సొంత కొడుకుపైనే బాబుకు నమ్మకం లేదు: సీఎం జగన్‌ | AP CM YS Jagan Slams Chandrababu Pawan Kalyan Nagari Public Meeting | Sakshi
Sakshi News home page

సొంత కొడుకుపైనే బాబుకు నమ్మకం లేదు, అందుకే.. : సీఎం జగన్‌

Published Mon, Aug 28 2023 12:44 PM | Last Updated on Mon, Aug 28 2023 2:51 PM

AP CM YS Jagan Slams Chandrababu Pawan Kalyan Nagari Public Meeting - Sakshi

సాక్షి, నగరి: సొంత కొడుకుపై నమ్మకం లేక దత్త పుత్రుడికి ప్యాకేజ్‌ ఇచ్చారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు రాజకీయ చరిత్ర మొత్తం వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలేనని మండిపడ్డారు. గొడవలు సృష్టించి శవరాజకీయాలు చేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సోమవారం నగరిలో బటన్‌ నొక్కి ‘విద్యాదీవెన’ నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యా­ర్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించారు. బటన్‌ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. 
చదవండి: విద్యాదీవెన పిల్లల భవిష్యత్తు మారుస్తుంది: సీఎం జగన్‌

దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని ముఖ్యమంత్రి విమర్శించారు. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడని, పిల్లనిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచాడని ప్రస్తావించారు. చంద్రబాబు ప్రతి అడుగు కుట్రలు, కుతంత్రాలేనని మండిపడ్డారు. పుంగనూరులో అల్లర్లు సృష్టించి పోలీసులపై దాడి చేశారని దుయ్యబట్టారు. ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పగలిగే వ్యక్తి ఎవరూ లేరని అన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్‌ ఫైర్‌
►గత పాలకులు ఎంతటి దుర్మార్గాలకు దిగుతున్నాడో నాలుగు మాటలు మీ ముందుంచుతా. 
►ఇదే పెద్దమనిషి, ఇదే దుర్మార్గమైన ఆలోచనలు చేసే ఈ పెద్ద మనిషి, మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 
►28 సంవత్సరాల క్రితమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 
► ఈ వ్యక్తి పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమైనా మీ మెదడులో తడుతుందా అని అడుగుతున్నా. 
► ఈ 4 సంవత్సరాల ఈ పాలనకు తేడా ఉందా తేడా లేదా అనేది ఆలోచన చేయండి. 

►ఈ మనిషి ఎలాంటోడో అందరికంటే మీకే బాగా తెలుసు. 
► ఈ మనిషి ఏదైనా మాట ఇస్తే నిలబెట్టుకున్నాడా? ఆలోచన చేయండి
► సొంత బలం మీద గానీ, సొంత కొడుకు మీద గానీ ఈ పెద్ద మనిషికి నమ్మకం లేదు. 
►ఈ మధ్య కాలంలో ఈయన గానీ, కొడుకు గానీ, దత్తపుత్రుడు గానీ మీటింగుల్లో మాట్లాడుతున్నప్పుడు వీళ్లు మాట్లాడుతున్న భాషను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. 
►వీళ్లతో పాటు కలిసి ప్రయాణం చేసే ఎల్లో మీడియా.
►ఏదైనా టీవీలో వార్త వస్తే నిజమేమో అనుకొనే పరిస్థితిలు పోయాయి. 
►ప్రజలకు ఫలానా మంచి చేశాము అని చెప్పే గత చరిత్ర ఏదీ లేదు కాబట్టే వీళ్లందరూ అబద్ధాల మీద, కుట్రలు, కుతంత్రాలు, వెన్ను పోట్ల మీద జీవిత ఆశయంగా మార్చుకొని రాజకీయాలు చేస్తున్నారు. 

ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా?
►ఈ పెద్ద మనిషి ఢిల్లీకి బయల్దేరాడు. ఎన్నికల కమిషన్‌ను కలుస్తున్నాడట.
► రాష్ట్రంలో తనమీద హత్యాయత్నం చేయడానికి పోలీసులు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడానికి బయల్దేరాడు. 
►దొంగ ఓట్లను తామే ఎక్కించుకొని దొంగ ఓట్లు మనం ఎక్కిస్తున్నామని చెప్పడానికి ఢిల్లీకి బయల్దేరాడు. 
►ఇటువంటి దారుణమైన అబద్ధాలు చెప్పలిగిన వ్యక్తి, మోసం చేయగలిగిన వ్యక్తి, కుట్రలకు పాల్పడే వ్యక్తి ఎవరైనా ఉంటారా? 

చదవండి: విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలి: రోజా సెటైర్లు

మ నుంచి సీఎం కూర్చుని లాగేసుకొని..
►ఎన్టీ రామారావును సీఎం కుర్చీని వీళ్లే లాగేసుకున్నారు. వెన్ను పోటు పొడిచారు. 
►పార్టీని లాగేసుకున్నారు. ఎన్టీఆర్ చావుకు వీళ్లే కారణం అయ్యారు. 
►ఇదే దుర్మార్గుడు ఇదే ఎన్టీఆర్ చనిపోగానే శవాన్ని లాక్కుకుంటారు. 
►ఫొటోలకు దండలేస్తారు. ఫొటో ముందు ప్రతి రోజూ దండం పెడుతూ తిరుగుతారు. 
►ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు ఇదే చంద్రబాబు. 
►ఒకసారి ఈ మనిషి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలని అడుగుతున్నా.

మాయ మాటలతో రైతులను మోసం
►రైతులను మాయ మాటలతో మోసం చేశాడు. 
►రూ.87,600 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నాడు. 
► బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు రావాలని నిట్ట నిలువునా మోసం చేశాడు. 
► అక్కచెల్లెమ్మలు రుణాలు కట్టొద్దు, బాబు ముఖ్యమంత్రి అవుతాడు తీరుస్తాడని మోసం చేశాడు. 
►బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వాగ్దానాలు చేసి మోసం చేశారు. 
►చివరకు ఈ పెద్ద మనిషి పిల్లలను వదల్లేదు, నిరుద్యోగులను వదల్లేదు. 
► 2014కు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. 
► జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 
►ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చాడని అడుగుతున్నా. 

ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో మేనిఫెస్టో
►ఎన్నికలకు ముందు ఇదిగో అందంగా మేనిఫెస్టో తెస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తాడు. 
►ఆయన వెబ్ సైట్లలో కూడా మేనిఫెస్టో కనపడకుండా మాయం చేస్తాడు. 
►ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటాడు, ఎన్నికలు అయిపోయాక ప్రజలకు నరకాన్ని చూపిస్తాడు. 
► చెప్పిన ప్రతి మాటనూ అమలు చేస్తున్న మనందరి ప్రభుత్వం మధ్య తేడా ఎంత ఉంది ఆలోచన చేయాలని అడుగుతున్నా. 
►చంద్రబాబు చేసిన అప్పులు విపరీతంగా ఉన్నాయి. అయినా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. 
► వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్. అయినా వెనకడుగు వేయలేదు. 
►సాకులు వెతకలేదు. కారణాలు చెప్పి తప్పించుకోవాలనుకోలేదు. 
►నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. 2.33 లక్షల కోట్లు నేరుగా వెళ్తున్న పరిస్థితి వచ్చింది. 
► ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రిమాత్రమే. 
►అప్పుడు చేసిన అప్పుల గ్రోత్ రేటు కన్నా ఇప్పటి అప్పుల గ్రోత్ రేటు తక్కువ. 
► మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు. 

అంతా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే
►ఈనాడుకి ఇంత, ఆంధ్రజ్యోతికి ఇంత, టీవీ5కి ఇంత, దత్తపుత్రుడికి కాస్తింత. చంద్రబాబుకు మిగిలింది ఇంత.
► జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే అంతా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే.
►ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్ నొక్కుతున్నాడు. 
► ఎటువంటి లంచాలు, వివక్ష లేదు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. 
►మనల్ని విమర్శలు చేస్తున్నారో వాళ్లందరికీ సమాధానాలు చెప్పండి. ఎప్పుడూ చూడని అభివృద్ధి, జరుగుతోందని చెప్పండి.
► దేశానికే రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో పాలన జరుగుతోంది. 
►స్కూళ్ల పరిస్థితి చూపించండి. స్కూళ్లు, కాలేజీలు మారుతున్నాయి. 
►స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు పనులు, ఐఎఫ్ పీ ప్యానెల్స్ వస్తున్నాయి. ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. 
►కరికులమ్‌లో మార్పులు, విద్యా దీవెన, వసతి దీవెన వస్తోంది.

సెంట్రల్ గవర్నమెంట్ కన్నా బెటర్‌గా పనిచేస్తున్నాయి
►చదువుల్లో వేగంగా అడుగులు వేస్తున్నారు. 
► ఇది కాదా అభిృద్ధి అని గట్టిగా ప్రశ్నించండి.
►ఆస్పత్రులు రూపు రేఖలు మారుతున్నాయి. 
►విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం కనిపిస్తోంది. 
►సెంట్రల్ గవర్నమెంట్ కన్నా బెటర్‌గా ఆస్పత్రులు పని చేస్తున్నాయి. 
►50 వేల మందిని హాస్పటల్స్ లో రిక్రూట్ మెంట్ అయ్యారు. 
►స్పెషాలిటీ డాక్టర్ల కొరత దేశంలో 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో కేవలం 3.98 శాతం మాత్రమే. 
►కొత్తగా 17 మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. 
► అడగండి ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది కాదా అని అడగండి.
►రాష్ట్రంలో ఉన్నమొత్తం పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులు ఉంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే మరో 4 సీ పోర్టులు వేగంగా కడుతున్నాం. 
► 10 ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయి. 

వాళ్లను మీ బిడ్డ నమ్ముకోలేదు
► ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని చెప్పండి.
►ఇది కాదా అభివృద్ధి అని అడగండి.
►మనం చేస్తున్న యుద్ధం మారీచులతో చేస్తున్నాం. 
► అబద్ధాల్ని నిజంగా చెబుతారు. ఒకే అబద్ధాన్ని వంద సార్లు నిజమని నమ్మించే వ్యవస్థలు వాళ్ల దగ్గర ఉన్నాయి. 
► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి అండ లేదు. వీళ్లను మీ బిడ్డ నమ్ముకోలేదు.
►మీ బిడ్డలో కల్మషం లేదు. మీ బిడ్డ నమ్ముకున్నది చేసిన మంచిని. 
► వీళ్లు చెబుతున్న అబద్ధాలు, మోసాలు నమ్మకండి. మీ ఇంట్లో మీకుమంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే ప్రామాణికంగా తీసుకోండి. 
►మీ ఇంట్లో మీకు మంచిజరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడండి. 
►మంచి చేసే పరిస్థితులు ఇంకా మెరుగ్గా ఇవ్వాలని, ఇంకా మంచి చేసే రోజులు రావాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా’నని సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement