
సాక్షి, తిరుపతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. ‘‘గతంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలను ఉద్దేశించి పవన్ చెప్పిన మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం.. రెండు కారం ముద్దలు తినండి, మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని పవన్ అన్నారు. అప్పట్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉంది.
..అయినా సరే ఎప్పటికప్పుడు వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేశారు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విభజన చట్టంలో గల అంశాలు... మొదలైన వాటిపై డిమాండ్ చేస్తూనే వచ్చారు. అయితే... ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ, జనసేన ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఊత కర్రల సాయంతో నడుస్తుంది.. ఇప్పుడు అదే మాటలను ఏపీ ఎంపీలకు పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు...?’ అంటూ ఎక్స్ వేదికగా రోజా ప్రశ్నించారు.

గతంలో... వైసిపి ఎంపీలను ఉద్దేశించి పవన్ చెప్పిన మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం..
రెండు కారం ముద్దలు తినండి , మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని @PawanKalyan అన్నారు.
అప్పట్లో ... కేంద్రంలో @BJP4India ప్రభుత్వం పూర్తి…— Roja Selvamani (@RojaSelvamaniRK) February 1, 2025
Comments
Please login to add a commentAdd a comment