరికా వెళ్లిందన్న కథనంపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. మైఖేల్ చెప్పిన ఆంశాలపై కూడా దృష్టి పెట్టామని మారియా చెప్పారు. అంతకుముందు, నిందితులు ముగ్గురిని పోలీసులు రాయ్‌గఢ్ అడవిలో షీనా మృతదేహాన్ని తగలబెట్టిన ప్రాంతానికి తీసుకెళ్లారు. నాటకీయ పరిణామాలు.. షీనా హత్యకేసు దర్యాప్తులో శుక్రవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు జరిగాయి. కోల్‌కతాలో అరెస్ట్ చేసిన ఖన్నాను శుక్రవారం ఉదయం ముంబై కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.స్థానిక బాంద్రా కోర్టు ఆగస్ట్ 31 వరకు పోలీస్ కస్టడీకి పంపించింది. ఐపీసీ 364(అపహరణ), 302(హత్య), 201(సాక్ష్యాల నాశనం) సెక్షన్ల కింద కేసు పెట్టి కోర్టులో హాజరుపర్చారు. షీనా హత్యలో ఖన్నాది క్రియాశీల పాత్రని, పూర్తి వివరాలు రాబట్టేందుకు విచారించాన్న వాదనతో ఏకీభవించిన కోర్టు ఖన్నాను పోలీసు కస్టడీకి పంపించింది. ఇంద్రాణి, ఖన్నా, ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ రాయ్.. 2012 ఏప్రిల్ 24న షీనాకు ముంబైలో ఒక హోటల్ గదిలో మద్యం తాగించి, కార్లో తీసుకెళ్తూ గొంతు నులిమి చంపారని, రాయ్‌గఢ్ జిల్లాలోని పెన్ పట్టణ శివార్లలోని అడవిలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగలపెట్టారని పోలీసులు కోర్టుకు తెలిపారు. కాగా, షీనా సోదరుడు, ఇంద్రాణి కుమారుడు మైఖేల్‌ను కూడా పోలీసులు గువాహటి నుంచి ముంబై తీసుకువచ్చారు. తన సోదరి హత్యకు సంబంధించి తనవద్ద కీలక ఆధారాలున్నాయని మైఖేల్ చెప్పడంతో ఆయనను గురువారం గువాహటిలో విచారించిన ముంబై పోలీసులు, తదుపరి విచారణ కోసం శుక్రవారం ముంబై తీసుకువచ్చారు. తన సోదరికి న్యాయం జరగాలని, అందుకు అవసరమైన పూర్తి సహకారం పోలీసులకు అందిస్తానని మైఖేల్ పేర్కొన్నారు. ఇంద్రాణి ప్రస్తుత భర్త స్టార్ మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియాను, ఆయన సోదరుడు గౌతమ్‌ను పోలీసులు విచారించారు. మారియా సమక్షంలో పీటర్‌ను ఖార్ పోలీస్ స్టేషన్లో 10 నిమిషాలు ప్రశ్నించి వదిలేశారు. షీనాతో సాన్నిహిత్యంపై పీటర్ కుమారుడు రాహుల్‌ను ప్రశ్నించడం తెలిసిందే. ప్రస్తుత భర్త పీటర్ కుమారుడు రాహుల్, తన కూతురు షీనా ల సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక ఇంద్రాణి ఈ హత్యకు పాల్పడిందా? ఇందులో ఆర్థిక కోణమేదైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, తాము చేసిన నేరాన్ని గుర్తు చేసేలా.. ‘నీ టీనేజ్ పిల్లలను గొంతు నులిమి చంపి ఉండకపోతే.. మనవళ్లు బహుమతిగా లభించేవారు’ అనే అర్థం వచ్చేలా 2014లో ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యాఖ్యకు ఇంద్రాణి లైక్ కొడ్తూ స్పందించడం గమనార్హం. ‘నువ్వెవరినైనా మోసం చేశావంటే దానర్థం.. ఆ వ్యక్తి తెలివితక్కువవాడని కాదు.. నిన్ను నీ అర్హతకు మించి విశ్వసించాడని అర్థం’ అనే మరో కామెంట్‌ను కూడా గత ఏడాది ఖన్నా పోస్ట్ చేశాడు. ఇంద్రాణిని కలవనివ్వడం లేదు! షీనా బోరా హత్య కేసు దర్యాప్తునకు ఉపయోగపడే అవకాశమున్న మరో ఆధారాన్ని పోలీసులు సంపాదించారు. 2012 ఏప్రిల్‌లో షీనా హత్యానంతరం, షీనాకు చెందిన ఎముకల ముక్కలను పరీక్షల నిమిత్తం పెన్ పోలీసులు 2012, మే నెలలో ముంబైలోని జేజే ఆసుపత్రికి పంపించారు. ఆ శాంపిల్స్‌ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ ఎముక ముక్కలను పరీక్షించి, వాటితో వయసు, స్త్రీయా లేక పురుషుడా, మృతికి కారణాలు.. మొదలైన వాటిని నిర్ధారించలేమంటూ 2013లోనే నివేదిక పంపించామని జేజే ఆసుపత్రి డీన్ టీపీ లహానే వెల్లడించారు. కాగా, ఇంద్రాణితో ఆమె లాయర్లను పోలీసులు కలుసుకోనివ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై ముంబైలోని మరో కోర్టు విచారణ జరిపింది. నిందితుల హక్కులపై సుప్రీంకోర్టు మార్గనిర్దేశాల ప్రకారం వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. -
సంజీవ్ ఖన్నాకు పోలీసు కస్టడీ
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు శుక్రవారం బాంద్రా కోర్టులో హజరుపరిచారు. ఆయనకు కోర్టు ఈనెల 31 వరకు పోలీసు కస్టడీ విధించింది. కోల్ కతాలో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంద్రాణిని పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. కాగా, షీనా బోరా మృతదేహాన్ని తగులబెట్టిన అటవీ ప్రదేశంలో పుర్రె, ఎముకలను పోలీసులు సేకరించారు. షీనా మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను భద్రపరిచారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని షీనా సోదరుడు మిఖైల్ తెలిపాడు. -
షీనా కేసులో కీలక ఆధారాలు మాయం!
సంచలనం రేపుతున్న షీనా బోరా హత్య కేసులో గంట గంటకూ కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. కేసులో కీలక ఆధారాలుగా భావిస్తున్న మూడు వస్తువులు మాయం అయినట్లు తాజా సమాచారం. షీనా బోరాను హత్యచేసి కాల్చి, పూడ్చిపెట్టిన ప్రదేశం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గులాబి రంగు వస్త్రం, ఒక దంతం, కుడి చేతి ఎముక ఏమైపోయాయో, ఎక్కడున్నాయో ఎంతకీ అంతుచిక్కడంలేదు . ఆ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీస్ రికార్డుల్లో ఉన్నప్పటికీ.. ల్యాబ్ అధికారులు మాత్రం అలాంటిదేమీలేదని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసులో నిందితురాలిగా భావిస్తున్న ఇంద్రాణియే తన పలుకుబడిని ఉపయోగించి ఆధారాలను మాయం చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుర్వాసన వస్తోందని.. రాయ్‌గఢ్ జిల్లా పేన్ తాలూకా గగోబె బుద్రుక్ గ్రామస్తులు.. 2012, మే 23న పేన్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. గ్రామం సమీపంలోని అటవీప్రాంతం నుంచి దుర్వాసన వస్తున్నదని, ఓ సారి వచ్చి చూడాల్సిందిగా కోరారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు అక్కడే పడిఉన్న ఒక వస్త్రం, దంతం, ఎముకలను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం కలీనాలోని ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపారు. సీన్ కట్ చేస్తే.. డ్రైవర్ వాగ్మూలంతో బట్టబయలైన షీనా బోరా హత్యోదంతాన్ని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల.. పేన్ పోలీసులు స్వాధీనం చెసుకున్న వస్తువుల గురించి తెలిసింది. దీంతో ముంబై పోలీసులు వెంటనే పేన్కు వెళ్లి రికార్డులను పరిశీలించారు. అటుపై కలీనాలోని ఎఫ్ఎస్ఎల్కు వెళ్లారు. కానీ అక్కడ ఆ ఆధారాలు కనిపించలేదు. పైగా పేన్ పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు ఒక మహిళకు సంబంధించిన మూడు వస్తువులేవీ తమ వద్దకు రాలేదని తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న ముంబై పోలీసులు.. 2012లో ల్యాబ్ ఇన్చార్జిలుగా పనిచేసిన వారందరినీ ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. పొరపాటునగానీ ఈ ఆధారాలు మరో ల్యాబ్ కు చేరి ఉంటాయా? అనే అనుమానంతో ముంబైలోని జేజే హాస్పిటల్ ల్యాబరేటరీ రికార్డులను కూడా పరిశీలించారు. అయితే అక్కడ కూడా నిరాశే ఎదురైంది. -
'తల్లి రీ- ఎంట్రీతో కూతురి లైఫ్‌స్టైల్ మారింది'
అప్పటిదాకా ఆమె ప్రపంచం వేరు. ఆహ్లాదకరమైన గువహటిలో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఎగిరే పక్షిలా ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేది షీనా బోరా. తన అందాన్ని పొగిడే స్నేహితురాళ్లకు తల్లి ఇంద్రాణి ఫొటోను చూపిస్తూ.. 'చూడండే.. మా అమ్మ ఎంత అందంగా ఉందో. నావీ ఆమె పోలికలే' అంటూ మురిసిపోయేదట! ఆమె చిన్నానాటి స్నేహితుడు, గువాహటికి చెందిన అర్నాబ్ సిక్దార్.. షీనా బోరాకు సంబంధించిన కొత్త విషయాలను మీడియాకు చెప్పారు. 'స్కూల్లో జరిగే ఆర్ట్స్, మ్యూజిక్ కాంపిటీషన్ అన్నింట్లోనూ షీనా పాల్గొనేంది. అవంటే ఆమెకు చాలా ఇంట్రెస్ట్. అంతేకాదు ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడాఎక్కువే. తాత ఉపేంద్ర కుమార్, అమ్మమ్మ, అన్నయ్య మిఖైల్ అంటే షీనాకు ప్రాణం. వాళ్లు కూడా ఆమెను గారాబం చేసేవాళ్లు. బంగారమొకెత్తుగా చూసుకునేవాళ్లు. ఎప్పుడైనా తల్లిదండ్రుల ప్రస్తావన వస్తే.. 'అమ్మానాన్న విడిపోయారు. ప్రస్తుతం అమ్మ విదేశాల్లో ఉంది' అని మాతో చెప్పేంది..' అంటూ షీనా చిన్ననాటి సంగతులు చెప్పుకొచ్చాడు అర్నాబ్. అలా హాయిగా సాగుతున్న షీనా జీవితం తల్లి ఇంద్రాణి రీ- ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది.. 'తొమ్మిది, పదో తరగతుల్లో షీనాలో ఊహించని మార్పు! కొత్త కొత్త లగ్జరీ కార్లలో తిరుగుతుండేది. ఆ వయసులోనే ప్రపంచ యాత్రలకు వెళ్లొచ్చేది. ఈ మార్పు మాకు వింతగా అనిపించేది. తర్వాతగానీ మాకు తెలిసిరాలేదు.. విదేశాల నుంచి షీనా తల్లి(ఇంద్రాణి) తిరిగొచ్చిందని. 2012లో గువాహటి వదిలి ముంబై వెళ్లిపోయిన తర్వాత షీనాను కలవలేదు. తాజాగా హత్యోదంతం వెలుగులోకి రావడంతో నా చిన్ననాటి స్నేహితురాలిని ఎప్పటికీ కలవలేనని తెలిసొచ్చింది' అని చెప్పాడు అర్నాబ్ సిక్దార్.