‘తప్పుమీది కాదు.. తప్పు ఈవీఎంలదే’ | RK Roja Slams AP Government Decisions | Sakshi
Sakshi News home page

‘తప్పుమీది కాదు.. తప్పు ఈవీఎంలదే’

Published Mon, Mar 17 2025 4:26 PM | Last Updated on Mon, Mar 17 2025 4:29 PM

RK Roja Slams AP Government Decisions

నగిరి: ఏపీలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్‌సీపీ నేత , మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు.  ‘కూటమి’ పాలనలో ఒక్కొక్క దానికి చరమగీతం పాడేస్తున్నారంటూ మండిపడ్డారు. మెడికల్ కాలేజీలకు మంగళం పాడేసిన కూటమి ప్రభుత్వం, భరోసా కేంద్రాలకు కూడా ఎత్తేస్తుందని, ఇప్పుడు ఇక బడుల వంతు అంటూ రోజా  విమర్శించారు.

‘మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారు, రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నారు.. ఇప్పుడు బడుల వంతు. అయినా.....  ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాదు’ అని ముందే మీరు చెప్పారు లెండి... తప్పు మీది కాదు.. తప్పంతా #EVM లదే !, ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా..?, గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా... ఎన్ని బెల్ట్ షాపులైనా ఉండవచ్చా...?, బాగుందాయ్యా ... బాగుంది !అని... ఊరంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది!!’ అని రోజా ఎద్దేవా చేశారు.

 

నగిరిలో  పరామర్శ కార్యక్రమాల్లో మాజీ మంత్రి రోజా
ఆర్కే రోజా నగిరి పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీబాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈరోజు(సోమవారం) విజయపురం మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీబాధిత కుటుంబాలను రోజా పరామర్శించారు. ఆయా గ్రామాల్లో అనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న నాయకులకు రోజా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. స్థానిక వైఎ‍స్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయా బాధిత కుటుంబాలను రోజా పరామర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement