చిత్తూరు అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కేజే కుమార్ గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. చిత్తూరు జిల్లా నగరిలో కమిషనర్‌పై దాడి చేశారని పోలీసులు తప్పుడు ఫిర్యాదుతో కేజే కుమార్‌ను, ఆయన కుమారుడు కేజే సురేష్, పార్టీ కార్యకర్తలు ముగ్గురిని గత నెలలో అరెస్టు చేసి చిత్తూరు జిల్లా జైలులో ఉంచిన విషయం తెలిసిందే. వీరితో పాటు నగరి మునిసిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతిపై కూడా కేసు బనాయించారు. వీరందరికీ బుధవారం రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ ఉత్తర్వులతో నాయకులు చిత్తూరులోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం కుమార్ తదితరులు చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో షరతుల మేరకు సంతకం చేశారు. అక్కడి నుంచి డీసీసీబీ బ్యాంకు ఆవరణలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేజే కుమార్ మాట్లాడుతూ.. పోలీసులు, టీడీపీ నాయకులు ఒక్కటై తమపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని కేజే కుమార్ అభిప్రాయపడ్డారు.
బెయిల్‌పై విడుదలయిన కేజే కుమార్
Published Fri, Sep 11 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM
Advertisement