Jagananna Vidya Deevena
-
YS Jagan: ఓ తరం.. అంతరం
‘మన పిల్లలు.. గ్లోబల్ స్టూడెంట్స్’ అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. నర్సరీ నుంచి డిగ్రీ, పీజీ వరకూ అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు నాంది పలుకుతూ.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తీసుకున్న ప్రతి నిర్ణయం పేదోడికి మేలు చేకూర్చింది. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఐబీ సిలబస్, టోఫెల్ ఇలా ఒకటేమిటి అధికారంలో ఉన్నన్నాళ్లూ సంస్కరణల పథాన ముందుకు సాగారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాటి నవశకం కాస్త.. నేడు అదోరకం అన్నట్లుగా తయారైంది. ఫలితంగా పేద విద్యార్థుల జీవితాలు అంధకారమయమవుతున్నాయి.వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు. దీని కోసం విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు. ఎందుకంటే గడిచిన రెండేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేసి విద్యార్థులకు సమకాలీన ఆధునిక వసతులతో కూడిన విద్యారంగం వైపు అడుగులు వేయించింది. కానీ ప్రస్తుతం కూటమి సర్కార్ ఆ పథకానికి ఎగనామం పెట్టి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లింది. అంతేకాక విద్యారంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన విద్యావిప్లవానికి తూట్లు పొడిచేలా నిర్ణయాలు తీసుకుంటూ ఓ తరాన్ని బలి తీసుకుంటోందని పలువురు విద్యారంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అమ్మ ఒడితో ఆనందాలు.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెట్టి ఆ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. రోజూ తమ పిల్లలను బడికి పంపించే కుటుంబానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా సాయమందించారు. కృష్ణాజిల్లాలో 1,35,434 మంది విద్యార్థులకు రూ.203 కోట్లు, ఎనీ్టఆర్ జిల్లాలో 1,80,254 మంది విద్యార్థులకు రూ.266 కోట్లు చొప్పున ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.469 కోట్లు ఏటా ఆయా కుటుంబాలకు అందించిన ఘనత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానిది. విద్యా, వసతి దీవెనలతో అండదండలు.. గత ప్రభుత్వ హయాంలో ఏటా ఇంజినీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేర్లతో కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ చేసేది. ప్రధానంగా జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి రూ.43 వేల నుంచి లక్షన్నర వరకూ ఫీజులుండగా వాటిని విడతల వారీగా అందించింది. ఎనీ్టఆర్ జిల్లాలో గత సర్కార్ సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఏటా విద్యాదీవెన పథకం ద్వారా రూ.406.56 కోట్లు, వసతి దీవెన ద్వారా రూ.152.49 కోట్లు అందించింది. అలాగే కృష్ణా జిల్లాలోను 35 వేల మంది విద్యార్థులకు సుమారుగా రూ.350 కోట్ల మేర సాయమందించింది.‘నాడు–నేడు’ అద్భుతం..గత ప్రభుత్వ పాలనలో జిల్లాలో పాఠశాలల రూపురేఖలు సైతం మార్పు చేసేందుకు నాడు–నేడు పథకం ద్వారా విశేష కృషి జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోనే తొలి విడతగా 341 పాఠశాలలకు రూ.96.32 కోట్లు, రెండో విడతగా 596 పాఠశాలలకు రూ.240 55 కోట్లు కేటాయించారు. రెండో విడత పనుల ముగింపు దశలో ఉండగా కూటమి సర్కార్ వాటిని పూర్తిగా నిలిపివేసింది. కృష్ణాజిల్లాలోనూ రెండో విడత పనులను సైతం పూర్తిగా ఆపేసింది.ఆధునికతకు అందలం.. గత ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఆయా పాఠశాలలను తీర్చిదిద్దింది. అందులో భాగంగా ఏటా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లను అందించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటి ఏడాది 26,334 మంది విద్యార్థులకు రెండో ఏడాది సైతం అదే రీతిలో కొనసాగించింది. ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీలతో పాటుగా ప్రాథమిక పాఠశాలలో ఇంటర్నల్ ప్యానల్స్‌ను అందించింది.ఆరోగ్యానికి ప్రాధాన్యం.. జగనన్న గోరుముద్దతో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పరిపూర్ణమైన పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాట్లు గత ప్రభుత్వం ప్రారంభించింది. రోజుకొక మెనూతో విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో మధ్యాహ్న భోజనాన్ని అందించింది. అంతేకాకుండా విద్యార్థులకు కోడిగుడ్డు, చెక్కీలు, రాగిజావ వంటి కొత్త ఆహారాలను సైతం పరిచయం చేసి విద్యార్థులకు పరిపూర్ణమైన ఆహారాన్ని జగన్ అందించారు.ఆంగ్ల బోధనతో కొత్త చరిత్ర.. సమకాలీన సమాజంలో మాతృభాషతో పాటుగా ఆంగ్ల భాషలో బోధన జరిగినప్పుడు విద్యార్థులకు మేలు జరుగుతుందని గత జగన్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ప్రతి పాఠశాలల్లో ఆంగ్ల బోధనను ప్రారంభించింది. విద్యార్థులు ఇబ్బంది పడకుండా తెలుగు– ఆంగ్ల భాషల్లో ముద్రించిన పుస్తకాలను అందించి వారికి పాఠ్యాంశాలు చక్కగా అర్థమయ్యేందుకు గత ప్రభుత్వం సహకరించింది. పథకాలు అమలు చేయాలి విద్యారంగంలో గత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పథకాలన్నీ కూటమి సర్కార్ అమలు చేయాలి. అవి పేద విద్యార్థులకు మేలు చేశాయి. అమ్మ ఒడి వంటి పథకాలను ఇంకా విస్తృతంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి నేడు దాని ప్రస్తావన ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావటం లేదు. నాడు–నేడు సైతం నిలిపివేసింది. – సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అద్భుతమైన ప్రగతి.. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో విద్యారంగం అద్భుతమైన ప్రగతిని సాధించింది. దేశంలోనే మొదటి సారిగా బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్, ఒకటి నుంచి 5వ తరగతికి బొమ్మలతో కూడిన డిక్షనరీని, ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, ట్యాబ్‌లు ఇలా ఒకటేమిటి ప్రతిఅంశంలో కొత్తదనాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులకు మేనమామగా ఆయన చేసిన పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. – టి. కల్పలత, ఎమ్మెల్సీవిద్యాకానుకకు జాతీయ గుర్తింపు.. గతంలో టీడీపీ సర్కార్ పాఠశాలలు ప్రారంభమైన ఆరు మాసాలైనా విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చే పరిస్థితి కనపడేది కాదు. కానీ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలు తెరిచిన రోజునే అందరికీ జగనన్న విద్యాకానుక పేరుతో పాఠ్యపుస్తకాలతో పాటుగా అత్యధిక నాణ్యత కలిగిన నోటు పుస్తకాలు, బూట్లు, బ్యాగ్, డిక్షనరీలు ఇలా ఎనిమిది రకాల వస్తువులను అందించేవారు. జగన్ ప్రభుత్వం అందిస్తున్న విద్యాకానుకకు జాతీయ స్థాయిలో ప్రశంసలు అభించాయి. కూటమి సర్కార్ తూట్లు..కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగానికి సంబంధించి అనేక పథకాలకు తూట్లు పొడిచిందని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అమ్మ ఒడి, నాడు–నేడు, ట్యాబ్‌ల పంపిణీతో పాటుగా పలు కార్యక్రమాలను నిలిపివేయటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జగనన్న గురుముద్ద పేరుతో ప్రారంభించిన మధ్యాహ్న భోజనాన్ని సైతం ఇష్టారాజ్యంగా మార్చేసి, పరిశుభ్రత లేకుండా చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో పని చేసే ఆయాలకు జీతాలు ఇవ్వకపోవటంతో విద్యాసంస్థల్లో విద్యార్థులు ఇబ్బందులెదుర్కొంటున్నారు. -
Nissie Leone: అనుకుంది... సాధించింది
కుటుంబంలో ఆడపిల్లను ఒక మైనస్‌గా భావించిన సమాజం నుంచి ఆడ, మగ అనే తేడా లేకుండా ఉన్నంతలో తమ పిల్లల్ని గొప్పగా చదివించాలనే సంకల్పం దిగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ మొదలైంది. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయే నిస్సీ లియోన్. ఆడపిల్లను చదువుకోసం పొరుగూరుకు కూడా ఒంటరిగా పంపడానికి ఇప్పటికీ భయపడుతున్న రోజుల్లో విదేశాల్లో కొలువుకి ఎంపిక అయ్యేలా ప్రొత్సహించారు నిస్సీ తల్లిదండ్రులు, చదివింది డిగ్రీ అయినా యూకేలో ఉద్యోగంలో చేరుతోంది. వార్షిక వేతనం అక్షరాలా రూ.37 లక్షలు అందుకోబోతోంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన నిస్సీ లియోన్ తన విజయావకాశం గురించి ఆనందంగా తెలియజేస్తోంది.‘‘బీఎస్సీ కార్డియాలజీలో డిగ్రీ పూర్తిచేశాను. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన ఎన్హెచ్ఎస్ నార్తెర్న్ కేర్ అలియన్స్ నన్ను ఉద్యోగానికి ఎంపికచేసింది. ప్రపంచవ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఈ సంస్థ ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఇండియా నుంచి ఇద్దరు ఎంపిక కాగా వారిలో నేనూ ఒకరిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.ఈ రోజుల్లో... మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న జార్జ్, అమ్మ సునీతలు స్థానిక చర్చ్‌లో పాస్టర్స్గా పని చేస్తున్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడు. సేవా తత్పరతతో కూడిన ఉద్యోగం చేయాలనేది నా ఆలోచన. మా అమ్మనాన్నల సేవాగుణం నాలోనూ అలాంటి ఆలోచనలు కలగడానికి కారణం అయింది. మొదట వైద్యురాలిగా స్థిరపడాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో వైద్య సహాయకురాలిగా స్థిరపడాలనుకున్నాను. శ్రీకాకుళంలోని బొల్లినేని మెడీ స్కిల్స్ పారా మెడికల్ డిగ్రీ కళాశాలలో కార్డియాలజీ విభాగంలో చేరాను. పిల్లల ఉన్నతోద్యాగాల గురించి పెద్దలు తరచూ ‘వాళ్లబ్బాయి సాఫ్ట్వేర్ అంట, వీళ్లమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుందంట’ అనే మాటలను వింటూనే ఉంటాం. అయితే దేశంలో కొన్ని రంగాలలో ఉన్నవారు మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారు. వారి విద్యార్హత, నాలెడ్జ్, చదివిన కాలేజీ, అభ్యర్థి నడవడిక, బృందంలో పనిచేసే వైఖరి.. వంటి వాటి ఆధారంగా జీతాలను నిర్ణయిస్తున్నారు. అలా కాకుండా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసే వారికి సైతం మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. విదేశీ సంస్థలు అందుకు స్వాగతం పలుకుతున్నాయి అని జెమ్స్ మెడికల్ కాలేజ్ ఛీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు, బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్. నాగేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ పద్మజల ద్వారా తెలిసింది. అంతకుముందు నాకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన లేదు. కానీ, వారిప్రొత్సాహంతోనే ఈ ఘనత సాధించాను.దశల వారీగా...నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన ఎన్హెచ్ఎస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులను, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేస్తోంది. ఇందులో ప్రవేశం అంత సులువేమీ కాదని కొద్దిరోజుల్లోనే అర్ధమైంది. హైదరాబాద్ కు చెందిన ప్రకార స్వచ్ఛంద సంస్థ ద్వారా మా కాలేజీకి సమాచారం వచ్చింది. నైపుణ్యం కలిగిన బీఎస్సీ కార్డియాలజీ ఎకో గ్రాఫర్ కావాలని, అందుకు వెంటనే అప్లై చేసుకోవాలనీ మా కాలేజీ వాళ్లు చె΄్పారు. దీంతో అప్లై చేసి, సికింద్రాబాద్ కిమ్స్‌లో శిక్షణ తీసుకున్నాను. కిందటేడాది జరిగిన బ్రిటిష్ సొసైటీ అఫ్ ఎకోకార్డియోగ్రాఫీ (బిఎస్ఇ) వారు నిర్వహించిన ట్రాన్స్ థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (టీటీఇ) పరీక్షతో పాటు ఇంటర్వ్యూకు హాజరయ్యాను. నిపుణులతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ చేసింది. అంతకుముందు జరిగిన థియరీ పరీక్షలోనూ మంచి మార్కులు వచ్చాయి. రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించడంతో ఉద్యోగానికి ఎంపియ్యాను. వార్షిక వేతనం ఇండియా కరెన్సీలో రూ.37 లక్షలు అని తెలిసింది. అమ్మానాన్నలు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను. ఒక డిగ్రీ విద్యార్థిని ఈ స్థాయిలో ΄్యాకేజీకి ఎంపిక కావడం చిన్న విషయం కాదని అందరూ అంటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతోంది. వీసాకు అయ్యే మొత్తాన్ని, విమాన యాన ఖర్చులు కూడా ఆ సంస్థనే అందిస్తోంది’’ అంటూ ఆనందంగా తెలియజేసింది నిస్సీ. అనస్తీషియా, కార్డియాలజీ రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్టులుగా ఉండేవి. కార్డియాలజీలో పని పట్ల మరింత సంతృప్తి లభిస్తుందనిపించి ఈ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాను. మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. వైద్యవృత్తిలో రాణించాలనుకునేదాన్ని. కానీ, మా కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి, ఈ డిగ్రీ తీసుకున్నాను. నా కాలేజీ ఫీజు విద్యా దీవెనలో కవర్ అయ్యింది. ఇప్పుడు మంచి సంస్థలో ఉద్యోగం లభించింది. – నిస్సీ లియోన్మా చుట్టుపక్కల వాళ్లందరూ మా అమ్మాయి గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆనందంగా ఉంది. నిస్సీ తల్లిదండ్రులుగా మాకూ గుర్తింపు వచ్చింది. ఈ రోజే మా అమ్మాయి విదేశాలలో ఉద్యోగం చేయడానికి బయల్దేరింది. – తల్లిదండ్రులు– నిర్మలారెడ్డి -
జగనన్న విద్యాకానుక రెడీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ఏటా అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫారం, బూట్లతో కూడిన కిట్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంచేసింది. ఈ నెల 12న పాఠశాలలు తెరిచిన మొదటిరోజే వాటిని అందించేందుకు సామగ్రిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్లో బోధించే 3.12కోట్ల పాఠ్యపుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు ఇప్పటికే చేరవేశారు. యూనిఫారం సరఫరా శనివారం నుంచి మొదలైంది.వస్తువులను ఒక్కొక్కటిగా స్టాక్ పాయింట్లకు చేర్చిన అనంతరం అక్కడ తరగతుల వారీగా కిట్లను రెడీ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయగా మిగిలిన 2 లక్షల కిట్లకు అదనంగా ఈ విద్యా సంవత్సరానికి 36లక్షల కిట్లను అధికారులు సిద్ధంచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా వస్తువులను అందించేలా సరఫరాదారులకు ఆదేశాలు జారీచేశారు.అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతోపాటు మూడు జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. అదేవిధంగా 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతుల విద్యార్థులకు నోట్‌బుక్స్, అందించనున్నారు. ఇప్పటివరకు విద్యాకానుక కిట్‌లో అందించే తొమ్మిది వస్తువుల్లో బూట్లు మినహా మిగిలిన బ్యాగులు, బెల్టులు, సాక్సులు, పాఠ్య, నోటుపుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ వంటి 8 రకాల వస్తువులు 90 శాతం మండల కేంద్రాలకు చేరాయి. ఒకట్రెండు రోజుల్లో బూట్ల సరఫరా చేపట్టనున్నారు. పాఠశాలలకు 3.12 కోట్ల పాఠ్య పుస్తకాలు..ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను స్టాక్ పాయింట్లకు పంపించారు. 3–10 తరగతుల వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. ఈనెల 8వ తేదీ నాటికే అన్ని స్కూళ్లలోను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కిట్లను సిద్ధంచేయాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్లుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది.రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రాన్ని సీబీఎస్ఈ తరహాలో జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ రూపంలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను పూర్తి ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదేతొలిసారి కావడం విశేషం. ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్‌గా ఇంజినీరింగ్ విద్యార్థులుఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. వీరి బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్‌గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్‌ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలు ముద్రించి పంపిణీకి సిద్ధంచేసింది. -
డీబీటీ పథకాల చెల్లింపులు ప్రారంభం
సాక్షి, అమరావతి: చంద్రబాబు అండ్ కో కుట్రలు, కుతంత్రాలు, దు్రష్పచారాన్ని వమ్ము చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల డీబీటీ చెల్లింపులను ప్రారంభించింది. వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా తదితర పథకాల లబ్దిదారులకు చివరి దశ చెల్లింపులను చంద్రబాబు బృందం అడ్డుకుంది. పేదల పొట్ట కొట్టేలా పోలింగ్‌కు ముందు పచ్చ బ్యాచ్ ఫిర్యాదులు చేయడంతో డీబీటీ చెల్లింపులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిలిపివేసింది. పోలింగ్ ముగిసిన తరువాత చెల్లింపులు చేయాలని, పోలింగ్‌కు ముందు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాలు గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని, కొత్తవి కాదని, లబ్ధిదారులు కూడా పాతవారే తప్ప కొత్తవారు కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ, చంద్రబాబు బృందానికి అనుకూలంగా ఈసీ వ్యవహరించింది. పోలింగ్ ముగియడంతో పేద లబ్దిదారులకు మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ పథకాల చెల్లింపులను ప్రారంభించింది. పొదుపు సంఘాల మహిళల కోసం రూపొందించిన వైఎస్సార్ ఆసరా పథకం నిధులు రూ.1,480 కోట్లను డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే పేద విద్యార్ధులకు ఫూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జగనన్న విద్యా దీవెన కింద డీబీటీ ద్వారా రూ.502 కోట్లు చెల్లించింది. మరో రెండు మూడు రోజుల్లో మిగతా పథకాల చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది.ముందే అనుమతి కోరినా సాగదీసి.. నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న పథకాల లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ కోసం పోలింగ్ తేదీకి చాలా ముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరింది. తెరవెనుక చంద్రబాబు అండ్ కో చేసిన మంత్రాంగంతో ఎన్నికల సంఘం ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చకుండా సాగదీసింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఈ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేయవద్దంటూ ఉత్తర్వులిచ్చింది. దీని వెనుక పచ్చ బ్యాచ్ ఒత్తిడి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ ఉత్తర్వులను ఈనెల 10వ తేదీన ఒకరోజు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే పథకాల డీబీటీ చెల్లింపులకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వివరణలు కోరింది. ఈసీ తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ, 10వ తేదీన సమయం మించిపోవడంతో లబి్ధదారులకు పథకాల మేలు నిలిచిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో పేదలకు నగదు చెల్లింపులను ప్రారంభించింది. దీని ద్వారా ఎన్నికల కోసం ఈ పథకాలను అమలు చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించిందనే అభిప్రాయాన్ని అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
సామాజిక రంగ వ్యయంలో దక్షణాదిలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: పేదలను విద్యావంతులు, ఆరోగ్యవంతులుగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై అత్యధిక వ్యయం చేస్తున్నారు. పేదల అభ్యన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ విద్య అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి పేదింటి పిల్లవాడూ లేదా అమ్మాయి చదువు మధ్యలో ఆపేయకుండా అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయి సిలబస్‌ను పిల్లలకు అందిస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పేదల ఇంటి వద్దకే వైద్యాన్ని చేరుస్తున్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించారు. బడి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షిత మంచి నీరు అందిస్తున్నారు. ఇలా సామాజిక రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారు. తద్వారా గత ఐదేళ్లుగా సామాజిక రంగ కేటాయింపులు, వ్యయంలో మన రాష్ట్రం ముందుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి పది నెలల్లోనూ (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) సామాజిక రంగ కేటాయింపులతో పాటు వ్యయంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, నెలవారీ వివిధ రంగాలకు చేసిన వ్యయాలపై కాగ్ గణాంకాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి రూ.1,30,366 కోట్లు కేటాయించింది. ఇందులో పది నెలల్లోనే రూ.1,07,610 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. ఇది ఏకంగా 82.54 శాతం. సామాజిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు, ఆ నిధులను సమర్ధంగా వినియోగించడంలో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలు వెనకబడ్డాయని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. మూడో స్థానంలో కర్నాటక,, నాలుగో స్థానంలో తెలంగాణ,, ఐదో స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. సామాజిక రంగ వ్యయం అంటే.. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. సామాజిక రంగ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. -
పేదపిల్లలు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే పెత్తందారులకు కడుపునొప్పి
-
ఆంధ్రప్రదేశ్‌లో మానవ వనరులపై 73 వేల కోట్ల రూపాయల మూలధన పెట్టుబడి పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన... జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 708 కోట్ల రూపాయలు జమ...ఇంకా ఇతర అప్డేట్స్
-
తలరాతలు తిరగరాస్తూ..
14 ఏళ్లు, మూడు దఫాలు సీఎంగా ఉన్న చంద్రబాబు పేద పిల్లలకు చేసిన మంచి ఏమిటి? వారి భవిష్యత్తు మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా చూపించారా? ఆయన చేసిన మంచేమిటి అంటే ఏ ఒక్కరికీ ఏదీ గుర్తురాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే విద్యారంగానికి చేసిన చెడు గురించి మాత్రం చాలా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ బడిని నీరుగార్చి నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించింది చంద్రబాబు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లిష్ మీడియం, గవర్నమెంట్ బడుల్లో మాత్రం తెలుగు మీడియం అని నిర్దేశించింది చంద్ర బాబు. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నాలుగు అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కు లాగాలని ప్రయత్నిస్తున్న మారీచులతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లు చేస్తున్న యుద్ధం కేవలం జగన్‌తో కాదు! జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచన చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా, తరతరాల తలరాతలను మార్చాలని గత 57 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఒక్క చదువులతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి విద్యారంగాన్ని సమూలంగా సంస్కరించినట్లు చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, నాడు–నేడు తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా పేదల ఉన్నత చదువులకు భరోసా కల్పించామన్నారు. ప్రభుత్వ టీచర్లకు చెల్లించే జీతభత్యాలు కాకుండా పేద పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తూ వివిధ పథకాలు, సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ఏకంగా రూ.73 వేల కోట్లకుపైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు. పేదింటి బిడ్డల ఉన్నత చదువులకోసం ఇంతగా పరితపిస్తుంటే పెత్తందారులైన దుష్ట చతుష్టయానికి కంటగింపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 2023 అక్టోబరు–డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ రూ.708.68 కోట్లను సీఎం జగన్ శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఐదేళ్లుగా విద్యారంగ పురోభివృద్ధి కోసం తీసుకున్న విప్లవాత్మక చర్యలను వివరించారు. పెద్ద చదువులు చదివే 93 శాతం పిల్లలకు లబ్ది.. తరతరాల పేదరికం సంకెళ్లను తెంచేస్తూ పెద్ద చదువులు అనే పునాదులపై ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు దోహదం చేసే గొప్ప కార్యక్రమం ఈరోజు పామర్రు నుంచి జరుగుతోంది. వంద శాతం ఫీజులను పిల్లల తల్లులకే అందచేసి వారి ద్వారా కాలేజీలకు చెల్లించే జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా అమలు చేస్తున్నాం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా ఆ తల్లుల ఖాతాలకు ఫీజుల మొత్తాన్ని జమ చేయడం కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు అంటే ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పూర్తి ఫీజులను మీ జగనన్న ప్రభుత్వమే చెల్లిస్తోంది. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను ఆలోచించమని కోరుతున్నా. ఆదాయ పరిమితిని పెంచాం.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత మంది పిల్లలు బాగా చదివి బాగుపడాలని ఆరాట పడ్డాం. ఏ పేదవాడూ తన పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే తపనతో ఆదాయ పరిమితిని పెంచాం. గతంలో రూ.లక్షకే పరిమితమైన ఆదాయ పరిమితిని ఏకంగా రూ.2.5 లక్షలకు పెంచి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలిగాం. ఫీజులు ఇంతే కడతాం! ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి! మీ చావు మీరు చావండనే గత ప్రభుత్వ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికాం. తల్లిదండ్రులు ఎవరూ ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని మన భుజ స్కంధాలపై వేసుకున్నాం. త్రైమాసికం ముగిసిన వెంటనే తల్లుల ఖాతాల్లోకి ఫీజులు జమ చేస్తూ కాలేజీలకు అందచేసే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లించే విద్యా దీవెనే కాకుండా ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. తాజాగా అందిస్తున్న రూ.708 కోట్లతో కలిపి ఇప్పటిదాకా 29.66 లక్షల మందికి పిల్లలకు మంచి చేస్తూ జగనన్న విద్యాదీవెన అనే ఒక్క కార్యక్రమం ద్వారానే రూ.12,609 కోట్లు తల్లులకు అందచేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లల భోజనం, వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో రూ.4,275 కోట్లు ఉంటుంది. వచ్చే ఏప్రిల్‌లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో రూ.1,100 కోట్లు కూడా కలిపితే విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా వెచ్చిస్తున్న సొమ్ము ఏకంగా దాదాపు రూ.18 వేల కోట్లు అవుతుంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుండాలనే సంకల్పంతో ప్రతి అడుగూ వేస్తూ వచ్చాం. మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చింది. హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్.. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కోసం 57 నెలల వ్యవధిలో రూ.73 వేల కోట్లు వ్యయం చేశాం. గవర్నమెంట్ టీచర్లకు ఇచ్చే జీతాల వ్యయం దీనికి అదనం. ఇదంతా పేద, మధ్య తరగతి కుటుంబాల మెరుగైన జీవితం కోసం మనం చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. పేద కుటుంబాల్లో ప్రతి పాపా, ప్రతి బాబు గొప్ప చదువులతో ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు, పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా ఎదిగి ఆ కుటుంబాల తలరాతలు మారాలని, భవిష్యత్ బాగుండాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం. మన విద్యా విధానంలో మీ అన్న ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఎలాంటి మార్పులు చేసింది? దానివల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? అనేది ఒకసారి అందరూ గమనించాలని కోరుతున్నా. మన విద్యార్థులు రేపు ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంటుంది. గత 30 ఏళ్లలో టెక్నాలజీ ఎంతో మారిపోయింది. ఆధునిక చదువులకు అనుగుణంగా మన విద్యా విధానాలను సంస్కరిస్తూ మెరుగైన పద్ధతులు, టెక్నాలజీని మన ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు అందుబాటులోకి తెస్తూ అడుగులు వేశాం. చదువుల యుద్ధం.. ప్రభుత్వం స్కూళ్లలో మనం ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి పెత్తందారులైన చంద్రబాబు, ఈనాడు రామోజీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది. గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడటం మన తప్పు! ఇంగ్లీష్ మీడియం తేవాలని తపనపడటం మనం చేసిన తప్పు! ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. మనపై యుద్ధం చేస్తున్న వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారని నిలదీస్తే ఏ ఒక్కరూ తెలుగు మీడియంలో చదువుతున్నారని చెప్పరు. వాళ్ల పిల్లలేమో ఇంగ్లిష్ మీడియంలో చదవాలి. పేదింటి పిల్లలనూ అలాగే చదివిస్తూ మీ జగన్ అడుగులు వేస్తుంటే మాత్రం తెలుగు భాష అంతరించి పోతోందంటూ యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. విద్యారంగంలోనూ క్లాస్ వార్.. ఇప్పుడు విద్యారంగంలో కూడా క్లాస్ వార్ జరుగుతోంది. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం ఇది. డబ్బున్న వారికి ఒక చదువులు, డబ్బులు లేని వారికి మరో చదువులు అనే ధోరణులపై జరుగుతున్న యుద్ధం ఇది. ఈ క్లాస్ వార్‌లో మీ కష్టాలు తెలిసిన అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా, తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాం.ఈ సంస్కరణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కొనసాగకుంటే కూలీల పిల్లలు కూలీలుగానే, పనివారు పనివారుగానే, పేద సామాజిక వర్గాల పిల్లలు అదే పేదరికంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు కొనసాగాలి. ఈ సంస్కరణలు వేగంగా అడుగులు పడుతూ పోవాలి. విదేశాల్లోని గొప్ప విశ్వవిద్యాలయాల కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తేవడం విప్లవాత్మక మార్పు. ఇవన్నీ మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. మనం వచ్చే వరకు గవర్నమెంటు బడులలో ఇంగ్లిష్ మీడియం కూడా ఎవరూ చూడలేదు. ఇవన్నీ 57 నెలల కాలంలోనే శ్రీకారం చుట్టాం. బాబు ఒక్క మంచీ చేయలేదు.. పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఎలాంటి ఆహారం అందుతుందో చంద్రబాబు ఏనాడు కనీసం ధ్యాస పెట్టలేదు. బైజూస్ కంటెంట్, పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడు – నేడుతో స్కూళ్లను బాగుపరచాలన్న ఆలోచనే చేయలేదు. ఇంగ్లీషు మీడియం ఊసే లేదు. అమ్మ ఒడి దిశగా అడుగులు వేసిందీ లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలన్న ఆలోచనే ఏ రోజూ చేయలేదు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఒక బోడి సున్నానే. విదేశీ విద్యా దీవెనతో ఏకంగా రూ.1.25 కోట్ల దాకా చదివించే బాధ్యత నాదీ అన్న ప్రోత్సాహకర మాటలే నాడు లేవు. రాష్ట్రంలో ఆయన పరిపాలన వల్ల జరిగిన మంచి ఒక్కటంటే ఒక్కటీ లేదు. గ్రామాలకు, సామాజిక వర్గాలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, చదువుకుంటున్న పిల్లలకు, జాబ్స్ కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశానని ఆయన చెప్పగలిగే పరిస్థితే లేదు. హాజరైన మంత్రులు, నేతలు కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రçఘురాం, టి.కల్పలత, మొండితోక అరుణ్‌కుమార్, రుహుల్లా, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, దూలం నాగేశ్వరరావు, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎంఎస్ నాగిరెడ్డి, ఉన్నత విద్యాచైర్మన్ హేమచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రాజబాబు తదితరులు పాల్గొన్నారు. నేటి విత్తనం.. రేపు మహా వృక్షం ఇవాళ మన పిల్లలకు కావాల్సింది ఏదో కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే అనుకునే చదువులు కాదు. ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే ఫర్వాలేదని భావించే చదువులు కానే కాదు. ఈరోజు మనకు కావాల్సింది క్వాలిటీ చదువులు. ఇవాళ్టి తరం రేపు పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే నాణ్యమైన చదువులు కావాలి. ఈ నిజం, అవసరాన్ని తెలుసుకున్నాం కాబట్టే మన పిల్లలందరూ భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా మన అడుగులు ముందుకు పడ్డాయి. ఈ దిశగా ప్రాథమిక విద్యలో కీలక మార్పులు తెచ్చాం. మనం వచ్చిన తర్వాతే గవర్నమెంట్ బడుల పరిస్థితులు మారాయి. ఇవాళ ఒకటో తరగతిలో మనం వేసే విత్తనం మరో 10–15 ఏళ్లలో చెట్టు అవుతుంది. మంచి భవిష్యత్ లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది. అలా కాకుండా మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం. నాడు–నేడుతో గవర్నమెంట్ స్కూళ్లలో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా మన ప్రయాణం సాగుతోంది. జగన్ అనే వ్యక్తి పక్కకుపోతే...! జగన్ అనే ఒక్కడు పక్కకుపోతే రేపు పిల్లల చదువులు ఉండవు! గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు! 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ కథ దేవుడెరుగు విద్యారంగం గాలికి పోతుంది! ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, పేదవాడికి ఇంటికే మందులు, వ్యవసాయం గాలికి ఎగిరిపోతాయి. రైతన్న పూర్తిగా చతికిలబడిపోతాడు. అక్కచెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నం అవుతాయి. పేదవాడికి తోడుగా నిలబడుతూ, పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్ మాత్రమే. అందుకనే ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. వాళ్లు చెప్పే అబద్ధాలు, మోసాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెబుతారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తామంటారు. మీ ఇంటికి ఎవరు మంచి చేశారు? ఎవరి హయాంలో మంచి జరిగింది? అనే ఆలోచన చేయండి. మీ జగన్ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా సైనికులుగా నిలబడండి. నేను చెప్పే ఈ మాటలు కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పిల్లల బాధ్యత తీసుకున్నారు తోడేళ్లన్నీ ఏకమైనా జగనన్న మనందరి కోసం పోరాడుతున్నారు. అట్టడుగు వర్గాలను పైకి తేవాలన్న సంకల్పం గొప్పది. వ్యవస్ధలో మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమని భావిస్తూ సంస్కరణలు చేపట్టారు. స్కూళ్లు మొదలయ్యే జూన్, జూలై వచ్చిందంటే ప్రతి ఒక్కరూ పిల్లల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు జగనన్న ఆ బాధ్యత తీసుకున్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్న 30 ఏళ్లు సీఎంగా ఉండాలి. సామాన్యుడైన నన్ను ఎమ్మెల్యేను చేశారు. ప్రాణం ఉన్నంతవరకు ఆయన వెంటే నడుస్తా. ముఠా నాయకులు, ప్యాకేజ్ స్టార్‌ను ప్రజలు తరిమి కొట్టాలి. ఓ వ్యక్తి ఇటీవల తరచూ అత్తగారింటికి నిమ్మకూరు వస్తున్నాడు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కొత్త కథలు చెబుతున్నాడు. – కైలే అనిల్‌కుమార్, పామర్రు ఎమ్మెల్యే విద్యార్థులకు వరంలా.. అమ్మలా గోరుముద్ద అందిస్తూ నాన్నలా ఫీజులు చెల్లిస్తున్న మీది గొప్ప మనసు అన్నా. కృష్ణా యూనివర్సిటీలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బీటెక్ చదువుకుంటున్నా. నాన్న చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగినట్లు చెప్పారు. నేను ఏ ఒక్క ఆఫీస్‌కూ వెళ్లకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికే వచ్చి పత్రాలు ఇచ్చారు. విజన్ ఉన్న మీరు సీఎంగా ఉండటం విద్యార్థులకు వరం. ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్లీ మళ్లీ సీఎం కావాలి. మీద్వారా మా కుటుంబం చాలా లబ్ధి పొందింది. – పి.శ్రీ షణ్ముఖ సాయి ప్రియ, విద్యార్థిని గొప్ప ప్రజా నాయకుడు మీరే.. మాది పేద కుటుంబం. నాన్న ప్రైవేట్ ఉద్యోగి. ఆయన జీతంపైనే కుటుంబం గడుస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ పూర్తి చేశా. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నా. విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా లబ్ధి పొందా. కరిక్యులమ్ కోర్సులతో పాటు ఇతర కోర్ సబ్జెక్ట్‌లు నేర్చుకోవడం వల్ల మంచి గ్రిప్ సంపాదించా. సాఫ్ట్వేర్ జాబ్స్‌కు అర్హత సాధించా. వరల్డ్ టాప్ యూనివర్సిటీలలో ఎంఎస్ చేయాలనుకుంటున్నా. మీరు యువతకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. మాల్కం గ్లాడ్వెల్ అనే ఇంగ్లిష్ రచయిత టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు. మీరు కూడా టెన్ థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు. నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్‌లో గ్రేట్ ప్రొఫెషనల్ పేరు సాధించాక మళ్లీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్‌పై నిలబడి మాట్లాడతానని మాట ఇస్తున్నా. – దిల్షాద్, విద్యార్థిని తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి.... మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 21 ఫ్యాకల్టీస్లో 330 కాలేజీల్లో సీట్లు సాధిస్తే జగనన్న విదేశీ విద్యా దీవెనతో రూ.1.25 కోట్ల వరకు ఫీజులు చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. పిల్లల డిగ్రీలకు ప్రయోజనం దక్కేలా వారు ఏం చదువుతున్నారు? కరిక్యులమ్‌లో ఎలాంటి మార్పులు తేవాలి? అత్యున్నత భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాలి? అని మొదటిసారిగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మీ అన్న మాత్రమే. కరిక్యులమ్‌ను జాబ్ ఓరియెంటెండ్గా మార్చాం. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తెచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్ షిప్ తీసుకొచ్చింది ఇప్పుడే. మన కరిక్యులమ్‌లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్‌ను తొలిసారిగా తీసుకొచ్చాం. చదువుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ తొలిసారిగా అనుసంధానం చేస్తూ అడుగులు వేశాం. డిగ్రీ పూర్తయ్యాక మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించక ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో విదేశాల్లో ఉన్నదేమిటి? ఇక్కడ లేనిదేమిటి? అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్టుల్లో ఉన్న వర్టికల్స్‌ను ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది కూడా మన ప్రభుత్వమే. ప్రఖ్యాత వర్సిటీల్లో ఉన్న దాదాపు 2 వేల కోర్సులన్నీ ఆన్లైన్ ద్వారా మన కరిక్యులమ్‌లో భాగాలుగా మారి సర్టిఫికెట్లు కూడా వారే ఇచ్చేలా అడుగులు వేశాం. అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, ఎంఐటీ, ఎల్ఎస్సీ, ఎల్బీఎస్ లాంటి అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్లో కోర్సులు పూర్తి చేసి పొందిన సర్టిఫికెట్లతో నైపుణ్యాలు సాధించిన మన విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే అంతర్జాతీయంగా మల్టీ నేషనల్ కంపెనీల్లో అందరికంటే ముందుంటారు. జగన్నాథ రథం.. విప్లవాత్మక సంస్కరణలతో మన జగన్నాథ రథం వడివడిగా కదులుతోంది. స్కూల్ ఎడ్యుకేషన్‌లో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు అడుగులు పడుతున్నాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని మీ అన్న పరిపాలనలోనే తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్‌తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతోంది కూడా ఇప్పుడే. గవర్నమెంట్ స్కూళ్లలో బైలింగ్యువల్ టెక్సŠట్బుక్స్ మన పిల్లల చేతుల్లో కనిపిస్తోంది కూడా ఇప్పుడే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్‌ను పేద పిల్లలకు సైతం అందించింది ఈ 57 నెలల కాలంలోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు నేర్చుకునే లిటరసీ నుంచి డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏకంగా ట్యాబ్‌లు ఇచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. నాడు – నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేసి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములో ఐఎఫ్‌పీ ప్యానెళ్లు తెచ్చింది మన ప్రభుత్వమే. పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహిస్తూ తల్లులకు అమ్మ ఒడితో ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తోంది కూడా మనమే. పిల్లలకు రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్దను పౌష్టికాహారంతో అందిస్తోంది కూడా ఈ 57 నెలలుగానే. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలు, అందులో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒకటి ఉండాలని ఏర్పాట్లు చేసింది కూడా మన ప్రభుత్వమే. విద్యా వ్యవస్థను మన ప్రభుత్వం ఎంత ఉన్నత స్థాయికి చేర్చిందో చెప్పేందుకు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థినులు ఐక్యరాజ్యసమితిలో అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడిన అరుదైన ఘట్టమే నిదర్శనం. మన చదువుల ఘనతను చిట్టి చెల్లెమ్మలు ప్రపంచానికి చాటి చెప్పారు. ఎమ్మెల్యే అనిల్‌ను చూసినప్పుడల్లా.. ఎమ్మెల్యే అనిల్‌ని చూసినప్పుడల్లా అందరూ తన మాదిరిగా ఉంటే ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని అనిపిస్తుంది. నిజాయతీ, నిబద్ధత ఉన్న అనిల్‌ను మీరందరూ దీవించండి. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కొన్ని పనులు అడిగాడు. అధికారులను పిలిపించి అవన్నీ కచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తానని హామీ ఇస్తున్నా. పెత్తందారులకో ధర్మం.. పేదలకో ధర్మమా? ఇవాళ నేను చెబుతున్న ప్రతి మాటా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నా. తల్లిదండ్రులు, పిల్లలందరూ దీన్ని గమనించాలి. పెత్తందార్లయిన వారికో ధర్మమట! పేదలైన మీకో ధర్మమట! వారి పిల్లలకు ఒక బడి.. మన పిల్లలకు ఇంకో బడట! వారి చదువులు వేరట.. మన చదువులు వేరట! పెత్తందార్లుగా వారుండాలట... పనివారిగా మనం ఉండాలట! పరిశ్రమలు వారివట.. కార్మికులుగా మాత్రమే మనమట! సామ్రాజ్యాలన్నీ వారివట.. సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట! వారి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ జగన్ పేద పిల్లలకు ట్యాబ్‌లిస్తే మాత్రం చెడగొడుతున్నారంటూ యాగీ చేస్తారు. ఇవన్నీ మన పిల్లలు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోవాలని కోరుకొనే పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనాలుగా మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. -
పామర్రులో జగనన్న .. విద్యాదీవెన నిధుల విడుదల (ఫొటోలు)
-
సీఎం జగన్‌తో పేర్ని కిట్టు కలిసి..!
-
CM Jagan Pamarru Meeting: జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
జగనన్న విద్యా దీవెన విడుదల
-
కేవలం పిల్లల కోసమే 57 నెలలో 73 వేల కోట్లు ఖర్చు చేశాం
-
పేద పిల్లల కోసమే ‘జగన్నాథ’ రథం: పామర్రులో సీఎం జగన్
సాక్షి,కృష్ణాజిల్లా: చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను బటన్ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్ ఖాతాల్లోకి సీఎం జగన్ విడుదల చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ పెద్ద చదువులు చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును పిల్లల తల్లులకు ఇచ్చి తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే కార్యక్రమమే విద్యాదీవెన అని తెలిపారు. ‘రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మంది పిల్లలు 9 లక్షల 44వేల 666 మందికి జగనన్న ప్రభుత్వమే ఫీజులు కడుతోంది. ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పులపాలు కాకూడదని మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలతో పాటు మిగిలిన కులాల వారిని స్కీమ్‌కు అర్హులుగా చేసేందుకు ఆదాయపరిమితిని 2 లక్షల దాకా పెంచాం. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నాం. గతంలో ఇంతే ఫీజులు కడుతాం.. ఇంత కంటే ఎక్కువ కట్టం.. మీ చావులు మీరు చావండి అన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ ప్రస్తుతం త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ మూడు నెలలకు సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాలో వేస్తూ ఫీజులు కట్టిస్తున్నాం. కేవలం ఫీజులే కాకుండా వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకువచ్చి పిల్లలకు బోర్డింగ్ ఉచితంగా అందిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 57 నెలలుగా విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తున్నాం. 57 నెలల్లో 29 లక్షల మందికి రూ.12 వేల కోట్లు.. అక్టోబర్,నవంబర్, డిసెంబర్ క్వార్టర్‌కు సంబంధించిన రూ.708 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలోకి ఈ వేదిక నుంచి నేరుగా పంపిస్తున్నాం. వీటితో కలుపుకుని గత 57 నెలలలో 29 లక్షల 60 వేల మందికి రూ.12వేల609 కోట్ల రూపాయలను విద్యా దీవెన కింద జమ చేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4275 కోట్లు చెల్లించాం. ఈ ఏప్రిల్‌లో విడుదల చేయనున్న నిధులను కూడా కలిపితే రెండు పథకాల మీద పెట్టిన మొత్తం రూ.18 వేల కోట్ల రూపాయలు అని చెప్పేందుకు గర్వపడుతున్నా. ఒక్క విద్యారంగంలో స్కీములకే ఐదేళ్లలో రూ.73 వేల కోట్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యా రంగంలో పెద్ద మార్పులు తీసుకువచ్చాం. విద్యా రంగంలో 57 నెలల కాలంలో కేవలం పథకాల మీద రూ.73 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం. పేదరికం నుంచి బయటికి రావడానికి చదువు ఒక్కటే అస్త్రమని నమ్మి మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతున్నాం. పేదింటి పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద కంపెనీ సీఈవోలుగా చేయాలని, పేదల తలరాతలుగా మారాలని ఈ 57 నెలల కాలంలో అడుగులు వేస్తూ వచ్చాం. మేం చేసిన మార్పుల వల్ల విద్యా విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రతి ఒక్కరూ గమనించాలి. 3 ఏళ్ల పిల్లల నుంచి 23 ఏళ్లలోపు పిల్లలు శతమానంభవతి అనే విధంగా మరో 100 ఏళ్లు జీవించాల్సిన జనరేషన్. ఈ జనరేషన్ పోటీపడేది ప్రపంచస్థాయిలో. గత 30 ఏళ్లలో చదువులు మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే సరిపోదు. ప్రస్తుతం క్వాలిటీ చదువులు కావాలి. ఇది గమనించాను కాబట్టే పెద్ద పెద్ద స్థానాల్లో పిల్లలు ఉద్యోగాలు సంపాదించే విధంగా అడుగులు వేస్తూ వచ్చాం. ఒకటవ తరగతిలో మనం వేసే విత్తనం 15 ఏళ్లలో చెట్టవుతుంది. పిల్లలకు మంచి భవిష్యత్తుండేలా పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలని కార్యక్రమాలు చేపట్టాం. ఇందులో భాగంగానే ప్రాథమిక విద్య నుంచి మొదలుపెడితే ఉన్నత చదువుల దాకా గొప్ప మార్పులు తీసుకువచ్చాం. నాడు నేడుతో ప్రభుత్వ బడులను ప్రక్షాళన చేశాం. ఇంగ్లీష్ మీడియంతో పాటు స్కూళ్లలో సీబీఎస్, ఐబీ సిలబస్ తీసుకువచ్చాం. ఇంగ్లీష్ మీడియం అంటే యుద్ధమే చేస్తున్నారు.. ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకు రావాలని ఆరాట పడితే చంద్రబాబు, రామోజీరావు, పవన్‌కళ్యాణ్‌తో యుద్ధం చేయాల్సి వస్తోంది. వీళ్లెవ్వరి పిల్లలు తెలుగు మీడియంలో చదవడం లేదు. ప్రభుత్వ బడుల్లో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడితే మాత్రం నానా యాగీ చేసి మన మీద యుద్ధమే చేస్తున్నారు. పెత్తందారులైన వారికో ధర్మమట.. మీకో ధర్మమట.. వారికో బడులట.. మనకో బడులట.. వారి పిల్లలకు ఒక చదువుట.. మనకు ఒక చదువులట.. పెత్తందారులు వారట.. పనివాళ్లం మనమట.. పరిశ్రమలు వారివట.. కార్మికులం మనమట. వారి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు. పిల్లలకు జగన్ ట్యాబులిస్తే మాత్రం ఏవేవో చూస్తూ వారు చెడిపోతున్నారని యాగీ చేస్తారు. మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలన్న వారి మనస్తత్వానికి ఇవన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయి. విద్యారంగంలో పెత్తందారులకు పేదలకు మధ్య క్లాస్ వార్ జరుగుతోంది. డబ్బులున్నవాళ్లకు, డబ్బు లేని వాళ్లకు ఒక యుద్ధం జరగుతోంది. మీ అన్నగా మీ తరపున విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చాం. ఈ అడుగులు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగానే, పేదల పిల్లలు, పేదలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు జరగాలి. పేద పిల్లల కోసమే జగన్నాథ రథం కదులుతోంది.. చంద్రబాబు ఆయన మనుషులు, పెత్తందారుల భావజాలాల మీద తిరుగుబాటుగానే విదేశీ విద్యాలయాల్లోని కోర్సులు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది. మూడవ తరగతిలోనే మన ప్రభుత్వ బడుల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. మూడవ తరగతిలోనే టోఫెల్ ఓరియెంటేషన్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. బై లింగ్విల్ టెక్స్ట్ బుక్స్ తీసుకువచ్చాం. బైజూస్ కంటెంట్‌ను పేద పిల్లకు అందించాం. పిల్లలు డిజిటల్ యుగాన్ని శాసించాలని 8వ తరగతిలోనే పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చాం. నాడునేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చాం. ప్రతి ఏటా అమ్మ ఒడి కింద తల్లులకు ప్రోత్సాహం కింద రూ.15వేల రూపాయలు ఇస్తున్నాం. స్కూలుకు వెళ్లే పిల్లలకు గోరుముద్ద కింత పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు, మన కాలేజీ పిల్లలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది మన కళ్లతో మనమే చూశాం. ఇదంతా ఈ 57 నెలల్లోనే కనిపిస్తోంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఈ 57 నెలల్లోనే వంద శాతం ఫీజులు, వసతి ఖర్చులు చెల్లిస్తున్నాం. విదేశీ యూనివర్సిటీల్లో ఒక్కొక్కరికి రూ.కోటి 25 లక్షల ఫీజు.. ప్రపంచస్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 330 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే పిల్లలకు రూ.కోటి 25 లక్షల దాకా ఫీజులు కడుతున్నాం. ఈ నాలుగేళ్ల పాలనలోనే కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువచ్చి జాబ్ ఓరియెంటెడ్‌గా మార్చాం. సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులు తీసుకువచ్చాం. చదువుల్లోకి ఏఐ, ఎంఎల్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ తీసుకువచ్చాం. మన కాలేజీల్లో డిగ్రీలు చదవడం వల్ల మనకు ఇబ్బందులు రాకూడదని సబ్జెక్ట్‌లో మార్పులు తీసుకువచ్చి ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చాం. మన కరిక్యులమ్‌లో భాగంగా ఎంఐటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకమనిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి కోర్సులు తీసుకువచ్చాం. విదేశీ విద్యాలయాల వల్లే చదువులు చెప్పి వాల్లే సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. పేదరికం సంకెళ్లను పేద పిల్లలు తెంచుకోవాలనే విద్యారంగంలో మార్పులు తీసుకువచ్చాం. దీంతో వచ్చే పది పదేహేనేళ్లలో ఎంఎన్సీలలో ఉద్యోగాలు వచ్చి బతుకులు, తలరాతలు మారతాయి. చంద్రబాబునాయుడు 14 ఏళ్లు సీఎంగా చేసి ఆయన చేసిన మంచి ఏమిటో చేయాలని ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ బడికి చంద్రబాబు చేసిన మంచేమిటని అడిగితే ఎవరికీ ఏదీ గుర్తుకు రాదు. పేదపిల్లలు, వారి చదువుల కోసం చెబితే ఏదీ గుర్తుకు రాదు. ఆయన చేసిన చెడు మాత్రం గుర్తుకు వస్తుంది. ప్రభుత్వ బడిని నీరుగార్చింది చంద్రబాబే.. ప్రభుత్వ బడిని నీరుగార్చించి చంద్రబాబునాయుడు. తన కార్పొరేట్ సంస్థలు నారాయణ, చైతన్యలను పోషించింది చంద్రబాబునాయుడు. పిల్లలకు ప్రభుత్వ బడుల్లో ఎలాంటి ఆహారం అందుతుందో అనేదానిపై కనీసం ధ్యాస పెట్టిన పాపాన చంద్రబాబునాయుడు పోలేదు. నాడు,నేడు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, కరిక్యులమ్లలో మార్పులు బాబు హయాంలో ఏవీ లేవు. 14 ఏళ్లు సీఎంగా చేసినపుడు రైతులకు, గ్రామాలకు, అవ్వాతాతలకు, చదువుకుంటున్న పిల్లలకు చంద్రబాబు మంచి చేసిన పాపాన పోలేదు. ఈరోజు మారీచులతో మేం యుద్ధం చేస్తున్నాం. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే జరిగే నష్టమేమిటో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పిల్లల చదువులుండవు, ఇంఘ్లీష్ మీడియం ఉండదు. పిల్లలను పట్టించుకునే పరిస్థితే ఉండదు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య శ్రీ ఉండవు. వ్యవసాయం గాలికిపోతుంది. రైతన్న చిన్నాభిన్నమవుతాడు. వాళ్లు చెప్పేఅబద్ధాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని చెప్తారు. మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారో ఆలోచన చేయండి. మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా ప్రతి ఒక్కరు సైనికుల్లా ఉండండి’ అని సీఎం జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్, ఉన్నతాధికారులు, కలెక్టర్ పాల్గొన్నారు. -
విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
-
పామర్రులో జరిగిన ఏపీ సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో జనం
-
Watch Live: సీఎం జగన్ విద్యాదీవెన
కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్ విద్యాదీవెన పథకం కింద రూ.708.68కోట్లు ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఈ విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ధి జరిగింది. పెద్ద చదువులు చదువుతున్న పేదింటి పిల్లల ఫీజు డబ్బులు వారి తల్లులకు ఇస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు. 57 నెలలుగా విద్యా దీవెన కార్యక్రమం కొనసాగుతోంది పిల్లల చదువుల కోసం పేదల అప్పులపాలు కాకూడదని అనుకున్నాం 93 శాతం మందికి విద్యాదీవెన అందిస్తున్నాం పిల్లల పూర్తి ఫీజును కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది విద్యా దీవెనతో పాటు జగనన్న వసతి దీవెన అమలు చేశాం గత త్రైమాసికానికి సంబంధించి రూ.708 కోట్లు ఇస్తున్నాం విద్యాదీవెన, వసతిదీవెన కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం విద్యారంగంపై ఐదేళ్లలో 73 వేల కోట్లు ఖర్చు చేశాం ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్ నుంచి ఐబీఎస్ వరకు చదువు చెప్పిస్తున్నా్ం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెచ్చాం ఈ పనులు చేస్తుంటే విపక్షాలు విమర్శిస్తున్నాయి చంద్రబాబు,దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది విమర్శించే వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు పెత్తందార్లకు ఓ ధర్మం..పేదలకు మరో ధర్మమా విద్యారంగంలో ప్రస్తుతం క్లాస్ వార్ జరుగుతోంది డబ్బులు ఉన్నవారికి,లేనివారికి యుద్ధం జరుగుతోంది ప్రభుత్వం ట్యాబ్ లు ఇస్తే చంద్రబాబు,పవన్ విమర్శిస్తున్నారు పెత్తందార్ల కుట్రలు ప్రజలు గమనించాలని కోరుతున్నా పేద విద్యార్ధుల కోసమే ఈ డబ్బు ఖర్చు చేస్తున్నాం విద్యార్ధులు పోటీ ప్రపంచంలో ఎదగాలన్నదే మా లక్ష్యం నాడు-నేడుతో బడులను మార్చేశాం పేద పిల్లలు విదేశాలకు వెళ్లి పెద్ద చదువులు చదువుతున్నారు విద్యార్ధులకు వందశాతం ఫీజులు ప్రభుత్వం భరిస్తోంది పిల్లలకు మనం అందించే గొప్ప ఆస్తి చదువే చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలి విద్యాదీవెనతో పేదింటి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు క్రమం తప్పకుండా విద్యాదీవెన నిధులు అందిస్తున్నాం విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపు పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ఏ పేదవాడు తన పిల్లల చదువు కోసం అప్పులపాలు కాకూడదు మన ప్రభుత్వం వచ్చాక ఆయా ఆదాయపరిమితులు పెంచాం వీలైనంత మందికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు ఫీజులే కాకుండా వసతి ఖర్చుల కోసం వసతి దీవెన ఇస్తున్నాం 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం రూ.708.68 కోట్లు ఖాతాల్లో ఇప్పుడు జమ చేయబోతున్నాం జగనన్న విద్యా దీవెనతో ఇప్పటి వరకు రూ.12,610 కోట్లు అందించాం వసతి దీవెన, విద్యా దీవెన కోసం ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు వెచ్చించాం ఎప్పుడూ చూడని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం విద్యారంగంలో ఇప్పటి వరకూ రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం తర్వాతి తరాలకు మనం అందించే గొప్ప ఆస్తి చదువే మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలి ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం ఈరోజు క్వాలిటీతో ఉన్న చదువులే మన పిల్లలకు కావాలి క్వాలిటీ చదువుల అవసరం తెలుసుకున్నాం కాబట్టే విప్లవాత్మక మార్పులు అమలు చేస్తున్నాం మన పిల్లలు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి....మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా? తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానా యాగీ చేస్తున్నారు పెత్తందారుల కుట్రలు గమనించమని కోరుతున్నా పెత్తందారుల పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండొచ్చు మీకు ట్యాబులు ఇస్తే చెడిపోతారంటూ నానా యాగీ చేస్తున్నారు పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించండి పెత్తంతారులతో మనం క్లాస్ వార్ చేస్తున్నాం చంద్రబాబు, ఆయన మనుషుల పెత్తందారీ భావజాలాన్ని గమనించండి 57 నెలల కాలంగా జగన్నాథ రథచక్రాలు ముందుకు సాగుతున్నాయి మన పిల్లలు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలి మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలి ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం ప్రభుత్వం ట్యాబ్‌లు ఇస్తే చంద్రబాబు, పవన్ విమర్శిస్తున్నారు పిల్లలకు మంచి చేస్తున్న మనపై చంద్రబాబు అండ్ కో యుద్ధం చేస్తుంది పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా చంద్రబాబు ప్రయత్నించారా? చంద్రబాబు పేద విద్యార్థుల కోసం చేసిన మంచి ఏంటి? చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు చాలానే ఉంది చంద్రబాబు ఏరోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా? నేను చేసిన పనుల్లో ఒక్క శాతమైనా చంద్రబాబు చేశారా? నారాయణ, చైతన్య విద్యా సంస్థల కోసమే చంద్రబాబు ఆలోచన జగన్ అనే వ్యక్తి తప్పుకుంటే జరిగే నష్టం గురించి ఆలోచించండి జగన్ మళ్లీ రాకుంటే పిల్లల చదువులు, సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయి జగన్ మళ్లీ రాకుంటే పేదవాడు అప్పులపాలవుతాడు ప్రతీ ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ అంటూ అబద్ధాలు చెబుతారు వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరుతున్నా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే జగన్ కు ఓటు వేయండి -
‘ అన్నా.. అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’
రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కృష్ణా జిల్లా పామర్రు పర్యటనకు వెళ్లారు. అయితే విద్యా దీవెన నిధులు విడుదల చేయడానికి సీఎం జగన్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులై ఉన్న సమయంలో ఇద్దరు విద్యాదీవెన లబ్ధిదారులు తమ అనుభవాలను అమూల్యమైన ప్రసంగం ద్వారా పంచుకున్నారు. ‘ మీరు సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం’ అన్నా అనే పదానికి అర్ధం, అమ్మలోని అ, నాన్నలోని న్న కలిపితే నిజంగా మీరేనన్నా, అమ్మలా గోరుముద్ద పెడుతూ, నాన్నలా బాధ్యతగా ఫీజులు కడుతున్న మీరు నిజమైన గొప్ప మనసున్న అన్న, అన్నా మాది మధ్య తరగతి కుటుంబం, నా ఇంటర్ తర్వాత నాన్నకు హార్ట్ ఆపరేషన్, నా చదువు ఎలా కొనసాగించాలా అనుకునే సమయంలో నాకు క్రిష్ణా యూనివర్శిటీలో బీటెక్ సీట్ వచ్చింది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను, అమ్మ ఖాతాలో నేరుగా డబ్బు పడుతుంది, నాన్న తను చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవారన్నారు, నేను ఒక్క ఆఫీస్‌కు వెళ్ళకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఇచ్చారు, మీలాంటి విజన్ ఉన్న వ్యక్తి సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం, మీరు మా విద్యార్ధులకు అన్నీ ఇస్తున్నారు, మీ వల్ల మాలాంటి ఎంతోమంది చక్కగా చదువుకుంటున్నారు, ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మా కుటుంబం కూడా చాలా లబ్ధి పొందింది, మేం మధ్య తరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి ఎదిగామంటే మీరే కారణం అన్నా, థ్యాంక్యూ. - శ్రీ షణ్ముక సాయి ప్రియ, విద్యాదీవెన లబ్ధిదారు ‘అందుకే మీరు మంచి రాజకీయ నాయకుడయ్యారు’ మాదొక పేద కుటుంబం.. మా నాన్నగారు ప్రైవేటు ఉద్యోగి. మా నాన్న గారి జీతం మీద మా ఇల్లు నడుస్తోంది. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను..ఇప్పుడు నేను వెలగపూడి రామకృష్ణా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాను. నేను ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి అదే కాలేజ్‌కి వెళ్లినప్పుడు చదివితే ఇటువంటి కాలేజీలో చదవాలి అనుకున్నాను. కానీ అప్పుడు మాకు అంత ఆర్థిక స్థోమత లేదు. చదివించేంత డబ్బులు లేవు. అప్పుడు మీరొచ్చారన్నా.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ వచ్చారు అన్నా. విద్యా దీవెన పథకం ద్వారా నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నారన్నా. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా అందిస్తాను చెల్లి అంటూ మీరు మరో అడుగు వేశారన్నా. మీ దీవెనలతోనే నేను ఎక్కడైతే చదవాలని అనుకున్నానో అక్కడే చదవుతున్నాను అన్నా. మాల్కం గ్లాడ్వెల్ అనే ఇంగ్లీష్ రైటర్ టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు, మీరు కూడా టెన్‌థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు, నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్‌లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్గా నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్ మీద నిలబడి మాట్లాడతానని నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మా యూత్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నారు, అన్నా థ్యాంక్యూ. -దిల్షాద్, విద్యాదీవెన లబ్ధిదారు -
పామర్రులో జగనన్న విద్యాదీవెన, విద్యార్థుల్లో ఉరకలెత్తిన ఉత్సాహం (ఫొటోలు)
-
పెత్తందారుల కుట్రలు గమనించమని కోరుతున్నా: సీఎం జగన్
Updates 03:04PM, Mar 1st, 2024 ముగిసిన సీఎం జగన్ పామర్రు పర్యటన కృష్ణాజిల్లా పామర్రులో ముగిసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన పామర్రు నుంచి తాడేపల్లికి బయల్దేరిన సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల అంతకు ముందు.. బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్ 12:03PM, Mar 1st, 2024 ప్రసంగం అనంతరం సీఎం వైస్ జగన్... ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించి నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. విద్యాదీవెన నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మీ చిక్కటి చిరునవ్వుల మధ్య, ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య, దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం పామర్రు నుంచి చేస్తున్నాం. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం, తరతరాల పేదరికం సంకెళ్లను తెంపేసి, చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు పామర్రు నుంచి జరుగుతోంది. పెద్ద చదువులు చదువుకుంటున్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, పూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చి, తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ జగనన్న విద్యా దీవెన కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు 9.45 లక్షల మంది పిల్లలకు.. మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజును మీ జగనన్న ప్రభుత్వమే కడుతోంది. ఆలోచన చేయమని అడుగుతున్నా. గతానికి ఇప్పటికి మధ్య చిన్న తేడా చెబుతా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలను చదివించాలి, వారు బాగుపడాలి, ఏ పేదవాడూ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని, అర్హత ప్రమాణాలను పెంచాం. ఇన్ కమ్ లిమిట్స్ పెంచాం. గతంలో లక్ష రూపాయలకు పరిమితమైన ఇన్ కమ్ లిమిట్ ను, ఎస్సీలకు 2 లక్షల దాకా పరిమితమై ఉండేది. మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.5 లక్షలకు పెంచి ఈరోజు 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలిగాం. గతంలో మాదిరిగా ఇంతే కడతాం, ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి, మీ చావు మీరు చావడం అనే విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పాం. పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడే పరిస్థితి రాకూండా పూర్తి ఫీజును కట్టే కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకున్నాం. ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే తల్లులకు ఫీజులు వేస్తూ కాలేజీల్లో ఫీజులు కట్టించే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. విద్యాదీవెనే కాకుండా పిల్లలు ఇబ్బంది పడకూడదని, జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి పాపకూ, బాబుకూ తల్లిదండ్రులకు మంచి చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా జరిపిస్తున్నాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి పిల్లలకు ఖర్చు అయ్యే పూర్తి ఫీజు రీయింబ్స్ మెంట్ ను 9.45 లక్షల మందికి మేలు చేస్తూ నేరుగా బటన్ నొక్కి పిల్లల, తల్లుల జాయింట్ అకౌంటుకు ఏకంగా 708 కోట్లు నేరుగా పంపించడం జరుగుతుంది. 708 కోట్లతో కలుపుకొని 57 నెలల కాలంలో మీ అన్న ప్రభుత్వం చెల్లించిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తీసుకుంటే.. ఏకంగా 29.66 లక్షల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ జగనన్న విద్యాదీవెన ద్వారా మాత్రమే రూ.12,609 కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు జమ చేయడం జరిగింది. జూలై నుంచి జూన్ దాకా ఉండే విద్యాసంవత్సరం మొదట్లో, చివర్లోనూ ప్రతి ఏప్రిల్ లో ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా చెల్లించిన మొత్తం మరో రూ.4275 కోట్లు. ఈ ఏప్రిల్ లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో 1100 కోట్లు కలుపుకొంటే.. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు పెట్టిన డబ్బు ఏకంగా రూ.18 వేల కోట్లు. ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు బాగుపడాలి, కుటుంబాలు బాగుపడాలి, పిల్లలకు మంచి జరగాలని ప్రతి అడుగూ వేస్తూ వచ్చాం. మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు వివిధ పథకాల మీద 57 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే 73 వేల కోట్లు చేశాం. గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలని, కేవలం పథకాల మీద ఖర్చు చేసిన సొమ్ము ఈ 73 వేల కోట్లు. ఇది పేద, మధ్య తరగతి కుటుంబాల మెరుగైన జీవితం కోసం మనం చేసిన హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్. పేద కుటుంబాల్లో ప్రతి పాపా, ప్రతి బాబూ గొప్ప చదువులతో గొప్ప డిగ్రీలతో ఇంజనీర్లుగానూ, కలెక్టర్లుగానూ, డాక్టర్లుగానూ, పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈవోలుగానూ వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆ కుటుంబాల తలరాతలన్నీ మారాలని, భవిష్యత్ బాగుండాలని అడుగులు వేస్తూ వచ్చాం. ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులనూ, పిల్లలనూ ఈ కార్యక్రమం టీవీ ద్వారా చూస్తున్న ప్రతి తల్లిదండ్రినీ గమనించమని కోరుతున్నా. ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేసింది, దాని వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అన్నది ఒకసారి అందరూ గమనించమని కోరుతున్నా. మీ పిల్లల వయసు ఈరోజు మూడు సంవత్సరాలు కావొచ్చు, 23 సంవత్సరాలలోపు ఎంతైనా కావచ్చు. వీరంతా కూడా శతమానం భవతి అన్న విధంగా కనీసం మరో 100 సంవత్సరాలు జీవించాల్సిన జనరేషన్ లో ఉన్న వారు. ఏ విషయంలో అయినా కూడా వీళ్లందరూ పోటీ పడేది ఎవరితో అన్నది ప్రతి ఒక్కరం ఆలోచన చేయాలి. పోటీ పడేది రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఆ గ్రామం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, దేశంతో కాదు, రేప్పొద్దున వీళ్లు ప్రపంచంతో పోటీ పడతారు. గత 30 సంవత్సరాలు తీసుకుంటే, అప్పటికి, ఇప్పటికి తీసుకుంటే వస్తువులు, సేవలు, టెక్నాలజీ అయినా ఎంతగా మారిపోయాయో, మారుతూ వస్తున్నాయో ఇవన్నీ కూడా మనమంతా చూస్తున్నాం. కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే అనుకొనే చదువులు కాదు.. ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే పర్వాలేదని అనుకొనే చదువులు కాదు.. ఈరోజు కావాల్సిన చదువులు క్వాలిటీ చదువులు. ఇవాళ తరం రేపు భవిష్యత్ లో పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే క్వాలిటీ చదువులు మన పిల్లలకు అవసరం. ఈ నిజం, అవసరం తెలుసుకున్నా కాబట్టే మన పిల్లలందరూ భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించుకొనేలా అడుగులు వేస్తూ వచ్చాం. ప్రాథమిక విద్యలో ప్రతి అడుగులోనూ మార్పులు తెచ్చాం. మనం వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ బడులు మారాయి. మనం వేసే విత్తనం మరో 10-15 ఏళ్లలో చెట్టు అవుతుంది. మంచిభవిష్యత్ లేకపోతే చెట్టు ఒరిగిపోతుంది. అలాంటిది కాకుండా పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, పెరగాలి, భవిష్యత్‌లో అందరికన్నా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని అడుగులు వేస్తూ వచ్చాం. గవర్నమెంట్ బడులను మార్చాం. ఇంగ్లీషు మీడియంతో పాటు గవర్నమెంట్ బడుల్లో సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం కనిపిస్తోంది. ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి.. ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తోంది, ఈనాడు రామోజీ రావుతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తోంది. టీవీ5తో యుద్ధం చేయాల్సి వస్తోంది. వీళ్లందరితో పాటు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడటం తప్పు. ఇంగ్లీషు మీడియం తేవాలని తపన పడటం తప్పు. ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. మనపై యుద్ధం చేస్తున్న వీళ్లు, వీళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు కూడా ఏ మీడియంలో చదువుతున్నారని మీలో ఎవరైనా నిలదీస్తే మాత్రం ఏఒక్కరూ తెలుగుమీడియంలో చదువుతున్నారని చెప్పరు. వాళ్ల పిల్లలేమో ఇంగ్లీషుమీడియం చదవాలి, కానీ మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాడానికి మీ జగన్ అడుగులు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించి పోతుందని ఏకంగా యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. నేను చెబుతున్న ప్రతి మాటా ఆలోచన చేయమని కోరుతున్నా. తల్లిదండ్రులు, పిల్లలందరూ గమనించాలి. పెత్తందార్లయిన వారికో ధర్మమట. పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడి అంట. మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. పెత్తందార్లుగా వారుండాలట. పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట. కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట. సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట. వారి పిల్లల చేతుల్లో ట్యాబులుండొచ్చు. స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు. కానీ మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులిస్తే మాత్రం పిల్లలు ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారని యాగీ చేస్తారు. ఇవన్నీ ఎప్పటికీ మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకొనే పెత్తందారీ మనస్తత్వానికి ఇవన్నీ నిదర్శనాలుగా మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి, మనకు మధ్య జరుగుతున్నది ఒక యుద్ధం. క్లాస్ వార్ జరుగుతోంది. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం, డబ్బులున్న వారికి ఒక చదువులు, డబ్బుల్లేని వారికి మరో చదువులుగా జరుగుతున్న యుద్ధం. మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా, తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాం. సంస్కరణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే, ఈ విప్లవానికి అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగానే, పనివారు పనివారుగానే, పేద సామాజిక వర్గాల పిల్లలు అదే పేదరికంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు జరగాలి. ఈ సంస్కరణలు వేగంగా అడుగులు పడుతూ పోవాలి. విదేశాల్లో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులు సైతం ఆన్ లైన్ లో పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం వరకు ప్రతి ఒక్కటీ విప్లవాత్మక మార్పు. ఇవన్నీ 57 నెలల కాలంలోనే శ్రీకారం చుట్టాం. అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది. అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్ లో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు అడుగులు పడుతున్నాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని తీసుకొచ్చింది మీ అన్న పరిపాలనలోనే. ఏకంగా 3వ తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్ తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ఈ 57 నెలల కాలంలోనే. మొట్ట మొదటి సారిగా గవర్నమెంట్ బడుల పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ మన పిల్లల చేతుల్లో కనిపిస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ ను పేద పిల్లలు చదువుతున్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిట్రసీ నుంచి డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఈ 57 నెలల కాలంలోనే. మొట్ట మొదటిసారిగా నాడునేడుతో స్కూళ్లన్నీ రూపురేఖలు మారుస్తూ, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములో ఐఎఫ్ పీ ప్యానెల్స్ తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహిస్తూ తల్లులకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. నాడునేడులో భాగంగా 45 వేల స్కూళ్లలో రూపురేఖలు మారుస్తూ 12 రకాల అంశాలను తీసుకొని ప్రతి స్కూళ్లో తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. పిల్లలకు రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలుండాలని, అందులో ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఒకటిఉండాలని ఏర్పాట్లు చేస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. ఐక్య రాజ్యసమితిలో మన పేద ఆడ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడిన ఘట్టం పేద పిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతోందో ప్రపంచానికి చాటి చెప్పిందో చూశాం. పెద్ద చదువులే చదువుతున్న పిల్లలకు మొట్ట మొదటి సారిగా 100 శాతం పూర్తిగా ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. భోజన, వసతి ఖర్చులు కూడా భరిస్తున్న ప్రభుత్వం కూడా ఈ 57 నెలల కాలంలోనే. ప్రపంచ స్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 21 ఫ్యాకల్టీస్ లో 330 కాలేజీల్లో సీటు మీరు తెచ్చుకోండి రూ.1.25 కోట్ల వరకు సపోర్ట్ చేసి శ్రీకారం చుట్టింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొదటిసారి ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు, కరిక్యులమ్ లో మార్పులు తీసుకురావాలి, భావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమేం మార్పులు తీసుకురావాలన్న ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే. మొట్ట మొదటి సారిగా కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఈ 57 నెలల కాలంలోనే. కరిక్యులమ్ ను జాబ్ ఓరియెంటెండ్ గా మార్చాం. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తెచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్ షిప్ అన్నది తీసుకొచ్చింది ఇప్పుడే. మొదటిసారి మన కరిక్యులమ్ లో సర్టిఫైడ్ ఆన్ లైన్ వర్టికల్స్ ను తీసుకొచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా చదువుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ అడుగులు వేయించింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. మన కాలేజీల్లో డిగ్రీ చదవడం వల్ల దేశీయంగా, విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని, అక్కడ ఉన్నదేమిటి, ఇక్కడ లేనిదేమిటి అని ఆలోచన చేసి, అక్కడ సబ్జెక్టుల్లో ఉన్న వర్టికల్స్ ను ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్ లైన్ లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. మొట్ట మొదటిసారిగా ఈరోజు మన చదువుల్లో కరిక్యులమ్ లో భాగంగా, మన సబ్జెక్ట్ వర్టికల్స్ లో భాగంగా ఎంఐటీ నుంచి ఏఐ, పెన్సిల్వెనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్, మేరీల్యాండ్ వర్సిటీ నుంచి వర్చువల్ బిల్డింగ్ డిజైన్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఇంటెలెక్చువల్ కమ్యూనికేషన్, ఈక్విటీ పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్ ఎన్ వైఐఎఫ్ నుంచి, రిస్క్ రిటర్న్ మేనేజ్ మెంట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి, సప్లై చైన్ మేనేజ్ మెంట్ ఎంఐటీ నుంచి, ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి, రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్ ఎంఐటీ నుంచి.. ఇలా దాదాపు 2 వేల కోర్సులు. ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్న కోర్సులన్నీ ఆన్ లైన్ ద్వారా మన కరిక్యులమ్ లో భాగాలై చదువులు చెబుతూ పరీక్షలు పెట్టి పిల్లలకు సర్టిఫికెట్లు కూడా వాళ్లే ఇచ్చేట్టుగా మొట్ట మొదటి సారి అడుగులు పడింది కూడా కేవలం ఈ 57 నెలల్లోనే. ఇది ఎప్పుడూ, ఎవరూ ఊహించని మార్పు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే మన పిల్లలందరికీ వాళ్ల చదువులు మారాలి. విద్యారంగంలో ప్రతి మార్పు వెనుక, చేస్తున్న వేల కోట్ల ఖర్చు వెనుక, మన పేద పిల్లలు ఇకనైనా పేదరికం సంకెళ్లను తెంచుకొనే స్థాయి రావాలి. ఈరోజు మనం వేసిన విత్తనం.. ఈ మార్పులన్నీ మరో 10-15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఈ విత్తనాలన్నీ అద్భుతమై ఫలితాలిచ్చే పరిస్థితి వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, ఎంఐటీ, ఎల్ ఎస్ సీ, ఎల్ బీఎస్ వంటి వర్సిటీల్లో అందుబాటులో ఉన్న కోర్సులు ఆన్ లైన్ లో సర్టిఫికెట్లను సొంతం చేసుకొని ఇంత క్వాలిఫైడ్ పర్సనల్ గా బయటకు వచ్చి మరో 10-15 సంవత్సరాల్లో ఉద్యోగాలకు అప్లికేషన్ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు అంతర్జాతీయంగా పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల్లో అందరికన్నా ముందుగా ఉంటారు. బతుకులు, తలరాతలు, భవిష్యత్తు మారుతుంది. ఈ రాష్ట్రంలోని పేద పిల్లాడికీ, ప్రతి పాపకూ తల్లిదండ్రులందరూ ఆలోచన చేయాలి చంద్రబాబు 14 సంవత్సరాలు 3 సార్లు సీఎంగా పని చేశాడు. పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి? ఆయన చేసిన మంచేమిటి? పేద పిల్లల భవిష్యత్ మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా చంద్రబాబు చూపించాడా? ఆలోచన చేయాలి. గవర్నమెంట్ బడిని అదే చంద్రబాబు చేసిందేమిటి? ఆయన చేసిన మంచేమిటి అంటే ఏ ఒక్కరికీ ఏదీ గుర్తుకురాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం ఆయన విద్యారంగంలో చేసిన చెడు మాత్రం చాలా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ బడిని నీరుగార్చింది చంద్రబాబు. నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించిన వ్యక్తి చంద్రబాబు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీషు మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడుల్లో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు. పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస పెట్టలేదు. బైజూస్ కంటెంట్, పిల్లలకు ట్యాబులు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడునేడుతో స్కూళ్లు బాగుపరచాలన్నది లేదు. అమ్మ ఒడి దిశగా అడుగులు వేసింది లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలన్న ఆలోచన ఏరోజూ చేయలేదు. వసతి దీవెన కథ దేవుడెరుగు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఒక బోడి సున్నా. విదేశీ విద్యా దీవెన ఏకంగా రూ.1.25 కోట్ల దాకా చదివించే బాధ్యత నాదీ అన్న ప్రోత్సాహకర మాటలు ఏదీ లేదు. ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇదీ అన్నది ఒక్కటంటే ఒక్కటీ లేదు. గ్రామంలో, సామాజిక వర్గాలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలు, చదువుకుంటున్న పిల్లలు, జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశానని చెప్పే పరిస్థితి లేదు. ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతోంది. మారీచులతో యుద్ధం చేస్తున్నాం. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నాలుగు అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కు లాగాలన్న శక్తులతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లు చేస్తున్న యుద్ధం కేవలం జగన్ తో కాదు. జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచన చేయాలి. జగన్ అనే ఒక్కడు పక్కకు పోతే పిల్లల చదువులు ఉండవు, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు, 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కథ దేవుడెరుగు. విద్యారంగం గాలికిపోతుంది. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, పేదవాడికి ఇంటికే మందులిస్తున్నది, వ్యవసాయం గాలికి ఎగిరిపోతుంది, రైతన్న పూర్తిగా చతికిలబడిపోతాడు, అక్కచెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నం అవుతాయి. పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్ మాత్రమే. అందుకనే ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. మోసాలు నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు, మోసాలు చెబుతారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తామంటారు. మీ ఇంట్లో ఎవరు మంచి చేశారు, ఎవరి హయాంలో మంచి జరిగిందని ఆలోచన చేయాలి. మీ ఇంట్లో మీ జగన్ వల్ల మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతిఒక్కరూ అడుగులు ముందుకు వేయండి, సైనికులుగా నిలబడండి. ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి, జరగాలిని కోరుకుంటున్నా 10:49AM, Mar 1st, 2024 ► పామర్రు చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ► సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు, కృష్ణాజిల్లా నేతలు, జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ అద్మాన్ నయీం అస్మి ►హెలీప్యాడ్ నుంచి సభా స్థలి వరకూ రోడ్‌షో ►సీఎంకు గ్రాండ్ వెల్కమ్ పలికిన పామర్రు ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ►సీఎం జగన్మోహన్రెడ్డిపై పూలవర్షం కురిపించిన పామర్రు ప్రజలు 10:29AM, Mar 1st, 2024 ►పామర్రు బయల్దేరిన సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు(శుక్రవారం) కృష్ణాజిల్లా పామర్రులో పర్యటించనున్నారు. ►రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను విడుదల చేయనున్న సీఎం జగన్ ప్రభుత్వం ►సీఎం జగన్ పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జమచేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది. ►పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది. ►ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది. -
జగనన్న విద్యా దీవెన సభకు భారీ ఏర్పాట్లు
-
నేడు విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
-
నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ
సాక్షి, అమరావతి/పామర్రు : రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణాజిల్లా పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జమచేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది. పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది. నేడు పామర్రుకు సీఎం వైఎస్ జగన్ రాక.. జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కృష్ణాజిల్లా పామర్రు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనే ఉన్న సభాస్థలిని గురువారం మంత్రి జోగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. శుక్రవారం ఉ.10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు పామర్రుకు చేరుకుంటారు. 10.50 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సభానంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మ.1.55కు తాడేపల్లి చేరుకుంటారు. -
విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక ముందడుగు
సాక్షి, అమరావతి: పేద, మధ్య తరగతి విద్యార్థులు సైతం అంతర్జాతీయ వర్సిటీలు అందించే కోర్సులను ఉచితంగా చదివేందుకు వీలు కల్పిస్తూ, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ 'ఎడెక్స్'తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం చేసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో.. రేపు(శుక్రవారం) సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ "ఎడెక్స్"ల మధ్య ఒప్పందం జరగనుంది. టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా రూపొందించిన ఎడెక్స్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ. "ఎడెక్స్ ఒప్పందం" ముఖ్యాంశాలు హార్వర్డ్, ఎంఐటీ, ఎల్ఎస్ఈ, కొలంబియా సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ.. తద్వారా మన విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన జాతీయ మరియు అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. "ఎడెక్స్ ఒప్పందం"తో ప్రయోజనాలు విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులు హార్వర్డ్, ఎంఐటీ, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులుబాటు.. ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ క్రెడిట్స్ మన కరిక్యులమ్‌లో భాగమవుతాయి. తద్వారా మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్ గా ఎదుగుతారు. ఉన్నత విద్యలో జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు.. పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలు కల్పిస్తూ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.. జగనన్న వసతి దీవెన ద్వారా భోజన, వసతి సౌకర్యాలు, ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనే (జూన్ / జులై), చివరిలో ప్రతి ఏప్రిల్‌లోనూ ఇస్తూ. జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా క్యూఎస్/టైమ్స్ ర్యాంకింగ్స్ 21 ఫ్యాకల్టీలలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 320 కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక సాయం. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్‌తో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు. కరిక్యులమ్ లో భాగంగా సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్. తద్వారా విద్యార్థులు తాము చదువుతున్నకోర్సులతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఆన్లైన్లో నేర్చుకునే వెసులుబాటు. కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్దిదిద్దడం. ఇప్పటికే 7 లక్షల మంది విద్యార్థులు 2 నెలల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్, 5.2 లక్షల మంది 2 నెలల షార్ట్ టర్మ్ ఇంటర్న్ షిప్ మరియు 2 లక్షల మంది 6 నెలల లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్స్ పూర్తి చేయగా మరో 3 లక్షల మంది విద్యార్థులు లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్స్ పూర్తి చేయనున్నారు. థియరీతో పాటు Industry oriented Courses చేయడం వల్ల 2018-19 విద్యా సంవత్సరంలో 37,000 ఉన్నప్లేస్ మెంట్స్ ఇప్పుడు (2022-23లో) 1 లక్షకు పెరిగింది. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సెక్టార్ స్కిల్ కౌన్సిల్ లతో ఒప్పందం. 50 బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ప్రోగ్రామ్ లతోపాటు 159 సింగిల్ మేజర్ కోర్సులు. డిగ్రీ కోర్సులో 2వ సెమిస్టర్ నుంచి Al, IoT. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనాలసిస్ & ఇన్వెస్ట్ మెంట్స్, లాజిస్టిక్స్, రిస్క్ మేనేజ్ మెంట్, స్టాక్ ఎక్చేంజ్, సైబర్ ఫోరెన్సిక్స్ ఫైనాన్షియల్ మార్కెట్ అనాలసిస్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి మైనర్ కోర్సులు ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా అందుబాటులోకి. డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు.. 400కు పైగా ద్విభాషా పాడ్ క్యాస్టులు. రాష్ట్రంలోని 18 యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీకి మన జగనన్న ప్రభుత్వం సన్నాహాలు. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ ప్రారంభం. మన విద్యార్థులను గ్లోబల్ విద్యార్థులుగా తయారు చేసే క్రమంలో ప్రపంచ ప్రముఖ యూనివర్సిటీలైన స్టెయిన్ బీస్- జర్మనీ, మెల్బోర్న్ ఆస్ట్రేలియా, కెంపెన్- జర్మనీ, బ్లెకింగ్-స్వీడన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బ్యాంకాక్ లతో అవగాహన ఒప్పందాలు. ఉన్నత విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయి వినియోగానికి చర్యలు. యూనివర్సిటీల్లో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెటావర్స్ లెర్నింగ్ జోన్ల ఏర్పాటు. ఒక్కో జోన్ కు రూ.10 కోట్ల పెట్టుబడి.. ఇప్పటికే పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభం. యువతలో సామాజిక సృహ, సమాజం పట్ల బాధ్యత పెంపొందించటానికి Board for Community Development through Education (BCDE)ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా 553 ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు.. ఇప్పటి వరకు 10వేల మందికి పైగా నమోదు. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే NAAC గుర్తింపు పొందగా, ఈరోజు రాష్ట్రంలో NAAC గుర్తింపు పొందిన విద్యా సంస్థలు 437. -
Fact check: అసత్య రాతలు.. తప్పుడు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన’ పథకాలు చింతలేని ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎందరో పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివే అవకాశం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇది ఎల్లో మీడియాకు ఏమాత్రం రుచించట్లేదు. పేదింటి బిడ్డను ప్రభుత్వం ఉన్నత చదువులకు తీసుకెళ్తుంటే ఓర్వలేక దుష్ప్రచారానికి పాల్పుడుతోంది. దీనికి తోడు అసలు ప్రభుత్వ పథకం లక్ష్యం, అది ఎలా అమలవుతోంది కనీస పరిజ్ఞానం లేని కొన్ని ప్రతిపక్షాలు ఈ తప్పుడు వార్తల ఆధారంగా అర్థరహిత విమర్శలు చేస్తున్నాయి. తిరిగి వాటినే మళ్లీ ఎల్లో మీడియా పెద్దపెద్ద హెడ్డింగ్లతో ముద్రిస్తూ పైశాచిక ఆనందం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి సగటున రూ.2,428 కోట్లుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044కోట్లుగా ఉంది. అప్పట్లో అప్పులు చేసి ఫీజులు కట్టే దుస్థితి గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక అవస్థలు పడేవారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్‌టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులుచేసి మరీ తమ పిల్లలను చదివించాల్సిన దుస్థితి ఉండేది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి రూ.35 వేలలోపు ఇస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.3లక్షలకు వరకు చెల్లిస్తూ పేదల విద్యను పట్టం కడుతోంది. జవాబుదారీ తనం పెంచేలా, పారదర్శకంగా తల్లి, విద్యార్థి జాయింట్ బ్యాంకు ఖాతాల్లో ప్రతి త్రైమాసికానికి విద్యాదీవెనను జమ చేస్తోంది. టీడీపీ హయాంలో సగటు చెల్లింపు స్వల్పం.. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజురీయింబర్స్‌మెంట్ కింద సగటున ఏడాదికి రూ.2066 కోట్లు, హాస్టల్ ఖర్చుల కింద రూ.362 కోట్లు మాత్రమే చెల్లించేది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.12,141 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వం 2017 నుంచి 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1778 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెడితే.. సీఎం జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా తీర్చింది. ఈ ప్రభుత్వంలో పెరిగిన ఖర్చు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 27లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఏకంగా రూ.18,576 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలతో కలిపి) చెల్లించింది. ఏడాదికి సగటున విద్యాదీవెన కింద రూ.2835 కోట్లు, వసతి దీవెన కింది అత్యధికంగా రూ.1068.94 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధి గతంలో వసతి దీవెనలో రూ.4వేల నుంచి రూ.10వేల మధ్య స్లాబ్ పెట్టిమరీ ఇచ్చేవారు. కానీ సీఎం జగన్ స్లాబ్ విధానాన్ని తొలగించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సమానంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చు కోసం ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ వీలైనంత మందిని అర్హులుగా చేర్పించేందుకు కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2లక్షలకు ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని వర్గాలు వారికీ కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. పీజీ విద్యలో ప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ వర్సిటీ విద్యను ప్రోత్సహించేలా అక్కడే పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తోంది. -
విదేశీ విద్యా దీవెన సమాచార బుక్లెట్ ఆవిష్కరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు యునైటెడ్ నేషన్స్ లక్ష్యాలకు చేరువలో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంపై షకిన్ కూమార్ రూపాందించిన సమగ్ర సమాచార బుక్‌లెట్‌ను బుధవారం తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సదస్సులో సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. గత సెప్టెంబర్‌లో పది మంది పేద విద్యార్థులను ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్లడంపై షకిన్ కుమార్‌ను సీఎం జగన్ అభినందించారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని షకిన్ పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం, అర్హతలు, దరఖాస్తు విధానం, అందించే కోర్సులు, డాక్యుమెంట్స్ చెక్‌లిస్ట్, అప్లికేషన్ స్టేటస్ చెకింగ్, అక్రిడేషన్, యూనివర్సిటీల జాబితా వంటి సమస్త సమాచారం ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు వివరించారు. ఈ పథకం పేద, ప్రతిభావంతమైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు రూ.కోటిన్నరకు పైగా స్కాలర్షిప్ రూపంలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. -
మామయ్యే చదివిస్తున్నాడు
-
సరికొత్త దారిలో సర్కారీ చదువులు
ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లోని 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. అయితే ఈ వర్సిటీల్లో చదివించేందుకు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే జగనన్న విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చాం. సీటు తెచ్చుకోండి.. రూ.1.25 కోట్లు మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం. జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదువుతున్నారు. బెస్ట్ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగితే వారి బతుకులతో పాటు రాష్ట్ర రూపురేఖలు మార్చే లీడర్ షిప్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. పెద్ద పెద్ద సంస్థలు మన పిల్లల్ని చేయిపట్టుకుని మరీ పైకి తీసుకుని పోయే అవకాశాలు ఇస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. దేశ భవిష్యత్‌ను, తల రాతను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. దీనిని నేను గట్టిగా నమ్మాను. విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్య దాకా 55 నెలల పరిపాలనలో విప్లవాత్మక అడుగులు వేశాం. ఏకంగా రూ.73 వేల కోట్లు విద్యా రంగానికే ఖర్చు చేశానని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యా రంగంలోనే కాకుండా వైద్య, వ్యవసాయ రంగాల్లో, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలోనూ తీసుకొచ్చామని చెప్పారు. ఇలా ప్రతి రంగంలో మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జూలై – సెప్టెంబర్ త్రైమాసికం నిధులను కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారు. 8,09,039 మంది పిల్లలకు మంచి చేసేలా రూ.7,47,920 మంది తల్లుల ఖాతాల్లో రూ.583 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా 27.61 లక్షల మంది పిల్లల పూర్తి ఫీజులు రూ.11,900 కోట్లు చెల్లిస్తూ తల్లిదండ్రులపై భారం పడకుండా ఒక మేనమామలా ఆదుకున్నానని చెప్పారు. పిల్లలపై బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల భారం పడకూడదని వసతి దీవెన ద్వారా అండగా ఉంటూ రూ.4,275 కోట్లు ఇచ్చామన్నారు. పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలు మరింత ఉన్నత చదువులు చదవాలనే తాపత్రయంతో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మొత్తంగా రూ.16,175 కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ‘ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ గొప్ప చదువులు, డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు కావాలి. అలా ఆ కుటుంబాల తలరాతలు మారాలనే తపనతో అడుగులు వేస్తున్నాం. 2017–18కి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజులు రూ.1,777 కోట్లను మనందరి ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత విద్యలో సంస్కరణలు ♦ నాడు–నేడుతో బడుల రూపురేఖలను మార్చుతూ ఉన్నత విద్యపై ధ్యాస పెట్టి సంస్కరణలు తీసుకువచ్చి కరిక్యులంలో మార్పులు చేశాం. పిల్లలు ఏం చదువుతున్నారు.. అని ఒక ముఖ్యమంత్రి ధ్యాస పెట్టిన పరిస్థితి మీ జగన్ మామ పాలనలోనే జరిగింది. తొలిసారి డిగ్రీలో కూడా ఆన్లైన్ వర్టికల్స్‌ను తీసుకొచ్చాం. ఏకంగా 10 నెలల ఇంటర్న్‌షిప్‌తో జాబ్ ఓరియంటెడ్ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేశాం. ♦ మన పిల్లలు ప్రపంచంలోని మేటి యూనివర్సిటీలతో పోటీ పడేలా మన రాష్ట్రంలో చదువులుండాలనే తపనతో అంతర్జాతీయంగా ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు, ఎంఐటీ, హార్వర్డ్, ఎల్బీఎస్, ఎల్ఎస్సీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు వచ్చేందుకు హైడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యాం. తద్వారా ఆన్లైన్లో ఆ కోర్సులు తీసుకొస్తూ ఏఐని అనుసంధానం చేస్తూ డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఈ దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ పేద విద్యార్థులు మన పిల్లలు.. ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితేనే వేగంగా ఎదగగలుగుతారు. ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలో భాగమైనప్పుడు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ముందు వరుసలో ఉంటాం. పిలిచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఒక పేజీ ఇంగ్లిష్, ఒక పేజీ తెలుగుతో బై లింగ్వల్ టెక్ట్స్ బుక్స్ ద్వారా మెరుగైన చదువు చెప్పిస్తున్నాం. శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉండే.. రూ.15 వేలు ఆన్లైన్లో చెల్లిస్తే తప్ప రాని బైజూస్ కంటెంట్‌ను మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాం. 6వ తరగతి.. ఆపై తరగతి గదుల్లో ప్రతి క్లాస్ రూంలో ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూంలుగా మార్చి డిజిటల్ బోధనను తీసుకువచ్చాం. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు సీబీఎస్ఈతో మొదలై ఐబీ వరకు వెళుతున్న ఈ ప్రయాణం పిల్లలందరినీ గొప్ప వారిగా తీర్చిదిద్దే వరకు సాగుతుంది. 3వ తరగతి నుంచి టోఫెల్ సబ్జెక్ట్‌ను తీసుకువచ్చి క్లాస్ టీచర్ లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేయడం వరకు.. పిల్లల బంగారు భవిష్యత్ కోసం వాళ్ల జగన్ మామ ఎంతో తాపత్రయపడుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నా.. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్టయ్యా నేను పేద కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాను. నేను ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో చిన్నప్పటి నుంచి కలగనేదాన్ని. జగనన్న విద్యా దీవెన ద్వారా ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టకుండా చదువుకుంటున్నాను. మొత్తం ఫీజు మీరే (సీఎం) కట్టారు. వసతి దీవెన ఎంతో ఉపయోగపడింది. మీ వల్ల అందరం బాగా చదువుకోగలుగుతున్నాం. మీ వల్ల నేను మంచి ప్యాకేజీతో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఆ క్రెడిట్ అంతా మీదే సార్. – ప్రిన్స్ ఏంజిల్, బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని, నరసాపురం మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారన్నా నేను జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బీటెక్ చదువుతున్నా. నెల్సన్ మండేలా చెప్పినట్టు విద్య అనే ఒక ఆయుధం మాత్రమే మన భవిష్యత్‌ను మారుస్తుంది అన్న మాటను మీరు నిజం చేశారు. మీరు విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వరల్డ్ క్లాస్ వర్సిటీల్లో మాదిరి సిలబస్ తీసుకొచ్చారు. మహిళా సాధికారత, విద్య.. ఈ రెండు జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయి. మీరు ఈ రెండింటినీ సాధించారు. మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్యూ సార్. – నవ్యశ్రీ, బీటెక్ విద్యార్థిని, భీమవరం మార్పును గమనించండి ♦ దేశ భవిష్యత్‌ను మార్చగలిగేది చదువు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో రూ.12 వేల కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేని పరిస్థితి. ఈ రోజు మనందరి ప్రభుత్వం రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి. తేడాను మీరే గమనించాలి. చదువు అనేది తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను మార్చాలన్నా, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలన్నా, వెనుకబడిన కులాల తలరాతను మార్చాలన్నా, దేశ భవిష్యత్‌ను మార్చాలన్నా.. ఆ శక్తి కేవలం చదువుకే ఉంది. అందుకే 55 నెలల ప్రయాణంలో విద్యా రంగంలో విప్లవాత్మక అడుగులు వేశాం. ♦ నాడు–నేడుతో బడులు బాగుపడిన తీరుతెన్నులు గమనించాలి. ప్రభుత్వ స్కూళ్లల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరుముద్ద మీద ఫోకస్ పెట్టాం. పిల్లలు బాగా చదవాలని, వారిని బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ప్రభుత్వ బడులను తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు తీసుకువచ్చి రూపురేఖలు మార్చుతున్నాం. ♦ ఒక్క విద్యా రంగంలోనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం. కేవలం 55 నెలల కాలంలోనే ఇన్ని మార్పులు జగన్ చేయగలిగినపుడు గత పాలకులు 14 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయారో మీరే ఆలోచన చేయాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు పరిపాలన గుర్తు తెచ్చుకోండి. -
జగనన్న విద్యా దీవెన : ఉన్నత చదువులకు చేయూత.. (ఫొటోలు)
-
ఏపీలో పేద పిల్లలకూ నాణ్యమైన విద్య: సీఎం జగన్
Updates: పేదల తలరాతలు మార్చే ఆస్తి చదువు: సీఎం జగన్ ►మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం భీమవరం నుంచి చేస్తున్నాం ►ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును మనందరి ప్రభుత్వం పిల్లల తల్లుల ఖాతాల్లోకి, పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయబోతున్నాం. ►ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా మూడు నెలలకోసారి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన డబ్బును తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం ►8 లక్షల 9 వేల 39 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి 7,47,920 మంది తల్లుల ఖాతాల్లోకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన 583 కోట్లను నేరుగా జమ చేయనున్నాం ►ఫైనలియర్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగడకూడదనే ఉద్దేశంతో 2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్ స్టాల్ మెంట్‌గా చెల్లించాల్సిన ఫీజు కూడా వారి తల్లుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం. ►ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రయాణం గమనించినట్టయితే ఈ ఒక్క జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారా 27,61,000 మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు ఒక మంచి మేనమామగా ఇచ్చింది రూ.11,900 కోట్లు ►ఇదొక్కటే కాదు జగనన్న వసతి దీవెన.. నాలుగున్నర సంవత్సరాల్లో పిల్లలు చదువులే కాదు, వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ విషయంలో కూడా పిల్లలకు అండగా, తోడుగా ఉంటూ దీని కోసం ఇచ్చింది మరో రూ.4,275 కోట్లు ►పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివేందుకు అప్పులపాలు కాకూడదనే తపన తాపత్రయంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలతో ఖర్చు చేసింది రూ.16,176 కోట్లు ►ఈరోజు వీళ్ల బతుకులు మారాలి. కుటుంబాల్లోంచి ప్రతి ఒక్కరూ గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీరింగ్, కలెక్టర్లు, డాక్టర్లు కావాలని, ఆ కుటుంబాల తలరాతలు మారాలని తపనతో అడుగులు పడ్డాయి ►2017-18కి సంబంధించిన ఫీజుల సైతం పెండింగ్‌లో ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు. రూ.1,777 కోట్లు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతో మనమే చెల్లించాం ►గత ప్రభుత్వ హయాంలో 12 వేల కోట్లు కూడా సరిగా ఖర్చు చేయని పరిస్థితులు.. ఈరోజు రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితులు. తేడా గమనించాలని కోరుతున్నా ►చదువు అన్నది ఒక తలరాతలు మార్చే ఒక ఆస్తి ►మనిషి తలరాతనుగానీ, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలని అనుకున్నా, వెనకబడిన కులాల తలరాతలుగానీ, ఒక దేశం భవిష్యత్ గానీ ఇవన్నీ మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది ►దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టే ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య దాకా 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాం. వేయగలిగాం ►గతానికి, ఇప్పటికీ తేడా చూడమని అడుగుతున్నా ►నాడు-నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించాలి ►తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంకు, సీబీఎస్ ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతున్న ప్రయాణం ►పిల్లలందరినీ గొప్పగా చదివించాలనే తపన, తాపత్రయంతో 3వ తరగతి నుంచే టోఫెల్ ను సబ్జెక్ట్ గా తీసుకొచ్చిన పరిస్థితులు, సబ్జెక్ట్ టీచర్ ను తీసుకొచ్చిన పరిస్థితి. ►పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ల జగన్ మామ అడుగులు వేశాడన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది ►బడులను ఒకవైపు రూపురేఖలు మారుస్తూ, మరోవైపున ఉన్నత విద్యపై ధ్యాస పెట్టాం ►ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చాం. కరిక్యులమ్‌లో మార్పులు చేశాం ►పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉందని ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతోంది ►ఆన్ లైన్ వర్టికల్స్ ను కూడా డిగ్రీలో తీసుకురావడం జరిగింది ►10 నెలలపాటు ఇంటర్న్ షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలోనే పడ్డాయి ►జాబ్ ఓరియెంటెడ్‌గా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి ►మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సీటీలతో పోటీ పడి చదవాలనే తపనతో, అంతర్జాతీయంగా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలో ఎంఐటీ, హార్వర్డ్, ఎల్ బీఎస్, లాంటి సర్టిఫికెట్లు ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి వచ్చేట్టుగా హెడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యి, ఆన్ లైన్ లో కోర్సులు తీసుకొస్తూ, ఏఐని అనుసంధానం చేస్తూ, డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ►మన పేద విద్యార్థి, మన పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితే వేగంగా ఎదగగలుగుతారు. ►ప్రపంచంలో ఎక్కడైనా పిలిచి ఆ పర్టిక్యులర్ సబ్జెక్టులో ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలకు సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలతో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రపంచంలో ముందు వరుసలో మనం ఉంటాం. ►ఇదొక్కటే కాదు, ప్రపంచంలో ఎక్కడైనామన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే, బెస్ట్ యూనివర్సిటీ నుంచి రాగలిగతితే, మన రాష్ట్ర తలరాతలు కూడా మార్చగలుగుతారు. ►జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చాం. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీల్లో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షల నుంచి కోటి దాకా ఉన్నాయి. ►అయినా ఏ ఒక్కరూ అప్పులపాలు కావాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు ►ఈ పథకం ద్వారా సీటు తెచ్చుకోండి, కోటీ 25 లక్షల దాకా మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం ►జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో చదువుతున్నారు ►వాళ్ల బతుకులతో పాటు రాష్ట్రం రూపురేఖలు మార్చే లీడర్షిప్ స్థాయికి రాబోయే రోజుల్లో వస్తారు ►ఒక్క విద్యా రంగంలోనే ఉన్నత విద్యగానీ, స్కూళ్లు గానీ సంస్కరణ మీదే 55 నెలల కాలంలో అక్షరాలా ఖర్చు చేసింది 73 వేల కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా ►ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యారంగంలోనే కాదు, వైద్య రంగం, వ్యవసాయ రంగం, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ, ప్రతి అడుగు వేస్తూ, మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతోందని చెప్పడానికి గర్వపడుతున్నా జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల ►జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ►ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. ►పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ►గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ►కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ►అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
విద్యార్థులకు ఆర్థిక సాయం
-
నేడు జగనన్న విద్యా దీవెన
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ముందెన్నడూ లేనివిధంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
రేపు భీమవరంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భీమవరంలో పర్యటిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
దీవెనపై కుళ్లు రాతలు
-
మేము వేసే ప్రతి అడుగులో జగనన్న అండగా ఉన్నారు
-
మా అమ్మగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. జగనన్న విద్యాదీవెన,వసతి దీవెన పథకాలతో చదువుకోగలుగుతున్నాను.
-
ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివేందుకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు వరం..!
-
దమ్ము లేకనే.. దత్తపుత్రుడు
సాక్షి, తిరుపతి: సొంత బలంపై, సొంత కుమారుడిపై నమ్మకం లేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్యాకేజీ చెల్లించి దత్త పుత్రుడిని అద్దెకు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలేనని ధ్వజమెత్తారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న విద్యాదీవెన నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ‘ఏ ఇంటికీ, ఏ సామాజిక వర్గానికీ, ఏ ప్రాంతానికీ ఎలాంటి మంచి చేయని గత పాలకులు ఎన్ని దుర్మార్గాలకు దిగుతున్నారో నాలుగు మాటలు మీ ముందుంచుతా. దుర్మార్గమైన ఆలోచనలు చేసే ఆ పెద్ద మనిషి మూడుసార్లు సీఎంగా ఉన్నాడు. 28 ఏళ్ల క్రితమే ఆయన సీఎం అయ్యాడు. మూడుసార్లు సీఎం అయిన ఆ వ్యక్తి పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమైనా మీ మెదడులో తడుతుందా? గత పాలనకు, ఈ నాలుగేళ్ల పాలనకు తేడా ఉందా? లేదా? అనేది ఆలోచన చేయండి’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సభలో సీఎం ఏమన్నారంటే.. దత్తపుత్రుడిని అద్దెకు తెచ్చుకున్నాడు ఆ మనిషి ఎలాంటివాడో అందరికంటే మీకే బాగా తెలుసు. ఆ మనిషి ఏదైనా మాట ఇస్తే నిలబెట్టుకున్నాడా? అనేది ఆలోచన చేయండి. అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనుకాడడు. చివరికి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవడానికి కూడా ఏ మాత్రం వెనుకాడని మనిషి.. ఆ పెద్ద మనిషి!! ఆ పెద్ద మనిషికి సొంత బలం మీద గానీ, సొంత కుమారుడి మీద గానీ నమ్మకం లేదు. కాబట్టే దత్త పుత్రుడిని ప్యాకేజీ ఇచ్చి అద్దెకు తెచ్చుకున్నాడు. ప్రతి అడుగులో కుళ్లు, కుతంత్రాలే! ఈమధ్య కాలంలో ఆయన గానీ, ఆయన కుమారుడు గానీ, దత్తపుత్రుడు గానీ మీటింగుల్లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు, వారి భాషను చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి మాటలోనూ రెచ్చగొట్టాలి, కుతంత్రాలు చేయాలి, గొడవలు సృష్టించి శవ రాజకీయాలు చేయాలనే కుతంత్రాలు ప్రతి అడుగులోనూ కనిపిస్తాయి. వీళ్లతో ఎల్లో మీడియా ప్రయాణం.. టీవీలో ఏదైనా వార్త వస్తే నిజమేనేమో అనుకునే పరిస్థితులు ఇవాళ లేవు. ఆ పాత రోజులు పోయాయి. ఈరోజు ఎల్లో మీడియా చంద్రబాబునాయుడును ఏ రకంగా మోస్తోందో మీ అందరికీ తెలుసు. ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పుకునేందుకు గత చరిత్ర ఏదీ లేదు కాబట్టే వీళ్లంతా అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్ల మీద ఆధారపడి వాటినే జీవితంగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారు. దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అనేదే వారి లక్ష్యం. కుర్చీ లాక్కుని ఫోటోలకు దండేస్తారు ఇదే వ్యక్తి.. ఎన్టీఆర్ నుంచి సీఎం కుర్చీని లాగేసుకున్నారు. ఆయనకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ పార్టీని కూడా లాగేసుకున్నారు. ఎన్టీఆర్ చావుకు కూడా చివరకు వీళ్లే కారణం అయ్యారు. ఇదే దుర్మార్గులు మళ్లీ ఎన్టీఆర్ చనిపోగానే ఆయన శవాన్ని లాక్కుకుంటారు. ఫొటోలకు దండలేస్తారు. ఫొటో ముందు ప్రతి రోజూ దండం పెడుతూ తిరుగుతారు. ఆయన పేరుతో ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు. ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే... ఒకసారి ఆ మనిషి మనస్తత్వం ఏమిటో తెలుసుకోవాలని అడుగుతున్నా. రైతులు, అక్కచెల్లెమ్మలకు దగా ఆ పెద్దమనిషి (చంద్రబాబు) రైతులను మాయ మాటలతో మోసం చేశాడు. ఎన్నికల వేళ రూ.87,612 కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తానన్నాడు. రుణాలు కట్టకండి.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబుకు ఓటే యాలని చెప్పి రైతులను నిట్ట నిలువునా మోసం చేశాడు. డ్వాక్రా మహిళలు రుణాలు కట్టొద్దు.. బాబు సీఎం అవుతాడు.. వెంటనే తీరుస్తాడని చెప్పి ఆ అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు. వాళ్లను వంచించడమే కాకుండా వారి తరపున కడుతున్న సున్నా వడ్డీని సైతం ఎగ్గొట్టాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వాగ్దానాలు చేసి నిలువుగా దగా చేశాడు. ఆ పెద్ద మనిషి చివరకు పిల్లలను కూడా వదల్లేదు, నిరుద్యోగులనూ వదల్లేదు. 2014 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ రూ.రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చాడని అడుగుతున్నా. ఆ పెద్ద మనిషి మనస్తత్వం చూస్తే... ఎన్నికలకు ముందు అందంగా ఉండే మేనిఫెస్టో తెస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేస్తాడు. వెబ్ సైట్లలో కూడా మేనిఫెస్టో కనపడకుండా మాయం చేస్తాడు. ఎన్నికల ముందు స్వర్గాన్ని చూపిస్తానంటాడు. ఎన్నికలు అయిపోయాక ప్రజలకు నరకాన్ని చూపిస్తాడు. ఇలాంటి వ్యక్తికి.. చెప్పిన ప్రతి మాటనూ అమలు చేస్తున్న మనందరి ప్రభుత్వం మధ్య తేడా ఎంత ఉందో? ఆలోచన చేయాలని అడుగుతున్నా. బాబు చేసిన అప్పులున్నా .. మన పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలున్నాయి. చంద్రబాబు చేసిన అప్పులు విపరీతంగా ఉన్నాయి. అయినా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్ సమస్యలు వచ్చాయి. ఖర్చులు పెరిగాయి, రాబడులు తగ్గాయి. అయినా మీ బిడ్డ కారణాలు, సాకులు చెప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో దాన్ని ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించాం. వెనకడుగు వేయలేదు. సాకులు వెతకలేదు. కారణాలు చెప్పి తప్పించుకోవాలని ఆలోచన చేయలేదు. నా అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలు బాగుండాలనే తపన, తాపత్రయంతో మీ బిడ్డ బటన్¯ నొక్కుతున్నాడు. నాలుగేళ్లలో రూ.2.33 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లాయి. ఇవాళ ఎక్కడా లంచాలు, వివక్ష చూపించే వ్యవస్థ లేదు. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుడు చేసిన అప్పుల గ్రోత్ రేటు కన్నా ఇప్పటి అప్పుల గ్రోత్ రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటంటే.. అప్పట్లో దోచుకో, పంచుకో, తినుకో అనే పాలన సాగింది. ఈనాడుకి ఇంత, ఆంధ్రజ్యోతికి ఇంత, దత్తపుత్రుడికి కాస్తంత, మిగిలింది చంద్రబాబునాయుడికి అని డీపీటీ సాగింది. జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి అడుగులోనూ దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే! మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే వ్యవస్థలు వాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి అండ లేదు. వీళ్లను మీ బిడ్డ నమ్ముకోలేదు. మీ బిడ్డలో కల్మషం లేదు. మీ బిడ్డ నమ్ముకున్నది చేసిన మంచినే. మీకు ఒక్కటే చెబుతున్నా. వీళ్లు చెబుతున్న అబద్ధాలు, మోసాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకుమంచి జరిగిందా? లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడండి. బాబువి శవ రాజకీయాలు.. పుంగనూరు, అంగళ్లులో జరిగిన ఘటన మీ అందరికీ తెలిసిందే. అప్పడు పోలీసులు చేసిన తప్పల్లా.. ‘‘బాబు గారూ మీకు పర్మిషన్ ఉన్న రూ ట్లోనే ప్రయాణం చేయండి. మీకు అనుమతున్న రూట్లో కాకుండా వేరే రూట్లో ఎందుకు ప్రయా ణం చేస్తారు? వేరే పార్టీ వాళ్లు అక్కడ ధర్నా చే స్తుంటే అక్కడికి వెళ్తామని ఎందుకు అంటున్నా రు? మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు వస్తాయి. ఆ రూట్ వద్దు’’ అని చెప్పటమే!! అలా చెప్పినందుకు పోలీసులపై కర్రలు, బాటిళ్లతో దాడి చేశారు. చివరకి ఓ పోలీసు సోద రుడి కన్ను కూడా పోగొట్టారు. 47 మంది పోలీసులపై దాడి చేశారు. దాడి చేసి రెచ్చగొట్టి పోలీసులు కాల్పులు జరిపితే శవ రాజకీయాలు చే యాలనే దిక్కుమాలిన ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే. ఈ పెద్ద మనిషి ఢిల్లీ వెళ్లా డు. ఎన్నికల కమిషన్‌ను కలిసి రాష్ట్రంలో పోలీ సులు తనమీద హత్యాయత్నం చేశారని ఫిర్యా దు చేయడానికి వెళ్లాడు. దొంగ ఓట్లను వారే చేర్చి మనపై ఫిర్యాదు చేయటానికి బయల్దేరాడు. ఇలా అబద్ధాలు ఆడి, మోసం చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఆలోచన చేయండి. ఇది అభివృద్ధి కాదా..? అభివృద్ధి జరగడం లేదని విమర్శిస్తున్న వారందరికీ గట్టిగా సమాధానం చెప్పండి. మన పాలనలో ఎప్పుడూ చూడని అభివృద్ధి ఇవాళ జరుగుతుంది. స్కూళ్ల పరిస్థితిని చూపించండి. నా డు–నేడుతో రూపురేఖలు మారిపోయి ఇంగ్లీష్ మీడియం, ఐఎఫ్‌పీ ప్యానెళ్లు వచ్చాయి. పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. కరిక్యులమ్‌లో మార్పులతోపాటు విద్యా దీవెన, వసతి దీవెన వస్తోంది. మన పిల్లలు చదువుల్లో వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇది కాదా అభివృద్ధి? అని ప్రశ్నించండి. నాడు – నేడుతో ఆసుపత్రుల రూపు రేఖలు మారుతున్నాయి. విలేజ్ క్లినిక్స్, ఫ్యామి లీ డాక్టర్ విధానం మన కళ్లెదుటే కనిపిస్తోంది. 53 వేల మంది వైద్య సిబ్బందిని నియమించాం. కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకా రం చుట్టాం. ఎవరైనా అభివృద్ధి గురించి మా ట్లాడితే ఇది అభివృద్ధి కాదా? అని అడగండి. రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 6 పోర్టులు మాత్రమే ఉంటే ఈ నాలుగేళ్లలో మరో 4 సీ పోర్టులను కడుతున్నాం. మన రాష్ట్రం వరుసగా మూడేళ్ల పాటు ఈవోడీబీలో దేశంలోనే నంబర్ వన్‌గా కొనసాగుతోందని చెప్పండి. -
విద్యాదీవెన పిల్లల భవిష్యత్తు మారుస్తుంది: సీఎం జగన్
సాక్షి, నగరి, చిత్తూరు: విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలవకూడదని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ, 15,600 కోట్లు అందించామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాదీవెన కింద 26,98,728 మంది పిల్లలకు మంచి చేస్తూ రూ. 11, 317 కోట్లు అందించామని పేర్కొన్నారు. నేడు 8, 44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేశామని సీఎం పేర్కొన్నారు. అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి రూ, 15 వేల అందించామని తెలిపారు. స్కూళ్లు ప్రారంభించే నాటికే విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని. బైజూస్ కంటెంట్‌తో విద్యార్థులకు బోధన అందిస్తున్నామన్నారు. పేదరికం విద్యార్థుల చదవులకు అడ్డు రాకూడదన్నారు. విద్యాసంస్థల్లో అక్రమాలుంటే 1902కు కాల్ చేయాలని తెలిపారు. సీఎం జగన్ ప్రసంగం.. ఆయన మాటల్లోనే! ►ప్రతి పేద కుటుంబం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్‌లో ఇంకా బాగుండాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ►ప్రతి అడుగూ కూడా ప్రతి పిల్లాడినీ చేయి పట్టుకొని పెద్ద చదువులు చదివించి తద్వారా పిల్లలు పేదరికం నుంచి బయటకు రావాలని అడుగులు వేస్తున్నాం. ► 17-20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు నేటి తరం మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో బతకాలంటే వాళ్ల ప్రయాణాన్ని జీవిత ప్రమాణాన్ని ఈ రెంటింటినీ మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని నమ్మాం. ►పిల్లల చదువుల కోసం వేగంగా అడుగులు వేస్తున్నాం. ►ప్రతి పేద కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఫీజులు పూర్తిగా తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం జగనన్న విద్యా దీవెన. ► భోజనం, వసతి ఖర్చులకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం. 3 నెలలకొసారి తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాలి. ►ఐటీఐ విద్యార్థులకు 10 వేలు, పాలిటెక్నిక్ పిల్లాడికి 15 వేలు, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్ పిల్లలకు సంవత్సరానికి 20 వేల చొప్పున పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ►జగనన్న వసతి దీవెన అనే ఒక్క పథకం ద్వారా మాత్రమే రూ.4,275 కోట్లు పెద్ద చదువుల కోసం తల్లుల ఖాతాల్లోకి జమ చేశాం. ►కేవలం ఈ రెండు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 4 సంవత్సరాల కాలంలోనే రూ.15,600 కోట్లు ఇచ్చాం. ►ఫీజులు మొత్తం నేరుగా కాలేజీలకే ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోంది. ►ప్రతి 3 నెలలకు ఒకసారి తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాలి. పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలి. ► ఆ కాలేజీలో విద్యా బోధన బాగాలేకున్నా, వసతులు సరిగ్గా లేకున్నా వాటిపై ఆ కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇస్తున్నాం. ఫిర్యాదుల కోసం 1902కు కాల్ చేయండి ►ఏవైనా వసతులు బాగోలేకున్నా, బోధన బాగోలేకున్నా, పిల్లలకు ఇవాళ ఇస్తున్న డబ్బు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కాక కాలేజీ యాజమాన్యాలు వేరే రకంగా ఇంకో ఫీజు ఇంకొకటని ఫీజులు అడిగితే మాత్రం 1902కు ఫోన్ చేయండి. ► జగనన్నకు చెబుదాంకు ఫోన్ చేయండి. ► ముఖ్యమంత్రి కార్యాలయం, కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతుంది. ► ఇటువంటి తప్పిదాలు జరగకుండా కట్టడి చేస్తుంది. యాక్షన్ తీసుకుంటుంది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ►4 సంవత్సరాల కాలంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం. ►తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా పిల్లలను చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా 15 వేల చొప్పున అమ్మ ఒడి ఇస్తున్నాం. ►ప్రతి సంవత్సరం పిల్లలకు బ్యాగు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ అన్నీ కలిపి విద్యా కానుకగా స్కూల్ తెరిచే రోజు ఇస్తున్నాం. ► స్కూళ్లను సమూలంగా రూపు రేఖలు మారుస్తూ, శిథిలావస్థలో ఉన్న స్కూళ్లకు గొప్ప వైభవం తీసుకొచ్చేందుకు నాడు-నేడు తీసుకొచ్చాం. ► గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, బైలింగువల్ టెక్ట్స్ బుక్ లు తీసుకొచ్చాం. ►బైజూస్ కంటెంట్‌తో కూడా పిల్లల కరికులమ్‌ను అనుసంధానం చేశాం. ► 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ►మూడో తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్ బోధన వచ్చే ఏడాది నుంచి ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాం. ► సీబీఎస్ఈ సిలబస్‌తో ప్రారంభించి ఐబీ, ఐజీసీఎస్ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ దిశగా మన గవర్నమెంట్ బడులు వేగంగా అడుగులు వేస్తున్నాం. ► ఇంతకు ముందు రాష్ట్రంలో చూడని విధంగా, నాడు-నేడు కింద పూర్తి అయిన బడుల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములు డిజిటలైజ్ చేస్తున్నాం. ►ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ►63 వేల క్లాస్ రూములకు సంబంధించి 31 వేల క్లాస్ రూముల్లో ఏర్పాటయ్యాయి. ►డిసెంబర్ నాటికల్లా మిగిలిన క్లాస్ రూముల్లో ఏర్పాటవుతాయి. ► 8వ తరగతి పిల్లలకు చదువులను ప్రోత్సహిస్తూ, వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా అనే తాపత్రయపడుతూ ట్యాబ్స్ ఇచ్చేందుకు మొదలుపెట్టాం. స్కూళ్లలో రోజుకో మెనూతో గోరుముద్ద ►గవర్నమెంట్ స్కూళ్లలో రోజుకో మెనూతో గోరుముద్ద కింద విపరీతమైన మార్పులు తెచ్చాం. ►పిల్లలు తింటున్న తిండి గురించి ఆలోచించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందంటే అది మీ అన్న పరిపాలనలోనే. ► సంపూర్ణ పోషణ, స్కూళ్లలో ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ తీసుకొచ్చాం. ► చదువులను ప్రోత్సహిస్తూ వివాహానికి ముందే 10 పాసై ఉండాలనే నిబంధన తీసుకొస్తూ వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా అమలు చేస్తున్నాం. ►ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదవాలని పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో విద్యా దీవెన తీసుకొచ్చాం. ► వసతి దీవెన తీసుకొచ్చాం. ► ప్రపంచంతో పోటీ పడుతూ విదేశాల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే చాలు ఉన్నత విద్యకయ్యే ఖర్చు మొత్తం కోటీ 25 లక్షల దాకా ఫీజులను చెల్లిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదీ లేదు. మన రాష్ట్రంలో తప్ప. ►కరిక్యులమ్‌లో ఆన్ లైన్ వర్టికల్స్ తెచ్చాం. తప్పనిసరి ఇంటర్నషిప్ తెచ్చాం. ►కేవలం ఈ పథకాల మీద మీ అన్న ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.69,296 కోట్లు. మీ అన్న చదవిస్తాడని చెబుతున్నా ► ప్రతి కుటుంబం నుంచి ఇంజనీర్, డాక్టర్ రావాలి. ► మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నా ఇబ్బంది పడకుండా పిల్లలను బడులకు, కాలేజీలకు పంపండి. ►విద్యా దీవెన, వసతి దీవెనలో ఎటువంటి కత్తిరింపులు లేవు. ►ప్రతి పిల్లాడికీ మీ అన్న, మీ తమ్ముడు చదివిస్తాడని చెబుతున్నా. ► పిల్లలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతులకు ప్రతి సామాజిక వర్గానికి మంచి చేయాలని అడుగులు వేస్తున్నాం’ అని సీఎం జగన్ ప్రసంగించారు చదవండి: విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలి: రోజా సెటైర్లు -
విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలి: రోజా సెటైర్లు
సాక్షి, నగరి: ఇంటర్లో తాను ఏ గ్రూప్ చదివాడో కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని మంత్రి రోజా విమర్శించారు. బైపీసీ చదివితే ఇంజనీర్ అవ్వొచ్చని చంద్రబాబు అంటారని.. పవన్, చంద్రబాబులకు కూడా విద్యాకానుక ఇవ్వాలని చురకలంటించారు.. విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలని సెటైర్లు వేశారు.. టీడీపీని నమ్ముకుంటే యువత జైలుకు వెళ్తారు. పవన్‌ను నమ్ముకుంటే యువత రిలీజ్ సినిమాలకు వెళ్తారన్న ఆమె... అదే సీఎం జగన్‌ను నమ్ముకుంటే మంచి కాలేజీలు, వర్సిటీలకు వెళ్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. ఈ సందర్బంగా వేదికపై మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిలో తొలిసారి నగరికి వచ్చేసిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సీఎం జగన్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాణ్యమైన విద్యను పేదవాడి ఆస్తిగా మార్చిన ఘనత సీఎం జగన్‌దేనని కొనియాడారు. చదువుకు కుల, మత, ప్రాంత బేధాలు చూడకుండా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు. సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారు విద్యారంగంలో దేశానికే ఏపీ అదర్శంగా నిలుస్తోందని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్ వల్లే అన్ని వర్గాలకు విద్య చేరువైందని.. కొర్పోరేట్ స్కూళ్లకు ప్రభుత్వ స్కూళ్లు పోటీనిస్తున్నాయని తెలిపారు. విద్యా దీవెన, వసతి పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకు రాలేదని తెలిపారు. ఇంత గొప్ప ఆలోచన ఎవరికీ కూడా రాలేదన్నారు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని.. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారని ప్రస్తావించారు. చదవండి: నగరి: జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ 2024 వైఎస్ జగన్ వన్స్‌మోర్ వైఎస్ జగన్‌ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని రోజా అన్నారు. జగన్‌ను ఓడించాలంటే.. అవతలివైపు జగనే ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు వైఎస్ జగన్‌ను ఎలా ఓడిస్తాడని ప్రశ్నించారు. ప్రజలంతా 2024 జగనన్న వన్స్‌మోర్ అంటున్నారని, రాష్ట్రంలోని 175 సీట్లు ఇచ్చి దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చిన ఘనత జగన్‌ది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని పేర్కొన్నారు. చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ కుప్పంలో సంక్షేమ పథకాలు ఎవరి హయాంలో అందాయని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కుప్పం నియోజగకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. కుప్పంలోప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్‌దేనని పేర్కొన్నారు. కుప్పంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ చతికిలబడిందన్న రోజా... వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదని తెలిపారు.. వారంటీ లేని చంద్రబాబు షూరిటీ ఇస్తే గ్యారెంటీ ఉంటుందా? అని మండిపడ్డారు.. మనకు రియల్ హీరో కావాలా? రీల్ హీరో కావాలా అని ప్రశ్నించారు ప్రతిపక్షాలకు మళ్లీ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.. ‘ఆటో డ్రైవర్ కూతురు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చేస్తోంది. రైతు బిడ్డ వ్యవసాయ శాస్త్రవేత్త చదువుతున్నాడు.ఒక మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. కంపౌండర్ కూతురు డాక్టర్ చదువుతున్నాడంటే అది ముమ్మాటికీ సీఎం జగన్ వల్లే. అన్న పార్టీలో ఒక సైనికురాలిగా ఉన్న గర్వపడుతున్నాం. అన్నదానం ఆకలి తీర్చితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుందంటారు. ఆకలి తీర్చాలన్నా, అజ్ఞానాన్ని తొలగించాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్న అది విద్యతోనే సాధ్యమని మనస్పూర్తిగా నమ్మారు కాబట్టే ప్రతి పేద వాడి బిడ్డను గొప్ప చదువులు చదివేందుకు సీఎం జగన్ అండగా నిలిచారు’ అని రోజా పేర్కొన్నారు. -
నగరి: జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
విద్యాదీవెన.. సీఎం జగన్ నగరి పర్యటన అప్డేట్స్ ► నగరి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగనన్న విద్యాదీవెన నిధుల్ని బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. నగరిలో సీఎం జగన్ కామెంట్లు అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారు. 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా?. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు. అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలు. కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి గొడవలు పెట్టి.. శవరాజకీయాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశం. కావాలనే పోలీసులపై రాళ్లు రువ్వించారు. పోలీసులపై కర్ర, బీరు సీసాలతో దాడి చేయించాడు. ఓ పోలీస్‌కన్ను కూడా పోగొట్టారు. చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తాడట. దొంగ ఓట్లు ఆయనే సృష్టించి.. మన మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకడాడని వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి.. ఆయన ఫొటోనే దండం పెడతాడు. ఎన్టీఆర్ నాణేం విడుదల కోసం ఢిల్లీ కూడా వెళ్లాడు. సీఎం జగన్ ప్రసంగం ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత బాగుండాలి. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డురాకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యాదీవెన తీసుకొచ్చాం. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకం. నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11 వేల మూడు వందల కోట్లు జమ చేశాం. 8 లక్షల 44 వేల 336 మంది మంది తల్లుల ఖాతాలో రూ.680 కోట్లు జమ చేస్తున్నాం. జగనన్న వసతి దీవెన కూడా పేద విద్యార్థలు కోసం అమలు చేస్తున్నాం. మంత్రిరోజా కామెంట్లు ► పేద విద్యార్థులకు సీఎం జగన్ ఉన్నత విద్య అందిస్తున్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు దేశంలో ఎక్కడా లేవు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తూ ప్రధానే ప్రశంసించారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్. కాంపౌండర్ కూతురు వైద్య విద్య అభ్యసిస్తుందంటే.. ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గతంలో చంద్రబాబు పేదింటి పిల్లలను విద్యకు దూరం చేశారు. ► చిత్తూరు కలెక్టర్ సగిలి షన్మోహన్ ప్రారంభోపన్యాసంతో విద్యాదీవెన నిధుల జమ కార్యక్రమం ప్రారంభం ► ప్రారంభమైన విద్యాదీవెన కార్యక్రమం ► నగరిలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడి నేతలతో, లబ్ధిదారులతో ముచ్చటించారు. అక్కచెల్లెళ్లమ్మలతో ఫొటో దిగారు. ఆపై వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్‌కు పుష్ఫనివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ► నగరి లో కీలపట్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద కు చేరుకున్న సీఎం జగన్. స్వాగతం పలికిన మంత్రులు ఆర్.కే రోజా, ఉషశ్రీ చరణ్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు ఆదిములం, ఏమ్.ఏస్.బాబు, వెంకట్ గౌడ, ఎమ్మెల్సీ భరత్ తదితరులు. ► తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో నగరి బయలుదేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ► కాసేపట్లో సీఎం జగన్ నగరి చేరుకోనున్నారు. ► రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్. మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి ఎమ్మేల్యే బియ్యపు మధు సూధన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ► విద్యాదీవెన కార్యక్రమం కోసం చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయల్దేరారు. 📖 ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది(ఇవాళ్టి రూ.680 కోట్లతో కలిపి). మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.69,289 కోట్లు ఖర్చుపెట్టింది. 📖 జగనన్న విద్యాదీవెన కింద.. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. 📖 జగనన్న విద్యాదీవెన పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కళాశాలలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని జగన్ సర్కారే భరిస్తోంది. 📖 ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సోమవారం సీఎం జగన్ నగరి వేదికగా విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ చిత్తూరు నగరి వెళ్లనున్నారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. ఆయన నిధుల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. ఈ పర్యటనలోనే నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. -
నేడు ఆంధ్రప్రదేశ్‌లోని నగరిలో జగనన్న విద్యా దీవెన సాయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
28న చిత్తూరు జిల్లా నగరిలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ఈ నెల 28న సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఆయన నగరి చేరుకుంటారు. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి నిధులను జమ చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. -
చరిత్ర తిరగరాసిన సీఎం జగన్.. విద్యలో ఏపీ టాప్
సాక్షి, హైదరాబాద్: విద్యాబోధన, సంస్కరణల్లో ఏపీ విధానాలు అత్యుత్తమంగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర విద్యాశాఖ పర్మామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) విడుదల చేసిన అతి ఉత్తమ్ కేటరిగిలో.. దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ మేరకు ఏపీకి అభినందనలు సైతం తెలిపింది. విద్యకు పెట్టిన పెట్టుబడికి సమీప భవిష్యత్తులో అద్భుత ఫలితాలు రానున్నట్టు చెప్పుకొచ్చింది. అక్షరాస్యతలో అద్భుతంగా ఉంటే అభివృద్ధి సునాయసమని తెలిపింది. ఈ సందర్బంగా ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్ల కాలంలో ఏపీలో విద్య విషయంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్టు తెలిపారు. విద్యకు సంబంధించి 10 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా ఉందన్నారు. విద్యా కానుక, అమ్మఒడి, నాడు-నేడు వంటి పథకాలతో విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. విద్య కోసం 67వేల కోట్లు.. ఇక, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.66,722 కోట్లు ఖర్చు చేస్తోంది. కేవలం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15వేలు అందిస్తోంది. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. నాడు-నేడు.. మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. దీని కోసం రూ.11,669 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బెల్ట్, మాస్క్‌ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన.. పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు. డిజిటల్ విద్య.. ఇక, 2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం ప్రభుత్వం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. కొత్త విద్యా సంవత్సరం (2023–24)లో 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్‌లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులందరికీ ట్యాబ్‌లు అందించింది. ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులతోపాటు సుమారు 75 వేల మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. 8, 9 తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు రూ.25 వేల ఖరీదు చేసే బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించింది. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తోంది. ఇది కూడా చదవండి: విద్యా రంగానికి పెద్దపీట.. భారీగా కేటాయింపులు -
ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహిస్తూ జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్..!
-
విద్య వ్యవస్థలో సరి కొత్త శకం
-
మీ భవిష్యత్తుకు బంగారు బాట
-
మా కుటుంబానికే వెలుగులు తెచ్చావు జగనన్న
-
‘జగనన్న విద్యాదీవెన’ ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం వల్లే నేను ఫీజు కట్టి చదవగలుగుతున్నాను..!
-
మా చదువులకు భరోసా.. ‘జగనన్న విద్యాదీవెన’
-
జగనన్న విద్యా దీవెనతో నా డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకుంటున్నాను
-
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
-
బాబు బతుకంతా వాగ్ధానాలు.. తరువాత వెన్నుపోట్లు: సీఎం జగన్
Updates ►మోసాల చక్రమే చంద్రబాబు సైకిల్ చక్రం ►బాబు పెత్తందారీ భావజాలానికి.. పేదలకు మధ్య యుద్ధం. ►సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. ►ఎల్లో మీడియా విష ప్రచారానికి, మనం చేస్తున్న మంచికి యుద్ధం. ►టీడీపీ హయాంలో దోచుకో, పంచుకో, తినుకో విధానం. ►డీపీటీ కావాలా? నేరుగా బటన్ నొక్కే డీబీటీ కావాలా? ►ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 అండగా ఉండకపోవచ్చు.. ►జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు. ►మీ జగనన్న ప్రజలనే నమ్ముకున్నారు. ►ఇది కురుక్షేత్ర యుద్దం ►ఈ యుద్ధంలో నా ధైర్యం, బలం మీరే. ►మీకు మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా నిలవండి. ►దుకాణం మూసేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. ►చంద్రబాబు పులిహోర మ్యానిఫెస్టో తెచ్చారు. ►మరోసారి మోసానికి తెరతీశారు. ►బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంటూ డ్రామాలు మొదలు పెట్టారు. ►14 ఏళ్లు సీఎంగా బాబు ఏం చేశారు? గాడిదలు కాశారా? ►బాబు బతుకంతా వాగ్ధానాలు.. తరువాత వెన్నుపోట్లు ► విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేశాం: సీఎం జగన్ ► ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన విద్యార్థులు ఉండాలి. ► టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం చేపట్టాం. ► అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ► ఇంగ్లీష్ మాట్లాడటంలో మన విద్యార్థులకు ప్రతిభ పెరుగుతుంది. ► రాష్ట్రంలోని 52 మంది ఇంగ్లీష్ టీచర్లకు అమెరికాలో శిక్షణ. ► విద్యాకానుక కిట్లలో మెరుగైన మార్పులు చేశాం. ► యూనిఫామ్ డిజైన్‌లో మార్పులు చేశాం. ► గతేడాది కంటే ఈ ఏడాది యూనిఫామ్ క్లాత్ శాతం పెరిగింది. ► రూ.1,042.53 కోట్ల వ్యయంతో విద్యాకానుక కిట్ల పంపిణీ. ► 43 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు విద్యాకానుక ► ప్రతి విద్యార్థి రూ. 2,400 విలువైన కిట్ పంపిణీ. ► ఇప్పటి వరకు విద్యాకానుక పథకానికి రూ. 3,366 కోట్లు ఖర్చుచేశాం. ►ఏపీలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి బొత్స సత్యనారాయణ ►విద్యారంగంలో కీలక సంస్కరణలు చేశాం. ►ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో నిలబడాలనేదే లక్ష్యం. ►ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్లో విద్యా బోధన. ►సీఎం జగన్ అంటే ప్రభంజనం: ఎమ్మెల్యే నంబూరి శంకరరావు ►పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ►నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను సీఎం జగన్ అందించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. క్రోసూరులో ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శించిన సీఎం జగన్ డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో కూర్చొని ముచ్చటించారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్‌పై ఆల్ ది బెస్ట్ అని రాశారు. జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు. ► పల్పాడు జిల్లా క్రోసూరుకు సీఎం వైఎస్జగన్ చేరుకున్నారు. కాసేపట్లో నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక అందించనున్నారు. ► పల్పాడు జిల్లా క్రోసూరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయల్దేరారు. ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండగా.. తొలిరోజే విద్యాకానుక అందిస్తోంది ప్రభుత్వం. వరుసగా నాలుగో ఏడాది సీఎం జగన్ ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌ను అందజేయనున్నారు. ►ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ►జగనన్న విద్యాకానుక కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా నాలుగు దశల్లో నాణ్యతా పరీక్షలు చేపట్టారు. ►43.10 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు సీఎం జగన్ విద్యా కానుక అందించనున్నారు. ►రూ. 1,042.53 కోట్ల వ్యయంతో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. ►నాలుగేళ్లలో విద్య కోసం రూ.60 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. ► తొలి దశలో నాడునేడు పూర్తయిన 15,715 స్కూళ్లలో డిజిటల్ విద్య, హైస్కూళ్లలో 30 వేల తరగతి గదులకు బైజూస్ కంటెంట్‌తో డిజిటల్ విద్య అందిస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ చదువుల భారమంతా తన భుజాలకెత్తుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యాకానుకను అందిస్తోంది. పాఠ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్ల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చదవండి: పకడ్బందీగా 50వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు! -
పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు
-
నా భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు.. జగనన్న ఇచ్చే విద్యాదీవెనతోనే మా పాపను చదివిస్తున్నాను
-
జగనన్న విద్యాదీవెనతో మా తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గింది
-
విద్యా దీవెనతో మారిన బతుకుచక్రం
-
ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు.. పదో తరగతి ఫలితాల్లో 578 మార్కులు వచ్చాయి
-
చలించిపోయిన సీఎం జగన్.. విద్యార్థిని దివ్య కుటుంబానికి ఇంటి స్థలం
తాళ్లపూడి: ఇటీవల కొవ్వూరులో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తనకు విద్యా దీవెన పథకం ఎలా మేలు చేసిందో చెబుతూ అందరినీ ఆకట్టుకున్న పెద్దేవం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తిరిగిపల్లి దివ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. దివ్య కుటుంబం కష్టాలు విని సీఎం వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.మాధవీలత నుంచి విద్యార్థిని దివ్యకు శుక్రవారం పిలుపు వచ్చింది. ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ, గ్రామ సర్పంచ్ తిరిగిపల్లి వెంకటరావు విద్యార్థిని దివ్యను వెంట పెట్టుకుని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. విద్యార్థి దివ్య కుటుంబానికి ఇంటి స్థలం తక్షణమే కేటాయించినట్టు కలెక్టర్ తెలిపారు. అతి త్వరలో మంత్రి చేతుల మీదుగా అందజేస్తామన్నారు. అలాగే ఉన్నత చదువుకు, ఆ తర్వాత మంచి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దివ్య హోంమంత్రి తానేటి వనితను కూడా కలిసింది. -
జగన్ ను ఎదుర్కోవడానికి తోడేళ్లందరూ ఏకమవుతున్నారు: సీఎం జగన్
-
రానున్నది కురుక్షేత్రం.. మీ బిడ్డకు అండగా ఉండండి
నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నిరుపేద వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా గట్టిగా నిలబడాలంటే వారి పట్ల ఉన్న వివక్ష సంకెళ్లు తెంచుకోవాలి. అందుకు చదువు ఒక్కటే మార్గమని అంబేడ్కర్, సావిత్రీబాయి పూలే, అబుల్ కలాం ఆజాద్ వంటి గొప్పవాళ్లు చెప్పారు. అందుకే మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా నాలుగేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను. – సీఎం వైఎస్ జగన్ కొవ్వూరు నుంచి సాక్షి ప్రతినిధి: ‘పేదల తల రాత మార్చేందుకు ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా పేదల బాగు కోసం మనందరి ప్రభుత్వం ఎంతగానో పరితపిస్తూ అడుగులు ముందుకు వేస్తోంటే గత పాలకులు రాష్ట్రం దివాలా తీస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారు. వారంతా గజ దొంగల ముఠాగా ఏర్పడి తోడేళ్ల గుంపు మాదిరిగా మీ బిడ్డపైకి వస్తున్నారు. పేదల ప్రతినిధిగా ఉన్న నాపైకి ఈ పెత్తందారులంతా రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతూ.. మరింతగా దుష్ప్రచారం చేస్తూ వస్తారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో వారితో జరిగే కురుక్షేత్ర మహా సంగ్రామంలో మీరంతా మీ బిడ్డకు అండగా నిలవాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సత్యవతినగర్‌లో బుధవారం ‘జగనన్న విద్యా దీవెన’ జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించిన నిధులను లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదవాడికి ఏం చెయ్యాలి.. పేదరికం పోవాలంటే ఆ పేదవాడిని ఎలా ఆదుకోవాలి.. ఎలా తోడుగా నిలబడాలని గత ప్రభుత్వ పెద్దలు ఏ రోజూ ఆలోచించలేదని చెప్పారు. గతంలో ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5 వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.. అంతా ఒక గజ దొంగల ముఠాగా ఏర్పడ్డారన్నారు. వాళ్ల రాజకీయం, వాళ్ల ఆలోచన అంతా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం అన్నట్టుగా సాగిందని తెలిపారు. ‘అందుకే దీని గురించి ఏ పేపర్లో రాయరు.. ఏ టీవీలో డిబేట్లు పెట్టరు.. ప్రశ్నిస్తాను అన్న ఏ ఒక్కరూ ప్రశ్నించరు.. కాలేజ్‌లో చదువుతున్న పిల్లలపై చేస్తోన్న ఖర్చుతో రాష్ట్రం దివాలా తీస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడే ప్రతిపక్ష నాయకుడిని, చెడిపోయిన మీడియా వ్యవస్థను చూస్తున్నాం’ అని అన్నారు. పేద పిల్లలు పెద్ద చదువులు చదవాలని, ఫీజు ఎంతైనా ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఇంగిత జ్ఞానం లేని కొందరికి చదువు విలువ తెలియదు ► భావితరాల తలరాతలు మార్చేలా విద్యార్థులపై హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా ఖర్చు చేస్తున్నాం. ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ రాష్ట్రం, దేశం.. దశ, దిశ మారుస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి విద్యార్థి మంచి ఇంజినీర్‌గా, డాక్టర్‌గా బయటకు వస్తే భావితరాలకు స్కిల్డ్ మేన్ పవర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తుంది. ► దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విప్లవాత్మక మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకువచ్చాం. ప్రభుత్వ బడి మారింది. చదువులు మారుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం వచ్చింది. సీబీఎస్ఈ సిలబస్ కూడా వచ్చింది. బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్ కూడా తీసుకువచ్చాం. దీని ద్వారా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో విద్యను అభ్యసించే అవకాశం లభించింది. పౌష్టికాహారం ఇచ్చే విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. ► గత ప్రభుత్వం సంవత్సరానికి కేవలం రూ.400 కోట్లు ఖర్చు చేస్తే మన ప్రభుత్వంలో ఈ ఒక్క ప«థకానికి దాదాపు రూ.2 వేలు కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లలకు యూనిఫాం నుంచి బుక్స్ వరకు ఎప్పుడు పాఠశాలలు తెరిచినా వారికి అందేట్టుగా విద్యాకానుక అందిస్తున్న ప్రభుత్వం మనదే. చదువుల విప్లవమే తీసుకువచ్చాం. ► పేదరికం సంకెళ్లు నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే పాశుపతాస్త్రం. మీ ఇంటిలో అందరినీ చదివించండి. మీ వెంట నేనుంటా. వివక్ష పోవాలంటే ఉన్నత చదువులతోనే సాధ్యమవుతుంది. విద్యపై పెట్టేది హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే విషయం ఇంగిత జ్ఞానం లేని కొందరు ప్రతిపక్ష నేతలకు తెలియడం లేదు. ఇది క్లాస్ వార్ ► గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతున్నా. ఈ నాలుగేళ్లలో జరిగిన మంచిని జీర్ణించుకోలేని వారందరూ కలిసి కట్టుగా ఒక్క జగన్‌ను ఎదుర్కోవడానికి వస్తామంటున్నారు. మీ జగన్‌కు వాళ్ల మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి మద్దతు ఉండకపోవచ్చు. ► ఈ రోజు జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్ జరుగుతోంది. పేద వాళ్లంతా ఒక వైపు ఉంటే మరోవైపు పెత్తందార్లు ఉన్నారు. మనందరి ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు అండగా సైనికులుగా నిలబడండి. నా బలం, నా నమ్మకం మీరే. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలనే నమ్ముకున్నా. ప్రతి కుటుంబం నుంచి సత్య నాదెళ్ల రావాలి ► మన రాష్ట్రంలో ప్రతి కుంటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మనది అని చెప్పడానికి గర్వపడుతున్నా. స్టాన్ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లో సీటు వచ్చినా ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులు.. ప్రతిభ మీరు చూపించండి, మీ ప్రతిభకు తోడుగా మీ జగనన్న ఉంటాడని మళ్లీ చెబుతున్నా. ► షాదీ తోఫా, కళ్యాణమస్తు వంటి çపథకాలకు చదువుతో ముడిపెట్టి ప్రతి ఇంట్లో కూడా పెద్ద చదువులు చదివేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నా. మన పిల్లలు బాగా చదవాలని, పేద పిల్లలు పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు ఒక్కటే మార్గమని మనసా వాచా కర్మణా నమ్మి వాళ్ల తరఫున మనందరి ప్రభుత్వం చదువుల కోసం ఇంతగా తాపత్రయపడుతోంది. విమర్శకులారా ఆలోచించండి ► ఇంతకు ముందెప్పుడైనా ఇలా బటన్లు నొక్కి ఎవరికీ లంచాలు ఇవ్వకుండా, వివక్ష చూపకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి పథకాల లబ్ధి నేరుగా చేర్చే పరిస్థితి ఉందా? మనందరి ప్రభుత్వాన్ని విమర్శించే వారు, విద్యాదీవెన అందుకుంటున్న ప్రతి తల్లి, ప్రతి విద్యార్థి ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నా. ► జగనన్న అమ్మ ఒడి దగ్గర మొదలు పెడితే విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత ఇలా ఏ పథకం చూసినా ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి ఏ విధంగా వస్తోందో ఆలోచించండి. ► ఇంతకు ముందు కూడా ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం. అప్పుల గ్రోత్ రేటు గతం కన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ. అదే రాష్ట్రం అయినప్పుడు, అదే బడ్జెట్ ఉన్నప్పుడు కేవలం మార్పు ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే. ఒక్క ముఖ్యమంత్రి మారడంతో ఈ రోజు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2.10 లక్షలు కోట్లు నేరుగా (డీబీటీ) వెళ్లింది. దీనికి ఇంటి స్థలాలు.. ఒక్కో స్థలం విలువ రూ.2.50 లక్షలు వేసుకున్నా రూ.75 వేల కోట్లు నాన్ డీబీటీ కింద కలుపుకుని మొత్తంగా రూ.3 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మలకు అందజేశాం. ఇదంతా ఈ నాలుగేళ్లలోనే జరిగింది. ఇది గతంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఎందుకు జరుగుతుందో ఆలోచించండి. పేదల కోసం పుట్టిన రారాజువన్నా.. ఇప్పటి వరకు ఎంత ఏడ్చినా మా కన్నీళ్లు ఆగవనుకున్నా. మీ చిరునవ్వుతో ఆ కన్నీళ్లు కాస్తా మాకు ఆనంద భాష్పాలుగా మారాయి. మాలాంటి పేద ప్రజల కోసం పుట్టిన రాజు, రారాజు మీరు. సంక్షేమ బాటసారివి. అధికార పీఠానికి కొత్త భాష్యం పలికి ఆదర్శమూర్తిగా నిలిచారన్నా. నా తల్లిదండ్రులు వికలాంగులు. వారికి మేము ఇద్దరం ఆడ పిల్లలం. నాన్న ఆకుకూరలు అమ్ముతుండగా అనుకోకుండా ఆయనకు పక్షవాతం వచ్చి బాగా నీరసించిపోయాడు. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇప్పిస్తూ.. మా కుటుంబాన్ని ఆదుకుంటున్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నా. మీ వల్లే నేను కార్పొరేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. మేము చదువుకున్నప్పటి స్కూళ్లు, ఇప్పటి స్కూళ్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నా. మళ్లీ స్కూలుకు వెళ్లి చదువుకోవాలనిపిస్తోందన్నా. మాకు అన్న లేని లోటు మీ వల్ల తీరుతోందన్నా. తరానికి ఒక్కడు, యుగానికి ఒక్కడు అంటుంటారే.. అది మీరేనన్నా. – దివ్య, బీకాం థర్డ్ ఇయర్, కొండవీటి డిగ్రీ కళాశాల, గోపాలపురం ఉద్యోగావకాశాలు మీ చలవే నేను పేద మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడిని. నా తల్లి గృహిణి, తండ్రి రైతు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం రూ.35 వేలు మాత్రమే వచ్చేది. ఈ రోజు నేను చాలా అదృష్టవంతుడిని. నాకు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. ఒక సాధారణ నాయకుడిలా మీరు మోసపూరిత హామీలు ఇవ్వలేదు. ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. మీరు ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు చాలా ఉపయోగకరం. దేశంలో నూతన విద్యా విధానం తీసుకువచ్చిన తొలి రాష్ట్రం మనదే. మన విద్యా విధానంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండటంతో ఎన్నో ఉద్యోగావకాశాలు పొందుతున్నాము. గతంలో మా కళాశాలలో కేవలం 30 – 40 శాతం మందికి ఉద్యోగావకాశాలు ఉండేవి. మీరు వచ్చాక అది 90 శాతానికి పెరిగింది. మా కాలేజ్ నుంచి ఓ విద్యార్థికి రూ.44 లక్షల ప్యాకేజీతో అమేజాన్‌లో ఉద్యోగం లభించిందంటే అది మీరు తీసుకువచ్చిన మార్పే. మీరే శాశ్వత సీఎంగా ఉండాలి. – రాపర్ల ప్రసన్నకుమార్, బీటెక్ థర్డ్ ఇయర్, తాడేపల్లిగూడెం ఉప్పొంగిన జన గోదావరి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన విద్యా దీవెన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి విద్యార్థులు, తల్లిదండ్రులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపించారు. సీఎం ప్రత్యేక బస్సులో ఆర్టీసీ బస్టాండ్, అక్కయ్యమ్మ కాలనీ, ఎన్టీఆర్క్రీడా మైదానం మీదుగా సత్యవతినగర్‌లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రెండు కిలోమీటర్లకు పైగా రోడ్‌షో సాగింది. ఇరువైపులా జనం జైజగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. సభా స్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం.. విద్యార్థులు, వారి తల్లులతో కొద్దిసేపు మాట్లాడారు. వారితో కలిసి గ్రూపు ఫొటో తీయించుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి విద్యార్థులు, వారి తల్లులు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో చాలా మంది బయటే ఉండిపోయారు. ‘ప్రతిభ మీది.. ఉన్నత విద్య బాధ్యత నాది.. నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని సీఎం అన్నప్పుడు విద్యార్థుల ఈలలు, కేకలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం వరాల జల్లు కురిపించారు. హోం మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.30 కోట్లతో పాటు 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, కొవ్వాడ కెనాల్ వద్ద కల్వర్ట్, మూడు మండలాల్లో మూడు అంబేడ్కర్ భవనాలు, ముస్లింలకు షాదీఖానా, ఎస్సీలకు కమ్యూనిటీ హాలు, కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చారు. -
సీఎం వైఎస్ జగన్ కొవ్వూరు పర్యటన ఫొటోలు
-
రాబోయే రోజుల్లో ఏపీ దేశానికే దశ దిశ చూపిస్తుంది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొవ్వూరు పర్యటనలో ఉన్నారు. కాగా, సీఎం జగన్ శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు. దీంతో, జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేశాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదగాలి. వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రం. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యం. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుంది. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయి. ప్రతీ పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశాం. జాబ్ ఓరియోంటెడ్‌గా కరిక్యులమ్ మార్చాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టాం. పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒక సత్యా నాదెళ్ల రావాలి. ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేది. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్‌వార్ జరుగుతోంది’ అని అన్నారు. -
‘నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం జగనన్న’
కొవ్వూరు: జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమంపై ప్రశంసలు కురిపించింది. ‘నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం జగనన్న. మా నాన్న, అమ్మ ఇద్దరూ దివ్యాంగులు. మా నాన్నకు పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉంటే మా అమ్మ చెవిటి-మూగ. అయితే నేను ఉన్నాను. నేను విన్నాను అంటూ జగనన్న మాకు అండగా నిలిచారు. మాకు విద్యా దీవెనతో పాటు, వసతి దీవెన కూడా జగనన్న అందించారు. మా కుటుంబానికి అండగా నిలబడిన జగనన్నకు కృతజ్ఞతలు. నా చిట్టి చెల్లెమ్మకు నేను ఉన్నాను అంటూ వసతి దీవెన అందించి నన్ను నిలబెట్టాడు మా అన్న. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకూ తెలుగు మీడియంలోనే చదువుకున్నా.. నాకున్న ఆర్థిక పరిస్థితి సరిపోక తెలుగు మీడియంలోనే చదువుకున్నా. ఇప్పుడు కార్పోరేట్ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నానంటే అది మీ దయే అన్నా. నేను స్కూల్ స్టడీస్‌లో ఉండగా అంతా ఇబ్బందిగా ఉండేది. వసతులు ఏవీ బాగుండేవి కావు. మీరు వచ్చిన తర్వాత స్కూళ్ల రూపురేఖలే మార్చేశారన్నా. ఇప్పటి గవర్నమెంట్ స్కూళ్లను చూస్తుంటే మళ్లీ స్కూల్‌కి వెళ్లాలనిపిస్తుందన్నా’ అని విద్యా దీవెన అందుకుంటున్న తాళ్లపూడి మండలకు చెందిన దివ్య అనే డిగ్రీ బాలిక తన ప్రసంగం ద్వారా ఆకట్టుకుంది. ప్రసంగం తర్వాత ఆ విద్యార్థిని వేదికపై ఉన్న సీఎం జగన్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంది. ‘సార్, నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్న రైతు, అమ్మ గృహిణి, నేను జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుడిని, గతంలో కేవలం రూ. 35 వేలు మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు పూర్తిగా ఫీజు మొత్తం కూడా ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా పొందుతున్నాం. మీరు మోసపూరిత హమీలు ఇవ్వకుండా ఇచ్చిన ప్రతి హమీ నెరవేర్చిన ఏకైక నాయకుడు మీరు. మీరు ఉన్నత విద్యలో ప్రభావవంతమైన సంస్కరణలు తీసుకొచ్చారు, నూతన విద్యా విధానానికి సంబంధించిన పాలసీని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనది. మన విద్యా విధానం అంతర్జాతీయ స్ధాయికి ఎదిగింది, మీ హయాంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్లలో 90 శాతంపైగా సాధిస్తున్నారు, నా కాలేజ్ విద్యార్ధి అమేజాన్ లో రూ. 44 లక్షల ప్యాకేజ్ కి సెలక్ట్ అయ్యాడంటే మీరే కారణం. మీ నవరత్నాల పథకాల లబ్ధి పొందుతున్నాం, మీరు మాపై ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసి ఏపీని ముందుకు తీసుకెళతాం, మీ పేరు ఎక్కడ రాయాలన్న చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీగా కాకుండా ద పర్మినెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీగా రాయాలనుకుంటున్నాం, అటువంటి అవకాశం మీరు కల్పించాలి, ధ్యాంక్యూ.’ -ప్రసన్నకుమార్, బీటెక్ విద్యార్ధి, తాడేపల్లిగూడెం -
Live: కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన
-
కొవ్వూరులో విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
-
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి: సీఎం జగన్
Updates సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ►మన సమాజంలో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ►ఆ కుటుంబాల తలరాతలు మారాలి ►వారు పేదరికం నుంచి బయటకు రావాలి ►ఆ కుటుంబాలనుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు లాంటి వారు రావాలి ►పేదరికం అనే సంకెళ్లను వారు తెంచుకోవాలి ►దానికి చదవులు ఒక్కటే మార్గం ►అందుకే నాలుగేళ్ల ప్రభుత్వ పాలనలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా అడుగులేశాం ►నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు సామాజికంగాను, ఆర్థికంగానూ గట్టిగా నిలబడాలంటే, వారు వివక్ష సంకెళ్లను తెంచుకోవాలంటే.. దానికి చదువులు ఒక్కటే మార్గం ►ఒక అంబేద్కర్, ఒక సావిత్రీ పూలే కాని, మౌలానా అబ్దుల్ ఆజాద్ కాని… వారి నోట్లోనుంచి వచ్చిన మాట ఏంటంటే.. చదువు అనేది ఒక్క అస్త్రం అని అలాంటి చదువుల విప్లవం మన రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా చేపట్టాం ►చదువులు అన్నవి పేదలకు ఒక హక్కుగా అందాలి ►జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలను అమలు చేస్తోంది ►పూర్తి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికంలోనూ జమచేస్తున్నాం ►జనవరి-ఫిబ్రవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇప్పుడు డబ్బు జమచేస్తున్నాం ►లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం ►చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఫీజులు ఇచ్చారు ► రూ. 1777 కోట్ల రూపాయలు బకాయిపెట్టాడు చంద్రబాబు ఆ డబ్బును కూడా మన ప్రభుత్వమే తీర్చింది ►బోర్డింగ్ ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది ►ప్రతి ఏటా వసతి దీవెన కింద రెండుమార్లు తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం ►అక్షరాల 25 లక్షల మందికిపైగా వర్తింపుచేస్తున్నాం ► కేవలం ఒక్క ఈ పథకానికే రూ.4,275.76 ఖర్చుచేశాం ►చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి ► ఫీజులు అరకొరగా ఇచ్చేవారు ►ఎప్పుడు ఇచ్చేవారో తెలిసేది కాదు ►ముష్టి వేసినట్టు ఇచ్చేవారు ►కేవలం రూ.35వేలు ఇచ్చేవారు ►మన ప్రభుత్వం ఫీజులు ఎంతైతే అంత ఇస్తోంది ►పిల్లలకు మంచి జరగాలని ఎంత ఫీజులైతే అంత చెల్లిస్తున్నాం ►ఎంత ఫీజులైనా ఫర్వాలేదు.. మీరు చదవండి… మీ జగనన్న చెల్లిస్తాడు ►పిల్లలకు మంచి మేనమామగా ఎప్పుడూ ఉంటాను ►ఇలాంటి పథకాలు ఇస్తుంటే… రాష్ట్రం దివాళా తీస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ►మీడియా వ్యవస్థలు కొన్ని ఇలానే మాట్లాడుతున్నాయి ►భావి తరాల పిల్లల తలరాతలు మార్చేందుకు మేం పెట్టే ఖర్చు.. మానవ వనరులమీద పెట్టుబడులు అని చెప్తున్నాను ►రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దశ, దిశ ఆంధ్రప్రదేశ్ చూపిస్తోంది ►ఏ రాష్ట్రంలో లేని విధంగా నర్సరీ నుంచి, ఉన్నత విద్యవరకూ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి ►ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి ►అందులో చదువులు కూడా మారుతున్నాయి ►సీబీఎస్ఈ ఇంగ్లిషు మీడియం చదువులు వచ్చాయి ►బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్ వచ్చాయి ►గొప్ప మార్పులకు నిరద్శనం ఇది ►అంగన్వాడీల స్వరూపం కూడా మారుతోంది ►పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం ►ఈ విషయంలో అక్షరాల ఒక్కో పథకానికి రూ.౨వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ►విద్యాకానుక ద్వారా స్కూళ్లు తెరిచే సమయానికి కిట్లను అందిస్తున్నాం ►ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న ప్రతి పిల్లాడికి మంచి బోధన అందించడంపై దృష్టిపెట్టాం ►సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టు తీసుకు వచ్చాం ►పిల్లలకు ఇంటికి వెళ్లిన తర్వాత ట్యూటర్ ఉండాలన్న తాపత్రయంతో బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్స్ ఇచ్చాం ►ఆఫ్‌లైన్‌లో పనిచేసే ట్యాబులు ఇచ్చాం ►నాడు – నేడు పూర్తిచేసుకున్న మొదటి దఫా స్కూళ్లలో 6 నుంచి పై తరగుతులకు డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం ►ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ద్వారా డిజిటల్ బోధన తీసుకున్న ప్రభుత్వం మనదే ►ప్రభుత్వ పాఠశాలలతో ప్రైవేటు స్కూల్స్ పోటీపడే పరిస్థితి వస్తుంది ►గత ప్రభుత్వం చివరి ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు 37లక్షలు ఉంటే.. ఆ సంఖ్య 40 లక్షలు దాటింది ►ప్రభుత్వ స్కూళ్లమీద నమ్మకం కలిగింది ►డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయి ►డిగ్రీల్లో చేరకుండా 2018-19లో 81,813 ఉంటే అది 2022-23 నాటికి 22,387కు తగ్గింది ►2018-19లో ఇంజినీరింగ్ చదివేవాళ్లు 80వేలు మంది అయితే ఈ ప్రభుత్వంలో 1.2 లక్షలమంది చదువుతున్నారు. దాదాపు 50శాతం వృద్ధి ఉంది: ►ఉన్నత విద్యతో పాఠ్యప్రణాళికను మార్చాం ►జాబో ఓరియంటెడ్‌గా తీర్చిదిద్దాం ►25 మార్కెట్ ఓరియెంటెడ్, 67 బిజినెస్ ఒకేషన్ కోర్సులు ప్రవేశపెట్టాం ►దేశంలో తొలిసారిగా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టాం ►పిల్లల నైపుణ్యం పెంచడానికి ఆన్లైన్ కోర్సులు ఇప్పిస్తున్నాం ►మైక్రోసాఫ్ట్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ►వారిచేత కోర్సులు చెప్పించి.. సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నాం ►అమెజాన్ లాంటి సంస్థలు కూడా రాష్ట్రప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యాయి ►జగనన్న విదేశీ దీవెన కింద 21 ఫ్యాకల్టీలో 350 ప్రపంచస్థాయి కాలేజీల్లో రూ. 1.25 కోట్ల వరకూ కూడా ఫీజులు కడుతున్నాం ►సత్యానాదెళ్లలా.. మన రాష్ట్రం నుంచి ప్రతి కుటుంబం నుంచి రావాలి ►ప్రతి కుటుంబం నుంచి కూడా సత్యనాదెళ్లలు రావాలి ►ప్రతిభ మీరు చూపించండి… మీ ప్రతిభకు తోడుగా నేనున్నాను ►షాదీతోఫా, కళ్యాణమస్తు లాంటి పథకాలు కూడా టెన్త్ చదివితేనే అమలు ►విమర్శించే ప్రతిపక్షాలతా ఆలోచన చేయండి ►ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగేదా? ►లంచాలు ఇవ్వకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వచ్చేవా? ►అమ్మ ఒడి నుంచి చూస్తే.. విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత లాంటి పథకాలు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలా వస్తున్నాయి? ►అప్పుడు బడ్జెట్.. ఇప్పుడు కూడా అదే బడ్జెట్ ►అప్పులు వృద్ధి చూస్తే.. అప్పటితో చూస్తే.. ఇప్పుడే తక్కువ ►కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు ►గతంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు జరగుతున్నాయి? ►గతంలో పేదవాడి గురించి ఆలోచన చేయలేదు ►పేదరికం పోవాలంటే.. ఏంచేయాలన్న ఆలోచన చేయలేదు ►గతంలో పాలకులంతా గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు ►చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫ వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ►ప్రజల గురించి వారెప్పుడూ ఆలోచన చేయలేదు ►దోచుకోవడం ఎలా.. ఎలా పంచుకోవడం.. అన్నదే వారి ఆలోచన ►అందుకే ఏ పేపర్లోనూ రాయరు… ఏ టీవీల్లోనూ డిబేట్లు పెట్టరు ►ప్రశ్నిస్తామన్న వాళ్లు… ప్రశ్నించరు ►ఇప్పుడు తోడేళ్లంతా కలిసికట్టుగా ఏకం అవుతామంటన్నారు ►జగన్‌కు వారి మాదిరిగా మీడియా ఉండకపోవచ్చు, దత్తపుత్రుడి సపోర్టూ ఉండకపోవచ్చు ►ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్వారు ►పేదవాడు ఒకవైపున ఉన్నాడు.. పెత్తందార్లు మరోవైపున ఉన్నాడు ►రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెప్తారు, మోసపూరిత మాటలు చెప్తారు ►మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి ►మంచి జరిగితే.. జగనన్నకు తోడుగా నిలవండి ►నా బలం మీరే.. నా నమ్మకం మీరే ►నేను నమ్ముకున్నది దేవుడి దయను, మీ అందరి చల్లని దీవెనలను ►రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీ దీవెనలు ఉండాలని కోరుతున్నాను ► హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. తండ్రి ఆశయ సాధన కోసం పాటు పడుతున్న తనయుడు సీఎం జగన్. ముఖ్యమంత్రి జగనన్న పాలనలో అన్ని కులాలకు సమన్యాయం అందుతోంది. జగనన్న పాలనలో విద్యాశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సీఎం జగన్ తీర్చిదిద్దారు. సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థులకు స్టేట్ ర్యాంకులు వచ్చాయి. జగనన్న.. విద్యను పేదవాడి హక్కుగా మార్చారు. పేద విద్యార్థులు చదువుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. చంద్రబాబు పాలనలో ఫీజు రియింబర్స్‌మెంట్ అరకొరగా ఇచ్చారు. జగన్ పేదల వైపు నిలబడితే.. చంద్రబాబు, పవన్ పెత్తందారుల వైపు నిలబడ్డారు. చంద్రబాబు పది మందితో కలిసి వచ్చినా సీఎం జగన్ ఒక్కరే ఎదుర్కొంటారు. సీఎం జగన్ నాయకత్వంలో నేను పనిచేస్తా. ► కొవ్వూరు చేరుకున్న సీఎం జగన్. ► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన, విశ్వరూప్. ►కొవ్వూరు బయలుదేరిన సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ లబ్ధిదారులకు జమచేయనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది. ► జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ► అనంతరం, తూర్పో గోదావరి జిల్లా కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ‘జగనన్న విద్యా దీవెన’.. ► పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో జగనన్న ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. ‘జగనన్న వసతి దీవెన’.. ► అలాగే, ఉన్నత చదువులు చదివే ఈ పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు అయితే రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. -
నేడు సీఎం జగన్ కొవ్వూరు పర్యటన
సాక్షి, అమరావతి/కొవ్వూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం (నేడు) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. అక్కడ జరిగే కార్యక్రమంలో ఆయన జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ఉ.8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కొవ్వూరు చేరుకుంటారు. అక్కడ సత్యవతినగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమచేస్తారు. అనంతరం కొవ్వూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
పేదలకు పెద్ద చదువులే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులను కూడా పెద్ద చదువులు చదివించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా జన వరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను బుధవారం సీఎం లబ్ధిదారులకు జమచేయనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. పేద విద్యార్థులకు వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న మేలును ఒకసారి పరిశీలిస్తే.. ‘జగనన్న విద్యా దీవెన’.. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో జగనన్న ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. ‘జగనన్న వసతి దీవెన’.. అలాగే, ఉన్నత చదువులు చదివే ఈ పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు అయితే రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. అలాగే.. ► ఇప్పటివరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన కింద రూ.10,636.67 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ► గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చే ఫీజుల్లో సైతం బకాయిలు పెట్టింది. ఇలా 2017 నుంచి పెట్టిన బాకీలు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,912.43 కోట్లు. ► ఇలా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 47 నెలల కాలంలో విద్యారంగం మీద చేసిన ఖర్చు మొత్తం అక్షరాల రూ.59,331.22 కోట్లు. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇలా.. ► నిజానికి.. పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యా దీవెన)తో పాటు భోజన, వసతి సౌకర్యాల (వసతి దీవెన) కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ► ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్‌లో మార్పులు చేసి జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్‌తో నాలుగేళ్ల హానర్స్ కోర్సులు.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెట్టారు. ► ఇందులో భాగంగా విద్యార్థులు తాము చదువుతున్న కోర్సులతో పాటు తమకు అవసరమైన ఇతర నైపుణ్యాలను ఆన్లైన్లో నేర్చుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ► కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ► 40 రకాల నైపుణ్యాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 1.20 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, అదే విధంగా సేల్స్‌ఫోర్స్‌లో 33,000, ఏడబ్ల్యూఎస్‌లో 23,000, నాస్కామ్‌లో 20,000, పాలో ఆల్టోలో 10,000, ఆల్టెరిక్స్ డేటా అనలిటిక్స్‌లో 7,000 మందికి శిక్షణ పూర్తిచేసి సర్టిఫికెట్లు అందించారు. ఇలా దేశంలో ఒకే ఏడాది రెండు లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రం మనదే. సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు.. ► ఇంటర్ పాసై పై చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018–19లో 81,813 కాగా.. జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ఈ సంఖ్య 2022–23 నాటికి 22,387కు తగ్గింది. అంతేకాక.. 2022–23 నాటికి ఇంటర్ పాసై పై చదువులకు పోలేని విద్యార్థుల జాతీయ సగటు 27శాతం అయితే, మన రాష్ట్రంలో ఇది కేవలం 6.62 శాతం మాత్రమే. ► 2018–19లో 32.4గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి 2020–21 నాటికి 94కు పెరిగింది. ► అలాగే, 2018–19లో 37,000గా ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ 2021–22 నాటికి 85,000కు పెరిగాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే 80వేల మందికి ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. ఆగస్టు ముగిసేనాటికి ఇది మరింతగా పెరిగే అవకాశముంది. డిజిటల్ విద్య దిశగా అడుగులు.. ► మరోవైపు.. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లు.. నాడు–నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్‌రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038.. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ప్రవేశపెట్టింది. అసలు, ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడటం కాదు.. కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం విద్యావ్యవస్థలో ఈ తరహా విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టింది. -
ఫ్యాక్ట్ చెక్ : తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి: విద్యపై చేసే ఖర్చు భవిష్యత్తు తరానికి పెట్టుబడి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద సంక్షేమ కేలండర్ ప్రకారం విద్యా సంవత్సరంలో త్రైమాసికానికి ఒకసారి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే పేదింటి పిల్లలు కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదని అంగన్వాడీ నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్‌తోపాటు విదేశాల్లో చదువుకునేందుకూ ఈ ప్రభుత్వమే అండగా నిలుస్తోంది. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థినీ ప్రోత్సహిస్తోంది. ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత 45 నెలల్లో కేవలం విద్యా రంగంలో సంస్కరణల కోసం రూ.57,642.36 కోట్లు ఖర్చుచేసింది. ఉన్నత సంకల్పంతో అమలుచేస్తున్న పథకాలతో వచ్చిన మార్పులు, వాటి ఫలితాలు కళ్ల ముందే కనిపిస్తున్నా పచ్చ గంతలు కట్టుకున్న ‘ఈనాడు’ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. సంక్షేమ కేలండర్ ప్రకారమే నిధులు విడుదల విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి విద్యార్థులకు ఫీజుల ఒత్తిడి లేకుండా ‘జగనన్న విద్యా దీవెన’ కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజును ఆ త్రైమాసికం పూర్తయిన తర్వాత ప్రభుత్వం చెల్లిస్తోంది. అక్టోబరు–నవంబర్–డిసెంబరు–2022 త్రైమాసికానికి 9,86,092 మంది విద్యార్థులకు రూ.684.52 కోట్లను మార్చి 19న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసింది. జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి మే 24న రూ.702.99 కోట్లు అందించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ముందుగా నిర్దేశించిన సంక్షేమ కేలండర్ ప్రకారమే, క్రమం తప్పకుండా ఇలా నిధులు విడుదల చేస్తున్నా.. వాస్తవాలను కప్పిపుచ్చి పచ్చ పత్రిక రోత రాతలు రాస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న 9,55,662 మంది పిల్లలకు ‘వసతి దీవెన’ కింద రూ.912.71 కోట్లను ఏప్రిల్ 26న జమచేసింది. అయినప్పటికీ ఈనాడు పత్రిక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ‘జగనన్నా ఇదేనా విద్యా దీవెన’ అంటూ అవాస్తవాలతో కూడిన కథనం వండి వార్చింది. అప్పట్లో అరకొర చెల్లింపులు.. అనేక కొర్రీలు గత ప్రభుత్వంలో కాలేజీల ఫీజులు కాలేజీ స్థాయిని బట్టి రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండేవి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం రూ.35 వేలకే పరిమితం చేసి, అది కూడా ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. పైగా ఏళ్ల తరబడి బకాయిలు. అప్పట్లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల ఆవేదను కనీసం పట్టించుకోని ఈనాడు.. ఇప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతున్నా బురద జల్లుతోంది. చంద్రబాబు హయాంలో చివరి రెండేళ్లు (2017–18, 2018–19) రూ.1,778 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టింది. అలాగే, విద్యార్థుల వసతి కోసం అనేక కొర్రీలూ పెట్టింది. కుల ప్రాతిపదికన, కోర్సుల ప్రాతిపదికన రూ.4 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే తక్కువ మందికి ఇచ్చింది. డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టళ్లల్లో ఈబీసీ, కాపు విద్యార్థులకు చోటులేకుండా చేసింది. అంతేకాక.. బాబు జమానాలో విద్యార్థులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష.. ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షల లోపు ఉండాలని నిబంధన పెట్టి ఎంతోమంది విద్యార్థులను ప్రభుత్వ పథకాలకు దూరం చేసింది. ఇవేవీ ఆ పచ్చ పత్రికకు పట్టవు. ఈ నాలుగేళ్లలో విద్య, వసతి దీవెనకు రూ.14,210 కోట్లు.. కానీ, ప్రసుత్త ప్రభుత్వం విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2.50 లక్షలకు పెంచి లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ పథకాలకు చేరువ చేసింది. ఏ విద్యార్థి చదువూ ఆగిపోరాదని ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏటా సగటున రూ.3,311 కోట్లు చొప్పున రూ.9,934 కోట్లు ఇప్పటికే చెల్లించింది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ‘జగనన్న వసతి దీవెన’ కింద ఐటీఐ విద్యార్థులకైతే రూ.10 వేలు, పాలిటెక్నిక్ వారికి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న వారికి రూ.20 వేలు చొప్పున ఏడాదిలో రెండుసార్లు తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటిదాకా విద్యార్థులకు రూ.4,275.76 కోట్లు చెల్లించింది కూడా. అంటే ఈ రెండు పథకాల కోసమే ప్రభుత్వం 2019–20 నుంచి 2022–23 వరకు (మే 24న విద్యా దీవెన కింద చెల్లించే రూ.702.99తో కలిపి) సుమారు రూ.14,210 కోట్లను క్రమం తప్పకుండా విడుదల చేసింది. ఇదేదీ ‘ఈనాడు’కు కనిపించదు. విద్యార్థులకు అండగా ‘1902’ టోల్‌ఫ్రీ నంబర్.. ఫీజుల విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఎవరైనా యాజమాన్యలు వినకపోతే ఆ ఫిర్యాదులు తీసుకునేందుకు 1902 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే.. ముఖ్యమంత్రి కార్యాలయమే (సీఎంఓ) నేరుగా కాలేజీలతో మాట్లాడుతోంది. పిల్లలకు ఫీజులు పూర్తిగా ఇవ్వడమే కాకుండా, వారు వసతి కోసం, భోజనం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని, ఆ ఖర్చులు కూడా భారం కాకూడదని.. తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన ద్వారా క్రమం తప్పకుండా ఆ మొత్తాన్ని చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద కూడా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తోంది. కానీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిధులు చెల్లించిందంటూ ఈనాడు నిరాధార ఆరోపణులు చేయడం సిగ్గుచేటు. -
శింగనమల నియోజకవర్గానికి వరాల జల్లు
అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రం వేదికగా బుధవారం ‘జగనన్న వసతి దీవెన’ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం విజయవంతమైంది. సీఎం హోదాలో మొదటిసారి విచ్చేసిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి విశేష ప్రజాదరణ లభించింది. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మహిళా సంఘాల సభ్యులు, శింగనమల, నార్పల, యల్లనూరు, పుట్లూరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె మండలాల నుంచే కాకుండా అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అన్ని దారులూ నార్పలవైపే సాగాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే జనం సభా వేదిక వద్దకు చేరుకోవడం మొదలైంది. 10 గంటలకల్లా గ్యాలరీలు నిండిపోయాయి. సభా ప్రాంగణం బయట మూడింతల జనం నిల్చుండిపోయారు. అధికారులు సీఎం ప్రసంగం కోసం ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. హోరెత్తిన నినాదాలు నార్పల పరిసరాలు ‘జై జగన్’ నినాదాలతో మిన్నంటాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టపర్తి ఎయిర్‌పోర్టు నుంచి నార్పలకు హెలికాప్టర్లో వచ్చారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, కలెక్టర్ ఎం.గౌతమి, డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, సహాయ కలెక్టర్ ఎస్.ప్రశాంత్‌కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట హెలికాప్టర్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. సభావేదిక మీద ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి సీఎం నివాళులర్పించి సభను ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్‌ను ఎమ్మెల్యే పద్మావతి, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, శింగనమల నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. సీఎం పర్యటన విజయవంతంగా ముగియడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. కరుణించిన వరుణుడు బహిరంగ సభ ప్రారంభానికి రెండు గంటల ముందు వరుణ దేవుడు కరుణించాడు. ఓ మోస్తరు వర్షం పడడంతో పరిసర ప్రాంతాలు చల్లగా మారాయి. సీఎం జగన్ ఎక్కడ సమావేశం పెట్టినా... వరుణ దేవుడు వచ్చి పలుకరించి వెళ్తాడనడానికి నార్పల బహిరంగ సభే నిదర్శనం. జనం సీఎం ప్రసంగం ఆసాంతం కదలకుండా విన్నారు. ప్రసంగం ఆద్యంతం ఈలలు, చప్పట్లతో హోరెత్తింది. పంచతంత్రం కథ ఆకట్టుకునేలా చెప్పడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. సీఎం ..సీఎం అంటూ నినాదాలు చేశారు. థ్యాంక్యూ మామయ్య అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ వాటర్ బాటిల్, స్నాక్స్, జ్యూస్ అందించారు. అలాగే అనంతపురం, బత్తలపల్లి, తాడిపత్రి, నార్పల వైపు వెళ్లే రోడ్లలో ప్రతి 50 అడుగుల దూరంలో వాటర్ ప్యాకెట్లు అందించారు. ఆత్మీయ వీడ్కోలు జగనన్న వసతి దీవెన కార్యక్రమం ముగించుకున్న తర్వాత బుధవారం మధ్యాహ్నం నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఆత్మీయ వీడ్కోలు లభించింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పార్టీనాయకులు ప్రతి ఒక్కరి నుంచి పూల బొకేలు స్వీకరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులను ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారందరితోనూ దాదాపు గంటన్నరపాటు సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా 23 మంది తమ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేశారు. వీరిలో 19 మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. కలెక్టర్ గౌతమిని పిలిపించి ముగ్గురి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వారందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ● వేదిక మీద జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, కేవీ ఉషశ్రీ చరణ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, పోతుల సునీత, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, కలెక్టర్ ఎం.గౌతమి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్/ఎమ్మెల్సీ తలశిల రఘురాం, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహమ్మద్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ రాగే హరిత, ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ ఎం.మంజుల, ఏడీసీసీ బ్యాంకు చైర్పర్సన్ లిఖిత, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, నార్పల సర్పంచ్ సుప్రియ, జెడ్పీవైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరరావు, అనంతపురం మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఎల్ఎం ఉమామోహన్‌రెడ్డి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, జేఎన్టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, రెక్టార్ ప్రొఫెసర్ ఎం.విజయకుమార్, అనంతపురం ఆర్డీఓ మధుసూదన్, కళ్యాణదుర్గం ఆర్డీఓ నిశాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, మాజీ ఎమ్మెల్సీ శమంతమణి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రఘునాథరెడ్డి, అనంతపురం మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు బాలనాగి భాగ్యలక్ష్మి, తదితరులు ఆశీనులయ్యారు. ఉన్నత విద్యావంతులను చేయడమే లక్ష్యం ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఎంతోమంది పేద విద్యార్థులకు భోజన, వసతి భారం తల్లిదండ్రుల మీద పడకుండా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ‘జగనన్న వసతి దీవెన’ ద్వారా అందజేస్తున్నారని కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. నార్పలలో నిర్వహించిన వసతి దీవెన కార్యక్రమం బహిరంగ సభను కలెక్టర్ స్వాగతోపన్యాసం చేశారు. ఐటీఐ నుంచి పీహెచ్డీ వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు వసతి దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది పేద విద్యార్థులకు రూ.912.71 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ కానుందన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన 40 వేల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.39.92 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఇలాంటి పథకాలు లేక నిన్న, మొన్నటి తరానికి చెందిన పేదలు ఉన్నత చదువులకు దూరం అయ్యారని పేర్కొన్నారు. అనంతపురం/శింగనమల/ నార్పల: శింగనమల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి విన్నవించగా సీఎం వెంటనే ఆమోదం తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. చాగల్లు రిజర్వాయర్ ముంపు గ్రామాలైన ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.168 కోట్లు మంజూరు. ఈస్ట్ నరసాపురంలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రూ.35 కోట్ల కేటాయింపునకు ఆమోదం. శింగనమల మండల కేంద్రంలో రూ.2 కోట్ల నిధులతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్ నిర్మాణానికి ఆమోదం. మిడ్‌పెన్నార్ డ్యాం నిర్వహణ నిమిత్తం రూ.3 కోట్ల నిధులు విడుదల. నార్పల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 800 మంది విద్యార్థినులు ఉన్నారు. పాఠశాల నిర్వహణకు రెండు ఎకరాలు కావాలని కోరగా, ఇందుకు కోటి రూపాయల నిధులు కేటాయిస్తూ సీఎం ఆమోదం. చిత్రావతి నది మీద యల్లనూరు మండలంలో కేడీ రోడ్డు నుంచి చింతకాయమందకు రాకపోకల నిమిత్తం రూ.11.75 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం. చిత్రావతి నది మీద కోడుమూర్తి నుంచి చిలమకూరు వరకు రూ.15 కోట్ల వ్యయంతో కాజ్వే నిర్మాణానికి అంగీకారం. పుట్లూరు, యల్లనూరు మండలాల ప్రజలు పులివెందుల నియోజకవర్గానికి ఆనుకుని ఉండండం వల్ల పులివెందులను కూడా తమ సొంత నియోజకవర్గంలా భావిస్తుంటారు. పుట్లూరు మండలంలో సాగు, తాగునీరు సమస్యను పరిష్కరించడానికి గండికోట రిజర్వాయర్ నుంచి సుబ్బరాయసాగర్ ట్యాంక్‌కు లిఫ్ట్ ద్వారా నీరందించే పథకానికి రూ.250 కోట్లు మంజూరు. -
తేడా మీరే చూడండి
దుష్ట చతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా, ప్యాకేజీ పార్టీలు ఎంతగా చేతులు కలిపినా, నీచ రాజకీయం నిత్యం ఎంత జరుగుతున్నా మీ బిడ్డకు ధైర్యం మీరే. నా నమ్మకం మీరే. నన్ను నడిపించేది మీరే. నా ప్రయాణంలో నేను నిరంతరం ఆధారపడే పరిస్థితి ఉందంటే అది ఆ దేవుడి మీద, మీ మీద మాత్రమే. అందువల్లే వీళ్ల మాదిరిగా నేను పొత్తులు పెట్టుకోవడానికి వెంపర్లాడను. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘గత ప్రభుత్వంలో అరకొర ఫీజులతో పేద పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించలేని దుస్థితి.. నేడు ఫీజు ఎంతైనా సరే.. మేమే చెల్లిస్తామంటూ పూర్తి భారం భుజాన వేసుకున్న ప్రభుత్వం ఇది.. గతంలో ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. అప్పుల పెరుగుదల శాతం చూస్తే అప్పటికన్నా ఇప్పుడే తక్కువ.. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు.. గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారో ఆలోచించండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను కోరారు. దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) విధానాన్ని నడిపిన గత ప్రభుత్వానికి.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానాన్ని ఆచరిస్తున్న మీ బిడ్డ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏమిటో మీరే గమనించాలని అన్నారు. విప్లవాత్మక కార్యక్రమాలు, సంస్కరణలతో విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న మనందరి ప్రభుత్వంలో ఉన్నత చదువులకు పేదరికం అడ్డు కానేకాదని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆదివారం ఆయన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా 2022 అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల చేశారు. 9.86 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ కంప్యూటర్లో బటన్ నొక్కి రూ.698.68 కోట్లను నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. చదువుతోనే వెలుగు ► ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లోంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మన పిల్లలకు మనం చెరగని ఆస్తి ఏదైనా ఇస్తున్నామంటే అది చదువు మాత్రమే. ► ఈ రోజు 17–20 ఏళ్ల మధ్య ఉన్న నేటి తరం మరో 80 ఏళ్ల పాటు వాళ్ల జీవితాలు సాఫీగా సాగాలంటే మెరుగైన జీతాలతో, మెరుగైన ఆదాయాలతో వాళ్ల బతుకులు సాగాలంటే వాళ్ల ప్రయాణాన్ని, జీవిత ప్రమాణాన్ని రెండింటినీ నిర్దేశించేది ఒక్క చదువు మాత్రమే. ► అందుకే మన రాష్ట్రంలో ఇవాళ ఎల్కేజీ లేదా పీపీ1 నుంచి చదువులు ప్రారంభిస్తున్న బిడ్డ దగ్గర నుంచి, ఆ బిడ్డ ఎదిగి మంచి డాక్టరో, ఇంజినీరో కావాలి. ఢిల్లీరావు శ్రీకాకుళం జిల్లాలో అత్యంత సాధారణమైన కుటుంబం నుంచి వచ్చారు. ఇవాళ కలెక్టర్‌గా మీ కళ్లముందు కనిపిస్తున్నారు. ఇలా అందరి బతుకులు మారాలి. ఫీజులు ఎంతైనా సరే.. ► చదువులకు పేదరికం అడ్డు రాకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను గొప్పగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో కాలేజీల ఫీజులు రూ.70 వేలు, రూ.80 వేలు, రూ.1 లక్ష నుంచి కొన్ని కాలేజీల్లో రూ.1.20 లక్షలు ఉంటే.. ఇచ్చేదేమో రూ.35 వేలు మాత్రమే. అది కూడా ఎప్పుడిస్తారో తెలియదు. ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా చూశాం. ► మనందరి ప్రభుత్వం రాగానే ఆ పరిస్థితి పూర్తిగా మారుస్తూ 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకొకసారి ఫీజులు పిల్లల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా మాత్రమే 27 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ రూ.9,947 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో చివరి రెండేళ్లు ఎగ్గొట్టిన రూ.1,777 కోట్లు కూడా చిరునవ్వుతో చెల్లించాం. ► ఫీజులు పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల వారికి కాలేజీలను ప్రశ్నించే హక్కు ఇస్తున్నాం. పిల్లల బాగోగులూ స్వయంగా తెలుసుకోవచ్చు. యాజమాన్యాల నుంచి ఇబ్బంది ఉంటే నేరుగా 1902కు ఫోన్ చేస్తే, సీఎంఓ నేరుగా కాలేజీలతో మాట్లాడుతుంది. ► వసతి దీవెన కింద ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇతర డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఏటా రూ.20 వేలు చొప్పున రెండు దఫాలుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాం. ఈ సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 11న ఇవ్వాలని నిర్ణయించాం. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి ► మన పిల్లలు బాగా చదవాలని, ప్రపంచంతో పోటీ పడాలని ఇవన్నీ చేస్తున్నాం. మన పిల్లలు ప్రతి ఒక్కరూ సత్య నాదేళ్ల మాదిరిగా కావాలని మీ అన్న తపన పడుతున్నాడు. అందుకే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు 45 నెలల్లో రూ.13,311 కోట్లు ఖర్చు చేశాం. అందువల్లే కాలేజీల్లో చేరికలు బాగా పెరిగాయి. 2018–19లో 87,439 మంది పిల్లలు ఇంజినీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరితే, 2022–23లో ఆ సంఖ్య 1.20 లక్షలకు చేరింది. ► ఇంటర్ పాసై చదువుకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018–19లో 81,813 ఉంటే, 2022–23లో ఆ సంఖ్య 22,387కు తగ్గిపోయింది. ఈ సంఖ్య సున్నా కావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పని చేస్తోంది. 2018–19లో 37 వేలు ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్లు 2021–22లో ఏకంగా 85 వేలకు చేరింది. ► ఇంటర్ తర్వాత చదువు ఆపేసిన విద్యార్థుల సంఖ్య దేశంలో సగటున 27 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది 6.62 శాతం మాత్రమే. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్ – అంటే 17–23 ఏళ్ల పిల్లలు కాలేజీల్లో చదవడం) 2018–19లో దేశం సగటు 32.4 శాతం ఉంటే మన రాష్ట్రంలో 70 శాతం లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ► అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, నాడు–నేడు, బైలింగువల్ టెక్టŠస్ బుక్స్, ఇంగ్లిష్ మీడియం తదితర కార్యక్రమాలతో పాటు ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌తో డిజిటల్ క్లాసు రూములు కాబోతున్నాయి. నాడు–నేడు పూర్తి చేసుకున్న 15,270 స్కూళ్లల్లో 6వ తరగతి, ఆపై ఉన్న స్కూళ్లు దాదాపు 5,800 ఉన్నాయి. వీటిలో 30,230 క్లాస్ రూమ్‌లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ పెట్టి తరగతి గదులను డిజిటలైజ్ చేయబోతున్నాం. 8వ తరగతిలో అడుగు పెట్టిన ప్రతి పిల్లాడికి ట్యాబ్స్ ఇస్తున్నాం. పదో తరగతి బోర్డు పరీక్షలు సీబీఎస్ఈ సిలబస్‌లో రాసేలా తర్ఫీదు ఇస్తున్నాం. ఉన్నత విద్యలోనూ మార్పులు ► హయ్యర్ ఎడ్యుకేషన్‌లో కూడా మార్పులు తీసుకొచ్చాం. మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీగా మార్చాం. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్నాం. కరిక్యులమ్‌తో అనుసంధానం చేస్తూ ఆన్లైన్ వర్టికల్స్‌ను తీసుకొచ్చాం. జాబ్ ఓరియెంటెడ్‌గా మార్చుకుంటూ పోతున్నాం. ఆన్లైన్ సర్టిఫికేషన్ తీసుకొచ్చాం. మైక్రోసాప్ట్, ఏడబ్ల్యూఎస్, నాస్కామ్, సేల్స్‌ఫోర్స్, ఆల్టో వంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేట్టుగా ఉచితంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. ► ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీ పడలేవు అన్న మాటను రెండేళ్లలో తుడిచేస్తాం. రెండేళ్ల తర్వాత కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడలేకపోతున్నాయనేలా చేస్తాం. ► మనబడి నాడు–నేడుతో 46,447 స్కూళ్లు, కాలేజీలలో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ మార్పు చేస్తున్నాం. కొత్తగా 14 డిగ్రీ కళాశాలను తీసుకొచ్చాం. జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీని విజయనగరంలో, ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఒంగోలులో, వైఎస్సార్ అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని కడపలో ఏర్పాటు చేశాం. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని పెట్టాం. ఈ ఏడాది పులివెందులలో అగ్రికల్చర్ కాలేజీ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ► వైద్య, విద్యా రంగం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను నాడు–నేడుతో రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో పిల్లల జీవితాలను మార్చే కార్యక్రమాలు. ఇంటింటా ఆనందం.. అదే సర్కారు లక్ష్యం ► ఒకే ఇంట్లో ఉన్న అవ్వతాతలు, అక్కచెల్లెమ్మలు, పిల్లలు, రైతుల పట్ల కానీ, సమాజంలో అణిచివేతను ఎదుర్కొన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల కానీ, నిరుపేదల పట్ల కానీ నిండు మనస్సుతో స్పందించే హృదయం నాది. అందువల్లే ఈ రోజు సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం.. తదితర వాటిని కర్తవ్యంగా, దైవకార్యాలుగా భావించి ముందుకు తీసుకువెళ్తున్నాం. ► గడప గడపలో సంతోషం చూడాలని, ఇంటింటా ఆనందం ఉండాలని తపించే మనస్సు మన ప్రభుత్వానిది. ఈ రోజు మన రాష్ట్రంలో ఏ పేద ఇంటికి వెళ్లినా, గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా మీ అన్న ప్రభుత్వం గత 45 నెలలుగా పాలన అందిస్తోంది. ఎలాంటి వివక్ష, లంచాలకు చోటు లేకుండా నేరుగా రూ.1.98 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. తోడేళ్లు ఏకమవుతున్నాయి.. ► మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదంటున్న దుష్ట చతుష్టయం ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతోంది? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి? ఏ విషయంలోనూ మనతో పోల్చుకునేందుకు అర్హత లేని వారంతా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? మనందరి ప్రభుత్వంపై ఎందుకు రాళ్లు వేస్తున్నారు? వారు చెబుతున్నదే నిజమైతే ఒంటరిగా 175 నియోజక వర్గాల్లో పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా. ఈ సవాల్ స్వీకరించే దమ్ము, ధైర్యం మీకుందా? ► దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్ ఎవరో తెలుసా? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు. వీళ్లందరికీ తోడు వీరి దత్తపుత్రుడు. కుటుంబ, మానవత, రాజకీయ విలువలు లేని ఈ దుష్ట చతుష్టయంతో ఇవాళ మనం యుద్ధం చేస్తున్నాం. వారు ఎన్ని కుతంత్రాలు పన్నినా చివరకు మంచే గెలుస్తుంది. ► రామాయణం చూసినా, భారతం చూసినా, బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా.. ఏ సినిమాకు వెళ్లినా అదే కనిపిస్తుంది. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా నిరుపేద అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు నిండు మనసుతో ఆశీర్వదిస్తుండగా, ఆ దేవుడు దీవిస్తుండగా అడుగులు ముందుకు వేస్తున్నాను. తిరువూరుకు వరాలు ► తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అడిగారు. కట్టలూరు వాగు మీదుగా హైలెవల్ బ్రిడ్జి కోసం రూ.26 కోట్లు మంజూరు చేస్తున్నాం. ► ఎ.కొండూరులో కిడ్నీ బాధితులను దృష్టిలో ఉంచుకుని కృష్ణా జలాల సరఫరా కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నాం. ► దాదాపుగా 8వేల పై చిలుకు ఇంటి స్థలాలు ఇచ్చాం. 4 వేల ఇళ్లు మంజూరై వేగంగా కడుతున్నారు. మరో 6 వేల ఇళ్లు కావాలన్నారు. అవి కూడా మంజూరు చేస్తున్నాం. పది వేల ఇళ్లు అంచనాగా తీసుకుంటే వీటి ఖరీదు దాదాపు రూ.250 కోట్లు. ► రోడ్ల మరమ్మతు కోసం రూ.10 కోట్లు, డ్రైనేజీ కోసం రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ స్కిల్ సెంటర్ (ఐటీఐ, పాలిటెక్నిక్ తరహాలో) వస్తుంది. -
నా ధైర్యం మీరే.. నా నమ్మకం మీరే.. నన్ను నడిపించేది మీరే
తాడేపల్లి : దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా తన ధైర్యం, తన నమ్మకం ప్రజలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తిరువూరు సభలో మాట్లాడిన కొన్ని అంశాలను మరొకసారి ట్వీట్ చేశారు సీఎం జగన్. ‘దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా… ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా… నా ధైర్యం మీరే… నా నమ్మకం మీరే… నన్ను నడిపించేది మీరే… నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడే పరిస్ధితి ఉంటే అది ఆ దేవుడి మీదా.. మీ మీద మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నా’ అని పేర్కొన్నారు. కాగా, ఈరోజు(ఆదివారం) ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. దుష్టచతుష్టయం చేస్తున్న కుతంత్రాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నిత్యం మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న ఈ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తోందో తెలుసా ? కుటుంబ విలువలు, మానవతా విలువలు, రాజకీయ విలువలు లేని ఒక దుష్ట చతుష్టయం అన్న వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. ఆలోచన చేయండి. ఇలాంటి దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. ఇవాళ ఆ దుష్టచతుష్టయాన్ని ఒక్కటే అడుగుతున్నాను. నేను వారికి సవాల్ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే.. వారు ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు ? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ? గ్రామ గ్రామానికి, ఇంటింటికీ అందిన అభివృద్ధి ఫలాల మీద కానీ, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, బడి పిల్లలకు, అవ్వాతాతలకు అందించిన సంక్షేమ ఫలాలు మీద కానీ మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేని వీరంతా కూడా మన ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా… ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా… నా ధైర్యం మీరే…. నా నమ్మకం మీరే… నన్ను నడిపించేది మీరే…. నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడే పరిస్ధితి ఉంటే అది ఆ దేవుడి మీదా, మీ మీద మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నా. pic.twitter.com/DCkwTvaSPG — YS Jagan Mohan Reddy (@ysjagan) March 19, 2023 ఇక్కడ చదవండి: ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నాయి?: సీఎం జగన్ -
జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో సీఎం జగన్ (ఫోటోలు)
-
ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నాయి?: సీఎం జగన్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అర్హతలేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నారు.. పొత్తుల కోసం వీళ్లంతా వెంపర్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. జగనన్న విద్యా దీవెన కింద సీఎం జగన్.. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ, మనది డీబీటీ అయితే వాళ్లది డీపీటీ అని విమర్శించారు. మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్.. గత ప్రభుత్వంలో డీబీటీ.. దోచుకో, పంచుకో, తినుకో’’ అంటూ సీఎం దుయ్యబట్టారు. ‘‘సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్లు కాదని.. చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. గతంతో పోలిస్తే ఈ బిడ్డ ప్రభుత్వంలో అప్పులు తక్కువ’’ అని సీఎం చెప్పారు. 9.86 లక్షల మందికి మంచి చేసే కార్యక్రమం దేవుడి దయతో ఈ రోజు మరోమంచి కార్యక్రమాన్ని తిరువూరు నుంచి ప్రారంభిస్తున్నాం. దాదాపుగా 9.86 లక్షల మంది పిలల్లకు మంచి చేస్తూ... నేరుగా బటన్ నొక్కి 8,91,180 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా దాదాపు రూ.700 కోట్లు జమ చేస్తున్నాం. విద్యాదీవెన కార్యక్రమం గురించి నాలుగు మాటలు చెబుతాను.. భవిష్యత్తు బాగుండాలనే.... ఈ కార్యక్రమం వలన ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లోంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజు నేను గట్టిగా నమ్మే అంశం.. మన పిల్లలకు మనం చెరగని ఆస్తి ఏదైనా ఇస్తున్నామంటే అది చదువు మాత్రమే. చీకటి నుంచి వెలుగులోకి చదువుతోనే సాధ్యం... అజ్ఞానాన్ని చీకటితోనూ, విజ్ఞానాన్ని వెలుగుతోనూ పోల్చుతుంటాం. అలాంటి చీకటి నుంచి వెలుగులోనికి, ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే.. అది సాధ్యమయ్యేది ఒక్క చదువుతోనే.మనిషి తలరాతను కానీ, కుటుంబం తలరాతను కానీ, వెనుకబడిన కులాల తలరాతలు కానీ, దేశాల తలరాతలనైనా మార్చగలిగిన శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. ఈ రోజు 17 నుంచి 20 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న నేటి తరం మరో 80 సంవత్సరాలు పాటు వాళ్ల జీవితాలు సాఫీగా జరగాలంటే మెరుగైన జీతాలతో, మెరుగైన ఆదాయాలతో వాళ్ల బ్రతుకులు సాగాలంటే వాళ్ల ప్రయాణాన్ని, జీవిత ప్రమాణాన్ని రెండింటినీ నిర్ధిశించేది ఒక్క చదువు మాత్రమే. కాబట్టి మన రాష్ట్రంలో ఇవాళ ఎల్కేజీ లేదా పీపీ1 నుంచి చదువులు ప్రారంభిస్తున్న బిడ్డ దగ్గర నుంచి, అక్కడ మొదలైన ఆ బిడ్డ జీవితం ఎదిగి మంచి డాక్టరో, ఇంజనీరో కావాలి. మన కళ్లెదుటే కనిపిస్తున్న కలెక్టర్ ఢిల్లీరావు అత్యంత సాధారణమైన కుటుంబం, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఇవాళ కలెక్టర్‌గా మీ కళ్లముందు కనిపిస్తున్నారు. ఇలా బ్రతుకులు మారాలి. చదువుకు పేదరికం అడ్డం రాకూడదని... మన జీవితాలు మారాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. అలాంటి చదువులకు పేదరికం అడ్డు రాకూడదు. పిల్లలు పెరగాలి, ఎదగాలి. పేదరికం వల్ల చదువులు మానేస్తున్న పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి తమ్ముడుకూ అన్నగా... ఆ చదువులుకు భరోసా ఇస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యాదీవెన పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్నాం. ఈ రోజు ఇలాంటి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం ద్వారా చదువులు అందిస్తూ... పిల్లలను చేయిపట్టుకుని నడిపిస్తూ.. వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రెండింటి ద్వారా మంచి చేస్తున్న ప్రభుత్వం దేశంలో మీ జగనన్న ప్రభుత్వం మాత్రమే. కాలేజీలు ఫీజులు ఎంతున్నా సరే, పిల్లలు ఎంతమంది చదివినా ఆ పూర్తి ఫీజులు బాధ్యత మీ జగన్ తీసుకుంటాడు. అందులో భాగంగానే ఈరోజు జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని పెద్ద చదువులు చదివిస్తున్న తల్లుల ఖాతాల్లోకి వారి పిల్లల పూర్తి ఫీజు రీయింబర్స్ చేసే కార్యక్రమాన్ని తిరువూరు నుంచి ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వం –అరా కొరా ఫీజులు... గత ప్రభుత్వంలో మనందరికి గుర్తు ఉంటుంది. కాలేజీల ఫీజులు విషయంలో ఎలా ఉండేదో చూశాం. ఫీజులు చూస్తే రూ.70, రూ.80వేలు, రూ.1 లక్ష నుంచి కొన్ని కాలేజీల్లో రూ.1.20 లక్షలు కూడా ఉంటే... ఇచ్చేదేమో అరకొరా ఇచ్చేవారు. ఆ రూ.35 వేలు కూడా ఎప్పుడిస్తారో తెలియదు. సంవత్సరాల తరబడి బకాయిలు పెట్టిన పరిస్థితులు చూశాం. ఆ కాలేజీల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రుల పడుతున్న అవస్ధలు చూశాం. ఆ ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా చూశాం. తల్లిదండ్రుల అవస్ధ మార్చాలనే... ఈ రెండింటిని మార్చాలని అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేగంగా ముందుకు వేశాం. ఫీజులు ఎంత ఉన్నా రూ.60వేలు, రూ.70, నుంచి రూ.1.20 లక్షల వరకు ఎంతైనా కానీ, ఎంతమంది పిల్లలు కుటుంబం నుంచి చదివినా, ఆ ఫీజులు కొరకు ఏ తల్లితండ్రీ అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. ఫీజులు కట్టలేక పిల్లలు చదువు మానేసే పరిస్థితి రాకూడదని, అలా జరగకూడదని మీకు తోడుగా నిలబడేందుకు మీ జగన్ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ కోసం ఉన్నాడు. ప్రతి విద్యాసంవత్సరంలో కూడా ఫీజులు చెల్లించడమే కాదు, సమయానికి చెల్లించాలి. అలా చెల్లిస్తేనే పిల్లలు ఇబ్బంది పడకుండా చదువులు ముందుకు సాగిస్తారు. ఈ ఉద్దేశ్యంతోనే ప్రతి మూడు నెలలకొకసారి అంటే ఏ క్వార్టర్‌కు ఆ క్వార్టర్ అయినవెంటనే దానికి సంబంధించిన ఫీజులు పూర్తిగా వాళ్ల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాల 9.86 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా 8,91,180 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.698 కోట్లు జమ చేస్తున్నాం. 27 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ... రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా ఎలాంటి బకాయిలు లేకుండా నూటికి నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ... జగనన్న విద్యాదీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా 27 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ రూ. 9,947 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో చివరి రెండు సంవత్సరాలు 2017–18, 2018–19కు సంబంధించి తాను ఎగ్గొట్టి పోయిన రూ.1777 కోట్లు కూడా చిరునవ్వుతో మీ అన్న ప్రభుత్వమే చెల్లించింది. ఆ పెద్దమనిషి బకాయిలు పెట్టి పోతే మీ అన్న ప్రభుత్వమే చెల్లించింది. ప్రశ్నించే హక్కు కోసం తల్లుల ఖాతాల్లో జమ... మరో విషయం కూడా చెప్పాలి. ఈ ఫీజులు మొత్తం కూడా నేరుగా కాలేజీలకు ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఇదొక గొప్ప మార్పు. కారణం ఆ తల్లులకు కాలేజీలను ప్రశ్నించే హక్కు వారికి ఇవ్వడం కోసం ఇలా చేస్తున్నాం. ఆ తల్లులు ప్రతి మూడు నెలలకొకసారి కాలేజీలకు వెళ్లి, తమ పిల్లల బాగోగులు తెలుసుకుని స్వయంగా వాళ్లే ఫీజులు కట్టే కార్యక్రమం జరగాలని, కాలేజీలో వసతులు లేకపోతే వాటిని కల్పించమని కాలేజీలను ప్రశ్నించే హక్కు ఆ తల్లులకు రావాలని ఈ మంచి కార్యక్రమానికి మార్పులు చేశాం. కాలేజీ యాజమాన్యాలు ఎవరైనా వినకపోతే ఆ తల్లులు 1902కు ఫోన్ చేస్తే... నేరుగా మీ బిడ్డ ప్రభుత్వంలోని సీఎంఓ నేరుగా కాలేజీలతో మాట్లాడుతుంది. పిల్లలకు ఫీజులు పూర్తిగా ఇవ్వడమే కాకుండా, వారికి వసతి కోసం, భోజనం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని, ఆ ఖర్చులు కూడా భారం కాకూడదని, తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఐటీఐ చదువుతున్న విద్యార్ధులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్ధులకు రూ.15వేలు, మెడిసిన్, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న పిల్లలకు సంవత్సరానికి రూ.20వేలు రెండు దఫాలుగా జగనన్న వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నాం. ఈ సంవత్సరానికి సంబంధించి వసతి దీవెన రెండో దఫా కింద ఇచ్చే సొమ్ము కూడా ఏఫ్రిల్ 11న ఇవ్వాలని నిర్ణయించాం. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని.... నా పిల్లలు బాగా చదవాలని, నా పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ఇవన్నీ చేస్తున్నాం.మన పిల్లలు ప్రతి ఒక్కరూ సత్య నాదేళ్ల మాదిరిగా కావాలని మీ అన్న తపన పడుతున్నాడు. ఈ విద్యాదీవెన, వసతి దీవెన కేవలం ఈ రెండు పథకాలకు 45 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.13,311 కోట్లు ఖర్చు చేసింది. చిన్న ఉదాహరణ కూడా చెబుతాను. జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన ఈ రోజు ఈ రెండు పథకాల వల్ల ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులలో చేరుతున్న విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018–19లో 87,439 మంది పిల్లలు ఇంజనీరింగ్ వంటి వృత్తివిద్యాకోర్సులను చదవడానికి ఎంచుకుంటే... 2022–23 సంవత్సరానికి ఆ సంఖ్య 1.20 లక్షల మందికి చేరింది. కారణం నా చదువులకు మా జగనన్న తోడుగా ఉన్నాడన్న భరోసా ఆ తల్లులకు, పిల్లలకు ఉంది కాబట్టే. ఇంటర్ పాసై చదువుకు దూరమైన విద్యార్ధుల సంఖ్య 2018–19లో 81,813 మంది అయితే మన ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల ద్వారా 2022–23కు వచ్చే సరికి ఈ సంఖ్య 22,387 కు తగ్గిపోయింది. ఈ సంఖ్య కూడా ఉండకూడదు. ఇది కూడా సున్నా కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. 2018–19లో 37వేలుగా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్లు 2021–22 నాటికి క్యాంపస్ ప్లేస్మెంట్లు ఏకంగా 85వేలకు చేరింది. ఇంటర్ తర్వాత చదువు ఆపేసిన విద్యార్ధుల సంఖ్య దేశంలో సగుటున 27శాతం అయితే మన రాష్ట్రంలో అది 6.62 శాతం మాత్రమే. ఈ రోజు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియా( జీఈఆర్) అంటే 17 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు బడిబాట పట్టి కాలేజీలలో చదవాలని మాట్లాడుతారు. జీఈఆర్ రేషియో 2018–19లో దేశం సగటు 32.4శాతం ఉంటే మన రాష్ట్రంలో 70 శాతానికి తీసుకుని పోవాలని తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. మీ పిల్లల చదువుల బాధ్యత నాది.... ప్రతి అక్కకూ మంచి తమ్ముడుగా, ప్రతి చెల్లికి మంచి అన్నగా ఒక మాట చెబుతున్నాను. మీ పిల్లల చదువులకు బాధ్యత నాది అని మాట ఇస్తున్నాను. అమ్మఒడితో మొదలుపెడితే గోరుముద్ద, విద్యాకానుక, నాడు నేడు వంటి మంచి కార్యక్రమాలతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లిషుతో బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్, మారుతున్న స్కూళ్లు రూపురేఖలు, ఆరోతరగతి నుంచి ప్రతి తరగతి గది కూడా ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్‌తో డిజిటల్ క్లాసురూములు కాబోతున్నాయి. అందులో భాగంగా నాడు నేడు పూర్తి చేసుకున్న 15,270 స్కూళ్లల్లో 6వతరగతి పై ఉన్న స్కూళ్లు దాదాపు 5,800 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 30,230 క్లాస్ రూమ్‌లలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ పెట్టి తరగతి గదులను డిజిటలైజ్ చేయబోతున్నాం. 8వతరగతిలో అడుగుపెట్టిన ప్రతి పిల్లాడికి కూడా నా పుట్టిన రోజునాడు ఆ పిల్లలను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలన్న తపనతో వారికి ట్యాబ్స్ ఇచ్చి పదోతరగతివరకు తీసుకునిపోయే కార్యక్రమం చేస్తున్నాం. రెండేళ్ల టైం ఇవ్వండి.... రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి, ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడలేవు అన్న మాటను తుడిచేస్తాను. రెండు సంవత్సరాలు టైం ఇస్తే.. కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా చేస్తాను. ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూం డిజిటలైజ్ అవ్వబోతుంది. ఒక్కసారి ప్రభుత్వ బడులు డిజిటలైజ్ అయిపోతే ప్రైవేటు వాళ్లు కూడా పోటీపడక తప్పదు. 8వతరగతి పిల్లలకు ప్రభుత్వ బడులలో ట్యాబులు ఇస్తున్నాం. రెండో సంవత్సరం కూడా ట్యాబులు ఇస్తే... ప్రయివేటు బడులు కూడా 8వతరగతి పిల్లాలకు ట్యాబులు ఇవ్వకతప్పని పరిస్థితుల్లోకి పోతారు. ఉన్నత విద్యలోనూ మార్పులు.... హయ్యర్ ఎడ్యుకేషన్‌లో కూడా మార్పులు తీసుకొచ్చాం. ఇవాల అక్కడ కూడా చదువులు మారుస్తున్నాం. మూడేళ్ల కోర్సులను నాలుగు సంవత్సరాలు చేసాం. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్నాం. డిగ్రీ చదువులు ఇంగ్లిషు మీడియంలోకి మార్చాం. కరిక్యులమ్‌తో అనుసంధానం చేస్తూ ఆన్లైన్ వర్టికల్స్‌ను తీసుకొచ్చాం. జాబ్ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌ను మార్చుకుంటూ పోతున్నాం. ఆన్లైన్ సర్టిఫికేషన్ తీసుకొచ్చాం. మైక్రోసాప్ట్, ఏడబ్ల్యూఎస్, నాస్కామ్, సేల్స్‌ఫోర్స్, ఆల్టో వంటి పెద్ద పెద్ద సంస్ధలన్నీ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చేటట్టుగా ఉచితంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. మారనున్న విద్యార్ధుల భవిష్యత్తు.. ఈ పథకాలతో మన విద్యార్ధుల భవిష్యత్తు, మన విద్యాసంస్థల రూపురేఖలు మారనున్నాయి. మనబడి నాడు నేడుతో 46,447 స్కూళ్లు, కాలేజీలలో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ మార్పు చేస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో పిల్లల జీవితాలను మార్చే కార్యక్రమాలు. మన ప్రభుత్వం వచ్చాక కొత్తగా 14 డిగ్రీ కళాశాలను తీసుకొచ్చాం. ఉన్నతవిద్యకు మరింత ఊతమిచ్చే అనేక చర్యలు తీసుకున్నాం. జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీని విజయనగరంలోనూ, ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఒంగోలులోనూ, వైయస్సార్అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని కడపలో ఏర్పాటు చేశాం. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని పెట్టాం. ఈ యేడాది పులివెందులలో అగ్రికల్చర్ కాలేజీను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వైద్య రంగంలో సమూల మార్పుల దిశగా... అంతే కాకుండా వైద్య, విద్యా రంగం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కూడా పూర్తిగా నాడు నేడుతో రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ పిల్లల జీవితాలను బాగుపరిచే కార్యక్రమం కోసం అడుగులు వేస్తున్నాం. నిండు మనసుతో ఈరోజు నిండు మనస్సుతో ఈ బాధ్యతను నెరవేరుస్తున్నాం. ఒకే ఇంట్లో ఉన్న అవ్వతాతల పట్ల కానీ, అక్కచెల్లెమ్మల పట్లకానీ, పిల్లలు, రైతుల పట్ల కానీ, సమాజంలో అణిచివేతను ఎదుర్కొన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల కానీ నిరుపేదల పట్ల కానీ నిండు మనస్సుతో స్పందించే హృదయం నాది. ఈ రోజు సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం వీటన్నింటినీ ఒక కర్తవ్యంగా, దైవకార్యాలుగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నాం. గడప గడపలో సంతోషం చూడాలని, ఇంటింటా ఆనందం ఉండాలని తపించే మనస్సు మన ప్రభుత్వానిది. ఈ రోజు మన రాష్ట్రంలో ఏ పేద ఇంటికి వెళ్లినా, గతంలో ఏ ప్రభుత్వం చేయనంత విధంగా మీ అన్న ప్రభుత్వం గత 45 నెలలుగా పాలన అందిస్తోంది. ఈ 45 నెలల పరిపాలనపై మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయండి. గతాన్ని గుర్తుచేసుకొండి. గతంలో మాదిరిగా కాకుండా ఈ 45 నెలల్లో మీ అన్న, మీ తమ్ముడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆలోచన చేయండి. ఈ 45 నెలల్లో ఎలాంటి వివక్షకు చోటు లేకుండా, లంచాలకు చోటు లేకుండా కేవలం బటన్ నొక్కి నేరుగా రూ.1.98 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు జమ చేశాను. ఎక్కడా ఏ అక్కచెల్లెమ్మను అడిగినా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు అన్న మాట వినిపిస్తుంది. ఏ ఒక్క సిఫార్సుకు తావులేకుండా మా అన్న ఇచ్చాడు అన్న మాట వాళ్లో నోటిలో నుంచి వస్తోంది. ఈ 45 నెలలుగా ఇదీ మీ బిడ్డ పరిపాలన అని చెప్పడానికి గర్వపడుతున్నాను. దుష్టచతుష్టయంతో యుద్ధం... ఇలాంటి మనందరి ప్రభుత్వం నిత్యం మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న ఈ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తోందో తెలుసా ? మీకు మంచి చేయడం కోసం తపిస్తున్న మీ ప్రభుత్వం ఎవరితో యుద్ధం చేస్తుందో తెలుసా ? కుటుంబ విలువలు, మానవతా విలువలు, రాజకీయ విలువలు లేని ఒక దుష్ట చతుష్టయం అన్న వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. ఆలోచన చేయండి. గతానికి ఇప్పటికీ తేడా చూడండి. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. అప్పులు పెరుగుదల శాతం చూస్తే అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారో ఆలోచన చేయండి. దోచుకో, పంచుకో, తినుకో( డీపీటీ)ని నడిపిన ప్రతిపక్షంతో.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్( డిబీటీ) నడుపుతున్న మీ బిడ్డ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్ ఎవరో తెలుసా ? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక చంద్రబాబు. వీళ్లందరికీ తోడు వీరి దత్తపుత్రుడు. తోడేళ్లు ఏకమవుతున్నాయి... ఇలాంటి దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. ఇవాళ ఆ దుష్టచతుష్టయాన్ని ఒక్కటే అడుగుతున్నాను. నేను వారికి సవాల్ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే.. వారు ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు ? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ? గ్రామ గ్రామానికి, ఇంటింటికీ అందిన అభివృద్ధి ఫలాల మీద కానీ, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, బడి పిల్లలకు, అవ్వాతాతలకు అందించిన సంక్షేమ ఫలాలు మీద కానీ మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేని వీరంతా కూడా మన ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు. వీరిని మరోసారి అడుగుతున్నాను. ఎన్నికల బరిలో మంచి చేసిన మనందరి ప్రభుత్వాన్ని 175 కు 175 సీట్లలో ముఖాముఖి, ఒంటరిగా ఎదుర్కునే సత్తా వీరికుందా అని అడుగుతున్నాను. దుష్ట చతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతన్నా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా, ప్యాకేజీ పార్టీలు ఎంతగా చేతులు కలిపినా, నీచ రాజకీయం నిత్యం ఎంత జరుగుతున్నా కూడా మీ బిడ్డకు ధైర్యం మీరే. నా నమ్మకం మీరే. నన్ను నడిపించేది మీరే. నా ప్రయాణంలో నేను నిరంతరం ఆధారపడే పరిస్థితి ఉంటే అది ఆ దేవుడు మీద, మీ మీద మాత్రమే. వీళ్ల మాదిరిగా నేను పొత్తులు పెట్టుకోవడానికి వెంపర్లాడను. వీళ్ల మాదిరిగా నేను ఆరాటపడను. కారణం నేను నమ్ముకున్నది ఈ పొత్తులు మీద కాదు. నేను నమ్ముకున్నది ఆ దేవుడుని, మిమ్నల్నే. వీళ్లందరికీ ఛాలెంజ్ విసురుతున్నాను. ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా చివరకు మంచే గెలుస్తుంది. రామాయణం చూసినా అదే కనిపిస్తుంది. భారతం చూసుకున్నా అదే కనిపిస్తుంది. బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా అదే ఏ సినిమాకు వెళ్లినా కూడా ఆ సినిమాలో హీరోనే నచ్చుతాడు కానీ, విలన్లు నచ్చరు. దేవుడు ఆశీర్వదించాలని మీ అందరి చల్లని దీవెనలు బిడ్డపై ఎల్లప్పుడూ ఉండాలని, కొండంత అండగా నిలబడిన నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా నిరుపేద అవ్వతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు వీరందరూ నిండు మనసుతో నాకు తోడుగా నిలబడాలని, మంచి జరిగిన ప్రతి ఇళ్లూ కూడా మీ బిడ్డకు అండగా నిలవాలని నిండు మనస్సుతో కోరుకుంటూ చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్ధిస్తున్నాను. చివరిగా... తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధిగారు కొన్ని అభివృద్ది కార్యక్రమాలు అడిగారు. కట్టలూరు వాగు మీదుగా హైలెవల్ బ్రిడ్జి గురించి అఢిగారు. దానికోసం రూ.26 కోట్లు అవసరం కాగా.. దాన్ని మంజూరు చేస్తున్నాను. ఏ.కొండూరులో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. వీరికి మంచి చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. అయినా శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం కోసం కృష్ణా జలాలు మంచినీటి సరఫరా కోసం రూ.50 కోట్లు ఖర్చవుతుందన్నారు. అవి కూడా కేటాయిస్తున్నాను. దాదాపుగా 8వేలపై చిలుకు ఇంటి స్ధలాలు ఇచ్చాం. 4 వేల ఇళ్లు మంజూరై ఇళ్లు వేగంగా కడుతున్నారు. మరో 6వేల ఇళ్లుకావాలన్నారు. అవి కూడా మంజూరు చేస్తున్నాను. పదివేల ఇళ్లు అంచనాగా తీసుకుంటే ఈ ఇళ్ల ఖరీదే దాదాపు రూ.250 కోట్లు. అదే విధంగా రోడ్ల రిపేరు కోసం రూ.10 కోట్లు అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. రూ.4 కోట్లతో డ్రైనేజీ కోసం మంజూరు చేస్తున్నాం. పాలిటెక్నిక్ కాలేజీ అడిగారు. ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్(ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీ, డ్రాపౌట్స్ కోసం ప్లంబర్లు, ఏసీ మెకానిక్స్ వంటి స్కిల్ ఎన్‌హేన్స్‌మెంట్ కోర్సులు) ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తుంది. రాబోయే రోజుల్లో స్కిల్ సెంటర్ ఇక్కడ వస్తుంది. వీటన్నింటి ద్వారా మంచి జరగాలని ఆశిస్తున్నాను అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. చదవండి: రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది: కన్నబాబు -
సీఎం జగన్ కు విద్యార్థులు, వారి తల్లుల ఘన స్వాగతం
-
జగనన్న విద్యాదీవెన: తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
Updates: ►జగనన్న విద్యా దీవెన కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. సీఎం జగన్ ప్రసంగం: ♦సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్లు నచ్చరు.. ♦ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ♦చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు ♦ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ♦పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు ♦అర్హతలేని వారు మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు ♦విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం ♦కుటుంబం, రాజకీయ, మనవతా విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం ♦మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ♦గత ప్రభుత్వంలో డీపీటీ.. దోచుకో, పంచుకో, తినుకో.. ♦కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం ♦17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి ♦45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9లక్షల కోట్లు అందించాం ♦ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నాం ♦ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నాం ♦ఏప్రిల్ 11న రెండో విడత వసతి దీవెన నిధులు ♦ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది ♦జీఈఆర్ రేషియో 32 నుంచి 72 శాతానికి తీసుకెళ్లే దిశగా అడుగులు ♦ప్రభుత్వ బడులు, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నాం ♦మీ పిల్లల చదువులకు నాది బాధ్యత ♦ఉన్నత విద్యకు మరింత ఊతమిచ్చే చర్యలు తీసుకున్నాం ♦8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం ♦రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం ♦ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి తెస్తాం ♦పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టాం: సీఎం జగన్ ♦పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే ♦ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువుతోనే సాధ్యం ♦ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. ♦ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువే ♦కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ కుటుంబం నంచి వచ్చిన వ్యక్తి ♦చదువుకు పేదరికం అడ్డుకాకూడదు ♦దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు ♦కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే ♦గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు ♦ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు ♦లంచాలు, వివక్ష లేకుండా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నిధులు జమ చేస్తున్నాం ♦గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగా ఇచ్చేవాళ్లు ♦ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడేవారు ♦తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి ♦అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం ♦జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చాం ♦27 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చాం ♦చంద్రబాబు హయాంలోని బకాయిలను సైతం చెల్లించాం ♦విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నాం ♦తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుంది ♦కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే మాట్లాడతాం ►సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు.. కాసేపట్లో నాలుగో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. సీఎం జగన్‌కు ఘన స్వాగతం ►కొద్దిసేపట్లో మార్కెట్ యార్డ్‌లోని సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. ►తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, మంత్రి బొత్స సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్,ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మేకా ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. ►జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా తిరువూరు వాహినీ కాలేజ్ గ్రౌండ్స్‌లోని హెలీప్యాడ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. ► జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ►గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ప్రశ్నించే హక్కును, తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ► జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్‌తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్ డిగ్రీ కోర్సులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ► కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. 40 అంశాలలో నైపుణ్యం పెంపొందించేలా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి చేసి, సర్టిఫికెట్స్ పంపిణీ చేసింది. దేశంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ► ఇంటర్ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంస్కరణల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి 22,387కు చేరింది. ► 2018–19లో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2020–21 సంవత్సరానికి 37.2కు పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్ శాతం 70కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంది. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది. ► 2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గణనీయంగా పెరిగి 2021–22కి 85,000 కు చేరడం విశేషం. విద్యా రంగంపై జగన్ ప్రభుత్వం గత 45 నెలల్లో మొత్తం రూ.57,642.36 కోట్లు వెచ్చించింది. ► 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, నాడు –నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తోంది. -
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ పర్యటన
-
నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది.ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ప్రశ్నించే హక్కును, తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ► జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్‌తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్ డిగ్రీ కోర్సులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ► కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. 40 అంశాలలో నైపుణ్యం పెంపొందించేలా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి చేసి, సర్టిఫికెట్స్ పంపిణీ చేసింది. దేశంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ► ఇంటర్ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంస్కరణల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి 22,387కు చేరింది. ► 2018–19లో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2020–21 సంవత్సరానికి 37.2కు పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్ శాతం 70కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంది. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది. ► 2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గణనీయంగా పెరిగి 2021–22కి 85,000 కు చేరడం విశేషం. విద్యా రంగంపై జగన్ ప్రభుత్వం గత 45 నెలల్లో మొత్తం రూ.57,642.36 కోట్లు వెచ్చించింది. ► 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, నాడు –నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తోంది. నేడు సీఎం వైఎస్ జగన్ తిరువూరు పర్యటన తిరువూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 19న (ఆదివారం) ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. 11 గంటల నుంచి 12.30 గంటల వరకు మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తారు. అనంతరం విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
AP Budget 2023-24: విద్యా రంగానికి పెద్దపీట.. ఎన్ని కోట్లు కేటాయించారంటే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్‌ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి(ఎన్.ఎమ్, ఎఫ్), సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు, విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్‌లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్ఈ) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10 వతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసింది. జగనన్న అమ్మ ఒడి. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ పథకం కింద 2019-20 సంవత్సరం నుంచి 44 లక్షల 50 వేల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సూమారు రూ. 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రావడం జరుగుతోంది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు కేటాయించింది. మన బడి నాడు-నేడు మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి మన బడి నాడు-నేడు కార్యక్రమం కిందరూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యాకానుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బెల్ట్, మాస్క్‌ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ►2023-24 బడ్జెట్లో జగనన్న విద్యాకానుక కోసం రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు ►2013-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన పథకం కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ►జగనన్న వసతి దీవెన పథకం కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు జరిగింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ►ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది.