పీటర్‌ ముఖర్జియా విడుదల | Sheena Bora Murder Case Accused Peter Mukerjea Released from Mumbai Jail | Sakshi
Sakshi News home page

పీటర్‌ ముఖర్జియా విడుదల

Published Sat, Mar 21 2020 2:13 AM | Last Updated on Sat, Mar 21 2020 2:33 AM

Sheena Bora Murder Case Accused Peter Mukerjea Released from Mumbai Jail - Sakshi

షీనా బోరా, పీటర్‌ ముఖర్జియా

ముంబై: 2012నాటి సంచలన షీనా బోరా హత్య కేసులో గత నాలుగేళ్లుగా జైళ్లో ఉంటున్న పీటర్‌ ముఖర్జియాకు శుక్రవారం విడుదల అయ్యారు. బాంబే హైకోర్టు ఆయనకు ఫిబ్రవరిలోనే బెయిల్‌ ఇచ్చినప్పటికీ.. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా ఆరువారాల పాటు ఆ బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విధించింది. ఆ స్టే గడువు గురువారంతో ముగిసింది.

సీబీఐ అప్పీల్‌ చేసుకోకపోవడంతో ఆయన శుక్రవారం విడుదల అయ్యారు. సొంత కూతురు హత్యకు సంబంధించిన ఈ కేసులో ముఖర్జియా మాజీ భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన ముద్దాయి. పీటర్‌ ముఖర్జియా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లుగా ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని బెయిల్‌ ఉత్తర్వుల్లో బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement