దమ్ము లేకనే.. దత్తపుత్రుడు | CM Jagan Fires On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

దమ్ము లేకనే.. దత్తపుత్రుడు

Published Tue, Aug 29 2023 3:38 AM | Last Updated on Tue, Aug 29 2023 4:07 PM

CM Jagan Fires On Chandrababu And Pawan Kalyan - Sakshi

చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన జగనన్న విద్యా దీవెన సభకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

సాక్షి, తిరుపతి: సొంత బలంపై, సొంత కుమారుడిపై నమ్మకం లేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్యాకేజీ చెల్లించి దత్త పుత్రుడిని అద్దెకు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలేనని ధ్వజమెత్తారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న విద్యాదీవెన నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు.

‘ఏ ఇంటికీ, ఏ సామాజిక వర్గానికీ, ఏ ప్రాంతానికీ ఎలాంటి మంచి చేయని గత పాలకులు ఎన్ని దుర్మార్గాలకు దిగుతున్నారో నాలుగు మాటలు మీ ముందుంచుతా. దుర్మార్గమైన ఆలోచనలు చేసే ఆ పెద్ద మనిషి మూడుసార్లు సీఎంగా ఉన్నాడు. 28 ఏళ్ల క్రితమే ఆయన సీఎం అయ్యాడు. మూడుసార్లు సీఎం అయిన ఆ  వ్యక్తి పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమైనా మీ మెదడులో తడుతుందా? గత పాలనకు, ఈ నాలుగేళ్ల పాలనకు తేడా ఉందా? లేదా? అనేది ఆలోచన చేయండి’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. సభలో సీఎం ఏమన్నారంటే..  

దత్తపుత్రుడిని అద్దెకు తెచ్చుకున్నాడు 
ఆ మనిషి ఎలాంటివాడో అందరికంటే మీకే బాగా తెలుసు. ఆ మనిషి ఏదైనా మాట ఇస్తే నిలబెట్టుకున్నాడా? అనేది ఆలోచన చేయండి. అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనుకాడడు. చివరికి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవడానికి కూడా ఏ మాత్రం వెనుకాడని మనిషి.. ఆ పెద్ద మనిషి!! ఆ పెద్ద మనిషికి సొంత బలం మీద గానీ, సొంత కుమారుడి మీద గానీ నమ్మకం లేదు. కాబట్టే దత్త పుత్రుడిని ప్యాకేజీ ఇచ్చి అద్దెకు తెచ్చుకున్నాడు.   

ప్రతి అడుగులో కుళ్లు, కుతంత్రాలే! 
ఈమధ్య కాలంలో ఆయన గానీ, ఆయన కుమారుడు గానీ, దత్తపుత్రుడు గానీ మీటింగుల్లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు, వారి భాషను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి మాటలోనూ రెచ్చగొట్టాలి, కుతంత్రాలు చేయాలి, గొడవలు సృష్టించి శవ రాజకీయాలు చేయాలనే కుతంత్రాలు ప్రతి అడుగులోనూ కనిపిస్తాయి.   

వీళ్లతో ఎల్లో మీడియా ప్రయాణం.. 
టీవీలో ఏదైనా వార్త వస్తే నిజమేనేమో అనుకునే పరిస్థితులు ఇవాళ లేవు. ఆ పాత రోజులు పోయాయి. ఈరోజు ఎల్లో మీడియా చంద్రబాబునాయుడును ఏ రకంగా మోస్తోందో మీ అందరికీ తెలుసు. ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పుకునేందుకు గత చరిత్ర ఏదీ లేదు కాబట్టే వీళ్లంతా అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్ల మీద ఆధారపడి వాటినే జీవితంగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారు. దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అనేదే వారి లక్ష్యం.  

