'ఆ రోజు గట్టి హగ్.. గాఢమైన ముద్దు ఇస్తాను' | Peter Mukerjea sends wife Indrani big hug, birthday wishes | Sakshi
Sakshi News home page

'ఆ రోజు గట్టి హగ్.. గాఢమైన ముద్దు ఇస్తాను'

Published Wed, May 4 2016 9:44 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

'ఆ రోజు గట్టి హగ్.. గాఢమైన ముద్దు ఇస్తాను'

'ఆ రోజు గట్టి హగ్.. గాఢమైన ముద్దు ఇస్తాను'

ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు ఆమె భర్త, తాను కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉంటున్న పీటర్ ముఖర్జియా ఓ ఘాటు ప్రేమ లేఖ రాశారు. ఈ ఏడాది జనవరిలో తన భార్య ఇంద్రాణి పుట్టిన రోజు సందర్భంగా జైలులో ఉన్న ఆమెకు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలతోపాటు తన ప్రేమను రంగరించి ఓ లేఖ పంపించారు.

'నీవు ఒక రోజు నీ అమాయకత్వాన్ని నిరూపించుకోగలవు. నేను కూడా నీ తరుపున ప్రార్థిస్తున్నాను. ఈ పీడకల నిన్ను వదిలి మంచి రోజు నీకు వస్తుంది' అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే ఒకరినొకరు పలకరించుకుంటున్నారని, గత నెలలో ఆమె పుట్టిన రోజుకు సంబంధించి స్వీట్లు కూడా తినిపించుకున్నారని అధికార వర్గాల సమాచారం. ఆయన స్వయంగా తన చేతి రాతతో జనవరి 3న ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖను ఎలా ప్రారంభించారంటే..

'ముమూ మై డియరెస్ట్.. ఈ రోజు నీ జీవితంలో ప్రత్యేకమైన రోజు.. నా కైతే ఇంకా చాలా ప్రత్యేకం. మనం కలిసినప్పటి నుంచి నీ ప్రతి పుట్టిన రోజును కలిసే జరుపుకున్నాం. కానీ ఈ ఏడాది మాత్రం చాలా దగ్గరగా ఉన్నా ఎంతో దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేవుడు చాలా గొప్పవాడు. దీనికి త్వరలోనే ముగింపు ఇస్తాడు. మనిద్దరం ఏం చక్కా రోమియో జులియెట్ లాగా త్వరలోనే ఒకరినొకరం తిరిగి కలుసుకుంటాం. అది కోర్టు ప్రాంగణం కావొచ్చు.. నివాసం కావొచ్చు. నీకు ఎదురైనప్పుడు మాత్రం బాధ మొత్తం పోయేలా మంచి సంతోషాన్ని ఇస్తాను. నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సంక్షిప్త లేఖ ద్వారా నేను నిన్ను ఇలా చేరుకుంటున్నాను. కానీ, నీ రోజంటూ వచ్చిన తర్వాత ఒక గట్టి కౌగిలి.. గాఢమైన ముద్దు ఇస్తాను' అంటూ ఆ లేఖలో రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement