తల్లి పీక కోసిన కొడుకు అరెస్టు
కన్నతల్లిని పీక కోసి, కత్తితో నాలుగైదు సార్లు పొడిచి మరీ చంపిన కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. దేశంలోనే అత్యంత సంచలనాత్మకమైన షీనాబోరా హత్యకేసును విచారిస్తున్న ఇన్‌స్పెక్టర్ జ్ఞానేశ్వర్ గనోరే భార్య దీపాలి ఇటీవల హత్యకు గురయ్యారు. తల్లిని పీక కోసి చంపేసిన ఆయన కుమారు సిద్ధాంత్.. ఆమె రక్తంతో ఇంట్లో నేలమీద ఒక స్మైలీ వేయడంతో పాటు.. ''ఆమె అంటే విసుగెత్తిపోయింది. నన్ను పట్టుకుని ఉరితీయండి'' అని రాశాడు. సిద్ధాంత్ నేషనల్ కాలేజిలో ఇంజనీరింగ్ చదువును సగంలో ఆపేశాడు. గత రెండు నెలలుగా ఎవరితోనూ పెద్దగా కలవడం లేదని, అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండట్లేదని అతడి స్నేహితులు తెలిపారు.
కన్నతల్లిని పీక కోసి చంపి.. రక్తాక్షరాలు!
హత్య తర్వాత రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు పారిపోయిన సిద్ధాంత్‌ను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. ముంబై నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. అక్కడి హోటల్లో ఉండగా విశ్వసనీయంగా సమాచారం అంది పోలీసులు వెళ్లడంతో సిద్ధాంత్ దొరికిపోయాడు.