కుర్చీ లాక్కుని ఫోటోలకు దండేస్తారు 
ఇదే వ్యక్తి.. ఎన్టీఆర్‌ నుంచి సీఎం కుర్చీని లాగేసుకున్నారు. ఆయనకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ పార్టీని కూడా లాగేసుకున్నారు. ఎన్టీఆర్‌ చావుకు కూడా చివరకు వీళ్లే కారణం అయ్యారు. ఇదే దుర్మార్గులు మళ్లీ ఎన్టీఆర్‌ చనిపోగానే ఆయన శవాన్ని లాక్కుకుంటారు. ఫొటోలకు దండలేస్తారు. ఫొటో ముందు ప్రతి రోజూ దండం పెడుతూ తిరుగుతారు. ఆయన పేరుతో ఒక కాయిన్‌ రిలీజ్‌ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు. ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే...  ఒకసారి ఆ మనిషి మనస్తత్వం ఏమిటో తెలుసుకోవాలని అడుగుతున్నా.   

రైతులు, అక్కచెల్లెమ్మలకు దగా 
ఆ పెద్దమనిషి (చంద్రబాబు) రైతులను మాయ మాటలతో మోసం చేశాడు. ఎన్నికల వేళ రూ.87,612 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తానన్నాడు. రుణాలు కట్టకండి.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబుకు ఓటే యాలని చెప్పి రైతులను నిట్ట నిలువునా మోసం చేశాడు. డ్వాక్రా మహిళలు రుణాలు కట్టొద్దు.. బాబు సీఎం అవుతాడు.. వెంటనే తీరుస్తాడని చెప్పి ఆ అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు. వాళ్లను వంచించడమే కాకుండా వారి తరపున కడుతున్న సున్నా వడ్డీని సైతం ఎగ్గొట్టాడు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వాగ్దానాలు చేసి నిలువుగా దగా చేశాడు. ఆ పెద్ద మనిషి చివరకు పిల్లలను కూడా వదల్లేదు, నిరుద్యోగులనూ వదల్లేదు. 2014 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ రూ.రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చాడని అడుగుతున్నా. ఆ పెద్ద మనిషి మనస్తత్వం చూస్తే... ఎన్నికలకు ముందు అందంగా ఉండే మేనిఫెస్టో తెస్తాడు.

ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేస్తాడు. వెబ్‌ సైట్లలో కూడా మేనిఫెస్టో కనపడకుండా మాయం చేస్తాడు. ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటాడు. ఎన్నికలు అయిపోయాక ప్రజలకు నరకాన్ని చూపిస్తాడు. ఇలాంటి వ్యక్తికి.. చెప్పిన ప్రతి మాటనూ అమలు చేస్తున్న మనందరి ప్రభుత్వం మధ్య తేడా ఎంత ఉందో? ఆలోచన చేయాలని అడుగుతున్నా.   

బాబు చేసిన అప్పులున్నా ..
మన పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలున్నాయి. చంద్రబాబు చేసిన అప్పులు విపరీతంగా ఉన్నాయి. అయినా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్‌ సమస్యలు వచ్చాయి. ఖర్చులు పెరిగాయి, రాబడులు తగ్గాయి. అయినా మీ బిడ్డ కారణాలు, సాకులు చెప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో దాన్ని ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించాం. వెనకడుగు వేయలేదు.

సాకులు వెతకలేదు. కారణాలు చెప్పి తప్పించుకోవాలని ఆలోచన చేయలేదు. నా అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలు బాగుండాలనే తపన, తాపత్రయంతో  మీ బిడ్డ బటన్‌¯ నొక్కుతున్నాడు. నాలుగేళ్లలో రూ.2.33 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లాయి.  ఇవాళ ఎక్కడా లంచాలు, వివక్ష చూపించే వ్యవస్థ లేదు. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే.

అప్పుడు చేసిన అప్పుల గ్రోత్‌ రేటు కన్నా ఇప్పటి అప్పుల గ్రోత్‌ రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటంటే.. అప్పట్లో దోచుకో, పంచుకో, తినుకో అనే పాలన సాగింది. ఈనాడుకి ఇంత, ఆంధ్రజ్యోతికి ఇంత, దత్తపుత్రుడికి కాస్తంత, మిగిలింది చంద్రబాబునాయుడికి అని డీపీటీ సాగింది.

జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి అడుగులోనూ దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే! మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే వ్యవస్థలు వాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి అండ లేదు. వీళ్లను మీ బిడ్డ నమ్ముకోలేదు.

మీ బిడ్డలో కల్మషం లేదు. మీ బిడ్డ నమ్ముకున్నది చేసిన మంచినే. మీకు ఒక్కటే చెబుతున్నా. వీళ్లు చెబుతున్న అబద్ధాలు, మోసాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకుమంచి జరిగిందా? లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడండి.   

బాబువి శవ రాజకీయాలు..
పుంగనూరు, అంగళ్లులో జరిగిన ఘటన మీ అందరికీ తెలిసిందే. అప్పడు పోలీసులు చేసిన తప్పల్లా.. ‘‘బాబు గారూ మీకు పర్మిషన్‌ ఉన్న రూ ట్లోనే ప్రయాణం చేయండి. మీకు అనుమతున్న రూట్లో కాకుండా వేరే రూట్లో ఎందుకు ప్రయా ణం చేస్తారు? వేరే పార్టీ వాళ్లు అక్కడ ధర్నా చే స్తుంటే అక్కడికి వెళ్తామని ఎందుకు అంటున్నా రు? మీరు అక్కడికి వెళ్తే లా అండ్‌ ఆర్డర్‌  ఇబ్బందులు వస్తాయి. ఆ రూట్‌ వద్దు’’ అని చెప్పటమే!! అలా చెప్పినందుకు పోలీసులపై కర్రలు, బాటిళ్లతో దాడి చేశారు. చివరకి ఓ పోలీసు సోద రుడి కన్ను కూడా పోగొట్టారు.

47 మంది పోలీసులపై దాడి చేశారు. దాడి చేసి రెచ్చగొట్టి పోలీసులు కాల్పులు జరిపితే శవ రాజకీయాలు చే యాలనే దిక్కుమాలిన ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే. ఈ పెద్ద మనిషి ఢిల్లీ వెళ్లా డు. ఎన్నికల కమిషన్‌ను కలిసి రాష్ట్రంలో పోలీ సులు తనమీద హత్యాయత్నం చేశారని ఫిర్యా దు చేయడానికి వెళ్లాడు. దొంగ ఓట్లను వారే చేర్చి మనపై ఫిర్యాదు చేయటానికి బయల్దేరాడు. ఇలా అబద్ధాలు ఆడి, మోసం చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఆలోచన చేయండి.  

ఇది అభివృద్ధి కాదా..?
అభివృద్ధి జరగడం లేదని విమర్శిస్తున్న వారందరికీ గట్టిగా సమాధానం చెప్పండి. మన పాలనలో ఎప్పుడూ చూడని అభివృద్ధి ఇవాళ జరుగుతుంది. స్కూళ్ల పరిస్థితిని చూపించండి. నా డు–నేడుతో రూపురేఖలు మారిపోయి ఇంగ్లీష్‌ మీడియం, ఐఎఫ్‌పీ ప్యానెళ్లు వచ్చాయి. పిల్లల చేతుల్లో ట్యాబ్స్‌ కనిపిస్తున్నాయి. కరిక్యులమ్‌లో మార్పులతోపాటు విద్యా దీవెన, వసతి దీవెన వస్తోంది. మన పిల్లలు చదువుల్లో వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇది కాదా అభివృద్ధి? అని ప్రశ్నించండి.

నాడు – నేడుతో ఆసుపత్రుల రూపు రేఖలు మారుతున్నాయి. విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామి లీ డాక్టర్‌ విధానం మన కళ్లెదుటే కనిపిస్తోంది. 53 వేల మంది వైద్య సిబ్బందిని నియమించాం. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలకు శ్రీకా రం చుట్టాం.  ఎవరైనా అభివృద్ధి గురించి మా ట్లాడితే ఇది అభివృద్ధి కాదా? అని అడగండి. రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 6 పోర్టులు మాత్రమే ఉంటే ఈ నాలుగేళ్లలో మరో 4 సీ పోర్టులను కడుతున్నాం.  మన రాష్ట్రం వరుసగా మూడేళ్ల పాటు ఈవోడీబీలో దేశంలోనే నంబర్‌ వన్‌గా కొనసాగుతోందని చెప్పండి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement