సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం అండతో పచ్చ బ్యాచ్ రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా నగరిలో టీడీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
వివరాల ప్రకారం.. చిత్తూరులోని నగరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. నగరి పట్టణంలో మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా సహా కార్యకర్తలు ఉన్న ఫ్లైక్సీలని చించేసి పైశాచిక ఆనందం పొందారు. ఇక, ఘటనపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లైక్సీలు చించేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment