ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెలాఖరు వరకు (మార్చి 31)వాయిదా వేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం వెలువరించింది.
తన ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆస్పత్రిలో చూపించుకునేందుకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ గత ఫిబ్రవరి నెలలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల బలహీనత కారణంగా తాను తరుచూ కళ్లు తిరిగి పడిపోతున్నానని పిటిషన్ లో పేర్కొంది. కన్న కూతురుని దేశం నివ్వెరపోయేలా ఇంద్రాణి హత్య చేసిన విషయం తెలిసిందే.
'స్పృహ కోల్పోతున్నాను.. బెయిల్ ఇవ్వండి'
Published Wed, Mar 23 2016 7:21 PM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM
Advertisement
Advertisement