released on bail
-
పీటర్ ముఖర్జియా విడుదల
ముంబై: 2012నాటి సంచలన షీనా బోరా హత్య కేసులో గత నాలుగేళ్లుగా జైళ్లో ఉంటున్న పీటర్ ముఖర్జియాకు శుక్రవారం విడుదల అయ్యారు. బాంబే హైకోర్టు ఆయనకు ఫిబ్రవరిలోనే బెయిల్ ఇచ్చినప్పటికీ.. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఆరువారాల పాటు ఆ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఆ స్టే గడువు గురువారంతో ముగిసింది. సీబీఐ అప్పీల్ చేసుకోకపోవడంతో ఆయన శుక్రవారం విడుదల అయ్యారు. సొంత కూతురు హత్యకు సంబంధించిన ఈ కేసులో ముఖర్జియా మాజీ భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన ముద్దాయి. పీటర్ ముఖర్జియా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లుగా ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని బెయిల్ ఉత్తర్వుల్లో బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. -
హార్దిక్ అరెస్ట్, విడుదల
సూరత్: గుజరాత్లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. సూరత్‌లో హార్దిక్, ఆయన మద్దతుదారులు శనివారం ‘ఏక్తా ర్యాలీ’ నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకుని తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని వారిపై ఎఫ్ఐ ఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. హార్దిక్‌తోపాటు మరో 35 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ర్యాలీకి నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోలేదని తెలిపారు. తర్వాత హార్దిక్‌ను, అయన అనుచరులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా రూ. వెయ్యి పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. హార్దిక్‌ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పటేళ్లు నిరసన తెలిపారు. వారికి, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. వదంతులను నిలువరించడానికి రాష్ర్టంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వం పటేళ్ల వర్గాన్ని అణచివేస్తోందని హార్దిక్ ఆరోపించారు. దండినుంచి అహ్మదాబాద్‌కు ర్యాలీ నిర్వహించేం దుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హార్దిక్ సూరత్‌లో ర్యాలీ తలపెట్టారు. -
బెయిల్‌పై విడుదలయిన కేజే కుమార్
చిత్తూరు అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కేజే కుమార్ గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. చిత్తూరు జిల్లా నగరిలో కమిషనర్‌పై దాడి చేశారని పోలీసులు తప్పుడు ఫిర్యాదుతో కేజే కుమార్‌ను, ఆయన కుమారుడు కేజే సురేష్, పార్టీ కార్యకర్తలు ముగ్గురిని గత నెలలో అరెస్టు చేసి చిత్తూరు జిల్లా జైలులో ఉంచిన విషయం తెలిసిందే. వీరితో పాటు నగరి మునిసిపల్ చైర్పర్సన్ కేజే శాంతిపై కూడా కేసు బనాయించారు. వీరందరికీ బుధవారం రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వులతో నాయకులు చిత్తూరులోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం కుమార్ తదితరులు చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో షరతుల మేరకు సంతకం చేశారు. అక్కడి నుంచి డీసీసీబీ బ్యాంకు ఆవరణలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేజే కుమార్ మాట్లాడుతూ.. పోలీసులు, టీడీపీ నాయకులు ఒక్కటై తమపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని కేజే కుమార్ అభిప్రాయపడ్డారు. -
సత్యం రామలింగరాజు విడుదల
-
సత్యం రామలింగరాజు విడుదల
హైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజు మరో ఏడుగురు బెయిలుపై బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. నాంపల్లిలోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారమే వీరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ పత్రాలు జైలు అధికారులకు అందడం జాప్యం జరగడం వల్ల వారు ఈ రోజు విడుదలయ్యారు. సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రామలింగరాజు, అతని సోదరుడు రామరాజు లక్ష రూపాయల చొప్పున, మిగతా నిందితులు 50 వేల రూపాయల పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆ మేరకు వారు పూచీకత్తు సమర్పించి విడుదలయ్యారు. -
గాలి జనార్దనరెడ్డి విడుదల
ఓఎంసీ కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దనరెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. చిట్ట చివరి కేసులో కూడా ఆయనకు మంగళవారం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. అనంతరం కొన్ని అధికారిక లాంఛనాలు ముగించి, పరప్పన అగ్రహార జైలు నుంచి శుక్రవారం సాయంత్రం గాలి జనార్దనరెడ్డిని విడుదల చేశారు. జైలు నుంచి తన కాన్వాయ్ లో జనార్దనరెడ్డి చిరునవ్వుతో చేతులు ఊపుతూ వెళ్లారు. అక్రమ మైనింగ్ ఆరోపణలపై 2011 సెప్టెంబర్ 5న సీబీఐ వర్గాలు ఆయనను బళ్లారిలోని ఆయన ఇంట్లోనే అరెస్టు చేశాయి. శుక్రవారం విడుదల కావడంతో ఆయన మొత్తం 1,237 రోజులు వివిధ జైళ్లలో గడిపినట్లు అయ్యింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన ఆయన.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లోనే చాలా కాలం ఉన్నారు. మధ్యలో ఆయన బెంగళూరులోని పరప్పణ అగ్రహారంలో గల ప్రధాన జైలుకు కూడా వెళ్లి వచ్చేవారు. ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. దాంతో ఆయనను బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. తన సోదరునికి బెయిల్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. -
గాలి జనార్దనరెడ్డి విడుదల