బెయిల్‌ ఓకే, ఆ బిడ్డకు తండ్రెవరు! ఏం జరిగింది? | In Jail for 17 Months, Man Gets Bail As DNA Shows He Is Not Father | Sakshi
Sakshi News home page

బెయిల్‌ ఓకే, ఆ బిడ్డకు తండ్రెవరు! ఏం జరిగింది?

Published Mon, Jan 25 2021 11:31 AM | Last Updated on Mon, Jan 25 2021 5:16 PM

In Jail for 17 Months, Man Gets Bail As DNA Shows He Is Not Father - Sakshi

అయినప్పటికీ ప్రాసిక్యూషన్ ఈ అభ్యర్ధనను తీవ్రంగా వ్యతిరేకించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే, నిందితుడు సాక్ష్యాలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది.

ముంబై : పొరుగింటి యువతిపై అత్యాచారం కేసులో 17 నెలల శిక్ష అనంతరం నిందితుడికి బెయిల్‌ లభించింది. డీఎన్‌ఏ రిపోర్టు ఆధారంగా బాధితురాలి బిడ్డకు అతను తండ్రి కాదని తేలడంతో కోర్టు బెయిల్‌ ముంజూరు చేసింది. వివరాల ప్రకారం పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన యువతి పాఠశాలలో ఉండగానే విపరీతమైన కడపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా, ఆమె గర్బవతి అని తేలింది. విషయాన్ని ఆరాతీయగా, పక్కింటి వ్యక్తే తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. దీంతో 2019 జూలై23న అతడిపై కేసు నమోదు కాగా, 17నెలల పాటు జైలు జీవితాన్ని గడిపాడు.
(ప్రేయసి విషయంలో స్నేహితుల మధ్య వివాదం)

ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని పేర్కొంటూ రెండుసార్లు బెయిల్‌ దాఖలు చేశాడు. అయినప్పటికీ ప్రాసిక్యూషన్ ఈ అభ్యర్ధనను తీవ్రంగా వ్యతిరేకించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే, నిందితుడు సాక్ష్యాలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా డీఎన్‌ఏ రిపోర్టు ఆధారంగా ఆ యువతి బిడ్డకు అతడు తండ్రి కాదని తేలడంతో కోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, దివ్యాంగురాలు జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి ఎవరనే ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. కావాలనే నిందితునిపై ఆరోపణలు చేశారా? లేక డబ్బు చేతులు మారి డీఎన్‌ఏ రిపోర్టులో మార్పులు చోటుచేసుకున్నాయా అని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
(నల్గొండలో జంట హత్యల‌ కలకలం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement